Sunday, August 10, 2025

 [8/6, 20:59] +91 79819 72004: *💎నేటి ఆణిముత్యం💎*

తామసిన్ త్రోలు చిరాగ్నినుండ నగ్నిపర్వతమేల? కన్ను
నలుసున్ దీయ చినుకుండ సాగరమేల? ఆడంబరముసేయు
కార్యము దుష్పలితమిచ్చు గదా.!!! నన్ పుట్టించినమ్మకు
నర్పితమ్ సుమా..!!!!
*భావం:-*
చీకటిగా ఉన్న ప్రదేశములో చిరు అగ్ని వేసిన వెలుగు ఇస్తుంది..
అగ్ని పర్వతం అవసరం లేదు కదా.. ! అలాగే కంటిలోని
నలుసు తీయడానికి చుక్క నీరు చాలు కాని సముద్రంలో ఉన్న
నీరు అంతా అవసరం లేదు కదా..! గొప్పలకు పోయి గోటితో
పోయే పనిని గొడ్డలితో చేస్తే చెడు ఫలితం ఇస్తుంది కదా..!
[8/6, 20:59] +91 79819 72004: *👬 నేటి చిన్నారి గీతం 👬*

*గాలి పటము*

ఎగిరింది ఎగిరింది
నా గాలి పటము
గాలిలో ఎగిరింది
నా గాలి పటము
పైపైకి ఎగిరింది
నా గాలి పటము
పల్టీలు కొట్టింది
నా గాలి పటము
రాజ్యాలు దాటింది
నా గాలి పటము
మబ్బులను తాకింది
నా గాలి పటము
పందెమే గెలిచింది
నా గాలి పటము
[8/6, 20:59] +91 79819 72004: *🗣నేటి జాతీయం🤔*


*కడుపులో చేయి పెట్టి కెలికి నట్టుంది*

మిక్కిలి కష్టపెట్టు. 

(నీమాటలు వింటుంటే నాకు కడుపులో చేయి పెట్టి కెలికి నట్టుంది.) 

అతి ఘోరమైన విషయాన్ని విన్నప్పుడు కలిగే మానసిక పరిస్థితిని తెలియ జేయడానికి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.
[8/6, 20:59] +91 79819 72004: *🤠 నేటి సామెత 🌸*


*ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు*

తాను సరిగా పాట పాడలేక, మద్దెలను బాగా వాయించలేదని నిందించాడు ఓ ఘనుడు. తన అసమర్ధతకు ఇతరులను నిందించే వాణ్ణి ఉద్దేశించి ఈ సామెతను వాడటం పరిపాటి. మద్దెల దరువుకు తగినట్టు నాట్యం చేయాలి. అందుకే అతడు మద్దెల వాయిస్తున్నాడు. ఆడే వాడు మద్దెల దరువుకు తగినట్టు ఆడడంలేదు. ఏమయ్యింది అలా ఆడు తున్నావంటే అతడు "నేను బాగానె ఆడుతున్నాను, నీ మద్దెలే ఓడు బోయి. సరిగా పలకడం లేదు" అన్నాడు. అనగా తన తప్పును కప్పి పుచ్చుకునేందుకు ఇతరులపై నెపం మోపేవారిని గురించి ఈ సామెత పుట్టింది. "ఆడ లేక మద్దెల ఓ డన్నట్టు"
[8/6, 20:59] +91 79819 72004: *✍🏼 నేటి కథ ✍🏼*

*కాపలాదారు నిజాయితీ* (ఒత్తులు లేని కథ)

