🙏🕉🙏 ...... *"శ్రీ"*
🔥 *"10"* 🔥
🔥🔥 *"ఆత్మ జ్ఞానం"* 🔥🔥
🔥🔥 *"మోక్షమార్గం"* 🔥🔥
💖🔥💖🔥💖🔥💖
💖🔥🕉🔥💖
💖🔥💖
💖
*"మరి దుఃఖం దేనికి?"*
*"దుఃఖం కేవలం విచారించకపోవడం వల్లే మానవునికి కలుగుతోందని తెలుస్తోంది."*
*"ప్రతి జన్మలోని మరణం అనే అనుభవం తర్వాత మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది అనేదానికి ఇప్పుడు చూద్దాం!"*
**స్వప్నం నుంచి మెలుకువ వచ్చాక మనిషి ఏమవుతున్నాడు."*
**నేను స్వప్నంలో మరణించి తిరిగి మెలుకువతో జన్మించాను అని అనుకుంటున్నాడా ?"*
**లేదు గదా!*
*ఇదీ అంతే."*
*"ఏదయితే మనమంతా మరణం అని ఇక్కడ అనుకుంటున్నామో ఆ మరణం తర్వాత మనిషి అక్కడికక్కడే ఇంకో శరీరం కలిగి అప్పటి వరకు తాను చూసిందంతా స్వప్నంలా భ్రమలా భావిస్తాడు."*
*"అప్పుడు తానున్న శరీరాన్ని వాస్తవం అనుకుంటూ ఆ శరీరానికి సంబందించిన తన బందు మిత్రులతో తిరుగాడుతూ అదే నిజమని నమ్ముతుంటాడు."*
*"ఒక స్వప్నం నుంచి ఇంకో స్వప్నంలోకి రావడం లాంటివే ఈ జన్మ-మృత్యువు అనే రెండు అనుభవాలు."*
*"అంతే తప్ప ఇక్కడ జన్మించేవాడూ లేడు.*
*మరణించేవాడూ లేడు.*
*రెండు అనుభవాలూ కేవలం మిధ్య మాత్రమే."*
*"మరణం అనే భ్రమ తర్వాత మరణించినవాడి లోకం ఎలా ఉంటుంది అంటే ఇప్పటి ఈ లోకం ఎలా ఉందో మరణం తర్వాతి లోకం కూడా ఇలానే ఉంటుంది.*
*జన్మ-మరణం అనేవి రెండు స్వప్నాలు.*
*ఈ లోకం ఆ లోకం అనేవి ఎక్కడా లేవు."*
*"ఇప్పుడు చూస్తున్న ఈ లోకంలోనే గత జన్మలోనూ ఉన్నాం."*
**ఈ జన్మలో ఏదో ఒక రోజు మరణించాక తర్వాతి జన్మకు ఇప్పటి ఈ జన్మ స్వప్నమే అవుతుంది."*
*"తర్వాతి జన్మ కొనసాగేదీ ఇప్పుడు చూసే ఈ స్వప్న ప్రపంచంలోనే. గత జన్మ, ఇప్పటి ఈ జన్మ, రాబోవు జన్మ అనే స్వప్నాలకు వేరు వేరయిన లోకాలు అనేవి లేవు."*
*"అన్ని జన్మలూ జీవులు కొనసాగించేది ఈ ఎదురుగ్గా కనిపించే ఈ స్వప్న ప్రపంచంలోనే."*
*"కాకుంటే కొత్త కొత్త శరీరాలు, కొత్త కొత్త ప్రదేశాలు, కొత్త కొత్త అనుభవాలూ అంతే తేడా."*
*"ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి ఈ అయిదింటిలోనూ జీవరాసులు ఉన్నాయి."*
*"ఈ అయిదింటినే అయిదు లోకాలుగా గూడా చెప్పుకోవచ్చు.*
*మరి ముల్లోకాలు ఉన్నాయి."*
*"ఇంకా స్వర్గం, నరకం అనే పదాలు కూడా ఈ లోకంలో వాడుకలో ఉన్నాయి గదా అంటే!"*
*అది ఈ లోకం కానివ్వండి లేక మరొక లోకం కానివ్వండి శరీరాన్ని నమ్మి ‘ఇదే నేను’ అనుకోవడమే “నరకం”.*
