ఇలాంటి శృంగార కలలు వస్తున్నాయా?
శృంగార కలలు.. యవ్వనంలోకి వచ్చిన అందరికీ వచ్చేవే. అయితే ఈ కలల వస్తే మంచిదా? దాని ద్వారా శృంగార కోరికలు పెరిగి ఏమైనా అవాంఛిత భావోద్వేగాలు రేప్ లు జరుగుతాయా? సైడ్ ఎఫెక్ట్ వస్తాయా? అన్న దానిపై తాజాగా ఓ పరిశోధన సాగింది. సాధారణంగా చాలా మందికి ఈ కలలు ఆనందాన్ని ఇస్తాయి. ఇంకొందరికి భయాన్ని కలిగించేలా ఉంటాయి. శృంగారంపై పడ్డ కలల అర్థం చాలా మందికి తెలియదు. శృంగార కలలు అర్థమేంటన్నది తెలుసుకోవడం ముఖ్యం.
మనుషులకు కలలు ఎందుకొస్తాయి? ఎలాంటి కలలు వస్తే ఎలాంటి అర్థం అన్న దానిపై ఆరాతీయగా ఈ విషయం తేటతెల్లమైంది. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ప్రకారం.. మనిషి మెదడులో భ్రమలు కలిగించేలా ఎందుకు ప్రేరిపిస్తుందో శాస్త్రీయ సిద్ధాంతాలను వివరించారు. సాధారణంగా కలలు నాలుగు నుంచి ఆరు సార్లు వస్తాయని గుర్తించారు.
శృంగారంపై ఎక్కువగా ఆలోచనలు ఉంటే వారిలో ఎక్కువశాతం శృంగారానికి సంబంధించిన కలలే వస్తాయని తేల్చారు. రోజులో ఏదైనా విషయంపై ఎక్కువగా ఆలోచిస్తే అదే రోజు రాత్రిలో కల రూపంలో కనిపిస్తుందని తేల్చారు.
బహుళ భాగస్వాములతో సెక్స్ గురించి కలలు వస్తే మాత్రం మీరు జీవితంలో ఉత్సాహాన్ని పొందాలని చూస్తున్నారని.. మీరు ఒత్తిడికి గురవుతున్నారని.. జీవితంలో చాలా విషయాలు జరుగుతున్నాయని కూడా ఈ డ్రీమ్ సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మీకు పరిచయం ఉన్న వారితో శృంగార కలలు వస్తే ఆ వ్యక్తి పట్లు వ్యక్తీకరించలేని అనుభూతులు కలిగి ఉన్నారని అర్థం. ఈ కల మీరు ఆ వ్యక్తితో బలమైన బంధాన్ని ఏర్పరుచుకోవాలన్న భావనను కలిగిస్తుందని అర్థం చేసుకోవాలి.
లైంగికత అనేది జీవితంలో ఒక సాధారణ భాగమని.. శృంగార కలలు లైంగికత.. ప్రాధాన్యాలు.. నైతికతతో పెద్దగా సంబంధం ఉండవని.. ప్రస్తుత లైంగిక జీవితాన్ని ప్రతిబింబించేలా కలలు ఉంటాయని తేల్చారు. సో మీరు శృంగార కలలుగంటే మీ ఆ జీవితం బాగున్నట్టు లెక్క. ఆనందంగా అనుభూతి చెందితేనే ఇది వస్తుందని తేల్చారు. ఆందోళన.. డిప్రెషన్ వ్యాకులత ఉంటే అలాంటి కలలే వస్తాయని తెలిపారు.
No comments:
Post a Comment