*ప్రధాన శత్రువులు.....*
*పుణ్య పాపాలగురించి చాలా మందికి మంచి అవగాహనే ఉంది. పుణ్యపాపాలు క్రమంగా సత్కర్మల మరియు దుష్కర్మల ఫలితమని వారికి తెలుసు. మంచీచెడుల మధ్య తేడాను గ్రహించగలిగినా ఆశ్చర్యకరంగా మానవుడు పాపపు కర్మలలోనే నిమగ్నుడవుతాడు. ఒకసారి దుర్యోధనుని యిలా ప్రశ్నించారు. "మీరు రారాజు. శాస్త్రాలను చదివారు. ధర్మమంటే ఏమిటో తెలుసు. అయినా మీరు యిలా ఎందుకు ప్రవర్తిస్తారు?" అందుకు దుర్యోధనుడు.*
*"ధర్మమంటే ఏమిటో నాకు తెలుసు. అయినా నా మనస్సు దాని వైపు మొగ్గటం లేదు. అధర్మమూ నాకు తెలుసు. కాని నామనస్సు పాప కర్మల నాచరించటానికే యిష్టపడుతోంది." అని సమాధానమిచ్చుట ఆశ్చర్యకరమైన విషయం.*
*శ్రీకృష్ణభగవానుని మాటలను వింటున్న అర్జునుడు "దేవా! నీవు బోధించే విషయం తెలుస్తున్నా మనిషి ప్రవర్తన చూస్తే వింతగా అనిపిస్తోంది.” అని ప్రశ్నించాడు.*
*"మనిషికి తాను ఏమి చేస్తున్నాడో తెలిసి* *చేసినా ఎవరి బలవంతం మీదనో చేస్తున్నట్లు పాపపు పనులనే చేస్తుంటాడు. దానికి కారణమేమిటి ?" దానికి శ్రీకృష్ణ భగవానుని సమాధానం ఇది :-*
*కామము మరియు క్రోధ మనబడు శత్రువులు రజో గుణం వలన జనిస్తవి. అవి ఎంతకు తనియవు. మహా పాపిష్టమైనవి. అవే మనిషిని బలవంతంగా పాపానికి ప్రేరేపిస్తాయ్.*
*పై అభిప్రాయం మనకు క్రొత్త కాదు. మనందరికీ సామాన్యంగా తెలిసినదే. అయితే మళ్ళీ మళ్ళీ మనం దానిని గురించి చర్చించాలి. ఎందుకంటే మనం దానిని ఆచరణలోకి తీసుకురాలేకపోతున్నాం కదా. కామం, క్రోధం అనేవి ప్రతి మనిషికి బద్ధ శత్రువులు. మనిషికి మొదట యిష్టం లేకపోయినా పాపకార్యాలు చేసేటట్లు ఈ రెండూ బలవంతపరుస్తాయి. కామక్రోధాలను అదుపులో ఉంచుకున్నట్లయితే పాపం చేయాలనిపించదు.*
*ఒక వస్తువును తీవ్రంగా కోరుకోవటం కామమైతే, ఆ వస్తువు లభించకపోతే లేదా దానిని కోల్పోతే క్రోధం వస్తుంది.*
*┈┉━❀꧁గురుభ్యోనమః꧂❀━┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🌺📿🌺 🙏🕉️🙏 🌺📿🌺
No comments:
Post a Comment