**శరీరాన్ని కదిలించే “ఆత్మ”ను గ్రహించి ఆ ఆత్మను అనుభవంలోకి తెచ్చుకునే ప్రయత్నంలో ఉండటమే “స్వర్గం”."*
*"ఇవి తప్ప వేరే స్వర్గ నరకాలు ఎక్కడా లేవు.*
*అసలు నరకం అంటే ఏంటి? దుఃఖమే కదా!*
*దుఃఖం లేని నరకం ఎక్కడయినా ఉంటుందా?*
*ఇక స్వర్గం అంటే ఆనందం.*
*ఈ రెండూ కూడా ఉన్నది మనిషిలోనే కదా."*
*"మరి మనిషిలోనే స్వర్గం, నరకం అనేవి ఆనందం దుఃఖం అనే రూపంలో ఉన్నప్పుడు స్వర్గం అనేదానికి ఒక లోకం నరకం అనేదానికి మరొక లోకం ఎక్కడో బయట ఉండటమేంటి పిచ్చి కాకపోతే."*
**దుఃఖమే నరకం.*
*ఆనందమే స్వర్గం.*
*నేను ఈ శరీరం అని నమ్మడమే నరకం.*
*ఎందుకంటే ఈ శరీరం ఒకరోజు నశిస్తుంది."*
*"ఈ శరీరమే నేను అనుకోవడం వల్ల ఇది నశించే సమయంలో మానవునికి మహాదుఃఖం కలుగుతుంది."*
*"ఆ దుఃఖం శరీరం కోల్పోయాక కూడా ప్రాణిలో కొనసాగుతుంది. అదెలాగంటే దుఖించేది శరీరం కాదు.*
*దుఖించేది నువ్వు.*
*శరీరం పోతుంది.*
**కానీ దుఖించే నువ్వెక్కడికీ పోవు. నువ్వు దుఃఖం అనే అనుభవంతో బాధపడి బాధపడి ఒకనాటికి మరొక శరీరాన్ని ధరిస్తావు. అది నరకమే కదా."*
*"మరి తప్పక నశించే ఈ శరీరాన్ని చూసుకుంటూ ఇది నేను అని ఎందుకు అనుకుంటారు."*
**మరణించబోయే పసి పిల్లాడిని అతడి తల్లి మురిపెంగా ముద్దు పెట్టుకోవడం ఎలాంటిదో ఈ శరీరం నేను అనుకోవడం కూడా అలాంటిదే అని అందరూ గ్రహించాలి."*
*"ఇక ఈ శరీరం నేను కాదు నేను ఆత్మను అని భావన చెయ్యడం వల్ల ఆత్మకు నాశనం అనేది లేనందున నేను ఆత్మను అనుకునేవాడికి కూడా నాశనం లేనట్లే గదా."*
*"మరి అది ఆనందమే కదా."*
*"అదే అతడికి స్వర్గం కూడా."*
*"నేను ఆత్మను అనే భావనలో ఉన్నవారు శరీరం కోల్పోయాక కూడా ఆ ఆనందంలోనే స్థితి కలిగి ఉంటారు."*
*"ఇక లోకాల గురించి చెప్పుకోవాలంటే బావిలో ఉన్న కప్పకు బావే దాని లోకం."*
*"దానికి ఇంకో లోకం తెలీదు."*
*"మరణం తర్వాత అది మానవ దేహాన్ని గనక పొందితే ఈ భూలోకం దానికి ఇంకో లోకమవుతుంది."*
*"సముద్ర గర్బంలో వున్న జీవరాసులకు అక్కడి నీళ్ళే వాటి లోకం. ఆకాశంలో తిరిగే పక్షికి ఆకాశమే దాని లోకం."*
*"తల వెంట్రుకల్లో వున్న పేనుకు అక్కడి వెంట్రుకలే దాని లోకం."*
*"రేగి పండులో ఉన్న పురుగుకు రేగి పండే తన లోకం."*
*"మానవ దేహంలో వున్న సూక్ష్మజీవులకు అక్కడి రక్తం, చీము, ఎముకలే వాటి లోకం."*
