*:::::::::::: ప్రపంచం::::::::::::::*
రోడ్డు మీద వెళ్తూ వున్నాను.
అనేక మంది, వస్తువులు, సంఘటనలు ఎదురు అవుతున్నాయి. ఇవేవి నా దృష్టిలో పడటం లేదు.
అనగా నాకు ఏమీ తెలియడం లేదు.అనగా నా మనస్సులో ఎలాంటి చర్య లేదు.
ఇప్పుడు
తెలిసింది....వెళుతూ అందమైన దేనిమీదో దృష్టి నిలిచింది.దానిని గుర్తు పట్టి నాను.
అనగా నా మనస్సు లో గుర్తించుట,దాని అందచందాలు కొలవడం,దాని అందానికి "ఫిధా"అవడం జరిగింది.
ఇదంతా బయట వస్తువు కి సంబంధించినది కాదు.ఇది ఈ మది లో జరిగిన ప్రక్రియ.
మొదట ఏమీ తెలియదు అన్నాము .కారణం మనస్సు లో ఎలాంటి ప్రక్రియ జరగలేదు.
కనుక తెలియడం అంటే మనస్సు లో చర్య (ప్రక్రియ) జరగడం. ఇది భావాలు, అభిప్రాయాలు, ఇష్టాలు. అనుభూతి చెందడం.
కాబట్టి లోపల ఏమి జరిగిందో అదే బాహ్యం. ప్రపంచం.
ఎవరి లోకం వారిది అంటే ఇదే.
*షణ్ముఖానంద. 9866699774*
No comments:
Post a Comment