Thursday, September 19, 2024

 *_నీ మరణం తరువాత ఏమి జరుగుతుందో చూడు..._*
 
*_అంత్యక్రియలకు వెళ్ళినవారు ఇంటికి తిరిగివస్తారు. కొద్దిగంటల్లో రోదనలన్నీ పూర్తవుతాయి._* 

*_బంధువులు వచ్చిన వారికి భోజనాలు చౌకుగా ఎక్కడ దొరుకుతాయో అని ఆరా తీస్తుంటారు._* 

*_పక్కింటి నీ ప్రాణస్నేహితుడు పాడె కట్టడానికి ఉపయోగించిన చెత్త తన ఇంటిముందు వేశారని విసుక్కుంటాడు._*
 
*_మూడోరోజున ఢిల్లీలో ఉండే నీ చిన్న కొడుక్కి సెలవు లేదు వెళ్లాలని తొందరపడుతుంటాడు._*
 
*_అతను వెళ్లేలోగా దినం ఖర్చులు తేల్చేస్తే బాగుండునని పెద్దకోడలు భర్తను పోరుపెడుతుంది._*
 
*_అందరూ ఉండగానే ఆస్తి పంపకాలు జరిగిపోతే బాగుండునని నీ పెద్దకూతురు తొందర పడుతుంది._*

*_నీ కారు తనకు ఇస్తే బాగుండునని నీ చిన్న కూతురు ఆతృతగా నీ భార్యను అడుగుతూ ఉంటుంది._* 

*_నీవు పోయిన సంగతి తెలియక నీ సెల్ ఫోన్ కు వచ్చే కాల్స్ ని చూసి పిల్లలు విసుక్కుంటూ ఆన్సర్ చేస్తుంటారు._*
 
*_పదకొండో రోజున భోజనాలు పూర్తయ్యాక ఆస్తుల పంపకం లో నీ పిల్లలు దెబ్బలాడుకుని నీ భార్యను ఎవరి దగ్గర ఉంచుకోవాలో తేలకుండానే కోపగించుకొని వెళ్ళిపోతారు._* 

*_నీ పెంపుడు కుక్క నీవు కనపడక తిండి మాని బక్కచిక్కి పోతుంది._*

*_మెల్ల మెల్లగా నీ మరణం పాతబడుతుంది. నిన్ను క్రమక్రమంగా అందరూ మరచిపోతారు. ఆస్తుల పంపకంలో వచ్చిన విభేదాల వలన నీ సంవత్సరీకానికి అందరూ రారు._*

*_అందుకే_*

*_బ్రతికినంత కాలం గౌరవంగా బ్రతుకు. నిజాయితీగా సంపాదించు. సంపాదన కోసం అడ్డదారులు తొక్కి నీవు చెడ్డపేరు తెచ్చుకుని సంపాదించి ఇచ్చినా చివరకు జరిగేది ఇదే.😞_*

No comments:

Post a Comment