Sunday, August 10, 2025

 [8/7, 14:34] +91 79819 72004: *💎నేటి ఆణిముత్యం💎*


ప్రేమను గూర్చి యల్పునకుఁబెద్దతనంబును దొడ్డవానికిం
దామతి తుచ్ఛపుంబని నెదం బరికింపగా యీయరాదుగా
వామకరంబుతోడ గుడువం గుడిచేత నపానమార్గయుం
దోమగవచ్చునే మిగులఁదోచని చేతులుగాక భాస్కరా!

*తాత్పర్యం:-*

భాస్కరా! లోకంలో నీచునకు గొప్ప పదవిని, గొప్పవానికి చిన్న పదవి నిచ్చి పనులు చేయించుచో ఆ పాలనమంతయు ఆలోచన లేక ఎడమ చేతితో భుజించుటయును, కుడి చేతితో మల మూత్రములు శుభ్రపరచుటయును యగును.
 
*ℂ𝕠𝕝𝕝𝕖𝕔𝕥𝕚𝕠𝕟 𝕓𝕪:𝕊𝕠𝕟𝕥𝕖𝕝𝕒 𝔻𝕙𝕒𝕟𝕦𝕟𝕛𝕒𝕪𝕒*
[8/7, 14:34] +91 79819 72004: *🫄🏻👭 నేటి చిన్నారి గీతం 🤰🏻👫*


*అందాల తోటలో...*

అందాల తోటలో బాల ఏమంది ?
ఆడగా పాడగా తోడు రమ్మంది
గున్నామామిడి పైని కోయిలేమంది ?
'కూ' అంటే 'కూ' అన్న కొంటె ఎవరంది
నిండుగా పురి విప్పి నెమలి ఏమంది ?
నృత్యాలు, నాట్యాలు నేర్చుకొమ్మంది
చెట్టుకొమ్మన రామచిలుక ఏమంది ?
సగము కొరికిన పండ్లు చవి చూడమంది
చెంగు చెంగున ఎగిరి జింక ఏమంది ?
పరుగు పందెములోన పస చూడమంది
అంతలంతలమేయు ఆవు ఏమంది ?
ఆగి తియ్యని పాలు త్రాగి పొమ్మంది
క్రొత్తగా కొన్నట్టి గుర్రమేమంది ?
స్వారి చేస్తే నీవు సాహసుడవంది
విరియ బూచిన పండు వెన్నెలేమంది ?
వింత వింతల కథల విందు నేడంది.

*రచన : కస్తూరి నరసింహమూర్తి*
[8/7, 14:34] +91 79819 72004: *🗣నేటి జాతీయం🤔*


*కడుపు నిండిన బేరం*

బేరం బాగా జరిగిందని అర్థం. 
అన్ని కార్యాలు సక్రమంగా జరిగి నిశ్చింతగా వున్న వారిని గురించి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.


అక్కరలేని బేరము... 

వాడికేమిలే..... వాడిది కడుపు నిండిన బేరం. అని అంటుంటారు.
[8/7, 14:34] +91 79819 72004: *🤠 నేటి సామెత 🌸*

*ఆరాటపు పెళ్ళికొడుకు పెరంటాళ్ళ వెంట పడ్డ్డాడట*


పెళ్ళి అయిన తరువాత శోభనం ముచ్చట జరుపుతారు. శోభనం కార్యక్రమంలో ముందు పూజ, తరువాత ముత్తయిదువులకు తాంబూలం వంటి ఆచారాలు ఉంటాయి. ఇవి అయినతరువాతనే అమ్మాయిని అబ్బాయిని గది లోకి పంపుతారు. ఈలోపున, పెళ్ళికొడుకుకి ఆత్రం ఎక్కువయి, అంతవరకు ఆగలేక, పేరంటానికి వచ్చిన మహిళల వెంట పడ్డాడట. ఈ సామెత ఏదయినా పని సాంతము జరిగేవరకు ఆగలేక, ఫలితం కొరకు ఊరికే ఆత్రపడే వారి గురించి గేలి చెయ్యటానికి ఈ సామెతను వాడతారు.
[8/7, 14:34] +91 79819 72004: *✅ తెలుసుకుందాం ✅*


