Tuesday, May 21, 2024

నా చిన్నతనం గురించి...మీకు తెలుసా..*! 😆🤔😇🥱🫣🤪🤪✍🏻

 *నా చిన్నతనం గురించి...మీకు తెలుసా..*!
😆🤔😇🥱🫣🤪🤪✍🏻

చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో మా మాస్టారు నన్ను కొట్టినప్పుడల్లా ప్రతీదెబ్బ తిన్న వెంటనే నేను చేతులను దులుపుకుని నా లాగుకి రాసుకున్న తర్వాతే రెండో దెబ్బకు చెయ్యి చాచేవాణ్ణి. శుచి-శుభ్రత అన్నది నాకు అప్పటినుంచే ఉండేది తెలుసా ! ఇప్పుడు శుభ్రత పరి శుభ్రత.. కానీ మాకు అప్పుడే వచ్చింది.. 🤔😄

అప్పట్లో మా గురువులంతా పాఠం చెప్పినంతసేపూ నిలబడే ఉండేవాళ్ళు, ఎందుకో తెలుసా? గౌరవం...
మా విద్యార్థులు అంటే వాళ్ళకి అంత గౌరవం... అంతే!...🤔 (అప్పట్లో వాళ్ళ నిబద్దత అలాంటిది )🙏🏻     

నేను చదువుకునే రోజుల్లో
మా గురువులు నాలుగురోజులకొకసారి
మా నాన్నగారిని తీసుకుని రమ్మనే వారు! ఎందుకంటే వాళ్ళందరూ ఏ విషయమైనా నాకు సూటిగా చెప్పడానికి చాలా భయపడేవారు! 🤔
 (నా క్రమశిక్షణ మిలట్రీ వాళ్లకు కూడా అంతుచిక్కనిలా ఉండేది మరీ..  ఎందుకంటే వాళ్లయితే ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చేవారు.. పంతుళ్లు కాబట్టి అలా పేరెంట్స్ తో సరిపుచ్చారు ) 😄😄
నేను రాసినవి చదవడానికి
మా గురువులంతా చాలా ఇష్టపడేవారు. అందుకే వాళ్ళు ఇచ్చిన ప్రశ్నలకు కొన్ని వందలసార్లు మళ్ళీ మళ్ళీ రాసి చూపించమని ప్రతీరోజూ అభ్యర్థించేవారు! 
వందలో ఒక్కసారైనా అర్ధం అవుతుంది అని వాళ్ళ ఉద్దేశ్యం 🤔

మా గురువులందరూ నన్ను "వీడొక సింహబలుడు" అన్నట్టుగా చూసేవారు. అందుకే వాళ్ళకి ఏమాత్రం భయం వేసినా క్లాసులో నుంచి నన్ను బయటకు పంపి గుమ్మం దగ్గర కాపలా కోసం నిల్చోబెట్టేవారు.
(క్లాస్ సజావుగా సహకరించగలరు అని వాళ్ళ ఉద్దేశ్యం )🤔
మా గురువులకి నేను చాలా తెలివైనవాడిని అనే భావన
బాగా బలంగా ఉండేది.
అందుకే వాళ్ళంతా,
"ఒరేయ్, నువ్వు స్కూలుకి ఎందుకొస్తావురా.
పోయి ఎక్కడైనా పనిలో చేరిపోవచ్చు కదా!", అని కనీసం రోజుకోసారైనా అనేవారు! 🤔
పని అంటే.ఉద్యోగం కదా అంటే నా చిన్నప్పుడే నేను ఉద్యోగం చేసే తెలివి తేటలు సమర్ధత నాకు ఉన్నాయి అని ముందుగానే గ్రహించారు అన్నమాట.  😜😊

అందుకే, నా చిన్నతనం నిజంగా ఒక స్వర్ణ యుగం!

పాజిటివ్  థింకింగ్ ఇన్ ఎనీ సిట్యుయేషన్ గుడ్ 😀🤣🤪

No comments:

Post a Comment