Monday, July 7, 2025

 [7/7, 16:19] +91 79819 72004: *💎నేటి ఆణిముత్యం💎*


ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై
         ఆరంభించి పరిత్యజింతు  రురు విఘ్నాయత్తులై మధ్యముల్
           ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై
            ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్ .


*భావము:*
అల్ప మానవులు ఏ పనైనా మొదలు పెట్టబోయే ముందే విఘాలు వస్తాయనే భయంతో అసలు పనినే
మొదలు పెట్టరు. మధ్యములు పని మొదలు పెడతారు గాని ఏదన్నా ఆటంకం వచ్చిందంటే ఇంక ఆ పనిని అక్కడే ఆపేస్తారు . ధీరులు ఎన్ని విఘ్నాలు వచ్చినా పని పూర్తి  చేసేంతవరకూ వదిలిపెట్టరు . ఇది ప్రజ్ఞానిధులైనవారి
ప్రవృత్తి.


*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*
[7/7, 16:19] +91 79819 72004: *🤘నేటి సుభాషితం🤘*


*కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది, హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది, మీ ప్రవర్తన మీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది.*
[7/7, 16:19] +91 79819 72004: *👬 నేటి చిన్నారి గీతం 👬*


*అంకెల పాట*


*ఒకటి - రెండు - ఒప్పులకుప్ప*


ఒకటి - రెండు - ఒప్పులకుప్ప
మూడు నాలుగు - ముద్దులగుమ్మ
అయిదు ఆరు - అందాల భరిణ
ఏడు ఎనిమిది - వయ్యరిభామ
తొమ్మిది పది - బంగారు బొమ్మ
[7/7, 16:19] +91 79819 72004: *🗣నేటి జాతీయం🤔*


*ఒంటి చేత్తో సిగముడవటం*


అసంభవం, 
ఎటువంటి పరిస్థితులలోనూ జరగటానికి వీలు లేదు,
వాస్తవదూరం
[7/7, 16:20] +91 79819 72004: *🤠 నేటి సామెత 🌸*


*అగ్నిచెంత వెన్న ఎంత తడవాగో ఆడవారి కోపము అంత తడవాగు*


అగ్ని చెంతే వెన్న వెంటనే కరిగి పోతుంది. అదే విధముగా ఆడవారి కోపము కూడా అతి స్వల్ప కాలమే అని ఈ సామెతకు అర్థము.


*అగ్గిపక్కన వెన్న ఆడవారి కోపం ఒకటే*

పురుషుడికి కోపం వస్తే ప్రతీకారం తీర్చుకొనేదాకా వూరుకోడు. కానీ స్త్రీల కోపము తాత్కాలికమే వేడి తగిలిన వెన్నలాగా స్త్రీ మనస్సు కరిగిపోతుంది అని ఈ సామెతకు అర్థము.
[7/7, 16:20] +91 79819 72004: *✍🏼 నేటి కథ ✍🏼*


*తెలివి తేటలు*

చంద్రయ్యకు ఇద్దరు భార్యలు. ఒక గ్రామంలోని  ఒక ఇంట్లోనే ఇద్దరు భార్యలతో సంసారం నడుపుకుంటూ పోతున్నాడు చంద్రయ్య. 

ఒకనాడు ఉన్నట్టుండి తెలివి విషయంలో ఇద్దరు భార్యలు ఇలా అనుకోసాగారు. మన సంసారాన్ని నేనెంతో బాగా నడుపుకుంటూ పోతున్నాను. కనుక నీ కంటే నేను ఎంతో తెలివిగలదాన్ని అన్నది చిన్నభార్య. అందుకు పెద్ద భార్య అదేమి కాదు. నేనెంతో తెలివిగలదాన్ని కావటంతోనే మన కాపురాన్ని చక్కదిద్దుకుంటూ రాసాగాను అన్నది. అలా రోజూ ఇద్దరు అనుకోవడమే కాక చివరకు కొట్టాడుకోసాగారు. 

ఇద్దరు భార్యల సంగతిని తెలుసుకున్న చంద్రయ్య మీరు కోట్లాడుకోవద్దు. మీ ఇద్దరిలో తెలివిగలవారు ఎవరో నేనే నిర్ణయించుతాను అని పెద్ద భార్యను ఒక ఇంట్లో, చిన్న భార్యను మరో ఇంట్లో పెట్టిన చంద్రయ్య, మొదట పెద్ద భార్యతో నేను అర్జంటు పనిమీద పక్క ఊరికి పోతున్నాను. రేపు ఉదయమే వస్తాను. ఈ రాత్రికి నీవు జాగ్రత్తగా పడుకో. ఏ దొంగైనా వచ్చు. నీ మెడలో ఉన్న బంగారు హారం  జాగ్రత్త అంటూ చంద్రయ్య చిన్న భార్య ఇంటికెళ్లి పెద్ద భార్యతో చెప్పినట్లే చెప్పి వెళ్లిపోయాడు. 