*🛑నూనె కాగితం పారదర్శకమవుతుంది. ఎందువల్ల? Oily paper become transparent Why?*

🟢కాంతి కిరణాలు పదార్థాలపై పడినప్పుడు కొన్ని కిరణాలు వెనుతిరిగి వస్తాయి. ఈ ప్రక్రియను పరావర్తనం (reflection) అంటారు. కొన్ని పదార్థాల గుండా కాంతికిరణాలు చొచ్చుకుపోతూ వంపునకు గురవుతాయి. ఈ ప్రక్రియను వక్రీభవనం(refraction) అంటారు. తెల్లకాగితం విషయానికి వస్తే అది వెదురులాంటి పీచుపదార్థాలతో తయారవుతుంది. కాగితంలో ఈ పదార్థపు పోగులు వదులుగా ఉండి, ఆ పోగుల మధ్య గాలి బంధించబడి ఉంటుంది. తెల్లకాగితంపై కాంతి పడినప్పుడు ఆ కాంతి కిరణాలలోని ఎక్కువ శాతం ఎక్కువ పాళ్లలో ఉండే పీచుపదార్థపు పోగులపై పడి పరావర్తనం చెంది వెనుతిరిగితే, మిగిలిన తక్కువ శాతం కాంతి కిరణాలు మాత్రమే పోగుల మధ్య ఉండే ప్రాంతాలనుంచి లోపలికి ప్రవేశించగలవు. కాగితంపై పడే కాంతి చాలా వరకు పరావర్తనం చెందడం వల్ల తెల్లకాగితం ప్రకాశవంతంగా ఉంటుంది. కాగితం ఆవలి వైపునకు చొచ్చుకుపోయే కాంతి పరిమాణం తక్కువవడం వల్ల కాగితం కాంతి నిరోధకం (opaque)గా ఉంటుంది.

కాగితంపై నూనె పడినప్పుడు అది కాగితంలోని పోగుల మధ్య గాలి ఉండే ప్రాంతాలలోకి చేరుకుంటుంది. ఆ ప్రాంతంపై పడే కాంతి కిరణాలు పరావర్తనం చెందకుండా, ఎక్కువశాతం చొచ్చుకుపోగలుగుతాయి. అందువల్లనే నూనె పడిన ప్రదేశంలో కాగితం పారదర్శకం (transperent) అవుతుంది. కాంతి పరావర్తనం చెందకపోవడం వల్లనే నూనెలో తడిసిన కాగితం ప్రకాశాన్ని కోల్పోతుంది.

*🎣Collection by : 🅢🅞🅝🅣🅔🅛🅐. 🅓🅗🅐🅝🅤🅝🅨🅐🎣*
[8/7, 14:34] +91 79819 72004: *🐈దొంగ పిల్లి🦜*

