ప్రేమ చాలా గొప్పది
మనం చూపే స్వచ్చమైన ప్రేమ పోయే ప్రాణాన్ని ఆపలేందేమో కానీ
తృప్తిగా పోయేలా చేయొచ్చు
*రవి రాజు ఇద్దరు స్నేహితులు* ఒకరి ఇళ్ల కు ఒకళ్ళు రాకపోకలు ఉండేవి.
రవి వాళ్ళ నాన్నకు మొక్కలంటే చాలా ఇష్టం ఇంటి ఆవరణలో చాలా మొక్కలు నాటి వాటితోనే సమయం గడిపేవారు.
హటాత్తుగా రవి నాన్న మరణించారు.
రాజు ఆ ఇంటికి వెళుతూ వస్తు ఉండేవాడు. ఆ ఇంటికి వెళ్ళగానే ఓ మందారం చెట్టు పై చూపు వెళ్లకుండా ఉండేది కాదు.
ఆ చెట్టు కొంచం కొంచంగా వాడిపోవడం గమనిజచాడు రాజు.
రవిని పిలిచి ఏంట్రా మొక్కలన్ని ఇలా వాడిపోతున్నాయి అని అడిగాడు.
ఏమో అర్థం కావటం లేదు రాజు నాన్న చనిపోయాక మొక్కలన్ని ఇలా వాడిపోతున్నాయి అన్నాడు.
చీడ పట్టుంటే మందు కొట్టడం లాంటివి ఎరువులు వేయడం వంటివి చేసావా అని అడిగితే
అన్నీ చేసాను చెట్ల పరామర్శకే ఓ మనిషిని పెట్టాను అని చెప్పాడు.
నాన్నకు మొక్కలంటే ప్రాణం ఆయన చాలా సమయం ఈ తోటలోనే గడిపేవారు.
ఒక్కోసారి ఈ మందారం చెట్టు దగ్గర చాలా సేపు నిలబడేవారు.
చూసే మాకు ఆయన ఒకవేళ మొక్కతో మాట్లాడుతున్నారా అని అనిపించేది.
ఈ మాటలు విన్న రాజు రవికి ఓ సలహా ఇచ్చాడు. ఆ సలహా పాటించిన తరువాత వాడిపోతున్న మొక్కలు మళ్లీ చిగురించడం మొదలుపెట్టాయి.
రాజుని రవి అడిగాడు ఈ విషయం నీకు ఎలా తట్టింది అని అడగగా.
ఎక్కడో చదివాను రా ఒక్కసారి ప్రాణంలేని వస్తువైనా ప్రాణం ఉన్న మొక్కలైనా కొందరితో మూగాప్రేమను పెంచుకుంటాయి.
అదే నీకు చెప్పాను అన్నాడు.
ఇంతకు రాజు రవితో ఏం చెప్పాడో మనము తెలుసుకుందాం
రవి రోజు కాసేపు వెళ్లి ఆ మందారం మొక్క ముందు నిల్చుకుని
నీకు నాన్నతో ఉన్న అనుబంధం నాకు అర్థం అయ్యింది.
ఇప్పుడు ఆయన లేరు మన మధ్య కానీ ఆయన ఇష్టపడే నువ్వు ఇలా వాడిపోతుంటే ఆయన బాధపడతారు.
ఆయన చిత్రపటం లోపల ఉన్నది.
ఆయనకు ఇష్టమైన నువ్వు మళ్లీ చిగురించి రోజుకో పువ్వును నువ్విస్తే ఆయన చిత్రపటం చెరొచ్చు అని చెప్పడం మొదలుపెట్టాడు
అంతే
ఆ మందారం మళ్లీ చిగురించడం మొదలు పెట్టింది.
నవ్వుతున్న ఆ చిత్రపటం పై నవ్వుతూ చేరిపోయింది...!!
No comments:
Post a Comment