Tuesday, September 3, 2024

****భగవన్నామ స్మరణ చేసేటపుడు భావం భగవంతునిపై ఉండేలా చూసుకోవాలి.*

 *భావనామాత్ర సంత్యుష్టయే నమః*
```

*భగవన్నామ స్మరణ చేసేటపుడు భావం భగవంతునిపై ఉండేలా చూసుకోవాలి.* ```

నామమునకు తగిన రూపం ప్రత్యక్షం కావాలి. అంతేకాని నోటితో నామము పలుకుతూ మనసులో ఏవో ఆలోచనలు చేస్తుంటే అది స్మరణ అనిపించుకోదు.

ఇలా ఎంత సమయం చేసినప్పటికీ ఏ కొంచెం కూడా ప్రయోజనం లేదు. రేడియో/టేప్ రికార్డర్  ఉంటుంది చూడండి, దానికో టేపు వేస్తే చక్కగా పాడుతూ ఉంటుంది. అంత మాత్రమున ఆ పాటలకు భగవంతుడు కదలి వస్తాడా!?

మనం నేడు రేడియో మాదిరిగానే చేస్తున్నాం కనుకనే అనుగ్రహాన్ని అందుకోలేకపోతున్నాం. భగవంతుడు బాహ్య ఆడంబరములకు లొంగేవాడు కాదు. ఆయనకు భావమే ప్రధానం. భావం సరిగా ఉన్నపుడే ఆయన పలుకుతాడు. ప్రార్థనకు సమాధానమిస్తాడు.                  

No comments:

Post a Comment