Tuesday, January 10, 2023

యోగిరామయ్య, భగవాన్ భక్తులలో నెల్లూరుకు చెందిన యోగి రామయ్య గారు ఒకరు

 


"యోగిరామయ్య"
భగవాన్ భక్తులలో నెల్లూరుకు చెందిన యోగి రామయ్య గారు ఒకరు   "విద్య నేర్చుకొనివారికి కూడా విజ్ఞానం లభించను. ప్రయత్నం మాత్రం చేయాలి. సాధనమార్గంలో భక్తి శ్రద్ధలు ఉంటే ఫలం తానంతట తాను లభిస్తుంది". అనే సూత్రానికి ఈయన జీవితం ఉదాహరణ. వీరి జన్మస్థానం నెల్లూరు జిల్లా వేదాద్రి ( నరసింహకొండ ) దగ్గర  మోవురు గ్రామం. దానధర్మాలకు, జ్ఞానసాధనకు ప్రసిద్ధికెక్కిన వంశం వీరిది. రెడ్డిజాతి తండ్రి చేవూరి పిచ్చిరెడ్డి. మూడు తరాలుగా ఈ వంశానికి ఒక్కడే పుత్రుడు.  పుత్రుడు జన్మించిన కొంతకాలానికి తండ్రి మరణించారు. మీరు మేనమామల ఊరు అయినా  బుచ్చిరెడ్డిపాలెం దగ్గర  గల అన్నారెడ్డిపాలెం లో పెరిగారు.  ( అన్నారెడ్డిపాలెం లో వీరి పేరుతోటి ఆశ్రమం ఇప్పుడు శ్రీ ప్రజ్ఞరణ్యస్వామి ఆధ్వర్యంలో నడుస్తున్నది అక్కడ ధ్యానం మీద తరగతులు నిర్వహిస్తారు. )
వంశానికి ఒక్కడు దానికి తోడు సంపన్నుడు, యవ్వనం వచ్చింది. కొంతకాలం భోగిరామయ్యగా విజృంభించిన సత్యసంథుడిగాను, ధర్మపారాయణుడీగాను జీవించారు. చిన్నతనంలోనే రామనామ ప్రీతిచే  "వాల్మీకివలె నేనెప్పుడూ అవుతాను? కబీరువలె ఎప్పుడు ఉంటాను?" అని వాంఛ, ఆవేదన కలవు. కావున ధ్యానాన్ని మొదలుపెట్టారు.
పూర్వ పుణ్యం వలన వారికి 19 సంవత్సరాలు వచ్చేసరికి శ్రీ బ్రహ్మానందంతీర్థస్వామి వద్ద తారకమంత్రం ఉపదేశం పొందారు. 'రోజుకు ఐదు వేలు మంత్రజపం చేయమని గురువాజ్ఞ. అనుక్షణం ఏమి చేస్తున్నా జపం కొనసాగించు దీక్ష  శిష్యునిది. వైరాగ్యం తీవ్రంగా ఉండీ అతడు కాశీకి వెళుతుండగా దారిలో గురువు ఎదురై, మీ అమ్మ  అ ఆశీర్వాదం తీసుకున్నారా?' అని అడగగా,  నేను వెళుతున్నాను అనే విషయమే ఆమెకు చెప్పలేదని రామయ్య అన్నారు. ఊర్లోని తోటలో ఏకాంతంగా జపం చేసుకుంటూ ఉండమని తాను వచ్చి చూస్తానని ఆయనకు మరల వెనక్కు మరలించారు. జపానికి  తోడు రామయోగి సాత్వికాహారం  స్వీకరిస్తూ, ప్రాణాయామాన్ని ఎవరి సహాయం లేకుండా ప్రారంభించారు. తీవ్ర సాధన వలన త్వరలోనే నాదబిందుకళాది అనుభవాలు కలిగాయి. కానీ అవి త్వరలోనే ఆగిపోయాయి. నాసికాగ్ర దృష్టిపై ధ్యానం చేస్తూ రాగా, ఆ స్థానం నుండి జ్యోతిర్మయంగా సర్పచలనం బయలుదేరి, నాసిక నుండి శిరస్థానంలో లీనమైనట్లు తోసింది. అప్పటివరకు కనిపించిన రామరూపం అదృశ్యమైంది. అన్నివైపులా జ్యోతిసముద్రం. ఏ రూపం లేదు.
"ఇదేమిటి?" అని రామయ్య ఆ ఊరి పండితులను అడిగారు. కానీ ఎవరూ చెప్పలేకపోయారు. శ్రీ బ్రహ్మానందతీర్థులు అప్పటికీ దివంగతులయ్యారు. తన సందేహాన్ని తీర్చేవారు లేకపోవడంతో, తాను చిన్నతనంలో యాత్రకు వెళ్ళినప్పుడు చూసిన "అరుణాచల మహర్షి" గుర్తుకు వచ్చి అక్కడకు వెళ్లి వారిని అడిగారు. మహర్షి  "సమాధిలో దృక్కు, దృశ్యాలు ( చూసేవాడు చూడబడేది, చూసే చూపు ) ఏకమవుతాయని ఆయన సందేహాన్ని తీర్చారు. అప్పటినుండి వారే తనకు గురువని నిశ్చయించుకొని, చూతగుహలో వారు చాలాకాలం తపస్సు చేశారు. అయన  తర్వాత అన్నారెడ్డిపాలెంకు వెళ్లి అక్కడ  ఆశ్రమం నిర్మించుకొని, దానధర్మాలు చేస్తూ, తల్లికి ఊరట కల్పిస్తూ, "శ్రీ రామాశ్రమం"న నిర్మించుకొని అక్కడే ఉండసాగారు. కొంతకాలం అన్నారెడ్డిపాలెంలోనూ, కొంతకాలం శ్రీ రమణాశ్రమంలో గురువు దగ్గర ఉండేవారు. గురు కార్యార్థియై తాను అంతకుముందు పాటిస్తున్న మౌనవ్రతాన్ని వదిలిపెట్టి శ్రీ రమణాశ్రమంలోని పాలితీర్థం బాగుచేయించడానికి, రమణ తీర్థమునకు, హలు  కట్టించుటకు, ఇతర ఆశ్రమ కార్యాలకు ఎంతో ధనం యోగిగారు సమర్పించారు. స్వామికి వీరిపట్ల అధికమైన ప్రీతి. వీరు ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతస్థితిని పొందారు. వీరి సహృదయత్వమును, విశ్వ ప్రేమను గుర్తించి సర్పములుగానీ, దుష్టజంతువులుగాని వీరికి హాని చేయవు. పాల్ బ్రంటన్ తన "గుప్త భారతాన్వేషణం" అనే గ్రంథంలో తాను ఎంతో ప్రశాంతతను వీధి సాన్నిధ్యంలో అనుభవించినట్లు వ్రాశారు. వీరికి సిద్ధులు కలవని చెబుతారు. వీర జయంతి ఉత్సవాన్ని వీరి శిష్యబృందం ప్రతి సంవత్సరం జరుపుతున్నారు. 
🌹అరుణాచల అత్మనంద ఓం నమో భగవతే శ్రీ రమణయ 🙏🙏

No comments:

Post a Comment