ఈ రోజు ఉదయం ఫేస్బుక్ ఓపెన్ చేసినప్పటి నుండి ప్రతీ పేజ్ లో స్వేచ్ఛ గారి బలవన్మరణ వార్త. నాకు ఆవిడ పర్సనల్ గా తెలియదు. కానీ చాలా మంది కామన్ ఫ్రెండ్స్ కి ఆమె మంచి ఫ్రెండ్. కొంతమంది అనుమానాస్పదం అన్నా, ఆమె తండ్రి మాత్రం ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తి ఆమె ఆత్మహత్యకు కారణం అని మీడియా ముఖంగా చెప్పి కేస్ కూడా పెట్టారు.
ఆత్మహత్యకు అనేక కారణాలు ఉంటాయి, ఆ ఫీలింగ్ వచ్చిన వెంటనే ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవడం చాలా ఉత్తమం. ఆ తరువాత ఖచ్చితంగా సైకాలజిస్ట్ ను కలవాలి. ఆమె లేక అతను స్ట్రాంగ్ అలా చేసుకుని ఉండకపోవచ్చు అని అనుకుంటాం కానీ, ఈ ఆత్మహత్య చేసుకోవాలి అనే ఎమోషనల్ పెయిన్ రిలీవర్ ముందు ఏ బలం పని చెయ్యదు. కొన్ని సార్లు ఈ సివియర్ అర్జ్ నెలల పాటు ఉంటే కొన్ని సార్లు క్షణికం. సామాన్యులుగా మనం కొంత వరకే ఈ సిట్యుయేషన్ హ్యాండిల్ చెయ్యగలం. నాకు ఉన్న అనుభవంతో నేను ఏదో ఒకలా సర్ది చెప్పి, సైకాలజిస్ట్ ను అప్రోచ్ అయ్యేలా చేస్తాను. అదే బెస్ట్ మార్గం.
ఆమెకు అంత మంది మంచి స్నేహితులు ఉన్నా, ఆమె స్ట్రెస్ లో ఉంది అని ఎవ్వరూ చెప్పలేదు. అందరూ షాక్ కి గురయ్యారు. ఆమె కూడా ఎవ్వరితో ఎందుకు షేర్ చేసుకోలేదొ అర్ధం కాలేదు. సహజీవనం అంటేనే ఈ సమాజంలో చాలా ధైర్యమైన నిర్ణయం.మ్యాన్ అండ్ హిస్ నేచర్ సెంట్రిక్ గా ఈ రిలేషన్ తయారు అయితే, ఇంక పెళ్ళికి సహజీవనానికి తేడా ఏముంది?
ఏ బంధం అయినా అది అందంగా ఉన్నంతసేపే దానిని అనుభవించాలి. ఆ బంధం ప్రతిబంధకంగా మారుతున్నప్పుడు, ఆ బంధాన్ని తెంచుకోవడం తప్ప వేరే మార్గం లేదు. కొన్ని బంధాలు తెగినప్పుడు బాధ ఉంటుంది, కానీ టైం అన్నీ సెట్ చేస్తుంది.
సమస్యలు షేర్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. అది నిజంగా మంచి హ్యాబిట్. షేర్ చేసుకోవడం సొల్యూషన్ రాకపోవచ్చు గాని,ఒక సలహా వస్తుంది, దానితో పాటు కొంత టైం వస్తుంది. ఫేస్బుక్ స్నేహాలు కూడా తక్కువ అంచనా వేయాల్సిన పని లేదు. చాలా మందికి సపోర్ట్ సిస్టంగా ఫేస్బుక్ ఫ్రెండ్స్ పని చేశారు.
ఒకవేళ మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఇలా అనిపిస్తుంది అని చెప్తే, ఇగ్నోర్ చెయ్యద్దు, కొంచెం టైం కేటాయించి మాట్లాడండి. తర్వాత ఎక్స్పర్ట్ అడ్వైస్ కోసం డాక్టర్ ను కలిసేలా ప్రోత్సహించండి, లేదా మీరే దగ్గర ఉండి తీసుకొని వెళ్ళండి.
No comments:
Post a Comment