Monday, July 7, 2025

 🚩🌹దశకొద్దీ_పురుషుడు_దానం_కొద్దీ_బిడ్డలు!
        (చిత్రం_వడ్డాది_పాపయ్యగారి_దానం.)
దానం చేయాలని ప్రముఖంగా చెబుతుంది
సనాతన ధర్మం..’
*పెట్టందే_పుట్టదు* ’ అనీ అంటుంది. 
’చేసుకున్న_వాళ్ళకి_చేసుకున్నంతా_అంటారు.
’పుణ్యం_కొద్ది_పురుషుడు, దానం_కొద్దీ_బిడ్డలూ’ అని అంటుంది లోకం. ఇలా దానం యొక్క గొప్పతనాన్ని చెబుతారు.
దానం చేసిన వారిలో ప్రముఖులనీ చెబుతారు. దధీచి తన వెన్నెముకనే దానం చేశారు, ఇంద్రుని వజ్రాయుధం కోసం. బలి చక్రవర్తి మూడడుగుల నేల కావాలంటే దానం చేసి పాతాళానికెళ్ళేరు. శిబి చక్రవర్తి తన తొడ మాంసం కోసి పావురాన్ని రక్షించడం కోసం ప్రయత్నం చేశారు, సరిపోకపోతే తానే సమర్పించుకోడానికి సిద్ధమయ్యారు. 
నేటి కాలానికీ ప్రపంచంలో కలిగినవారు తమ సొత్తులో కొంత లేక అంతా దానం చేస్తూనే ఉన్నారు, సమాజ హితం కోసం.
ఎవరికైనా కావలసింది పిడికెడు మెతుకులు బతికున్నపుడు, చస్తే తగలబెట్టడానికో పూడ్చి పెట్టడానికో కావలసిన చోటు ఆరడుగుల నేల. ఎవరూ పోయేటపుడు కూడా ఏం పట్టుకుపోరు. అన్ని మతాలూ దానం చేయమనే చెబుతాయి.
అపాత్రులకు దానం చేయకూడదు. దానం తీసుకునేవారు మనకంటే తక్కువవారనుకోవడం చాలా తప్పు. వారు మనం దానం చేయడానికి వీలు కల్పించినందుకు సంతసించాలి. కలిగినంతలో దానం చేయాలి, శక్తికి మించి దానం చేయకూడదు.
కలిగినవారు దానం చేయకపోవడం తప్పు. కలగనివారు శక్తికి మించి దానం చేయడం తప్పు. దానం ఏ రూపంలోనైనా ఉండచ్చు, ఒక్క ధనమిస్తేనే దానం కాదు. దశదానాలంటారు. అన్నిటిలోనూ గొప్పదైనది అన్నదానం వెంటనే ఫలితమిచ్చి ప్రాణాన్ని నిలుపుతుంది, ఆ తరవాతది విద్యా దానం. చెప్పుకుంటూ పోతే చాలా ఉంది.

         🙏🙏

No comments:

Post a Comment