Tuesday, May 7, 2024

పరమానంద స్థితి

 హరిఓం    ,                        -                                                         -        *పరమానంద స్థితి*

సదృశంగా ఉండిపోవాలా! భౌతికమైన లక్ష్యాలు ఆధ్యాత్మిక పరంగా అవి సాధనకు అవరోధాలు అవుతాయా! ఇలాంటి ప్రశ్నలెన్నో సాధకులకు ఎదురవుతుంటాయి. ఇతరులకు హాని జరగని ఏ
మనిషై పుట్టినవాడు కోరికలు తీర్చుకోక శిలా కోరిక తీర్చుకున్నా అది తప్పు కాదన్నాయి శాస్త్రాలు. నిజానికి కోరికలు లేకుండా ప్రాణికోటికి మనుగడ లేదు. మనిషి సృష్టిలో ప్రథమ స్థానం ఉన్నవాడు. 

కాబట్టి తన కోరికలు తీరే విషయంలో అతడి ప్రతిభాపాటవాలకు తోడుగా భగవంతుడి కరుణ, వాత్సల్యం తోడవుతాయి. చిన్నా చితకా కోరికల జాబితాను మానవుడు సదా భగవంతుడికి నివేదించడం తెలివైన పని కాదంటారు విమర్శకులు. మోక్షమంటే మరణానంతరం పొందే పరమానంద స్థితి అనుకుంటాం. కావచ్చు. 
మరణానికి ముంది సైతం మన జీవితాలు నిత్యానందభరితం కావాలి.

భూములు, అగ్రహారాలు బహూకరించగల మహారాజు ప్రసన్నుడై మనల్ని ఏదైనా కోరుకొమ్మంటే అల్పమైన కోరికలు కోరడం ఎంత పొరపాటు! అలాగే భౌతిక సంపదతోపాటు నిత్య ప్రశాంతిని, కైవల్యాన్ని ప్రసాదించగల దైవాన్ని అల్పమైన లౌకిక కోరికలు కోరడం ఎంత వరకు సమంజసం! అది కూడదంటారు విజ్ఞులు.

కష్టసుఖాలను సమదృష్టితో చూసినప్పుడే సాధకుడికి ఆ స్థితి కలుగుతుందంటారు పెద్దలు. అనుభవంలోనూ అదే తెలుసుకుంటాం. మనం ఏది కలిగి ఉంటే మరేదీ అక్కరలేదో అలాంటి మహోన్నతమైన వస్తువే ఎవరైనా కోరుకొనేది. అదే బ్రహ్మానందం, అదే పరమసుఖం, అదే తృప్తి! ఈ మూడూ సిద్ధింపజేసుకున్నవాడు జీవించి కైవల్యాన్ని పొందినవాడే!. ఆదిత్యయోగి...

సన్యాసులు సదా నూతన ప్రదేశ సందర్శన చేస్తుంటారు. వారికి సైతం అవసరాలు ఉంటాయి. వెళ్ళిన చోట ఆహారపానీయాలు, వసతి కావాలి. కేవలం అవసరాలు తీర్చుకుంటూ కోరికలను జయించి క్షేత్రాలను వారు దర్శిస్తారు. కోరికలపై విజయం మోక్షసిద్ధికి సోపానాలు అన్నది వేదవిదుల మాట.

ఏ కోరికలూ లేనప్పుడు శరీరంతో ఉండవలసిన అవసరం ఏముందన్న ప్రశ్న ఉదయిస్తుంది. దైవాన్ని కోరవలసిన కోరికలు ఎలా ఉండాలో చెప్పారు. భక్తాగ్రేసరులు, పరమోత్కృష్టమైన మోక్షం (పరమానంద స్థితి) కోరదగినదని వారి అభిప్రాయ తీరని ఏ కోరికా లేనప్పుడు మిగిలేది ప్రశాంతే కదా అన్నారు గురుదేవులు రమణ మహర్షి. ఏ చిన్న కోరిక తీరనిది ఉన్నా దాన్ని సాధించడం కోసం మనసు ఆరాటపడుతుంది. ఆరాట పోరాటాలు లేని హృదయంలో ప్రశాంత ఆవిర్భవిస్తుంది. అందుకే మహర్షులు కోరికలు లేని స్థితికోసం సాధన
చేసేవారు. 

