తెలుగెక్కడుందిరా తెలుగోడా... నీ తెలుగు తెల్లారె తెలుగోడా !
Youtube link - https://m.youtube.com/watch?v=30sWbSkloYU
తెలుగు ఎక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా అమ్మనే ఈజిప్టు మమ్మీని చేసావు నాన్ననే డాడీకి డమ్మీని చేసావు నీ బిడ్డ ఆలు దిద్దనే లేదు తన భాష చదవడం రాయడం కాదు తెలుగునే వెలివేసే మన బడులు కూడా తెలుగు మాట్లాడితే పగులుద్ది దౌడా తెలుగు ఎక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా తెలుగు ఎక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా లేత మనసుల్లోన నీతులే ముద్రించు శతకాలు అటకెక్కి చెదప పట్టినాయి బతుకు పుటలను తెరచి వ్యాఖ్యానమొనరించు మన తెలుగు సామెతలు మంట గలిసాయి రామాయణం లేదు భారతం లేదు భాగవత పద్యాల్లో ఒకటైనా రాదు కథలు చెప్పే బామ్మ అమ్మమ్మ లేరి కథలరే టీవీల చుట్టూత చేరి మమ్మీకి ఎల్కేజీ ర్యాంకులే ముఖ్యం డాడీకి లైఫ్ లో విజయమే లక్ష్యం తెలుగు ఎక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా తెలుగు ఎక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా మువ్వన్నె జెండాను తెగ ఊపుతున్నావు దాన్ని చేసిన తెలుగు వాడెవడో తెలుసా వెండి తెర హీరోలు వీరులు అంటున్నావు నిజ జీవితపు తెలుగు హీరో హీరోలు తెలుసా గుడి గుడి గుంచాలు కోతి కొమ్మ వచ్చి ఏళ్ళు గడిచెను తెలుగు ఆటలే చచ్చి పసివాళ్ళ చేతులకు సెల్ ఫోనులు ఇచ్చి పెంచావు వీడియో గేమ్స్ పైపిచ్చి పోటీకి సయ్యంది నీ తెలుగు మీద ఉనికినే మరిచింది అది అసలు బాధ తెలుగు ఎక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా కూడు పెట్టని భాష భాష కాదన్నావు డాలర్లు తెచ్చేదే అసలు చదువన్నావు కూడు పెట్టని భాష భాష కాదన్నావు డాలర్లు తెచ్చేదే అసలు చదువన్నావు తెలుగు పండగలన్నీ మొక్కుబడి చేసావు కార్పొరేట్ పండగల ఉచ్చులో పడ్డావు గ్లోబునే గెలిచాము చూడమన్నావు తల్లి వేరును మటుకు తెగ నరికినావు తెలుగు మొనగాన్న నీ తొడ చరిచినావు తల్లి పేరు అడిగితే తెల్లబోయావు నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా సెంటిమెంటల్ స్టంట్ చాలు నీ బొంద నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా సెంటిమెంటల్ స్టంట్ చాలు నీ బొంద తెలుగు ఎక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా డాడ తెలుగు ఎక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా
No comments:
Post a Comment