Sunday, September 15, 2024

*****అంగీకార భావనను అలవాటు చేసుకోగలిగితే - కష్టము, నష్టము, బాధ వుండవు.

 🌹గుడ్ మార్నింగ్ 🌹ఆనందానికి - దుఖానికి మధ్య తేడా - సంతోషానికి - బాధకు మధ్య తేడా - కేవలం ఇష్ట అయిష్టాలు. ఇవి మనం స్వయముగా ఏర్పర్చుకున్నవి. ఏ ఇద్దరి ఇష్ట అయిష్టాలు, అభిప్రాయాలు, ఆలోచనలు మొత్తముగా ఒకేలా వుండవు. అతి దగ్గర రక్తసంభందీకులైనా వారిలో ఏ ఇద్దరికీ అన్నీ కలవవు. ఇది సత్యము. ఈ సత్యాన్ని అంగీకరిస్తే మనుషుల మధ్య విభేదాలు పోతాయి.
ఏ ఇద్దరు ఒకలా వుండరు కనుక ఎవరి ప్రయత్నాలు వారివి కనుక - మానసిక, శారీరక,ఆర్ధిక,సామాజిక,కుటుంబిక, ఇలా అన్ని రకాల విషయాలు కూడా ఎవరికి వారికి విడివిడిగా ఉంటాయి. దీనిని అర్ధం చేసుకుంటే పోలికల దుఖాలు వుండవు. ఇక, మనం ఎంత ప్రయత్నించినా అది ప్రకృతికి లోబడే. ప్రకృతి నియమాలు, విధానాలు, మారవు, మార్చలేము. ఇది అంగీకరిస్తే సత్యము అర్ధమవుతుంది కనుక ఉన్న దానితో - వస్తున్న దానితో, వాటితో తృప్తిగా జీవించటం అలవాటవుతుంది. మరణమే మనిషికి తప్పదు అన్నది ప్రకృతి సత్యమైనప్పుడు - ఇక బాధలు, సమస్యలు ఏపాటివి? అర్ధం చేసుకొని, సత్యాన్ని అవగాహన చేసుకొని, అంగీకార భావనను అలవాటు చేసుకోగలిగితే - కష్టము, నష్టము, బాధ వుండవు. అంగీకరించటం అంటే ప్రయత్నించక పోవటం కాదు - ప్రయత్నించి లభించిన దానిని, వాటిని అంగీకరించటం. మొత్తం ఆధ్యాత్మిక జ్ఞాన సారం - జీవన విధానము ఇంతే... ఆలోచించి చూడండి. 🌹god bless you 🌹

No comments:

Post a Comment