Thursday, May 9, 2024

సద్బోధ

 🔔  *సద్బోధ* 🔔

```మనం ఎల్లప్పుడూ మన అంతరంగాన్ని నియంత్రించగలగాలి. ఆనందం అంతరంగం నుంచే వస్తుంది. మహాత్ములు ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఆనందంగా ఉంటారు. వాళ్ళకు ఏది లభించినా వారు ఆనందంగానే స్వీకరిస్తారు. వారిలో ప్రకాశం స్పష్టంగా కాన వస్తుంది. ఆత్మచైతన్యం అత్యంత ప్రకాశవంతమైనది. 

బాధల్లో ఉన్నవారిని చూసి వారితో కలిసి ఏడిస్తే పరిష్కారం లభించదు. దాని వలన సంబంధం ఏర్పడవచ్చు కానీ అది పరిష్కారాన్ని చూపలేదు. దుఃఖానికి విరుగుడు ఆనందం. నిత్యజీవితంలో సంతోషంగా ఉండగలిగేలా మనం చూసుకోవాలి. అది మనలో ధైర్యాన్ని, పనులను సమర్థవంతంగా చక్కబెట్టగల స్ఫూర్తిని కలిగిస్తుంది. మనస్సు ఆనందంగా ఉండగలిగితే ఎటువంటి పరీక్షనైనా ఎదుర్కొనగల సామర్థ్యంతో ఉంటుంది. ఆనందమే మన స్వరూపం అనే సంగతి ఆధ్యాత్మికత పట్ల మన దృష్టి నిశ్చలంగా నిలిచినప్పుడే అవగతమవుతుంది.

అందుకై మనం భగవంతుని ఈ విధంగా ధ్యానించాలి...```

*ఆ శ్రీమన్నారాయణుడు నా చేయిపట్టుకొని నా జీవితాన్ని నడిపించుగాక,  ఆయన అభీష్టానుసారం నా జీవనాన్ని మలచుగాక, ఒంటరితనాన్ని, అధిగమించగల శక్తి నాకు ప్రసాదించుగాక, కష్ట సమయాల్లో అంతరంగ మూలంపై నా దృష్టిని సారించే శక్తిని కలిగించుగాక, ఆ ఆనందమూర్తి సదా ఉత్సాహాన్ని, సంతోషాన్ని నాకు ప్రసాదించుగాక.✍️```
           *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

No comments:

Post a Comment