ధ్యానాచరణతో జ్ఞాని అయ్యేదాకా బోధి | వృక్షం ఛాయలో తపస్సు ఆచరించాడు. బుద్ధభగవానుడు. మనసును ఏకాగ్రం చేసి మోక్షాన్ని (పరమశాంతి గమ్యాన్ని) తెచ్చిపెట్టగల ద్వారయో ఆవశ్యకతను సాధకుడు గుర్తించవలసి ఉంది.. నిష్కామ (కోరికలులేని) జీవితంలో మనిషికి పరమశాంతి లభించడంలో ఎలాంటి సందేహం. లేదు...
.

జన్మించిన ప్రాణి మరణించక తప్పదు. మరణించిన తర్వాత జన్మించక తప్పదు’ ఇది ప్రకృతి ధర్మం. ఈ ధర్మానికి ప్రధాన రక్షకులు ముగ్గురు. వారే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వీరు ముగ్గురు సర్వ స్వతంత్రులు అయినప్పటికీ.., ఒకరి విధి నిర్వహణలో మరొకరు తల దూర్చరు. ‘బ్రహ్మ’...సృష్టి ధర్మానికి రక్షకుడు. ప్రాణికోటిని సృష్టించడమే ఈయన ధర్మం. ‘విష్ణువు’...సృష్టిని పోషించి, రక్షించడమే ఈయన ధర్మం. ఈ ధర్మరక్షణ కాస్త కష్టంతో కూడుకున్న వ్యవహారం. ఒక కుటుంబాన్ని పోషించి, రక్షించడానికి.., యజమాని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది., మోసాలు చేయాల్సి వస్తుంది. 

కేవలం ఒక్క కుటుంబ రక్షణే ఇంత కష్టతరం అయినప్పుడు.., మరి ఈ మాయాజగత్తును పోషించి, రక్షించడమంటే మాటలా! ఈ ధర్మరక్షణ కోసమే ‘శ్రీ మహావిష్ణువు’ ఎన్నో అవతారాలు ఎత్తాడు..,ఎన్నో మాయలు పన్నాడు.., మరెన్నో మోసాలు చేసాడు. ఎలా రక్షించాడు అన్నది అప్రస్తుతం. ఇక్కడ రక్షణే ప్రధానాంశం. ‘మహేశ్వరుడు’...లయకారకత్వం ఈయన ధర్మం. ‘లయం’ అంటే ‘ నాశనం’ అని ఓ తప్పుడు అర్ధాన్ని చెప్పేస్తారు. ఇంగ్లీషు భాషలో ‘destroyer’ అనే పదాన్ని వాడతారు. అది తప్పు. ‘absorber’ అనే పదాన్ని వాడాలి. ‘శివుడు’ నాశనకారుడా? ఎంత తప్పు భావన అది. ‘లయం’ అంటే లీనం చేసుకోవడం, లేదా తనలో కలుపుకోవడం. ఈ సృష్టిచైతన్యాన్ని లయం చేసుకోవడం అంటే మాటలా? ధానికి ఎంతో తపశ్శక్తి కావాలి. అందుకే శివుడు ఎప్పుడూ తపస్సమాధి స్థితిలో ఉంటాడు. సృష్టికి, రక్షణకు నాశనం ఉంది. ‘లయం’కు నాశనం లేదు. అది శాశ్వతం. భౌతికంగా కనిపించేది ప్రతీదీ నాశనం అయ్యేవే. అభౌతికమైనవే శాశ్వతంగా ఉండేవి... ఆదిత్యయోగి..