*డా॥ ఎం. హరికిషన్- 9441032212*

ఒక అడవిలో ఒక దొంగ పిల్లి ఉండేది. దానికి రామచిలుకలు గానీ,
పావురాలు గానీ కనబడితే చాలు మట్టసంగా వెనక నుంచి వచ్చి లటుక్కున పట్టేసి
గుటుక్కున మింగేసేది. అప్పుడే పుట్టిన చిన్నపిల్లలని గూడా వదిలేది కాదు.
ఆ అడవిలో ఒక చిలుకమ్మ ఉండేది. అది ఈ దొంగ పిల్లికి భయపడి ఒక
చెట్టు పైన, చాలా ఎత్తులో, కొమ్మల చాటున గూడు కట్టి పిల్లలని పొదిగింది. కానీ
ఆ దొంగ పిల్లి ఎలా కనుక్కోనిందో గానీ చిలుక తన పిల్లలకి ఆహారం తీసుకొని
రావడానికి బయటకు పోయినప్పుడు మట్టసంగా పైకెక్కి వాటిని తినేసింది.
చిలుకకు చానా బాధ వేసింది. అందరూ ఎవరికి వారు ఉన్నారే గానీ ఆ
పిల్లిని ఎలా దెబ్బకొట్టాలో ఆలోచించడం లేదు. దానితో పిల్లికి తనను ఎవరూ
ఏమీ చేయలేరులే అని బాగా పొగరెక్కింది.
ఒక చెట్టు కొమ్మ కింద ముళ్ళకంప ఉంది. దానికి బాగా లావు లావు ముళ్ళు
ఉన్నాయి. ఆ కంపను చూసిన చిలుకకు ఒక ఉపాయం తోచింది.
చిలుక ఒక కాకి దగ్గరికి పోయింది. ఆ కాకి రెండు పిల్లలని గూడా ఈ
దొంగ పిల్లి వారం కిందట తినేసింది. దాంతో అది కోపంతో రగిలిపోతుంది. కానీ
ఆ పిల్లిని ఏమీ చేయలేక లోలోన కుమిలిపోసాగింది. చిలుక కాకితో ఏం చేయాలో
చెప్పి, మనం చేయి చేయి కలిపితే, చీమలూ చీమలూ కలసి ఏనుగును జయించినట్టు
మనం పిల్లిని జయించగలం అంది. కాకి వెంటనే సరే అంది.
చిలుక పిల్లికి కనబడేలా ఒక చెట్టు కొమ్మ మీద వాలింది. ఆ కొమ్మ కిందనే
ముళ్ళకంప ఉంది. పిల్లి ఆ చిలుకను పట్టుకోవాలని నెమ్మదిగా చెట్టు ఎక్కి వెనుకనుంచి
దగ్గరకు వచ్చింది.
అంతలో కాకి సర్రున దూసుకొని వచ్చి పిల్లి కన్ను మీద గట్టిగా ఒక్క పోటు
పొడిచింది.
అంతే.. పిల్లి పట్టుదప్పి పైనుంచి దభీమని కిందనున్న ముళ్ళకంపపై పడింది.
[8/7, 14:34] +91 79819 72004: పిసినారి - టెంకాయ (సరదా జానపద నీతి కథ) - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*********
     ఒకూర్లో ఒకడుండేటోడు. వాడు పెద్ద పిసినారి. పదిపైసలు ఖర్చు పెట్టాలన్నా పదిసార్లు ఆలోచించేటోడు. వానికో రోజు పెద్ద జ్వరమొచ్చింది. ఎంతమంది వైద్యులకు చూపిచ్చినా, ఎన్ని మందులు మింగినా కొంచం గూడా తగ్గలేదు. దాంతో ఒకరోజు దేవుని గుడికి పోయి “సామీ! సామీ! నాకు జ్వరం గనుక తగ్గిపోతే నీకు ఒక టెంకాయ కొడతాను. ఎట్లాగయినా తగ్గించు సామీ" అని వేడుకున్నాడు. కొద్దిరోజులకు వైద్యులిచ్చిన మందులు బాగా పని చేసి జ్వరం తగ్గిపోయింది.
జ్వరం తగ్గితే దేవునికి టెంకాయ కొడతానని మొక్కుకున్నాడు గదా! దాంతో ఒక రోజు టెంకాయలంగడికి పోయి “ఒక టెంకాయెంత" అనడిగినాడు. వాడు "నాలుగు రూపాయలు" అని చెప్పినాడు.
వీడు పెద్ద పిసినారోడు గదా... వాడడిగినంత ఇవ్వడం ఇష్టం లేక బేరం చేద్దామని “మూడుకియ్యవా " అన్నాడు. ఆ మాటలకు వాడు "మూడు రూపాయలకు ఈడ యాడా దొరకవుగానీ పక్కనే వున్న తాండ్రపాడుకు పో, ఆడ దొరుకుతాయి" అన్నాడు.