*పునఃకథనం: డా॥ ఎం. హరికిషన్ - 9441032212*

ఒక ఊరిలో ఒక మామిడి తోట ఉంది. దానికి గోపాలు కాపలా
కాసేవాడు. అతను చాలా నిజాయితీ పరుడు.
ఒకసారి ఆ మామిడి తోట యజమాని తోట చూడడానికి
పోయాడు. తోట బాగా విరగకాసింది. అతను సంతోషంగా
గోపాలును పిలిచాడు. “మంచి తీయని మామిడిపండు ఒకటి
తీసుకొని రా” అని పంపాడు.
గోపాలు ఒక పండు తెంపి యజమాని ముందు ఉంచాడు.
యజమాని ఆ పండు రుచి చూసి మొహం వికారంగా ఉంచి
"ఈ పండు ఏమీ బాగాలేదు. పులుపుగా ఉంది. మరొకపండు
బాగా చూసి మంచిది తెంపుకొని రా” అని మరలా పంపాడు.
గోపాలు ఈసారి బాగా మాగిన ఇంకొక పండు తెంపి యజమాని
ముందు ఉంచాడు.
కానీ అది కూడా ఏమీ బాగాలేదు.
దాంతో యజమాని కోపంగా “ఈ తోటలో ఏ పండు తీయగా
ఉంటుందో, ఏ పండు పులుపుగా ఉంటుందో నీకు తెలియదా”
అని అరిచాడు.
దానికి గోపాలు వినయంగా “దొరా... నేను మీ తోటకు కాపలా
కాసే వాడినే గానీ... కాయలు తిని రుచి చూసే వాడిని కాదు. నేను
ఏ రోజూ ఈ తోటలో ఏ పండూ కోసుకొని తినలేదు. అందుకే ఏ
పండు తీయగుందో, ఏది లేదో నాకు తెలియదు" అని వివరించాడు.
గోపాలు నిజాయితీకి యజమాని సంతోషించాడు.
అతని జీతం రెండింతలు చేశాడు.
[8/6, 20:59] +91 79819 72004: *✅ తెలుసుకుందాం ✅*


*🛑నీళ్లలోని వస్తువుల బరువు తగ్గినట్టు అనిపిస్తుంది.ఎందువల్ల?*

🟢తాను నీళ్లలో మునిగినపుడు తన బరువు తగ్గినట్లనిపించడాన్ని బట్టి క్రీస్తు పూర్వం మూడో శతాబ్దపు గ్రీకు శాస్త్రవేత్త ఆర్కిమెడిస్‌ ఓ సూత్రాన్ని కనిపెట్టాడనే విషయం తెలిసిందే. ఏదైనా ఓ వస్తువు ఓ ద్రవంలో మునిగిందంటే అర్థం ఆ వస్తువుకున్న ఘనపరిమాణం మేరకు ఆ ద్రవ భాగాన్ని పైకి నెట్టి ఆ ద్రవంలో అది ఆక్రమించి నట్టేకదా! ఆ వస్తువు ఆ ద్రవంలో కరగకుండా కేవలం మునిగే ఉందంటే అర్థం ఏమిటంటే ఆ ద్రవానికి ఆ వస్తువును తనలో ఉంచుకోవడం అభిమతం కాదని, తనలోకి భూమ్యాకర్షణ ద్వారా చొచ్చుకుని వస్తున్న వస్తువును తన శక్తిమేరకు భూమ్యాకర్షణ దిశకు వ్యతిరేక దిశలో ఆ వస్తువును నెట్టివేసి తాను కోల్పోయిన తన ద్రవ భాగాన్ని తనలో నింపుకొవడానికి ప్రయత్నం చేస్తుంది.

ఈ బలాన్నే బయాన్సీ అంటాం. దీని పరిమాణం వస్తువు ఘన పరిమాణానికి సరిపడినంత ఘన పరిమాణం గల ఆ ద్రవపు బరువు ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. వస్తువు మీద భూమ్యాకర్షణ వల్ల కలిగే బలాన్నే బరువు అంటాం. ఇది భూమి వైపు ఉంటుంది. బయాన్సీ భూమికి వ్యతిరేక దిశలో ఉంటుంది. అంటే వస్తువు బరువు బయాన్సీ మేరకు తగ్గిపోతుంది. మరో మాటలో చెప్పాలంటే ఓ వస్తువు ద్రవంలో మునిగినపుడు ఆ వస్తువు ఘనపరిమాణం ఎంత ఉందో అంతే ఘనపరిమాణం గల ద్రవపు బరువు మేరకు బయాన్సీ ద్వారా తన బరువును కోల్పోతుంది. దీనినే 'ఆర్కిమెడిస్‌' సూత్రం అంటారు. ఆర్కిమెడిస్‌ సూత్రం నిత్య జీవితంలో మనకు చాలాసార్లు అవగతానికి వస్తుంది.

🇸 🇴 🇳 🇹 🇪 🇱 🇦 
🇩 🇭 🇦 🇳 🇺 🇯 🇦 🇾 🇦

No comments:

Post a Comment