Saturday, July 5, 2025

 *_మంచి భర్త గురించి ఒక చిన్నకథ._* 
_[మీ అందరికోసం తప్పనిసరిగా ప్రతి మగాడు ఈ కథ చదవండి.]_ 
==~==~==~==~==~==

*పండు👨మధు👧ఇద్దరు భార్యాభర్తలు.👬పండు ఏదో తన చదువుకు తగ్గ చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు..*

*మధు ఇంట్లోనే పిల్లల ఆలనా పాలనా చూస్తూ అత్తమామలను సేవిస్తూ సాఫీగా జీవితం గడుపుతూ ఉండేవారు...*

*మధుకి భర్త అంటే ఎనలేని ప్రేమ 💕💕*
*పండుకి భార్య అంటే ఎంతో అనురాగం💗💗....మధు అత్తమామలకి కోడలంటే... చెప్పలేనంత ప్రీతి💑💑*

*ఈ కారణంగానే మధు పుట్టిటింటికి పెద్దగా వెళ్ళేది కాదు. వెళ్లినా ఒక్కపూట, అరపూటలో తిరిగి వచ్చేది...*

*ఒక సమయాన మధు అన్న గారికి పెళ్లి కుదరడంతో మధు 15 రోజులు ముందే పుట్టిటింటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మధుని పంపడం పండుకి... అతని తల్లిదండ్రులకు ఇష్టం లేదు. కానీ తప్పని పరిస్థితి...*

*మధు పుట్టింటికీ వెళ్లింది... పండు స్నేహితులతో కాలం గడుపుతూ.. తన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ కాలం వెళ్ళదీస్తున్నారు...*

*ఇంతలో స్నేహితులలో ఒకరిది పుట్టినరోజు వచ్చింది.. తన స్నేహితులతో కలిసి అందరూ సరదాగా గడపాలి అనుకున్నారు. పండుని కూడా పిలిచారు. భార్య కూడా ఇంట్లో లేదు కనుక, ఒంటరిగా ఎందుకు అని పండు కూడా పార్టీకి వెళ్లారు. స్నేహితులు బలవంతం చేయడం వలన మద్యం తీసుకున్నారు...*

_【పండుకు పెళ్లికి ముందు మందు తాగే అలవాటు ఉంది. పెళ్ళయ్యాక మధుకి ఇష్టం లేదని తెలిసి మానేశారు】_

*చాలా రోజుల తర్వాత అలవాటు గుర్తు చేసుకున్న పండు రోజూ స్నేహితులతో కలిసి మందు తాగడం అలవాటయ్యింది...* 

*ఇంతలో మధు అన్నగారి పెళ్లి తంతు దగ్గర పడింది. పండు కుటుంబం అందరూ పెళ్లికి హాజరయ్యి తిరిగి వచ్చేశారు... మరుసటి రోజు కూడా పండు స్నేహితులతో కలిసి పార్టీలు, గట్రా పూర్తి చేసుకుని వెళ్తూ వెళ్తూ స్నేహితులకు ఒక్కమాట చెప్పాడు... _"ఫ్రెండ్స్ నేను రేపటి నుండి ఇలాంటి పార్టీలకు రాలేను"_ అని...*

*వాళ్ళందరూ ఆశ్చర్యం గా పండు వైపు చూశారు... _"ఏంటి బావా..! ఏమయ్యింది.. ఇంత అర్ధాంతరంగా ఈమాట అంటున్నావు?"_ అన్నారు.* 

*అప్పుడు పండు నవ్వుతూ.. _"రేపు మీ చెల్లెలు(మధు) వస్తుంది బావా..! అందుకే ఇక రాలేను"_ అన్నాడు.* 

*అంతలోనే స్నేహితులలో ఒకరు.. _"పెళ్ళానికి భయపడుతున్నావా?"_ అని ఎగతాళి చేశారు. మరొకరు, _"పిరికోడా..!"_ అన్నారు. ఇంకొకరు, _" చేతకానివాడు..!"_ అన్నారు.* 

*ఇవన్నీ వింటున్న పండు ఏమీ మాట్లాడకుండా అక్కడ నుండి సైలెంట్ గా వెళ్ళిపోయాడు.* 

*మరునాడు సాయంత్రం రోజూలానే స్నేహితులని కలిసాడు. _"ఏంటి బావ రాను అన్నావుగా ఎందుకొచ్చావు...?"_ అన్నారు.* 

*మరొకరు వెంటనే.. _"మందుకు బానిసైతే అంతే బావా ఏదీ గుర్తు రాదు"_ అన్నారు. అప్పుడు పండు వాళ్ళందరికీ ఇలా చెప్పాడు...*
 
*_"రాత్రి మీరన్న మాటలకి సమాధానం అప్పుడే చెప్పేవాడిని కానీ తాగి వాగాను అంటారు అందుకే ఇప్పుడు చెప్తున్నా.."_* 

*★నా భార్య అంటే భయమే నాకు...! ఎందుకంటే, నేను తాగితే నా ఆరోగ్యం పాడవుతుంది. అని ఆలోచించి తనెక్కడ ఆరోగ్యం పాడు చేసుకుంటుందేమో అని...*

*★పిరికోడినే...! ఎందుకంటే, నేను చేసే పొరపాట్లన్నింటినీ సమర్ధించుకునే నా భార్య ధైర్యం ముందు నేను పిరికోడినే...!*

*★చేతకాని వాడినే....! ఎందుకంటే నేను ఎంతటి వెర్రి చేష్టలు చేసినా ఓపికతో భరించే ఆమె సహనం ముందు నేను చేతకాని వాడినే....*

*పండు సమాధానం విన్నాక అక్కడ మౌనం రాజ్యమేలింది.* 

*అందరూ కొంత సేపటికి తేరుకున్నారు. పండు కళ్ళలో చెమర్చిన కన్నీరు... స్నేహితుల మౌనం.. ఇవన్నీ పండుకు గర్వముగా అనిపించాయి... అందరూ పండుని క్షమాపణలు కోరారు. పండు ఆనందంగా మధు దగ్గరకు వెళ్లిపోయాడు.* 

 *మనలో కూడా చాలా మంది చెప్తుంటారు... _"అయ్యో ఇంట్లో మా ఆవిడ ఉంది.."_ అని అన్నాడంటే.. అతను భార్యకి భయపడినట్టు కాదు, భార్యని గౌరవిస్తున్నట్టు అని అర్ధం...* 

*భార్యను బాధపెట్టకూడదు అని అతని ఆంతరంగికం...*

*కొందరు భార్యకు గౌరవం ఇవ్వకపోగా ఇచ్చేవాళ్ళని చూసి ఎగతాళి చేస్తూంటారు. ఇది ఎంతవరకూ సమంజసం..???* 
_(-Latham Ravi)_ 
😢😢😢
*_{సేకరణే: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు, ఆత్మకూరు పట్టణం, నెల్లూరు జిల్లా🙏}_*

No comments:

Post a Comment