Tuesday, May 7, 2024

****ఆనందం శాంతి బయట దొరుకుతాయా వాటి అడ్రస్ ఎక్కడ ??

 ఆనందం శాంతి బయట దొరుకుతాయా వాటి అడ్రస్ ఎక్కడ ??
------------------------------------------------------------------------------
మనిషి గా పుట్టిన ప్రతి ఒక్కరూ ఆనందంగా సుఖంగా ఉండాలి అని కోరుకుంటారు . సుఖం అంటే ‘’ నాకు అన్ని సౌఖ్యంగా కావాలి నా బాడికి కంఫర్ట్ గా ఉండాలి ‘’ ఆ సుఖాలు కోసం చుట్టూ ఎన్నో బంధాలు ఉన్నాయి . భర్త / బార్య /పిల్లలు / అంతస్తులు వాహనాలు ఎన్నో , ???? ఎన్నెన్నో ??

ఏమిటో !!
మొదట శారీరక సుఖం ... ఇదే సుఖం అనిపిస్తూ ... ఆ తరువాత తరువాత నేను నా పిల్లలు... ఇదే సుఖం అంటూ  ... నా అస్దులు వాహనాలు ఇదే సుఖం అంటూ ....కామాలు తప్ప పులిస్టాప్ లేదు .....  ఇది ఉంటే సుఖం అది ఉంటే సుఖం అని నీకు దగ్గరగా లేనప్పుడు భావన చేస్తావు దగ్గర కాగానే మరేదో ఇంకా ఏదో కావాలి , మరేదో రావాలి అనిపిస్తూ ,, ఎందుకు ఇలా ఇవన్నీ తాత్కాలిక ఆనందం ఇస్తున్నాయి కానీ శాస్విత ఆనందం ఇవ్వడం లేదు . అంటే ఇపుడు నేను అనుభవిస్తున్న సుఖాలు అన్నీ ఆనందాలు ఆన్ని శాస్విత ఆనందానికి ప్రతి బింబం మాత్రమే ..

అసలు సుఖం ఇది కాదు . అసలు అయిన అది పట్టుకుంటే ఇది నచ్చదు .. ఇవన్నీ తృణంగా అనిపిస్తాయి .
మరి ఆ ఆనందం అంటే ఎలా ఉంటుంది :??

నేను గాఢంగా నిద్ర పోయాను , అసలు తెలివి లేదు . ఆ నిద్రలో నేను సుఖంగా ఉన్నాను , హాయిగా ఉన్నాను . అక్కడ నా భార్య / భర్త /పిల్లలు/ ఇల్లు / వాహనాలు లేవు నేను ఆనందంగా ఉన్నాను .దేహంతో సంబంధం లేదు ?  ఎవరూ నా ప్రక్కన లేరు 
‘’ అంటే ఆనందం ఎక్కడో లేదే ? నాలోనే ఉన్నదే ! యెక్కడ ఎక్కడ అని వెతుకుతున్నానే ? మరి నాకు అంతటి హాయిని ఇచ్చింది ఎవరు ? ప్రశాంతంగా ఉన్న ఆ స్తితిని నాకు ఇచ్చింది ఎవరు ??

నిద్ర లేచాను డిస్టబెన్స్ మొదలు అయింది .. ఒక్కసారి బయటకు చూశాను .ప్రతి ఒక్కరూ ఏదో ఒక దుఃఖం 
ప్రతి ఇంటికి ఓ కధ ప్రతి మనిషికి ఓ వ్యధ .... దుఖం లేని మనిషి కనిపించ లేదు .. ఒక ఇంట్లో ఐదుగురు ఉంటే ఒక్కొక్కరు ఒక్కో జీవితం , ఒక్కో మార్గం , ఒక్కో అనుభవాలు ...
అరె ఇప్పటిదాకా హాయిగా ఉన్నాను . లేవగానే ఏమిటి నాకు ఈ నరకం .. అప్పుడు అనుభవించిన హాయి ఇప్పుడు ఎందుకు లేదు . అది ఎక్కడికి వెళ్లిపోయింది . 

‘’ నేను ......... నేనుగా ఉన్నంత వరకు హాయిగా ఉన్నాను . 
దృశ్య ప్రపంచంలోకి రాగానే మనసు లేచింది ..... ఇక అంతే ..... 
ఇదిగో కన్నీళ్లు అంటుంది అదిగో ఆనందం అంటుంది .... 
ఈ భౌతికమైన సుఖాలు అన్నీ కొరడా దెబ్బకు దెబ్బకు మధ్య చిన్న విరామం అంతే ....

అసలు ఆ ...... ఆనందాన్ని వదిలి పెట్టి ఈ తాత్కాలిక ఆనందం... దుఖం అనేవి నేను ఎందుకు అనుభ విస్తున్నాను ... 
కర్మ అనే మొక్క అప్పుడు నాటాను .’’ ఇప్పుడు వాటి ఫలాలు వచ్చాయి .. అది దుఖమైన సుఖమైనా అనుభవించాలి సిందే ..
ఎక్కుపెట్టిన భాణమ్ నిన్ను చీల్చక తప్పదు .. 
మరి తప్పించుకునే మార్గం శరణాగతి .. తలకు తగిలేది తలపాగాకు తగిలి వెళ్ళి పోతుంది ..

అసలు నాకు ఈ పాపం వద్దు పుణ్యం వద్దు ... ఆ శాస్విత ఆనందం నాకు ఎప్పుడు కావాలి నేను ఏమి చెయ్యాలి ... 
‘’ ఇది నేను .... నేను చేస్తున్నాను ... నా వలనే ఇదంతా .... అనే కర్తుత్వ భావన వదలి వేయాలి ‘’
కర్మ ఫలాలు నాటడం మానాలి ‘’ అంటే కర్మ చేయకుండా ఎలా కుదురుతుంది ‘’ 
కర్మ చెయ్యి కానీ నేను చేస్తున్నాను అనే భావన వదిలి , నేను చేసే ఈ పనికి అది రావాలి , ఇది పోగొడదు , అది నాదే , ఇదీ నాదే అనే వాసనలు మూట కట్టుకోవద్దు .. నీ మొబైల్ లో  వేస్ట్ డేటా మొత్తము ఎలా క్లియర్ చేస్తావో ఎప్పటి కప్పుడు .ఇది నాది కాదు అనుకుంటూ నీ ఆలోచనల ఫోల్డర్ ఖాళీగా చెయ్యి ..
అయ్యో అది ఖాళీగా ఉండదే .. మరి దానిలో ఈ చెత్త అంతా వేస్తున్నది ఎవరూ ?

అదేనండీ  మనసు ... 
దీనిని అదుపు చేయాలి . మచ్చిక చేయాలి ? ఎలా బుద్దితో .... 
నీ మనసు ఎప్పుడైతే నీ ఆధీనంలోకి వస్తుందో ... ఇదేదీ నేను కాదు అని గ్రహిస్తావో , అది అనుభవ పూర్వకంగా జీవితంలో అనుభూతి చెందుతావో ఇక దుఖం లేదు .. అంతా ఆనందమే బ్రహ్మానందమే .కేవలం సాక్షిగా మిగిలిపోతావు .. 
భగవాన్ రమణ మహర్షి వారి ఉపదేశ సారం నుండి ఓ చిన్న అమృత గుళిక

No comments:

Post a Comment