Saturday, September 7, 2024

 🕉️🦚🌻🌹💜🌈

 *🍁ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికైనా ఇవ్వగలగే అత్యంత ఖరీదైన బహుమతి ‘సమయం’.మీ సమయం ఎంతో విలువైనది.ఎవరికి పడితే వారికి ఆ సమయాన్ని ఇచ్చి వృధా చేయకండి.దాన్ని పదిలంగా ఉపయోగించు కోవాలి ఏందుకంటే ఏన్ని కోట్లు పెట్టినా కూడా కొనలేని విలువైన బహుమతి సమయం.సమయం,సముద్రంలోని ఆటుపోట్లు ఒకలాంటివే.అవి ఎవరి కోసం వేచి ఉండవు. తమ పని తాము చేసుకుంటూ పోతాయి.* 

 *రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అనుకోకుండా ఈరోజే మీరు చేయాల్సింది చేయండి.లేకుంటే ఈరోజు సమయం రేపు ఉండదు...ఎల్లుండికి మిగలదు.మీరు జీవితంలో కోల్పోయిన ఒక్క క్షణాన్ని కూడా తిరిగి పొందలేరు. సమయాన్ని వెచ్చించడం అంటే మీరు పెట్టుబడి పెట్టినట్టే.దానికి తగిన ఫలితం రావాల్సిందే.ఏ ఫలితం రాలేదంటే మీరు సమయాన్ని వృధా చేశారని అర్థం.డబ్బు కన్నా సమయమే విలువైనది.*

 *మీరు కావాలనుకుంటే ఎంత డబ్బు నైనా సంపాదించగలరు కానీ సమయాన్ని మాత్రం సంపాదించలేరు.మనముండే తీరు మన ఎదుగుదలకు మూలమైతే మనం గడిపే సమయం మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది కాబట్టి సమయాన్ని ఎవరైతే సద్వినియోగ పరుచుకుంటారో వారే జీవితంలో తొందరగా ఎదగగలరు..* 

🕉️🦚🌻🌹💜🌈

No comments:

Post a Comment