*_స్థాయిని బట్టి...మర్యాదలిచ్చే వారున్నారు..అందాన్ని చూసి....ప్రశంసించేవారున్నారు..ప్రతిభను చూసి...గౌరవించేవారున్నారు..అవేం చూడకుండానే..విమర్శించే వారుకూడా ఉన్నారు.._*
*_ఈ పోటీ ప్రపంచంలో గౌరవాలను దరఖాస్తులతోను, విలువలను విలువ తక్కువ మాటలతోను..ఎవరికి తోచినట్టుగా వారు వాడేసుకుంటున్నారు..ఇవేమీ పట్టించుకోకుండా ముందడుగు వెయ్యు._*
*_నిరాశలోనే ఆశ..తిరస్కారంలోనే పరిష్కారం..ఓటమిలోనే పాఠం..నిర్లక్ష్యంలోనే లక్ష్యం..నిదానంలోనే సమాధానం ఎలా అయితే ఉందో..అలాగే నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది దానిని ఎలా మలుచుకుంటావో నీ ఆలోచనల్లో ఉంది.._*
*_కాబట్టి ఆలోచిస్తూ కూర్చోక ఆచరణ ప్రారంభించు ఏది చేసినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి అమలు చెయ్యు._*
*_ప్రతి రోజు మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి.నిజంగా నేనేమైనా మెరుగవుతున్నానా..? లేక ఎవరికో నాకు విలువ ఉందని నిరూపించుకునే ప్రయత్నంలో తీరిక లేకుండా ఉన్నానా..? అనే ప్రశ్న ప్రతి రోజు వేసుకోవాలి._*
*_మనలో చాలామందికి అభివృద్ధి అంటే ఇతరులకు చూపించడమే అనిపిస్తుంది.వాళ్లకి తెలుస్తేనే నా ప్రయోజనం అనే ఒక అసహజమైన ఆశ..కానీ,నిజంగా ఎదగడం అంటే అది కాదు.,మనం మెరుగవ్వడమే గానీ నిరూపించుకోవడం కోసం శ్రమించడం అవసరం లేదు.._*
*_ఎవరికో చూపించడం కంటే..మీ అభివృద్ధిని మీరే గుర్తించండి.అది ఎప్పటికైనా మీ మీద మీకే గర్వపడేలా చేస్తుంది.☝️_*
*_✍️మీ. తుకారాం జాదవ్. 🙏_*
No comments:
Post a Comment