Saturday, September 7, 2024

 నిజమైన శిష్యుడు 
కథానిక 
కూచిభట్ల జనార్ధన స్వామి 
అతడు ఒక బిజీ హీరో .
అంతకుమించి మానవతావాది .
మాస్ హీరోగా దూసుకుపోతున్న ఆ హీరోకి ,తనని హీరోగా పరిచయం చేసిన దర్శకుడు అంటే అపారమైన కృతజ్ఞతతో కూడిన భక్తి. 
గొప్ప మనసు సినిమాలు తీసిన ఆదర్శకుడు తెలుగు నుండి హిందీ చిత్రం రంగానికి వెళ్లి ,కొన్ని హిట్ సినిమాలు తీసి, తర్వాత కొన్ని ప్లాప్ చిత్రాలు తీసి ఆర్థికంగా దెబ్బతిన్నాడు. బొంబాయి నుండి మద్రాసు చేరుకున్నాడా దర్శకుడు. తన శిష్యునితోటే ,ఓ మాసు చిత్రం తీయాలి అనుకున్నాడు. శిష్యుడికి చెప్పాడు. శిష్యుడు మిగిలిన చిత్రాలను వెనకకు పెట్టి ,తన గురువు చిత్రానికి కాల్ షీట్లు ఇచ్చాడు. ఆర్థిక స్థితి బాగో లేకపోవడంతో బ్లాక్ అండ్ వైట్లో చిత్రం తీద్దాం అనుకున్నాడు దర్శకుడు. శిష్యుడు ఒప్పుకోలేదు. కలర్ లోనే చిత్రం తీయాలని, పట్టుబడ్డాడు అందుకు కావలసిన కలర్ ఫిలిం తానే కొని గురువుకి ఇచ్చాడు.చిత్రానికి పారితోషికం కూడా తీసుకోలేదు. సినిమా శరవేగంతో పూర్తయి ,రిలీజ్ అయింది. 
సూపర్ హిట్.
 11 లక్షల తో నిర్మించిన ఆ చిత్రానికి 13 లక్షలు వసూలు అయ్యాయి. రెండు లక్షలు లాభం వచ్చింది ఆదర్శక నిర్మాతకు.
 గురువు ఒడ్డునబడ్డాడు. 
తన గురువు మరలా ఆర్థికంగా నిలదొక్కుకోవడం ఆ శిష్యునికి ఆనందం కలిగింది. 
ఆ విధంగా అతను గురుదక్షిణ చెల్లించుకొన్నాడు.
నీతి; 1 తనను ఉన్నతి స్థితికి వచ్చిన గురువులను ఎప్పుడు శిష్యుడు మర్చిపోరాదు 
2. గురువులకు ఎప్పుడూ కృతజ్ఞులమై వారికి అవసరమైనప్పుడు వీలైనంత సహాయం చెయ్యాలి 
ఆ చిత్రం పేరు: 
మాయదారి మల్లిగాడు..(1973)
ఆ నిర్మాత, దర్శక ,గురువు: 
ఆదుర్తి సుబ్బారావు 
ఆ మాస్ హీరో; సూపర్ స్టార్ కృష్ణ

No comments:

Post a Comment