*గుడిలో మనం ఏం సేవ చేయొచ్చు?"*
భగవంతుడికి మనం చేసే గొప్ప సేవలలో ఒకటి మన శరీరంతో ఒక సామాన్యుడిలా సేవ చేయడం. ఆ సేవ ఒక దేవాలయంలో చేస్తే ఇంకా గొప్ప పుణ్యం.
భగవంతుడి ముందు అందరం సమానమే. అందరూ సామాన్యులమే అనే భావం మనస్సులో నింపుకొని, ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా దేవాలయంలో సేవ చేస్తే, భగవంతుడు తప్పక మనల్ని అనుగ్రహిస్తాడు.
దేవాలయంలో మనం చేసే సేవ, ఆ భగవంతుడి పూజ కన్నా ఎక్కువైనదే అనటంలో సందేహం లేదు. దేవాలయంలో మనం చాలా సేవలు చేయవచ్చు. అవి.....
దేవాలయం బండలు తుడవడం,
భగవంతుడు (విగ్రహం) ధరించిన వస్త్రాలు ఉతకడం,
దేవుడి పల్లకి మోయడం,
దేవుడి పూజ సామాగ్రిని శుభ్రం చేయడం,
దేవాలయ ప్రాంగణం శుభ్రం చేయడం,
దేవుని విగ్రహాల అలంకరణ కోసం పూలమాలలు కట్టడం,
దేవుడి అలంకరణలో సహాయం చేయడం,
దేవుడి పూజకు సామాన్లు సర్దడం,
దేవుడి అభిషేకం కోసం పదార్థాలను వండటం / సర్దడం దేవుడి తీర్థ ప్రసాదాలు పంచడం, *దేవాలయం గోడలు / గోపురాల మీద బూజు దులపడం,
అన్నదాన కార్యక్రమంలో వంటకు సహాయం చేయడం,
దేవుడి పూజ యొక్క నిర్మాల్యం శుభ్రం చేయడం,
అభిషేకం తర్వాత గర్భాలయం శుభ్రం చేయడం,
దేవుడి కళ్యాణంలో సహాయం చేయడం.
భగవంతుడు మనకిచ్చిన దానిలో ఆయనకు,ఆయన నివసిస్తున్న ఇంటికి(దేవాలయానికి) సహకారం అందించి అభివృద్ధి చేయడం
దేవుని పూజలకు సహాయం అందివ్వడం
దేవుని కళ్యాణం కొరకు, హోమాల కొరకు సౌకర్యం చేయడం
వీటిలో కనీసం మనకు చేతనైన,అవకాశమున్న కొన్నిటినైన చేసి భగవంతుని కృపతో మన మానవ జన్మను సార్థకం చేసుకోవాలి.
🥦🥦మన జన్మకు కొంచెమైనా పుణ్యం, పురుషార్థము వుండాలి కదా!🥦🥦🥦🥦🥦🥦
No comments:
Post a Comment