Friday, September 20, 2024

 వనవాస సమయంలో నార వస్త్రాలు మాత్రమే ధరించి వెళ్ళారు సీతారామ లక్ష్మణులు. కానీ రావణ అపహరణ సమయం లో సీతా మాత తన ఆభరణాలు జార విడిచింది?
వనవాస సమయంలో సీతారామ లక్ష్మణులు నార వస్త్రాలు మాత్రమే ధరించి వెళ్ళగా సీతామాత ఆభరణాలు ఎలా జారవిడిచింది ?

శ్రీరాముడంటే ప్రేమ భక్తి .. రెండూ ఒకటే లెండి . ఉన్న వారు రామాయణం చదవకపోతే .. ఇదే అనుమానం బయటకి చెప్పలేక వంకర ప్రశ్నలకి జవాబివ్వలేక సతమతమవుతారు

కైకేయీ మాత వరాలు కోరిన తరువాత దశరధుడు నిశ్చేష్ఠుడైపోయాడు .పరిపరి విధాల కైకను అభ్యర్ధించాడు ఆమె అంగీకరించలేదు

కైకయే శ్రీరాముణ్ణి పిలిపించి తండ్రి గారి ఆఙ్ఞగా వినిపించింది .రాముడు సంతోషంగా అంగీకరించాడు . అందరూ సిద్ధం అయినారు .కైక నారచీరలు తెప్పించి వారికి ఇచ్చింది .రామలక్ష్మణులు నార చీరలు ధరించారు మైథిలీ జనకాత్మజ అయిన సీతమ్మ తల్లి నార వస్త్రాలు ధరించే అలవాటు లేక ఇబ్బంది పడింది .ఓ చక్రవర్తి కి కూతురై ఇంకో చక్రవర్తి కి పెద్దకోడలైన రామపత్ని భావి మహారాణిగా ప్రజలచే నమస్సులు అందుకునే తల్లికి సుకుమారికి అది దుష్కరమే కదా

రామలక్ష్మణులు నారచీరలు ధరించినా తట్టుకున్న దశరధుడు ఈ ఘోరం చూసి తట్టుకోలేక పోయాడు .చలించిపోయాడు .కన్నకూతురు కన్నా కోడలిని అపురూపంగా చూసుకునే సంస్కారం

పట్టరాని ఆగ్రహంతో కైకని నిందజేసి

ఆఙ్ఞాపించాడు . సీత పూర్తి రాజలాంఛనాలతోనే వనవాసానికి వెళ్తుంది అని శిలాశాసనంలాంటి ఆఙ్ఞ ఇచ్చాడు .

అందువలన సీతమ్మ ఓ మహా రాణీ ఎలాంటి లాంఛనాలతో ఉంటుందో అలాగే వెళ్ళింది

ఆభరణాలు జారవిడచి తల్లి అశోక వనంలో రాముడికి భౌతికంగా దూరమై

ఉపవాస కృశాం దీనాం ఏకవేణి ధరాశయ్యా మలినమంబరం ...విలపిస్తూ హనుమకు దర్శనమిచ్చింది

తెలిసీ తెలియక సినిమాలలో చూసిందే నిజమని భ్రమించే జనులకు ఏం చెప్పాలి

శ్రీ రామాయణం వేదోప బృహ్మణము మధురమైన కావ్యం

జీవన వేదం .మనుష్య జాతికి ప్రవర్తనా నియమావళి

మర్యాదా పురుషోత్తముడు నడయాడిన పుణ్య భూమి శ్రీరామకథని వక్రంగా చూపించే ప్రమాదం ఉంది శ్రీరామాయణం చదవండి తెలుసుకోండి ఆచరించండి రాముడిగా మారిపోండి

డా. సూర్యనారాయణ వెన్నేటి

No comments:

Post a Comment