Sunday, September 1, 2024

**** తండ్రీ అదే..మీ #నాన్నగారి జీవితం కంటే #మీ జీవితం #మెరుగ్గా ఉంటే మీరు #అదృష్టవంతులే.

 తండ్రీ అదే..మీ #నాన్నగారి జీవితం కంటే
#మీ జీవితం #మెరుగ్గా ఉంటే మీరు #అదృష్టవంతులే.

కొంతమంది కోట్లకు #కోట్లు సంపాదిస్తారు.
వారిలో కొందరు పూర్తిగా దివాళా తీస్తారు. మరి అలా దివాళా తీసిన వారు మీకు ఎప్పుడైనా కనిపించారా?
పోనీ ఇలా చేస్తే..ఇట్లా నష్టపోయారు అని ఎవరైనా వారిపై వ్యాసాలు రాసారా?

● Micro Soft అధినేత #సత్యానాదెళ్ళ గారు వేలకోట్లు సంపాదించారు. 
కానీ వారికి పూర్తి #అంగవైకల్యం ఉండి Wheel Chair కు మాత్రమే పరిమితమైన కొడుకు ఉండేవాడు.అతను దాదాపు 25సంవత్సరాలపాటు అలాగే జీవించి ఇటీవలే మరణించాడు.మరి వారికి వచ్చిన ఈ #దురదృష్టం ఎందరికి తెలుసు?

● అలాగే మాగుంట సుబ్బరామిరెడ్డి గారు వేలకోట్లు సంపాదించారు.
వారికి మానసిక వికలాంగుడైన ఓ కొడుకు ఉండేవాడు.అతనికి అంగరంగ వైభవంగా పెళ్ళి చేశాడు. కానీ అది కూడా #ఫలించలేదు.

● మన దివంగత ముఖ్యమంత్రి NTR గారు కూడా వందలకోట్ల ధనము సంపాదించాడు. 
అయినా గానీ వారి‌మొదటి భార్య చనిపోతే...దగ్గరుండి ప్రేమతో పట్టెడు అన్నం పెట్టే వాళ్లు లేరు. 
అలాగని రెండో పెళ్ళి చేసుకుంటే కుటుంబ కలహాలతో పదవీచ్యుతుడై మనస్తాపంతో కుళ్ళి కుళ్ళి చనిపోయాడు.

● Raymonds అధినేత #విశ్వపతి సింఘానియా తన స్వశక్తితో రేమండ్సు కంపెనీని బాగా అభివృద్ధి చేశాడు వేలకోట్ల ఆస్తులను తన పుత్రరత్నానికి బహుమతిగా ఇచ్చాడు. 
ఇంత చేస్తే ఆ పుత్రుడే వారిని తమ ఇంటి నుంచి బయటకు గెంటేశాడంటే ఎంత హృదయ విదారకంగా ఉంటుంది. ?

మనము ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు. 
మనము #ధర్మమార్గం లో జీవిస్తూ ఉండటం ముఖ్యం.

ఇక ఇంకొందరుంటారు
వాడికి ఒకే కొడుకు లేదా ఒకే కూతురు
(Ex జగన్)
కానీ రాజకీయం,దోపిడీ వ్యాపారాలతో లక్షల కోట్లు ఆర్జిస్తారు.
ఆశ, ఆగడు మాత్రం చావదు..ఇంకా వస్తే బాగుండు అనేదే వాడి నిత్య కృత్యం.
ఇంకొక Ex నారాయణ College ల అధిపతి..వీడు పేదలను కొట్టి, ఎన్ని లక్షల కోట్లు వెనకేసుకుంటే ఏమి..వీడి కొడుకు Hyd లో అర్ధరాత్రి తప్ప తాగి..తన కార్ ని అతివేగంతో మెట్రో పిల్లర్ కి గుద్దుకొని చచ్చాడు

కాబట్టి
మన పిల్లలకు మరియు ఇతర కుటుంబ సభ్యులకు మంచి సంస్కారం అందించాలి. 

