Saturday, August 9, 2025

 *మహా సంయోగం*

ఈసారి ఆస్ట్రాలజీ ప్రకారం కొన్ని దశాబ్దాల తర్వాత ఈఏడాది రాఖీ పండుగ 2025 రోజున అరుదైన మహా సంయోగం ఏర్పడబోతుంది. 1930 తర్వాత ఈ ఏడాది 2025లో రాఖీ పండుగ రోజు ఏర్పడనుంది. వివరంగా చెప్పాలంటే 1930 ఏడాది ఎలాంటి యోగం అయితే ఉందో ఈ ఏడాది కూడా అలాంటి యోగమే ఏర్పడుతుంది. 
అలాగే.. ఈ ఏడాది రాఖీ పండగ రోజు ఇతర శుభ యోగాలు కూడా ఉన్నాయి.

*ఈ రాఖీపండుగ రోజున లక్ష్మీ నారాయణుడిని పూజించి రాఖీ కడితే శుభ ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.*

ఆగస్టు 9 రాఖీ పండుగ రోజున సౌభాగ్య యోగం ఏర్పడనుంది.
అనంతరం శోభన యోగం ఏర్పడుతుంది. 
అంతేకాకండా ఆగస్టు 9వ తేదీన ఉదయం 5:47 గంటల నుంచి మధ్యాహ్నం 2:23 గంటల వరకు సర్వార్థ సిద్ధి యోగం ఉంటుంది.

 మరోవైపు శ్రవణ నక్షత్రం  సైతం మధ్యాహ్నం 2:23 గంటల వరకు ఉంటుంది. 

ఇవన్నీ గమనిస్తే 95 ఏళ్ల తర్వాత రాఖీ పండుగ ఒకే తేదీ, ఒకే రోజు, ఒకే సమయం, ఒకే నక్షత్రం, ఒకే యోగాలు ఏర్పడటం గమనార్హం. కాబట్టి ఈ ఏడాది అత్యంత శుభ యోగాల్లో రాఖీ పండుగ 2025 నిర్వహించుకోనున్నారు. 

*ఇక రాఖీ కట్టడానికి ఆగస్టు 9వ తేదీ ఉదయం 5.21 నుంచి మధ్యాహ్నం 1.24 గంటల వరకు శుభ సమయం. ఈ సమయంలో రాఖీ కడితే శుభ ఫలితాలు ఉంటాయి.*

No comments:

Post a Comment