Tuesday, February 14, 2023

శ్రీరమణీయం: నాలోవున్న శక్తి, నేను అనే స్ఫురణవున్న నేను ఒకటేనా తేడా ఎక్కడొస్తుంది ?

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 💖💖💖
       💖💖 *"468"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"నాలోవున్న శక్తి, నేను అనే స్ఫురణవున్న నేను ఒకటేనా తేడా ఎక్కడొస్తుంది ?"*

*"మనని మనం దేహమని అనుకుంటున్నాం. అలా అనుకునే శక్తి ఒకటి మనలో ఉంది. ఆ శక్తి వల్లనే నిద్ర నుండి లేవగానే నేను ఫలానా మనిషిని, ఫలానా వ్యక్తినని స్ఫురణకు వస్తుంది. మన పేరు, ఊరు, ఉనికి అన్నీ ఎరుకలోకి వస్తాయి. నిద్రపోతున్నప్పుడు (లేదా కోమాలో ఉన్నప్పుడు) మనలోని శక్తికి ఏ స్ఫురణా రావటంలేదు. అప్పుడు తన ఉనికికి సంబంధించిన సమాచారంగాని, తాను మనిషినన్న భావనగాని ఉండదు. అప్పుడు మనలోని శక్తి తెలివిగావ్యక్తం కాకపోవటమే అందుకు కారణం. అంటే మనలోని శక్తి తెలివిగా ఉంటేనే మన జీవనం సాధ్యం అవుతుంది. ఆ తెలివే లేదంటే కోమాలోని వ్యక్తిలాగా మనకి జీవనం లేనట్లే ! దీన్నిబట్టి ఈ దేహం ద్వారా జీవనం చేస్తున్నది, మనలోని శక్తేనని అర్థమవుతుంది. తెలివిగా మారిన శక్తి తనను తాను దేహాన్ని అనుకుంటుంది. తనతో ఉన్నవన్నీ తనవేనని భావిస్తుంది. కానీ తెలివి ఏ వస్తువును తనతోపాటు తీసుకెళ్ళలేదు. అంటే ''ప్రాణంలేని దేహంకానీ, దేహంలేని ప్రాణంకానీ'' వస్తువులను తమలో ఐక్యం చేసుకోలేవు. మనలో కలిసి పోనిది, మన వెంట రానిది మనదెలా అవుతుంది !?"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
             

No comments:

Post a Comment