Saturday, September 7, 2024

 మహాభారతం చివర్లో కృపాచార్యుడు, కృతవర్మలు ఏమయ్యారు? వారు పాండవులతో కలిసిపోయారా?
పద్దెనిమిదవ రోజు రాత్రి పాండవుల శిబిరం మీద దాడి చేసి , తమ విజయాన్ని దుర్యోధనుడికి తెలియజేస్తారు.

తరవాత ముగ్గురూ మూడు దారుల్లో వెళ్ళిపోతారు.

అశ్వద్ధామ , వ్యాస ఆశ్రమానికి వెళ్లి కే కూర్చుంటే, పాండవులు వచ్చి , అతన్ని ఓడించి , శిరోమణి తీసుకుని వెళ్ళిపోతారు.

అతడి వల్లనే ఆ అకృత్యం జరిగిందని భావించడం వల్ల , మిగిలిన ఇద్దరినీ పాండవులు ఏమి చేయలేదు.

కృపాచార్యుడు తిన్నగా హస్తినాపురంలో తన ఇంటికె వెళ్ళిపోతాడు.

పాండవులు ఆయన్ని గౌరవించి తదనంతరం ఆయనను పరిక్షిత్తుకు గురువుగా నియమిస్తారు, ఆదర సత్కారాలతో !

కృతవర్మ తిన్నగా ద్వారకా వెళ్ళిపోతాడు. ౩౬ ఏళ్ళ తరువాత యాదవుల వంశక్షయ కలహంలో సాత్యకిచేత చంపబడతాడు. అతని వారసుడిని అర్జునుడు సగౌరవంగా మూర్తికావతంలో భోజవంశంలో మిగిలిన వాళ్ళతో సహా స్థిరపరచి వెళ్తాడు.

అశ్వద్ధామ కు సహకరించినందుకు వీళిద్దరినీ పాండవులు ఏమీ చేయలేదేమి అనే సందేహం అందరికి రావడం సహజం.

అయితే యుద్ధ పరిసమాప్తి తరువాత శత్రుత్వాలు కూడా సమసిపోయి ఎవరి ధర్మం వారు నిర్వర్తించారు అని భావించి ఊరుకున్నారనీ , అదే ఆనాటి ధర్మమనీ అర్ధం చేసుకోవాలి .

No comments:

Post a Comment