Saturday, May 4, 2024

దేవుడిచ్చిన మనిషి నేర్చుకోవలసిన ఆరోగ్య సూత్రాలు

 దేవుడిచ్చిన మనిషి నేర్చుకోవలసిన
ఆరోగ్య సూత్రాలు 
1.కూర్చున్న చోటే కునికిపాట్లు
2.భూమి మురక చూస్తే నిద్రలోకి జారడం
3. మాటలతో గాని చేతలతో గాని ఎవరు ఏరకంగా ఇబంది పెట్టిన నొచ్చుకొని తత్త్వం
4.తిట్టినాగాని మనసును కష్టపెట్టినా గాని ఆనందంగా నవ్వడం
5. సంతోషాన్నైనా కష్టాన్నైనా ఓపికగా ఎదుర్కోవడం
6. స్నేహితుడి విషయంలోనైనా విరోధి విషయంలో నైనా ఒకేలా స్పందించడం
7. కనీసం ఉదయం సాయంత్రమైనా స్నాన్నాన్ని ఆచరించడం
8. ఆహారం ఎంత రుచికరమైనదైనా మితంగా భోంచెయ్యడం
9. తామస స్థితి నుండి సాద్విక స్థితికి మార్చే జలాన్ని ఎక్కువగా తీసుకోవడం
10.ఏ మంచి విషయానికైనా ఎలాంటి దురలవాటుకైనా బానిస కాకపోవడం
11. సర్వ ప్రాణులను ఒకేవిదంగా ప్రేమించే మనసు కలిగి ఉండడం
12. వీటి అన్నిటితో పాటు భూమిని చెట్లను రక్షించుకునే ఆలోచన కలిగి ఉండడం 
కొన్ని పుట్టుకతో స్వతహాగా వచ్చేవి
కొన్ని అనుభవంలో నేర్చుకోవలసినవి
ఈ పన్నెండు సూత్రాలు పాటించగలిగితే మనిషి ఆయురారోగ్యాలతో జీవించగలడు.
సర్వేజనా సుఖినోభవంతు 🙏🏽🙏🏽

No comments:

Post a Comment