*:::::::::::::కాల వ్యవధి. :::::::::::*
బాహ్య ప్రపంచం (అనగా రూపం, గంధం, శబ్దం, రసం, స్పర్శ,) మన ఇంద్రియాల ద్వారా ఎల్ల వేళలా మనలో ప్రేరణలు కలిగిస్తుంది. ఈ ప్రేరణలకు మనం ప్రతి స్పందిస్తాము.
దాదాపుగా మనం ప్రతి స్పందించే తీరు ఒక అలవాటుని ఒక తీరుని ఒక నమూనాని కలిగి ఒక అసంకల్పిత యాంత్రిక చర్య లాగా వుంటుంది. మన నియంత్రణ, పట్టు వుండదు. అందువల్ల సరి తూగవు.
*కాని ఒక చిన్న అవకాశం వుంది.అది ఏమిటంటే. కాల వ్యవధి.*
బాహ్య ప్రేరణకి మన స్పందనకి మధ్య కాలవ్యవధి.
ఈ కాల వ్యవధి లో మనం ఎన్ని రకాలుగా స్పందించ వచ్చో, ఎలాంటి స్పందన సరితూగ గలదో, నిర్ణయించ వచ్చు.
*ఏకాగ్రత* మనకు ఈ వ్యవధి ని ఇస్తుంది.
*సతి, అంతర్దృష్టి* ఎలా స్పందిస్తున్నాం అని చెపుతుంది
*ప్రజ్ఞ* ఏది సరైన స్పందనో చెపుతుంది.
*శీలం* శీలాచరణకు దారితీస్తుంది.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment