1210. 1-1. 120123-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*గొప్ప స్నేహితులెవరు?*
➖➖➖✍️
*‘యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత’*
అంటూ *తాను ఏది ఆచరిస్తే అదే ధర్మమని జగద్గురువుగా నిలిచినవాడు శ్రీకృష్ణుడు*.
*ధర్మసంస్థాపన కోసం కురుక్షేత్ర సంగ్రామాన్ని నిర్వర్తించి, దుష్టసంహారం చేయించిన దేవదేవుడు. మహాభారత యుద్ధంతో కలియుగ ఆరంభానికి బీజం వేసిన జగద్రక్షకుడు శ్రీకృష్ణుడు.*
*శ్రీమన్నారాయణుడి దశావతారాల్లో ఎనిమిదో అవతారమైన కృష్ణుడు లీలామానస రూపుడిగా పేరుగాంచాడు. అతంటి మహిమాన్వితుడైన కృష్ణుడికి అర్జునుడు, కుచేలుడు స్నేహితులు.*
*అయితే కుచేలార్జునుల్లో జగన్నాటక సూత్రధారి ఎవరి మీద ఎక్కువ ప్రేమను చూపించాడు. ఇద్దరిలో ఎవరి స్నేహం గొప్పది?.*
*నరనారాయణులే ద్వాపర యుగంలో కృష్ణార్జునులుగా అవతరించారు. వీరి జననానికి ఓ కారణం ఉంది. అయినా ఒకరికొకరు బంధువులే కాదు గాఢమైన స్నేహితులు కూడా. కానీ అర్జునుడు దేవదేవుని ప్రార్థించే ప్రతి సందర్భంలోనూ, ప్రతి సంఘటనలోనూ తానూ, తన రాజ్యం గురించే ఆలోచించేవాడు. అంతెందుకు సాక్షాత్తు శ్రీహరినే యుద్ధంలో తన రథసారథిగా ఉండమని కోరాడు. పాండవుల రక్షణ కోసం శ్రీకృష్ణుడు చేయని కార్యం అంటూలేదు.*
*అయితే కుచేలుడు శ్రీ కృష్ణుల మధ్య స్నేహం అలాంటిది కాదు.* *అడుగకపోయినా యిచ్చే ఆ దాతకి, చిన్ననాడెంతో సఖ్యంగా ఉండేవాడో, అంతకంటే యెక్కువ మక్కువతో ఆదరించిన తన స్నేహితునికీ, కుచేలుడు నమస్కరించాడు.*
*ఈ కృష్ణకుచేలుర స్నేహం భగవత్ భాగవత సంబంధం కలిగింది.*
*ఇద్దరూ ఒకే గురువు వద్ద విద్యాభ్యాసం చేశారు. కృష్ణుడికి కుచేలుడు నమస్కరించిన సందర్భంలో ఎలాంటి స్వార్థపూరితమైన ఆలోచనలు లేవు. తన ధర్మం, భగవద్ధ్యానం, తన కర్తవ్యం, పరమేశ్వర ఆరాధనం తప్ప మరో ఆలోచన ఉండేది కాదు.*
*కుచేలుడి ప్రార్థనలో భగవంతుడే కనిపించాడు. తీవ్ర దారిద్ర్యంతో భార్య సలహా మేరకు కృష్ణుణ్ణి కలిసినప్పుడు అసలు తానెందుకు వచ్చాడో కుచేలుడు మరిచిపోయాడు. తన స్నేహితుడిని చూసిన ఆనందంలో తన పేదరికమే గుర్తుకురాలేదు. కాబట్టి కృష్ణ కుచేలుర స్నేహమే గొప్పదని అంటారు.*
*కృష్ణుడు ప్రసాదించిన ఐహికభోగభాగ్యాలని అనుభవిస్తున్నా, వాటియందు మోహమే లేకుండా, నిరంతరమైన భక్తితో కృష్ణుని మొక్కుతూ, కుచేలుడు తన జీవితమంతా గడిపాడు. ఆ తరువాత దేవదేవుని పరమపదం చేరుకున్నాడు.*.✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
No comments:
Post a Comment