*"ఈ ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల జీవరాసుల్లో మానవ శరీరమే అత్యుత్తమం."*
*"అనేక వేల, లక్షల సంవత్సరాలపాటు కొన్ని కోట్ల వివేకం లేని జన్మల తర్వాత అదృష్టం కొద్దీ మానవ శరీరాన్ని పొందిన మనం వివేకంతో ఈ “భ్రమ”ను దాటి “మోక్షాన్ని” పొందక పోతే తిరిగి ఇప్పటి వరకూ మనం చెప్పుకున్న అన్ని జీవ రాసుల లోకాలూ ఇంకా అనేకానేక జీవరాసుల లోకాలలోకి తిరిగి ప్రవేశించి మన పాత బంధువుల్ని అందరినీ పలకరించాల్సి వస్తుంది.*
*ఇప్పుడు సృష్టి క్రమం ఒకసారి పరిశీలిద్దాం…."*
*"ఆకాశం నుంచి వాయువు పుడుతోంది.*
*వాయువు నుంచి అగ్ని పుడుతోంది.*
*అగ్ని నుంచి జలం పుడుతోంది.*
*జలం నుంచి భూమి పుడుతోంది. "*
*"భూమి నుంచి చెట్లు, చెట్ల నుంచి ఆహారం, ఆహారం నుంచి వీర్యం,"*
**వీర్యం నుంచి ప్రాణులు పుడుతున్నాయి."*
**పురుషుడి నుంచి విడువబడిన వీర్యం స్త్రీ యోని మార్గం ద్వారా ఆమె గర్బంలోకి ప్రవేశించి కొద్ది నెలల తర్వాత నూతన ప్రాణి ఈ లోకంలోకి రావడం జరుగుతోంది."*
**ఒక ప్రాణి జన్మకు కారణం ప్రాధమికంగా స్త్రీ పురుషులు అనుకుందాం."*
*"పురుషుడు తన నుంచి స్త్రీ యోనిలోకి వదలబడిన వీర్యం పురుషుడికి ఎక్కడి నుంచి లభించింది?"*
*"నోటితో తిన్న ఆహరమే అతడి శరీరంలోకి ప్రవేశించి వీర్యంగా మారింది."*
*"అంటే వీర్యానికి కారణం పురుషుడు తిన్న ఆహారం అని తెలుస్తోంది."*
*"ఇక ఆహారానికి కారణం చెట్లు.*
*చెట్లకు కారణం భూమి.*
*భూమికి కారణం జలం.*
*జలానికి కారణం అగ్ని.*
*అగ్నికి కారణం వాయువు.*
*వాయువుకి కారణం ఆకాశం.*
*"ఆకాశానికి కారణం...!"*
*ఆకాశానికి కారణం లేదు."*
*"కారణం లేకుండా కార్యం ఎక్కడ ఉంటుంది?"*
*"మరి ఆకాశానికి కారణం ఏదని చెబుతాం."*
*"ఏదయినా చెప్పటానికి అసలు ఉంటే గదా!"*
*"ఆకాశానికి కారణమే లభించట్లేదు..!"*
*"కాబట్టి ఆకాశం అనేది లేనిదే అనే నిర్ణయానికి రావలసి వస్తోంది."*
**ఇక ఆకాశమే లేనప్పుడు లేని దాని నుంచి*
*వాయువు,*
*అగ్ని,*
*జలం,*
*భూమి,*
*ఆహారం,*
*వీర్యం,*
*"ప్రాణులు అనే క్రమమంతా ఎక్కడిది?"*
*"అలా కాదు ఏదో అదృశ్య శక్తి ఆకాశానికి కారణం అయి ఉండవచ్చు.."*
*"బహుశ అది మనకు కనిపించకపోవచ్చు అని అంటే..!"*
*"అప్పుడు కూడా ఆ అదృశ్య శక్తికి ఇంకేదో మరొక శక్తి కారణం అయి ఉండాలి కదా..!"*
*"ఆ మరొక శక్తికి కూడా మళ్ళీ ఇంకేదో ఇంకొకటి కారణం అయి ఉండాలి.!"*
🪷🌹🪷🌹🪷
🪷🕉️🪷
No comments:
Post a Comment