Wednesday, April 12, 2023

త్వరలో అంతరించబోతున్న పాత తరం...

 *త్వరలో అంతరించబోతున్న పాత తరం... 😢🙏🙏🙏🙏

రాబోయే 10/15 సంవత్సరాలలో ఒక క్రమశిక్షణ కలిగిన, కష్టపడిన తరం ఈ ప్రపంచం  నుండి కనుమరుగు అవ్వబోతోంది.

అవును ఇది ఒక చేదు నిజం ।
ఆ తరం ప్రజలు అతి సామాన్య వ్యక్తులు.  
రాత్రి పెందరాళే పడుకునే వాళ్ళు !
ఉదయం పెందరాళే లేచేవాళ్ళు !

నడక అలవాటు ఉన్నవాళ్ళు! 
మార్కెట్ కి నడిచి వెళ్ళే వాళ్ళు
ఉదయమే  వాకిట కళ్ళాపు చల్లేవాళ్ళు !
ముంగిట్లో ముగ్గులు పెట్టేవాళ్ళు! 

మొక్కలకు నీళ్ళు పెట్టేవాళ్ళు!
పూజకు పూలు కోసే వాళ్ళు !
పూజ కాకుండా ఏమీ తినని వాళ్ళు !
మడిగా వంట వండేవాళ్ళు !

దేవుడి గదిలో దీపం వెలిగించే వాళ్ళు! 
దేవుడి గుడికి వెళ్ళే వాళ్ళు !
దేముడి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు !!!
మనిషిని మనిషిగా ప్రేమించే వాళ్ళు.!!

అందరితో ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు! 
కుశల ప్రశ్నలు వేసేవాళ్ళు !
స్నేహంగా మెలిగే వాళ్ళు!
తోచిన సాయం చేసేవాళ్ళు !

చేతులు జోడించి నమస్కారం చేసేవాళ్ళు !
ఉత్తరం కోసం ఎదురుచూసిన వాళ్ళు !
ఉత్తరాలు తీగకు గుచ్చిన వాళ్ళు !
పాత ఫోన్ లు పట్టుకు తిరిగే వాళ్ళు! 

ఫోన్ నెంబర్ లు డైరీ లో రాసిపెట్టుకునే వాళ్ళు!
పండుగలకూ, పబ్బాలకూ అందరినీ పిలిచే వాళ్ళు!
కుంకుడు కాయతో తలంటుకున్నవాళ్ళు !
సున్నిపిండి నలుగు పెట్టుకున్నవాళ్ళు !

పిల్లలకు పాలిచ్చి పెంచినవాళ్ళు ! 
తీర్థయాత్రలు చేసేవాళ్ళు !
ఆచారాలు పాటించే వాళ్ళు !
తిధి, వారం , నక్షత్రం గుర్తుపెట్టుకునే వాళ్ళు !

పుట్టిన రోజు దీపం వెలిగించి జరుపుకునేవాళ్ళు !
చిరిగిన బనియన్లు తొడుక్కుని ఉండేవాళ్ళు !
లుంగీలు, చీరలు  కట్టుకుని ఉండేవాళ్ళు !
చిరిగిన  చెప్పులు కుట్టించుకుని వాడుకునే వాళ్ళు!

అతుకుల చొక్కాలు కట్టుకున్నవాళ్ళు !  
తలకు నూనె రాసుకునే వాళ్ళు !
జడ గంటలు పెట్టుకున్నవాళ్ళు !
కాళ్ళకు పసుపు రాసుకునేవాళ్ళు !
చేతికి గాజులు వేసుకునే వాళ్ళు !

ఇప్పటిలా మనుష్యులను వాడుకుని వస్తువుల తో స్నేహం కాకుండా... వస్తువులను వాడుకుంటూ మనుషుల తో స్నేహంగా గడిపిన తరం.....

ఈ తరాన్ని చూసి మూగబోయిన వాళ్ళు మీకు తెలుసా ?
వీళ్ళంతా నెమ్మది నెమ్మదిగా  మనల్ని వదిలి పెట్టి వెళ్ళిపోతున్నారు.
మన ఇళ్ళల్లో ఇలాంటి వాళ్ళు అతి తక్కువ మంది మాత్రమె ఉన్నారు.
మీ ఇంటిలో ఇలాంటి వాళ్ళు ఉంటె దయచేసి వాళ్ళను బాగా చూసుకోండి 
లేదంటే ..... లేదంటే .....  లేదంటే .....
ఇప్పటి తరం చాలా కోల్పోవలసి వస్తుంది.

వాళ్ళ ప్రపంచం, వస్తువులతో కాకుండా, మనుషులతో మానవత్వంతో, స్నేహంతో కూడి ఉండే తరం...
సంతోషకరమైన జీవనం గడిపిన తరం అది ,!
స్పూర్తిదాయక జీవనం గడిపిన తరం అది !
కల్లాకపటం లేని జీవనం గడిపిన తరం అది!
ఉన్నది ఉన్నట్టు నిర్మొహమాటంగా మాట్లాడగలిగిన తరం
ద్వేషం, మోసం లేని స్నేహ  జీవనం గడిపిన తరం అది!
సాత్విక ఆహారం తిని జీవనం గడిపిన తరం అదే
 
తప్పు చేయడానికి భయపడి జీవనం గడిపిన తరం అది !
ఇరుగుపోరుగుతో కలసిమెలసి జీవనం గడిపిన తరం అది!😊
 తనకోసం కొంత మాత్రమే వాడుకుని, తన సంతానం వృధ్ధి కోసం పరితపించిన తరం.
వారినుండి మనం నేర్చుకోకపోతే ముందు తరాల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది.
మీ కుటుంబం లో పెద్దవారిని మీరు గౌరవించడం ద్వారా మీ పిల్లకు మంచి సంస్కారం అందివ్వండి. .
సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజాలతో స్నేహంగా వుండేట్టు వారిని తయారు చేయాలి..

*సంస్కారం లేని దేశం ... సంస్కృతి లేని దేశం గా ఈ భారతాన్ని  మార్చేయ్యకండి !!!*

తప్పులను సరిదిద్దగలది  సంస్కారమే సర్కారు చేసే  చట్టాలు కాదు....🙏

*రాబోయే తరాలకు ఆస్తులనే కాదు ... ఆప్యాయతలను, స్నేహాన్ని కూడా అందిద్దాం.. లేకుంటే రాబోయే తరాల వారిని మనుషులుగా కాక మర యంత్రాలుగా పిలుస్తారు..🤔*

No comments:

Post a Comment