*మృత్యు భయం.....*
*ఆ భయం నీకెప్పుడు కలుగుతుంది.? నీవు గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీకు శరీరధ్యాస ఉండదు. అప్పుడా భయముంటుందా.? నీవు పూర్తిగా మేల్కొని, నీ శరీరాన్ని, ప్రపంచాన్ని చూస్తున్నప్పుడే ఆ భయముంటుంది. కలలు లేని నిద్రలో వలె నీవు వీటిని చూడకుండా, కేవలం ఆత్మగానే ఉన్నప్పుడు ఏ భయమూ నిన్ను సోకలేదు. ఏదో పోతుందన్న భావమే భయాన్ని కలిగిస్తుంది. ఆ పోయేదేమిటి అని విచారిస్తే అది నీ శరీరం కాదని, అందులో పని చేసే మనస్సనీ తేలుతుంది.*
*తనకి ఎల్లప్పుడు ఎరుక ఉండేట్టయితే, ఈ రోగపీడితమైన శరీరాన్ని, దాని వల్ల కలిగే ఇబ్బందిని వదిలించు కోవటానికి అందరూ సిద్దమే. పోతుందని అతను భయపడేది ఈ ఎరుకని, ఈ చైతన్యాన్ని. జీవించి ఉండటమంటే, సదా ఎరుక కలిగి ఉండటమే. అదే వారి ఆత్మ. ఇదంటనే అందరికీ ప్రీతి. అటువంటప్పుడు ఈ దేహంలో ఉంటూనే ఆ శుద్ధ చైతన్యాన్నే పట్టుకొని ఎందుకుండ కూడదు. అన్ని భయాలనీ ఎందుకు* *వదిలించుకోకూడదు.*
*"నీ సహజస్థితి లోనే ఉండు"*
*┈━❀꧁ఓం నమః శివాయ꧂❀━┈*
*ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
📿🌺📿 🙏🕉️🙏 📿🌺📿
No comments:
Post a Comment