🙏🕉🙏 ...... *"శ్రీ"*
🪷🪷 *"త్రికరణశుద్ధి"* 🪷🪷
🪷🌹🪷🌹🪷🌹🪷
🪷🌹🕉🌹🪷
🪷🌹🪷
🪷
*"చెట్టు మీద పిట్ట వాలుతుంది. ఓ కొమ్మపై గూడు అల్లుతుంది. అందులో గుడ్లు పెడుతుంది. అవీ పక్షులై పెరుగుతాయి. ఆహారం కోసం దూర తీరాలకు ఎగిరిపోతాయి. వెళ్లిన చోటే రాత్రి పూట గడపవచ్చు. కానీ, పక్షులు అలా చెయ్యవు.అవి తిరిగి సాయంకాలం గూళ్లకు చేరుతాయి. మనిషి జీవన స్థితీ అంతే. చైతన్యం సృష్టించిన గూడే శరీరం. అందులో పుట్టే భావాలు పక్షులు. అవి తొడుక్కునే రెక్కలే ఆలోచనలు. అవీ ఎగురుతాయి. జీవితం విస్తరించిన మేర సంచరిస్తాయి."*
*"విన్నవి, కన్నవి అనుభవాలవుతాయి. వీటన్నింటి సమాహారమే- మనసు. అది అత్యంత శక్తిమంతమైనది, చంచల మైనది. ఎంత దూరాన్నైనా క్షణాల్లో చేరగలదు. తలచుకుంటే నిశ్చలంగా ఉండగలదు. అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యగలదు. పంచభూతాలతో శరీరం తయారవుతుంది. ఆ తరవాతే మనసు నిర్మాణంజరుగుతుంది. శరీరం లేకుండా మనసు మనగలదా లేదు. మనిషంటే ఎవరు? అతడి ఉనికి తెలిపేది ప్రధానంగా అతడి- ఆకృతి (రూపం).అంటే, శరీరమే కదా. ‘మనసు’- అనుసంధాన కర్తగా పనిచేసే మధ్యవర్తి. ఒక వైపు చైతన్యం మరోవైపు శరీరం ఉంటేనే కదా ఆ రెండింటి మధ్య వంతెనలా మనసు ఉండగలిగేది."*
*"శరీరం నిండా చైతన్యం పరచుకొని ఉంటుంది. మనసూ చైతన్యాంశమే. కానీ, దేహం నుంచి వీడిపోయిన మనసు తెగిన గాలిపటం లాంటిది. దాని పయనం అగమ్యగోచరం."*
*"మనిషి(మనసు) ప్రమేయం లేకున్నా శరీరం తన విధులు చక్కగా నిర్వర్తిస్తుంది. లయ తప్పకుండా గుండె కొట్టు కుంటుంది."*
*"ఈ క్రియలన్నింటికీ చైతన్యం పునాదిగా పనిచేస్తుంది. ఆ రెండింటికీ మనసు తోడైతే మూడూ ఒక్కటవుతాయి. అప్పుడు, ‘త్రికరణ శుద్ధి’ నెలకొంటుంది. ‘ధ్యానం’ పురివిప్పుకొంటుంది."*
*"ఆ స్థితిలో చేపట్టే ప్రతీపని ఒక ‘ప్రార్థన’ అవుతుంది.నిలువ ఉన్న నీరు చెడిపోతుంది. పారే నది ప్రయోజనకారిఅవుతుంది.మనసు మంచిగా ఉండాలన్నా, ప్రజల శ్రేయం కోరే ఆలోచనలు కలగాలన్నా ముందు శరీరం బాగుండాలి.మనసులో మలినశుద్ధీ జరుగుతుంది. పరిశుద్ధమైన మనసే ధ్యానానికి సిద్ధపడుతుంది."*
🪷🌹🪷🌹🪷
🪷🕉️🪷
No comments:
Post a Comment