🌹గుడ్ మార్నింగ్ 🌹నేను - నేను అని అధికముగా భావించుకోకండి. ఈ నేను భావన తగినంత ఉండటమే ఆధ్యాత్మికత. నేను నిజమే. దాని అవసరాలు నిజమే. దానికి ప్రయత్నాలు అవసరమే, నిజమే. కాని ఈ నేనుకు దాని పుట్టుక తెలియదు, దాని మరణము తెలియదు. మధ్య జీవితములో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. తెలిసింది కేవలం తను ఇప్పుడు బ్రతకటం.
గమనిస్తే ఈ బ్రతకటానికి ఆధారమైన అన్ని వనరులు, ప్రాణ వాయువుతో సహా అన్నీ ప్రకృతినుండే లభిస్తున్నాయి. పోనీ నా శరీరాన్ని చూసుకుంటే నా ప్రమేయం లేకుండా అంతర్గత అవయవాలన్నీ వాటి పని అవి చేసుకుంటున్నాయి. శరీరముతో కొన్ని ప్రయత్నాలు, ఇంద్రియాలతో కొన్ని అనుభవాలు తప్ప నాకు నా గూర్చి, నాకు అవసరమైన విషయాలు గూర్చి, ఈ సృష్టి గూర్చి ఏమి తెలియదు అన్న విషయం నాకు తెలుస్తున్నది. కొంచెం లోతుగా చూస్తే అసలు నేను ఉండటం అనేది సృష్టి వలనే దానిలోనే, దానితోనే జరిగినట్లుగా అర్ధమవుతున్నది. ఇంకా కొంచెం ముందుకు వెళ్లి గమనిస్తే మొత్తం అంతా ఒక క్రమశిక్షణతో ఎవరో నడుపుతున్నట్లుగా తెలుస్తున్నది. ఎవరో పుట్టించి, ఎవరో ఎన్నో ఇచ్చి బ్రతికించి, ఎవరో ఎక్కడకో తీసుకుపోతుంటే - మధ్యలో ఈ నేను ఏమి చేయగలదు? ఎంత చేయగలదు?
ఎందుకింత నేను - నేను అన్న భావన....
ఇందుకే కొంతమంది ఈ సత్యము తెలిసిన మహాత్ములు నిన్ను నీవు తెలుసుకో అని చెప్పారు. నిజముగా నన్ను నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తే నేను అసలు ఎక్కడా లేకుండా పోతాను. మొత్తం సృష్టి మాత్రమే దర్శనమవుతుంది.ఇదే నిజమైన విశ్వవిజ్ఞానపు, స్వీయ జ్ఞానపు, ఆత్మజ్ఞాన, ఆధ్యాత్మిక చదువు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి పరిశీలిస్తే, ఎవరి అంతరంగములోకి వారు వెళితే - వారే ఈ చదువు చదువుకోవచ్చు. అలా వారిని వారు - చుట్టూ ఉన్న ప్రకృతిని చదివిన మహాత్ములు అందించినదే ఈ ఆత్మజ్ఞాన చదువు.🌹god bless you 🌹
No comments:
Post a Comment