ఆ రోజు సాయంత్రమే గుర్తు తెలియని ఒక మనిషి పెద్ద భార్య ఇంటికొచ్చి చంద్రయ్య అంటే మీ ఆయన ఊరిలో ఉన్నాడా? వేరే ఊరికేమైనా వెళ్లాడా? అన్నాడు. పెద్ద భార్య ఏదో ఆలోచించి మా ఆయన ఊరిలోనే ఉన్నాడు. రాత్రికి ఇంటికి వస్తాడు. అసలు నీవెవరు అని ప్రశ్నించింది. ఆ మనిషి మరేమి చెప్పక సరాసరి ఇంకోచోట ఉన్న చిన్న భార్య ఇంటి వద్దకు పోయి పెద్ద భార్యను ప్రశ్నించినట్లే ప్రశ్నించాడు. అందుకు చిన్న భార్య మా ఆయన తొందర పనిమీద పక్క ఊరికి వెళ్లాడు. రేపు ఉదయమే వస్తాడు అన్నది. ఆ రోజు గడిచి తెల్లవారింది. అయితే చిన్న భార్య మెడలో ఉన్న బంగారు హారం కనపడలేదు. రాత్రి ఏ దొంగో వచ్చి హారాన్ని కత్తిరించుకునిపోయాడని చిన్న భార్య ఏడవసాగింది. 

ఆ సమయానికే వచ్చిన చంద్రయ్య మొదట పెద్ద భార్య ఇంటికి వచ్చాడు. అపుడు పెద్దభార్య నిన్నటి సాయంత్రం ఎవరో మనిషి వచ్చినట్లు అతడిమీద అనుమానమున్నట్లు, అతడికి అబద్ధం చెప్పినట్లు అంతా వివరించి చెప్పింది. ఆ వెంటనే చంద్రయ్య చిన్న భార్య ఇంటికెళ్లాడు. చిన్న భార్య కూడా ఆ కొత్త మనిషి సంగతిని చెప్పి, రాత్రి జరిగిన దొంగతనం సంగతిని కూడా వివరించి భోరున ఏడవసాగింది. ఓసి పిచ్చిదానా! నీ కంటె నీ అక్కయక్క తెలివిగలది. ఎలాగంటే నా కోసం ఎవరో మనిషి వస్తే నేను ఊరిలో లేకపోయినా ఊళ్లోనే ఉన్నట్లు అబద్ధం చెప్పింది. నీవు నేను ఊరెళ్లినట్లు నిజం చెప్పావు. నీ నిజం వల్లనే దొంగతనం జరిగింది. అబద్ధం వల్ల దొంగతనం జరగలేదు. మగవారు ఇంట్లో ఉంటే దొంగయినా దొంగతనానికి ముందుకురాడు. మగవారు ఇంట్లో లేకపోతే ఏదొంగైనా దొంగతనానికి సాహసిస్తాడు. మీ ఇద్దరిలో తెలివి ఎవరికున్నదో నీవే ఆలోచించు. సమయ సందర్భాలను బట్టి అబద్ధం కూడా పనికొస్తుంది. 

అసలు సంగతి ఏమిటంటే మీ ఇద్దరిలో తెలివిగల వారు ఎవరో నిర్ణయించాలనుకుని నేను ఊరికి పోతున్నట్లు నటించి నా మిత్రుడి చేత ఈ నాటకం ఆడించాను అంటూ చంద్రయ్య తన జేబులో నుంచి హారం తీసి చిన్న భార్యకిచ్చాడు. ఎంతో ఆశ్చర్యపడింది చిన్న భార్య. పెద్ద భార్యకే తెలివి ఉన్నదని తెలిసిన చిన్న భార్య చాలా సిగ్గుపడింది. ఆ నాటి నుంచి తెలివి ప్రస్తావన ఎత్తకుండా భార్యలిద్దరూ కలసి మెలసి ఒక ఇంట్లోనే బాగా ఉండసాగారు. అందుకే తెలివి ఒకరిసొత్తు కాదు. ఉన్న మన తెలివినే ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవచ్చు.
[7/7, 16:20] +91 79819 72004: *🟥కాల్చిన ఇటుకలు గట్టిగా ఉంటాయి. ఎందుకు? Burned bricks are stronger.Why?*

🟩పచ్చిమట్టిలో కేవలం విడివిడి మట్టి రేణువులు ఉంటాయి. వీటి మీద నీటి అణువులు ఉండడం, ఈ రేణువులన్నీ కలిసి ముద్దగా ఉండడం వల్ల మనం ఆ ముద్దను ఏ రూపంలోకైనా తీసుకురాగలము. ఇటుకల కోసం వాడే ఎర్రమట్టి ఇలాంటిదే. అయితే ఇటుకలు చేసిన తర్వాత ఆరబెట్టినప్పుడు ఆ ఇసుక, మట్టి రేణువుల మధ్య ఇంకా కొన్ని నీటి అణువులు ఉండడం వల్ల ఆ ఇటుక రూపం అలాగే ఉంటుంది. ఇలాంటి స్థితిలో ఇటుక దిమ్మెలను బట్టీలో అధిక ఉష్ణోగ్రతకు గురి చేసినప్పుడు నీటి అణువులు అక్కడి నుంచి ఆవిరైపోయినా, మట్టిలో ఉన్న విడివిడి రేణువుల్లోని ఉపరితలాల వద్ద కొత్త రసాయనిక బంధాలు ఏర్పడుతాయి. పింగాణీ వస్తువులు, కుండలు, ఇటుకలు, గాజు పదార్థాల తయారీలో ఇలాంటి ఉష్ణ రసాయనిక చర్యలు (Thermo chemical reactions) కీలక పాత్ర వహిస్తాయి. ఇలా తయారయ్యే పదార్థాలను కాంపోజిట్లు అంటారు. బట్టీలో తయారయ్యే ఇటుకలు ఓ విధమైన కాంపోజిట్లే.

No comments:

Post a Comment