ఎందుకు మోక్షం మన జీవితం లక్ష్యం?|Freedom from Birth and Death – Know the Truth!
https://youtu.be/Uh6mxvXSKQ8?si=xzOtBCLQigKDE9M7
మన జీవితం ఒక అంతులేని ప్రయాణం పుట్టుక నుంచి చావు దాకా మళ్ళీ ఇంకో జన్మ అంటూ సాగే ఈ చక్రం ఎప్పటికీ తిరుగుతూనే ఉంటుంది. ఈ ప్రయాణానికి ఒక అంతం ఉందా? అసలు మనం ఎందుకు పుడుతున్నాం ఎందుకు చనిపోతున్నాం? మన ప్రయాణానికి చివరి గమ్యం ఏంటి? ఈ ప్రశ్నలు మనలో చాలా మందిని వేధిస్తూ ఉంటాయి కదా. ఈ ప్రశ్నలన్నింటికీ కేవలం ఒకటే సమాధానం. అదే మోక్షం. మోక్షం అనే పదం సంస్కృతం నుండి వచ్చింది. దీనికి అర్థం బంధనాల నుండి విడిపోవడం. కానీ ఇది మనం అనుకున్నట్లు కేవలం శరీరాన్ని వదిలేయడం కాదు ఇది అంతకు మించినది మనలో ఉండే కోరికలు మన ఆలోచనలు మన అహంకారాన్ని వీటన్నిటి బంధాల నుండి విముక్తి పొందడమే నిజమైన మోక్షం ఇది ఒక రకమైన స్వేచ్ఛ. మన సనాతన ధర్మంలో ఉపనిషత్తులు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇవి జ్ఞానానికి మూలం మోక్షం గురించి కాకుండా ఇవి ఎన్నో విషయాలను చెప్పాయి. మన ఇంద్రియాలు మన మనసు మన బుద్ధి ఇవన్నీ ఎప్పుడు ప్రశాంతంగా నిశ్చలంగా ఉంటాయో ఏ కోరికలు లేకుండా విశ్రాంతి పొందుతాయో అదే మోక్షం అని అంటారు. అంటే బయటి విషయాలపై పరుగులు తీసే మన మనసు అదుపులో ఉంచుకోవడమే మోక్షానికి మొదటి మెట్టు జ్ఞానాన్ని సంపాదించిన మనిషి మృత్యువును దాటి పరమాత్మలో విలీనమం అవుతాడు. ఎంత లోతైన అర్థం ఉంది కదా మన లక్ష్యం చావును దాటడమే కానీ చావుకు భయపడటం కాదు. ఉపనిషత్తుల జ్ఞానాన్ని సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా పురాణాలు కథల రూపంలో వివరించాయి. మోక్షం గురించి పురాణాలు ఏం చెప్పాయో చూద్దాం. భాగవత పురాణం భక్తి ద్వారా మోక్షం ఎలా సాధ్యమో ఎంతో నమ్మకంగా చెప్పింది. విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడిని నిరంతరం ధ్యానిస్తూ ప్రేమతో జీవించేవాడు చివరికి శరీరం వదిలి పెట్టిన తర్వాత శ్రీహరిలోనే విలీనం అవుతాడని భాగవతం చెబుతుంది. అంటే పరమాత్మ పట్ల అంచంచలమైన ప్రేమ శరణాగతి మోక్షానికి దారి తీస్తాయని అర్థం. గరుడ పురాణం మోక్షం గురించి మరింత స్పష్టంగా వివరిస్తుంది. పుణ్యకార్యాలు చేసినవారు పాపాల నుండి విముక్తి పొందిన వారు వైకుంఠం లేదా కైలాసం వంటి పుణ్య లోకాలకు వెళ్తారని గరుడ పురాణం చెబుతుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ లోకాలు తాత్కాలికమైన స్వర్గాలు మాత్రమే. అక్కడ పుణ్యం చేసినంత కాలం ఉండి పుణ్యఫలం అయిపోగానే తిరిగి భూమిపై జన్మ తీసుకోవాల్సి వస్తుంది. నిజమైన మోక్షం అంటే ఈ స్వర్గ లోకాలను కూడా దాటి మళ్ళీ జన్మ తీసుకోకుండా పరబ్రహ్మంతో ఏకం అవ్వడమే. ఇది చాలా లోతైన ఆలోచన కదా ఇప్పుడు మోక్షం పొందడానికి మన ధర్మంలో నాలుగు ప్రధాన మార్గాలు చెప్పబడ్డాయి. ఇవి ఒకదానికి ఒకటి భిన్నంగా అనిపించిన అన్నిటి అంతిమ లక్ష్యం ఒకటే. అదే మోక్షం. మొదటిగా జ్ఞానయోగం. జ్ఞానం ద్వారానే విముక్తి అని చెప్పబడింది. రెండవది భక్తి యోగం. భగవంతుడి పట్ల ప్రేమ ద్వారానే మోక్షం లభిస్తుంది. మూడవది కర్మయోగం. ఫలితం ఆశించకుండా