Sunday, August 17, 2025

****ఇదే వివాహేతర సంబంధలకు అసలు కారణం.*

 *భర్త, పిల్లలు, మంచి ఇల్లు, డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. పైకి చూస్తే వారిది అంతా పర్‌ఫెక్ట్‌గా సెట్ అయిన లైఫ్. అయినా, 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసులో ఉన్న కొంతమంది మహిళలు  పురుషుడి వైపు ఆకర్షితులవుతున్నారు. ఎందుకంటే పైకి హ్యాపీగా ఉన్నా వారిలో ఏదో తెలియని ఒంటరితనం, పూడ్చలేని ఓ పెద్ద గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్‌ను ఫీల్ చేసుకోవడానికి వారు ప్రయత్నిస్తారు. ఎమోషనల్ కనెక్షన్ కోసం, కోల్పోయిన గుర్తింపు కోసం లోపల ఓ అన్వేషణ మొదలుపెడతారు. ఇదే వివాహేతర సంబంధలకు అసలు కారణం.*

*పెళ్లయిన కొత్తలో భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ, అన్యోన్యత, గంటల తరబడి సాగే కబుర్లు.. ఏళ్లు గడిచే కొద్దీ నెమ్మదిగా మాయమవుతాయి. లైఫ్ మొత్తం ఉద్యోగం, పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, బాధ్యతలతోనే నిండిపోతుంది. దీంతో భార్యాభర్తల మధ్య కన్వర్జేషన్లు కూడా ఏం కావాలి? పనైందా? అన్నట్లుగా అవసరం వరకే పరిమితమవుతాయి. సొంత ఇంట్లోనే తాము ఎవరికీ పట్టనట్టు, తమ ఫీలింగ్స్ ఎవరికీ అవసరం లేదన్నట్లుగా మహిళలు ఫీల్ అవ్వడం మొదలుపెడతారు.*

*సరిగ్గా ఇలాంటి టైమ్‌లో, బయట వ్యక్తి ఎవరైనా ప్రేమగా ఏమైంది ఓకేనా అని ఒక్క మాట అడిగితే చాలు, అది వాళ్ల మనసును టచ్ చేస్తుంది. తమను కూడా పట్టించుకునే వారు ఒకరున్నారనే ఫీలింగ్, వాళ్లలో ఎప్పుడో మిస్సైన ఎమోషన్స్‌ను మళ్లీ బయటకు తెస్తుంది.*

*పెళ్లి, మాతృత్వం తర్వాత చాలామంది మహిళల జీవితం మారిపోతుంది. ఆమె ఐడెంటిటీ మొత్తం 'భార్య', 'అమ్మ' అనే రోల్స్‌లోనే ఇరుక్కుపోతుంది. తనకంటూ ఉన్న ఇష్టాలు, కలలను కుటుంబం కోసం పక్కన పెట్టేస్తుంది. భర్త కూడా తనను కేవలం ఒక తల్లిగా ఇంటి బాధ్యతలు చూసుకునే వ్యక్తిగా మాత్రమే చూస్తున్నాడని అనిపించినప్పుడు, ఆమెలో అసంతృప్తి మొదలవుతుంది.*

*ఈ ఎఫెక్ట్‌తో తనను తానుగా గుర్తించే, మెచ్చుకునే ఒక వ్యక్తి కోసం ఆమె వెతకడం మొదలుపెడుతుంది. చాలా సందర్భాల్లో ఇలాంటి బంధాలు సెక్స్ కోసం కాదు.. "నన్ను కూడా ఒకరు చూశారు, నా విలువను గుర్తించారు" అనే సంతృప్తి కోసం మొదలవుతాయి.ముప్పైల మధ్యలో మహిళల హార్మోన్లలో, ఆలోచనల్లో చాలా మార్పులు వస్తాయి. ఈ వయసులో వారికి ఇంటిమసీ, ఎమోషనల్ సపోర్ట్, ఒకరితో ఒకరు డీప్‌గా కనెక్ట్ అవ్వాలనే కోరిక బలంగా ఉంటుంది. అయితే, భర్త ఉద్యోగ రీత్యా వేరే ఊర్లో ఉండటం వల్ల దగ్గరగా లేకపోయినా, లేదా పక్కనే ఉన్నా ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వకపోయినా, వారి అవసరాలు తీరవు. ఈ ఎమోషనల్ గ్యాప్‌ను ఎవరైనా బయట వ్యక్తి వచ్చి ఫిల్ చేస్తే, వారికి ఈజీగా అట్రాక్ట్ అవుతారు.*

