*అగ్ని.....*
*అగ్ని పంచభూతాలలో ఒకటి. ఉష్ణమోచక రసాయనిక చర్య ద్వారా ఒక పదార్థం దహనం చెందుతూ వేడినీ, వెలుతురునీ, అనేక ఉత్పన్నాలను ఇచ్చే ఒక ఆక్సీకరణ చర్యని "అగ్ని" అంటారు. మంట అనేది "అగ్ని"లో కంటికి కనబడే భాగం. అంటె వెలుగులీనే గాలులే "మంట"లాగ కంటికి కనిపిస్తాయి. పదార్థ ధర్మాలను బట్టీ, మాలిన్యాల సాంద్రత తదితర విషయాలను బట్టి మంటకి రంగు, అగ్నికి తీవ్రత అని చెప్పవచ్చు.*
*మానవ జీవితంలో అగ్ని యొక్క స్థానం చాలా విశిష్టమైనది. మానవ చరిత్రలో నిప్పుని కనుగొనడం ఒక మలుపు. ఈ మలుపు మానవుణ్ణి జంతు సామ్రాజ్యపు రారాజుని చేసింది. ప్రకృతిపైన అధిపత్యానికి ప్రయత్నించేలా చేసింది. భారతదేశం, ప్రాచీన గ్రీసు వంటి బహు దేవతారాధక సమాజాలు "అగ్ని"ని దైవం అన్నాయి. అతి ప్రాచీనమని చెప్పబడుతున్న ఋగ్వేదం కూడా "అగ్ని మీళే పురోహితం" అంటూ ప్రారంభమౌతుంది.*
*పంచాగ్నులు.....*
*వివిధ కావ్యాలలోను,* *పురాణాలలోను చెప్పబడిన ఐదు అగ్నులును పంచాగ్నులు అని అంటారు. అగ్ని పురాణములో చెప్పబడిన అగ్నులు ఇవి...*
*1) బడబాగ్ని...*
*ఇది సముద్రంలో ఉంటుంది. బడబాగ్నినే బ్రహ్మాగ్ని అని కూడా అంటారు.*
*2) జఠరాగ్ని...*
*ఇది జీవుల ఉదరంలో ఉండి ఆహారమును జీర్ణింపచేస్తుంది.*
*3) కాష్టాగ్ని లేదా దావానలము...*
*ఇది ఎండు కఱ్ఱల రాపిడి వలన పుట్టి హోమములు మొదలగు వాని యందు ఉపయుక్త మగుచున్నది.*
*4) వజ్రాగ్ని...*
*ఇది ఇంద్రుని వజ్రాయుధంలో ఉంటుంది.*
*5) సూర్యాగ్ని...*
*ఇది ఆదిత్యుని యందు ఉంటుంది.*
*ఇంకా కొన్ని సందర్భాలలో ప్రస్తావింపబడే అగ్నులు...*
*ఆత్మలో రగిలే జ్ఞానాగ్ని*
*పాదాల్లో కాలాగ్ని*
*కడుపులో క్షుధాగ్ని*
*హృదయంలో శీతాగ్ని*
*నేత్రాల్లో క్రోధాగ్ని...*
*┈┉┅━❀꧁ హరే కృష్ణ ꧂❀━┅┉┈*
*SPIRITUAL SEEKERS*
🔥🌞🔥 🙏🕉️🙏 🔥🌞🔥
No comments:
Post a Comment