Indian Railways: రైళ్ల కోచ్‌లకు పసుపు, తెలుపు గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా?
Indian Railways: మనందరం ట్రైన్స్ ఎక్కుతాం, దిగుతాం... కానీ... వాటిపై ఉండే పసుపు, తెలుపు గీతలను పట్టించుకోం.
Indian Railways: 1859 ఏప్రిల్ 16న ఇండియాలో ఇండియన్ రైల్వేస్ సేవలు ప్రారంభమయ్యాయి. మొదటి రైలు... ముంబై నుంచి థానే 33 కిలోమీటర్ల దూరం ఉన్న మార్గంలో పరుగులు పెట్టింది. అయితే అప్పటి నుంచి రైళ్లకు పై భాగంలో పసుపు, తెలుపు, గ్రీన్ గీతలు గీస్తున్నారు. మనందరం రైళ్లు ఎక్కుతున్నాం, దిగుతున్నాం కానీ... ఆ గీతలు ఎందుకో, వాటిని ఎందుకు గీస్తారో తెలియదు. ఇందుకు ప్రత్యేక కారణం ఉంది.
మన దేశంలో ప్రయాణికులకు తక్కువ ఖర్చులో అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని భారతీయ రైల్వే అందిస్తోంది. 1951లో భారతీయ రైల్వే వ్యవస్థను జాతీయం చేశారు. ఇండియన్ రైల్వేస్... ఆసియాలో అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్, ప్రపంచంలో రెండో అతి పెద్దది.
రైళ్లలో ప్రతి అంశానికీ, ప్రతి సైన్ బోర్డుకూ, ప్రతీ వస్తువుకూ ప్రత్యేక కారణం అంటూ ఉంటుంది. ప్రయాణికులకు ఇలాంటి ఆలోచించే తీరిక ఉండదు. ఎవరి బిజీలో వారు ఉంటారు. ఐతే... కొన్ని విషయాలు తెలుసుకుంటే... ఒకింత ఆశ్చర్యం కలుగుతుంది. రైళ్ల కోచ్‌లకు ఉండే గ్రీన్, ఎల్లో, వైట్ గీతలు అలాంటివే. వాటికి ప్రత్యేక గుర్తు ఉంది.
ఇండియాలో ఎక్స్‌ప్రెస్, హైస్పీడ్ రైళ్లకు బ్లూ కలర్ ఉంటుంది. ఈ రైళ్లకు ఉండే విండోలపై కనిపించే వైట్ లైన్ అర్థం... ఆ కోచ్‌లు రిజర్వ్ కాని కోచ్‌లు అని అర్థం. అందువల్ల ఆ కోచ్‌లలో ప్రయాణికులు ఎవరైనా కూర్చోవచ్చు.
పసుపు రంగు గీతలు ఉంటే... అది ప్రత్యేకమైన కోచ్ అని అర్థం. దాన్ని దివ్యాంగులు, అనారోగ్యంతో ఉండేవారి కోసం కేటాయించారని అర్థం.
అదే విధంగా గ్రీన్, బ్లాక్ లైన్స్ గనక ఉంటే... ఆ కోచ్‌లు ప్రత్యేకంగా మహిళల కోసం అని అర్థం. ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు... కోచ్ ఎక్కక ముందే అది ఏ కోచో తెలుసుకునేందుకు వీలుగా ఇండియన్ రైల్వేస్ ఈ గీతల విధానం తెచ్చింది. కానీ వాటిపై ప్రజలకు అవగాహన కల్పించలేదు. అందువల్ల చాలా మంది వాటిని పట్టించుకోకుండానే ప్రయాణిస్తున్నారు.
#వందేమాతరం 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🚩
#భారత్_మాతాకీ_జై_జై_హింద్. 🇮🇳 🚩

No comments:
Post a Comment