*ఏ రిలేషన్‌షిప్‌నైనా ఇద్దరూ ఒకరిపై ఒకరు శ్రద్ధ పెట్టడం ఆపేస్తే, ఆ రిలేషన్‌షిప్‌లో ఉన్న స్పార్క్ పోతుంది. సరదాగా ఆటపట్టించుకోవడం, ప్రేమగా మాట్లాడటం, సర్‌ప్రైజ్‌లు ఇవ్వడం వంటివి ఆగిపోయి, లైఫ్ అంతా ఒకేలా, రొటీన్‌గా మారిపోతుంది.ఒకప్పుడు ఉన్న కిక్, ఎగ్జైట్‌మెంట్ పోయి అంతా చప్పగా అనిపిస్తుంది. ఈ దశలో కొందరు మహిళలు లైఫ్‌లో మళ్లీ ఆ థ్రిల్, ఆ ఎమోషనల్ వైబ్రేషన్‌ను కోరుకుంటారు. భర్తను వదిలేయాలని కాదు, కానీ ఆ మిస్సవుతున్న ఫీలింగ్‌ను బయట ఎక్కడైనా పొందాలని చూస్తారు. అలాంటి థ్రిల్ ఇచ్చే మగవాళ్లకు అట్రాక్ట్ అవుతారు.*

*పెళ్లి, పిల్లలు, కుటుంబ జీవితంలో బిజీ అయిన తర్వాత.. 30 ఏళ్ల వయసులో ఇంట్లో లభించాల్సిన గుర్తింపు, ప్రశంసలు ఆఫీస్‌లోనో, ఫ్రెండ్స్ సర్కిల్‌లోనో లభిస్తుంది. ఆఫీస్‌లో కొలీగ్స్ ఇచ్చే చిన్న కాంప్లిమెంట్, వాళ్లతో పంచుకునే జోకులు, సీరియస్ డిస్కషన్స్.ఇవన్నీ ఒక మహిళలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. పరవాలేదు, నాక్కూడా టాలెంట్ ఉంది, నన్ను మెచ్చుకునే వాళ్లున్నారు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ అటెన్షన్ క్రమంగా ఎమోషనల్ కనెక్షన్‌గా మారి, ఆ తర్వాత హద్దులు దాటే ప్రమాదం ఉంటుంది.*

*ఇలాంటి వ్యవహారాలు భార్యాభర్తల బంధంలో ఉన్న సమస్యలకు ఒక పెద్ద వార్నింగ్ సైన్. రిలేషన్‌షిప్ పూర్తిగా దెబ్బతినకముందే ఈ గ్యాప్‌ను సరిచేసుకోవడమే అసలైన పరిష్కారం. ఇదే జీవితం కాదు అని తెలుసుకోవాలి. అలానే పరాయి వాడు ఎప్పుడు మన వాడు కాదనే సత్యాన్ని కూడా గ్రహించాలి. రేపు ఏదైనా అయితే తనని దగ్గరుండి చూసుకోవాల్సింది తాళి కట్టిన భర్త మాత్రమే అని తెలుసుకోవాలి. మగాడు కూడా రేపు తనకు ఏదైనా అయితే అన్ని దగ్గరుండి చూసుకునేది తలొంచి తాళి కట్టించుకున్న తన భార్య మాత్రమే తనని, తన బిడ్డల్ని, తన పేరెంట్స్ ని మగాడిలా నడిపించేది తనొక్కత్తే తప్ప బయట ఆడది కాదు అని గుర్తించి. భార్య తో ప్రేమగా కాసేపు టైం స్పెండ్ చేయడం. మధ్యాహ్నం టైం లో ఎంత బిజీగా ఉన్నా సరే కాసేపు భార్య తో చాటింగ్ లేదా కాల్ మాట్లాడటం. ఇంటికి వచ్చాక తనతో కాసేపు కూర్చుని మాట్లాడటం. ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఫోన్ లో పడిపోకుండా ఉంటే చాలు జీవితాలు హ్యాపీగానే ఉంటాయి...*

No comments:

Post a Comment