ఇలా ఉంటూ మన శక్తి మేరకు సంపాదిస్తూ వచ్చిన డబ్బును ఆస్తులను ఒక #ధర్మకర్త వలె ఖర్చు పెట్టాలి.
అప్పుడే ఆ డబ్బు మనకు సుఖమును తృప్తిని ఇస్తుంది. ఇలా తృప్తి సుఖము ఉంటే అన్నీ ఉన్నట్లే. 
ఎంత సంపాదించాము అనేది ముఖ్యము కాదు.

ఇలా ఎంతో మంది ధనికులు చాలా బాధలు పడ్డారు...(వాళ్ళ చరిత్రలు ఇక్కడ రాయాలంటే వ్యాసం పెద్ద దవుతుంది)

డబ్బు తనతో పాటు కొంత #చెడును కూడా తీసుకుని వస్తుంది. 
డబ్బు ఉంటే #అహంకారం వస్తుంది. ఆ అహంకారమే అన్ని అనర్థాలకు #మూలకారణం అవుతుంది.

ఇలా ప్రతివారికీ ఏవో దురదృష్టం కూడా ఉంటుంది. కావున ఇతరుల ఆస్తులను,అంతస్తులను...మిద్దెలు, మేడలు చూసి వాటి గూర్చి అసూయ పడ కూడదు.

ఎంత చెట్టుకు అంత గాలి ఉంటుంది. 
ఈ విషయం మరచిపోకూడదు.

మనకు ఉన్న దానితో సంతోషిస్తూ మన తెలివితేటలతో ఎక్కువ సంపాదించే కృషి చేయాలి.

మనకు #మంచి_ఆకలి వేస్తూ ఉండటం,
ఆ ఆకలివేసినపుడు‌ మంచి #భోజనం, మంచి #నిద్ర, 
ఒక ఇల్లు, సంఘంలో గౌరవ ప్రదమైన జీవితం జీవిస్తూ ఉంటే మనము చాలా ధనవంతులము.అదృష్ట వంతులము కూడా. 
దానికి తోడు ప్రశాంతమైన,ధర్మ మార్గంలో జీవనం. ఇవి ఉంటే అన్నీ ఉన్నట్లే.

ఎవరికీ ఎప్పుడూ సుఖాలు ఉండవు. 
సుఖపడినవారు కష్టాలు పడతారు. 
కష్టపడిన వారు సుఖపడే అవకాశం కూడా ఉంటుంది. కష్టపడేవారు హాయిగా భోజనం చేసి హాయిగా నిద్రపోతారు. 
ఈ అవకాశం చాలామంది ధనవంతులకు #లేదు గదా.

ఏ కష్టాలు లేని వారి ఇంటి నుంచి గుప్పెడు బియ్యం తీసుకుని రాగలరా? ప్రయత్నించి చూడండి.

ఇలా అసూయ పడతారనే శేషప్ప కవిగారు సరళమైన తెలుగు పదాలతో ఇలా చెప్పారు.

తల్లి గర్భము నుంచి ధనము తేడెవ్వడు!
వెళ్ళి పోయెడి నాడు వాడి వెంటరాదు!!
లక్షాధి'కారైన లవణ'మన్నమె గాని!
మెండు'బంగారంబు మింగబోడు!!

ఏ వస్తువు అయినా తాత్కాలికంగా సుఖమును ఆనందమును ఇస్తుంది. సుదీర్ఘ కాలములో ఎన్ని ఎక్కువ వస్తువులు ఉంటే అంత ఎక్కువ అశాంతి ఉంటుంది. కావాలంటే మీరు కూడా సేకరించి చూడండి.
 
ఎక్కువ డబ్బు సంపాదించినా కూడా అదికూడా అశాంతికి దారితీస్తుంది.

మన కోరికలే అన్ని దుఃఖాలకు మూలకారణం అని ఎవరో మన పూర్వులైన బుద్ధి జీవులు ఎప్పుడో చెప్పారు. తక్కువ కోరిక లతో తృప్తిగా హాయిగా సమాజం లో #గౌరవప్రదంగా జీవించడం చాలా అదృష్టం.🙏🙏
ఈ పోస్ట్...మీకోసం మీ యెలిగేటి విట్టల్ !!🚩🙏🏿


జై శ్రీరామ్ 🚩🚩🚩🙏🏿🙏🏿

No comments:

Post a Comment