Tuesday, May 21, 2024

జెండా పై కపిరాజు(హనుమంతుడు) ఎందుకు వుంటాడు

 *🚩🐒🚩జెండా పై కపిరాజు(హనుమంతుడు) ఎందుకు వుంటాడు🚩🐒🚩* 
🚩🐒🚩🏵🏵🚩🐒🚩🏵🏵🐒🚩
 

🚩🐒మహాభారత కాలంలో ధర్మరాజు చేసిన రాజసూయయాగంలో దక్షిణ దేశాలను జయించటానికి అర్జునుడు సైన్యంతో బయల్దేరాడు .దక్షిణానఉన్న హిందూమహా సముద్రాన్ని చేరుతాడు.

🚩🐒 అక్కడ శ్రీ రాముడు లంకకు కట్టిన వారధిని చూసి పరిహాసంగా నవ్వుతాడు.దానికి  హనుమంతుడికి కోపం వస్తుంది.అప్పుడు హనుమంతుడు అక్కడికి వచ్చి అర్జునునికి హనుమంతుడికి మధ్య వాగ్వాదం జరుగుతుంది.అర్జునుడు నేను బాణాలతో ఇంతకన్నా గట్టి వారధిని నిర్మిస్తానని దానిని ఎవరూ కూల్చలేరని చెబుతాడు.దానినికూల్చుతానని ఆంజనేయుడు అంటాడు. 

🚩🐒ఆవాగ్వాదం కాస్త పెరిగి పంతాలకు పోయి ఇద్దరు ప్రతిజ్ఞలు చేసుకుంటారు. నేనుఓడిపోతే నీకు సేవ చేస్తానని ఒకరికొకరు అనుకుంటారు.

🚩🐒అప్పుడు అర్జునుడు బాణాలతో సేతువును నిర్మిస్తాడు. ఆంజనేయుడు దానిని తొక్కి తునాతునకలు చేస్తాడు. అర్జునుడు మళ్ళీ సేతువును నిర్మిస్తాడు. దాని కింద ఎవ్వరికీ తెలీకుండా కృష్ణుడు తాబేలు రూపంలో వెళ్లి సేతువు కింద ఉంటాడు. 

🚩🐒హనుమ ఒక్క సారి సేతువు పైకెక్కి కాళ్ళతో చిందర వందర చేస్తూ తొక్కుతాడు.కృష్ణుడు సేతువు విరిగి పోకుండా కాపాడుతాడు.హనుమ ఎంత తొక్కిన సేతువు యేమాత్రం వంగకుండా శిధిలం కాకుండా నిలబడి ఉంటుంది. హనుమ అంతటి బలాధ్యుని పాద ఘట్టనానికి తట్టుకొని నిలబడింది.

🚩🐒ఆంజనేయుడు ఓటమిని అంగీకరించాడు. అర్జునుడు విజయగర్వంతో విర్రవీగాడు. కృష్ణుడు నీటి నుండి బయటకు వచ్చాడు. ఒళ్లంతా రక్తం కారుతోంది. పార్ధుని తో సహా అందరు భయ పడ్డారు. 

🚩🐒అప్పుడు పరమాత్మ ”అర్జునా ! ఈ జయం నీది కాదు. ఆన్జనేయుడిది. నేను వారధి కింద వీపు పెట్టి మోయక పోతే అది హనుమ ఒక్క లంఘనానికే విరిగి ముక్కలయ్యేది. నీ పరువు కాపాడ టానికి నెత్తురువోడేటట్లు శ్రమించాను. బాధ భరించాను అనిచెబుతాడు.హనుమకు నేను రాముడిగా, కృష్ణుడిగా ఉంటున్నానని తెలియదు పాపం.అంతేకాదు ఆంజనేయుడు వాయుపుత్రుడు నీకు సోదరుడు అని చెబుతాడు.

🚩🐒దానికి అర్జునుడుకి గర్వభంగం కలిగి సిగ్గుపడి తనతప్పుకు పశ్చాత్తాపపడి హనుమను ఆశ్రయించి క్షమాపణ కోరతాడు. హనుమ శ్రీ కృష్ణుని శ్రీరామునిగా గ్రహిస్తాడు.శ్రీకృష్ణుడు అంజనేయుని కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుని రథంపై వుండి అర్జునునికి విజయం చేకూర్చమని అనుగ్రహిస్తాడు.

🚩🐒అప్పటి నుండి అర్జునుని రధం మీద జెండా పై హనుమ ఉండి మహా భారతయుద్ధం లో ఆతని విజయానికి కారకుడవుతాడు . దాన్నే ”కపి ధ్వజం” అంటారు.

No comments:

Post a Comment