రూపాయ మిగులుతుందనేసరికి వాడు సంబరంగా పదిమైళ్ళు కిందామీదాపడి నడిచి తాండ్రపాడులో టెంకాయలంగడికి చేరుకోని "ఒక టెంకాయెంత" అనడిగినాడు. వాడు “మూడు రూపాయలు" అని చెప్పినాడు.
వీడు పెద్ద పిసినారోడు గదా. వాడడిగినంత ఇవ్వడం ఇష్టం లేక బేరం చేద్దామని "రెండుకియ్యవా" అన్నాడు. ఆ మాటలకు వాడు “రెండు రూపాయలకు ఈడ యాడా దొరకవుగానీ పక్కనే వున్న నన్నూరుకుపో ఆడ దొరుకుతాయి" అన్నాడు.
రూపాయ మిగులుతుందనేసరికి వాడు సంబరంగా మరో పదిమైళ్ళు కిందామీదాపడి నడిచి నన్నూరులో టెంకాయలంగడికి చేరుకోని “ఒక టెంకాయెంత" అనడిగినాడు. వాడు “రెండు రూపాయలు" అని చెప్పినాడు.
వీడు పెద్ద పిసినారోడుగదా... వాడడిగినంత ఇవ్వడం ఇష్టం లేక బేరం చేద్దామని "రూపాయకియ్యవా " అన్నాడు. ఆ మాటలకు వాడు "రూపాయకు ఈడ యాడా దొరకవుగానీ పక్కనే వున్న ఓర్వకల్లుకు పో. ఆడ దొరుకుతాయి" అన్నాడు.
రూపాయ మిగులుతుందనేసరికి వాడు సంబరంగా పదిమైళ్ళు కిందామీదాపడి నదిచి ఓర్వకల్లులో టెంకాయలంగడికి చేరుకోని “ఒక టెంకాయెంత" అనడిగినాడు. వాడు “ఒక రూపాయ" అన్నాడు.
వీడు పెద్ద పిసినారోడు గదా... రూపాయ గూడా ఖర్చు పెట్టడం ఇష్టం లేక "వూరికే ఇయ్యవా" అన్నాడు. ఆ మాటలకు వాడు “వూరికే ఈడ యాడా దొరకవుగానీ పక్కనే వున్న కాల్వబుగ్గకు పో ఆడ దొరుకుతాయి" అన్నాడు.
రూపాయ మిగులుతుందనేసరికి వాడు సంబరంగా ఇంకో పదిమైళ్ళు కిందామీదాపడి నడిచి కాల్వబుగ్గలో టెంకాయల తోటకి చేరుకోని “ఒక టెంకాయెంత" అన్నాడు. వాడు "డబ్బులేమీ వద్దులే పూరికే తీసుకో" అన్నాడు.
వీడు పెద్ద పిసినారోడు గదా ఇచ్చిందాన్ని పుచ్చుకోని సంతోషంగా తీసుకోని పోక "వూరికే రెండియ్యవా" అన్నాడు. ఆ మాటలకు వాడు పక్కనే ఉన్న ఒక కొబ్బరి చెట్టు చూపించి “రెండేం ఖర్మ నీకెన్ని కావాలంటే అన్ని నువ్వే కోసుకో పో" అన్నాడు.
దాంతో వానికి ఆశ పుట్టి గబగబా టెంకాయచెట్టు దగ్గరికి పోయినాడు. అది ఒక పెద్ద బావి పక్కనే వుంది. నెమ్మదిగా చెట్టు ఎక్కసాగినాడు. టెంకాయ చెట్టు బాగా పొడుగ్గా, కొమ్మలు రెమ్మలు లేకుండా సక్కగా, నున్నగా వుంటాది గదా. దాంతో వాడు కొంచం దూరం ఎక్కి పట్టు తప్పి సర్రున జారి దభీమని బాయిలో పడినాడు. ఆ బాయికి మెట్లుగూడా లేవు. దాంతో వాడు లబోదిబోమని అరుస్తా వుంటే టెంకాయలోడు వచ్చి గమ్మున చూస్తా కూచున్నాడు.
వాడు వాన్ని చూసి “బాబూ! బాబూ! నన్ను కాపాడవా" అనరిచినాడు.
దానికి వాడు చిరునవ్వు నవ్వి “టెంకాయలయితే వూరికే ఇస్తాగానీ... ఎవరినీ ఊరికే కాపాడను. వందరూపాయలు ఇచ్చేటట్టయితే చెప్పు కాపాడుతా" అన్నాడు. వాడు చేసేదేమీ లేక ఆఖరికి "సరే" అన్నాడు. దాంతో వాడు తాడేసి వాన్ని పైకి లాగి వందరూపాయలు తీసుకున్నాడు.
రూపాయకు చూసుకుంటే ఆఖరికి వందరూపాయలు పోయిందే అని బాధపడతా వాడు మళ్ళా నడుచుకుంటా ఉత్త చేతులతో ఇంటికి చేరుకున్నాడు.
*********

No comments:

Post a Comment