. *మన ఘన తెలుగు వెలుగు*
. *************************
మన భాష చక్కని తెలుగు.
మనకు శ్వాస , వెలుగు.
అజంతాక్షర భాష.
మనసు నాకర్షించు భాష.
చక్కగ పలుకగ వీలగు భాష.
ఇంపు సొంపుల మేలిమి భాష.
నవ రసముల నేలు భాష.
తెలుగందుకె మాధుర్యము.
అవిరళ రస రమ్య పస గల
భావోత్కృష్టమైన భాష.
ఎదను మీటి కదిలించెడి
ప్రేరణ గల తత్వ భాష.
శోభలెన్నొ పొదిగెదిగిన
అరమరికలు లేని భాష.
ఆత్మీయత పెంచు భాష.
ఆరని సొబగుల భాష.
పలుకుటకనుగుణ్యతతో
చెలిమిని సంధించు భాష.
సఖ్యత నొలికించు భాష.
చెలిమికి ఆసరయెడి భాష.
నా తెలుగొకటే యనుచు
మురిపించు ప్రసన్న భాష.
ఎందరెందరో మన యీ నేలలొ
పేరెన్నిక గన్న కవుల
మదిలొ ఎదిగి ఒదిగినట్టి
సాంద్రత గల తెలుగు భాష.
సులభమెంతొ కఠినమంత
కలుగిన సాంద్రతల భాష.
ఎద లోతుల మీటి అలరు
సాటి లేని మేటి తెలుగు.
*ఇలియానాకు ఆఫ్ ది ఈస్ట్* గ
కీర్తి బడసి నట్టి తెలుగు.
దేశ భాషలందు తెలుగు
లెస్సని అనబడిన తెలుగు.
ఘంటసాలాది గానం గంధర్వుల
నోట అలరిన తీపి దీప్తి తెలుగు.
ఇటులెంతగ చెప్పిన తక్కువె
తెలుగు భాష వైశిష్ట్యము.
తెలుగు భాష నుచ్ఛరించి
తెలుగును బ్రతికించు కొనుము.
తెలుగును మరుగున పడనీయక
తెలుగోడిగ మసలుకొనుము !
ఇదియే మన అసలు సిసలు
కర్తవ్యముగా నెంచుము !
తెలుగు వెలుగు నెల్లెడలా
వ్యాపింపగ జేయుమెపుడు !
***********************
రచన:--- రుద్ర మాణిక్యం.(కవి రత్న)
రిటైర్డ్ టీచర్. జగిత్యాల (జిల్లా)
************************************
No comments:
Post a Comment