*“నాకు టైం లేదు...”* కానీ ఏ పనులకు టైం ఉంటుందో ఆలోచించండి.
12 గంటల ప్రయాణం ఇప్పుడు 4 గంటల్లో పూర్తవుతుంది — అయినా మనిషి చెబుతున్నాడు:
*“నాకు టైం లేదు.”*
12 మంది సభ్యుల కుటుంబం ఇప్పుడు 2 సభ్యుల కుటుంబంగా మారింది — అయినా చెబుతున్నాడు:
*“నాకు టైం లేదు.”*
ఒకప్పుడు వార్తలు చేరడానికి 4 వారాలు పట్టేది, ఇప్పుడు అది 4 సెకన్లలో వస్తోంది — అయినా చెబుతున్నాడు:
*“నాకు టైం లేదు.”*
తొలితరం ముఖాలను చూడడానికి ఏళ్లెన్నో పట్టిన కాలం ఇప్పుడు సెకన్లలో వీడియో కాల్ లో చూస్తున్నాం — అయినా చెబుతున్నాడు:
*“నాకు టైం లేదు.”*
ఆఫీసులో అన్ని పనులు చేస్తాడు. అయినా తల్లిదండ్రులు
చెప్పిన పని చేయడానికి - చెబుతున్నాడు:
*“నాకు టైం లేదు."*
ఒకప్పుడు మెట్లు ఎక్కేందుకు సమయం తీసుకునేవాడు, ఇప్పుడు లిఫ్ట్ లో ఒక్క నిమిషంలో
చేరుతున్నాడు.
అయినా చెబుతున్నాడు:
*“నాకు టైం లేదు.”*
ఒకప్పుడు గంటల తరబడి బ్యాంకు క్యూలో నిలబడే మనిషి, ఇప్పుడు మెల్లగా ఫోన్‌లోనే అన్ని లావాదేవీలు చేస్తాడు — అయినా చెబుతున్నాడు:
*“నాకు టైం లేదు.”*
ఒకప్పుడు వైద్య పరీక్షలు వారాల తరబడి పట్టేవి, ఇప్పుడు గంటల్లో పూర్తి అవుతున్నాయి — అయినా చెబుతున్నాడు:
*“నాకు టైం లేదు.”*
ఆక్టివా కారు లో ప్రయాణించేటప్పుడు ఒక చేత్తో హ్యాండిల్ పట్టుకొని, మరో చేత్తో ఫోన్ పట్టుకొని మాట్లాడుతున్నాడు — ఎందుకంటే వాహనం ఆపడానికి అతనికి....
*"టైం లేదు."*
కారు నడుపుతూనే వన్ హ్యాండ్ స్టీరింగ్ పై, ఇంకో హ్యాండ్ వాట్సాప్ లో — ఎందుకంటే అతనికి .....
*"టైం లేదు."*
ట్రాఫిక్ లో వేచి ఉండలేడు — పక్క దారిలోకి వెళ్లి చిన్న ప్రమాదం చేసుకుంటాడు — ఎందుకంటే అతనికి .....
*"టైం లేదు."*
స్నేహితులతో ఉన్నప్పుడు మరొక వ్యక్తికి
ఫోన్లో మెసేజ్ చేస్తూ ఉంటాడు — ఎందుకంటే ఒక సమయంలో ఇంకెక్కడైనా ఉండాలి — ఎందుకంటే అతనికి ..... *"టైం లేదు..."*
ఒంటరిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు, కానీ ఇంట్లో, జనాల్లో గందరగోళంగా — ఎందుకంటే అతనికి....
*" టైం లేదు."*
పుస్తకాలు చదవడానికి....
*టైం లేదు,*
తల్లిదండ్రులకు కాల్ చేయడానికి....
*టైం లేదు,*
స్నేహితులను కలవడానికి....
*టైం లేదు,*
తినడానికి, నిద్రపోవడానికి....
*టైం లేదు,*
ప్రకృతిని ఆస్వాదించడానికి....
*టైం లేదు.....*
*కానీ…...*
*ఐపీఎల్ చూసేందుకు.....*
*"టైం ఉంది,"*
*నెట్‌ఫ్లిక్స్ లో సినిమాలు చూడటానికి.....*
*"టైం ఉంది,"*
*పనికిమాలిన రీల్స్ చూడటానికి....*
*"టైం ఉంది,"*
*రాజకీయాల గురించి వాదించేందుకు....*
*'టైం ఉంది"…*
*ఇష్టమైన హీరో సినిమాలు చూడటానికి......"*
*టైం ఉంది.....**
*🙏కానీ తనకోసం.....*
*టైం లేదు!*
ప్రపంచం వేగంగా మారింది, సాంకేతికత దగ్గరైంది, దూరాలు తగ్గిపోయాయి, సౌకర్యాలు పెరిగాయి, అవకాశాలు ఎక్కువయ్యాయి — అయినా మనిషి మాత్రం అదే మాట చెబుతూనే ఉన్నాడు:
*“నాకు టైం లేదు.”*
తనతో కూర్చొని మాట్లాడేందుకు, తనను అర్థం చేసుకోవడానికి, నవ్వడానికి కూడా....
*"టైం లేదు.'*
*⏳ అయితే ఒక రోజు వస్తుంది…*
*కాలము తుఫాను వలె వెళ్తుంది....*
*ఆ చివరి క్షణంలో, అతడు గ్రహిస్తాడు…*
*“నాకు టైం ఉంది…...*
*కానీ నేను టైం లేదు అని చెప్పుకుంటూ... జీవించడమే మర్చిపోయాను అని”*
*☀️ అందుకే…*
*ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకో.....*
*🕰️ నీకోసం కొద్దిగా టైం ఉంచు,*
*👨👩👧👦 బంధాలకు, మీ తల్లిదండ్రులు, భార్య మరియు పిల్లల కోసం కొంత టైం ఉంచు...*
💖 *నీ హృదయం కోసం,*
*నీ శాంతి కోసం,*
*నీ జీవితాన్ని నిజంగా అనుభవించడాని కోసం కొద్దిగా... టైం ఉంచు.*
*ఎందుకంటే*
*"టైం లేదు"* *అనేది నిజం కాదు —*
*అది ఒక అలవాటు, సాకు మాత్రమే....*
*అది సాకుగా మరియు అలవాటుగా మారింది.*
*అది మారాలి.....*
*"ప్రశాంతంగా జీవించాలి”*
🙏🙏🙏
No comments:
Post a Comment