ఏది అభౌతికమైనది అంటే..‘ఆత్మే’ అభౌతికమైనది. దీనికి చావు పుట్టుకలు ఉండవు. ఈ ఆత్మ దేహధారణ చేస్తే ‘జీవాత్మ’ అవుతుంది. ‘జీవాత్మ’ దేహత్యాగం చేస్తే ‘ఆత్మ’గా మిగిలిపోతుంది.పాంచభౌతికమైన శరీరం మరణించిన తర్వాత భూతత్వం..భూమిలోను., అగ్నితత్వం.. అగ్నిలోను., జలతత్వం., జలములోను., వాయుతత్వం..వాయువులోను., శబ్దతత్వం.. ఆకాశంలోను., లయమౌతాయి. ఇక మిగిలివున్న ‘ఆత్మ’ను శివుడు లయం చేసుకుంటాడు. ఎలా? ఉదాహరణకు..., ఒక దీపాన్ని ఊదేస్తే ఏమవుతుంది? ఆరిపోతుంది. ఆరి.. ఎక్కడకు పోతుంది? తన ఉత్పత్తి స్ధానమైన దీపంలోకే వెళ్లి లయమైపోతుంది. తిరిగి దీపాన్ని వెలిగించాలంటే.. దీపం నుంచే దీపాన్ని వెలిగించాలి. అలాగే ఒక మనిషి మరణిస్తే.. ‘చనిపోయాడు’ అంటాం. ‘చని’ అంటే ‘వెళ్లుట’ అని అర్థం. ఎక్కడకు వెళ్లాడు..అంటే..తను వచ్చినచోటుకే వెళ్లాడు. తిరిగి రావాలంటే.. అక్కడనుంచే రావాలి.అంటే.. లయంనుంచే సృష్టి ప్రారంభమౌతున్నదన్నమాట. దీనిని బట్టి మనకు ఏమర్థమౌతోంది? 

దేహం నుంచి విడివడిన ‘ఆత్మ’ తన ఉత్పత్తిస్ధానమైన శివునిలో లయమైపోతుంది. కనుకనే ఆయనను లయకారుడన్నారు. వ్యామోహం లేనివాడే విరాగి. మమకారం ఉన్నచోట స్వార్ధం ఉంటుంది. స్వార్దం ఉన్నచోట లయానికి తావులేదు. కష్ట సుఖాలయందు సమదృష్టి కలవాడే విరాగి. అట్టి విరాగే సర్వాన్ని సమానంగా తనలో లీనం చేసుకోగలుగుతాడు. శివునకు తన దేహంమీదే మమకారంలేదు. చితాభస్మాన్ని పూసుకుంటాడు.. దిగంబరంగా తిరుగుతాడు..భిక్షాటన చేస్తాడు. పుర్రెలో భుజిస్తాడు. రుద్రాక్షలు, పాములు ధరిస్తాడు. శ్మశానంలో నివసిస్తాడు. ఇంతటి విరాగి కనుకనే ఆయన లయకారుడయ్యాడు. సృష్టి, స్ధితులకు ఆద్యుడయ్యాడు. సర్వజగత్తుకు ఆరాధ్య దైవమయ్యాడు....ఓం నమఃశివాయః...
.

పరబ్రహ్మ స్వరూపులైన 
మా ఆత్మ బంధువులకు మా మనవి ఏమనగా 

మీరు ప్రతిరోజు ఇతరులకు మంచి మంచి విషయాలు తెలియజేస్తున్నారంటే తప్పకుండా 
మీలో కొన్ని అయినా మంచి లక్షణాలు ఉండే ఉంటాయి 

మీలో మంచి లక్షణాలు ఉన్నందుకు చాలా సంతోషం అయితే మంచి విషయాలు ఇతరులకు తెలియజేయడం వల్ల అనుకోకుండానే మీరు మంచికి అలవాటు పడతారు ..................                     -                                                       -            🙏🙏 .....                                 -            వలిశెట్టి లక్ష్మీశేఖర్ .                       -             98660 35557...                  -              06 .05 .2024.


.

No comments:

Post a Comment