🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఆంజనేయ
ద్వాదశ నామ స్తోత్రం
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హనుమాన్ అంజనాసూనుః
వాయుపుత్రో మహాబలః ।
రామేష్టః ఫల్గుణసఖః
పింగాక్షః అమితవిక్రమః ॥ 1 ॥
ఉదధిక్రమణశ్చైవ
సీతాశోకవినాశకః ।
లక్ష్మణ ప్రాణదాతాచ
దశగ్రీవస్య దర్పహా ॥ 2 ॥
ద్వాదశైతాని నామాని
కపీంద్రస్య మహాత్మనః ।
స్వాపకాలే పఠేన్నిత్యం
యాత్రాకాలే విశేషతః ।
తస్యమృత్యు భయం నాస్తి
సర్వత్ర విజయీ భవేత్ ॥ 3
1) హనుమంతుడు 2) అంజనాదేవి, కేసరిల పుత్రుడు. 3) వాయుదేవుని ఔరస పుత్రుడు. 4) మహాబలుడు, 5) శ్రీరామదాసుడు, 6) అర్జునుని సఖుడు, 7) ఎర్రని కన్నులుగల వానరుడు, 8) అమిత విక్రముడు. 9) శతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు. 10) లంకలో బందీయైన సీతమ్మ తల్లి శోకాన్ని హరించినవాడు, 11) ఔషధీ సమేతంగా ద్రోణాచలం మోసుకుని వచ్చి యుద్ధంలో వివశుడైన లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు. 12) దశకంఠుడైన రావణాసురుని గర్వం అణచినవాడు.
హనుమంతుని ఈ ద్వాదశ నామాలు నిద్రించడానికి ముందు, ప్రయాణానికి ముందు స్మరించినవారికి మృత్యుభయం లేదు. వారికి సర్వత్రా విజయం లభిస్తుంది.
జై హనుమాన్!!
ఓం నమఃశివాయ!!
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
No comments:
Post a Comment