మన పనులు మనం చేసుకోవడమే కర్మయోగం. నాలుగవది ధ్యాన యోగం మనసును ఆత్మలో లీనం చేయడం ఇదే ధ్యాన యోగం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ఇది భక్తి యోగానికి పరాకాష్ట అంటే అన్ని ధర్మాలను వదిలిపెట్టి నన్నే శరణు పొందు భగవంతుడి పట్ల పూర్తి శరణాగతి అదే మోక్షానికి మూలం. ఇక్కడ ధర్మాలు అంటే బాధ్యతలు లేదా కర్మలు అని అర్థం కాదు. నేను మాత్రమే శరణు పొందేందుకు అర్హుడను అని భగవంతుడు అంటాడు. చాలా మందికి స్వర్గం అంటేనే మోక్షం అని ఒక అపోహ ఉంటుంది. కానీ ఈ రెండు వేరు వేరు. స్వర్గం అనేది మనం చేసిన పుణ్యకర్మల ఫలితంగా లభించే ఒక తాత్కాలిక లోకం. మనం ఎంత పుణ్యం చేసుకుంటే అంతకాలం అక్కడ సుఖాలను అనుభవిస్తాం. పుణ్యఫలం అయిపోగానే తిరిగి భూమిపై జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఒక హోటల్లో బస చేసినట్లు గడువు ముగియగానే బయలుదేరాలి. మోక్షం అంటే పునర్జన్మ చక్రం నుండి పూర్తిగా విముక్తి పొందడం. ఇది తిరిగి జన్మ అనే బాధ లేకుండా నిత్య సత్యమైన పరబ్రహ్మంతో ఏకమవడం ఇది శాశ్వతమైన స్థితి అంతం లేని ఆనందం మోక్షం అనేది ఏదో పెద్ద యజ్ఞాలు యాగాలు చేస్తేనే వచ్చేది కాదు మన దయనిందిన జీవితంలో కొన్ని పద్ధతులను అనుసరించడం ద్వారా కూడా మోక్షానికి మార్గం సుగమం చేసుకోవచ్చు. నిత్యం ఆత్మజ్ఞానం మీద ధ్యానం చేయడం మనం ఎవరు? మన ఉద్దేశం ఏంటి? అని నిరంతరం మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఆత్మ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇంద్రియ నిగ్రహం వాసనలపై నియంత్రణ మన కళ్ళు, చెవులు నాలుక వంటి ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. అనవసరమైన కోరికలు మనసులో పెంచుకోకూడదు. ఆహార శుద్ధి మనం తినే ఆహారం మన మనసుపై ప్రభావం చూపుతుంది. సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా శుద్ధంగా ఉంటుంది. మంచివారితో స్నేహం చేయడం సజ్జనులతో కలవడం. జ్ఞానవంతులైన గురువుల మార్గదర్శకత్వంలో నడవడం మోక్ష సాధనకు ఎంతగానో తోడుపడుతుంది. అహంకారాన్ని పూర్తిగా వదిలేయండి. నేను నాది అనే భావనను వదిలేయడం వల్ల మనసు తేలిక పడుతుంది. ఇది మోక్ష సాధనకు అత్యంత ముఖ్యమైన మెట్టు. ఎప్పుడైతే ఒక వ్యక్తికి ముక్తి లభిస్తుందో అప్పటికీ అతనిలో ఒక స్పష్టత వస్తుంది. నేను ఈ శరీరం కాదు నేను ఈ మనసు కాదు నేను కేవలం ఆత్మను అని. ఈ స్థితిలో అతని బాధలు, ఆశలు, కోపం, భయం ఇవన్నీ అంతరించిపోతాయి. ఎందుకంటే ఇవి శరీరానికి మనసుకు సంబంధించినవి కానీ ఆత్మకు కావు. ఆ విధంగా మోక్షం అంటే నిరంతర ఆనంద స్థితి. ఇది బయట పరిస్థితులపై ఆధారపడని శాశ్వతమైన సంతోషం. మోక్షం అనేది ఎక్కడో దూరంగా అందుబాటులో లేనిది కాదు ఇది మనలోనే ఉంది. మన మనసుని బయట విషయాలపై పరుగులు తీయకుండా లోపలికి మన ఆత్మ వైపు మల్లించినప్పుడే ఆ మోక్ష ద్వారం తెరుచుకుంటుంది. ఆత్మను తెలుసుకున్న వాడికి మళ్ళీ జన్మ అనేది ఉండదు. ఇది భయం కాదు, మన ప్రయాణానికి ఒక గొప్ప గమ్యం. ఇది చావు కాదు, ఇది నిజమైన చైతన్యం. సో ఫ్రెండ్స్ మీరు నిజమైన మోక్షాన్ని పొందాలనుకుంటే బయట ఎక్కడా వెతకకండి. మీలోనికే ఒక అడుగు వేయండి. మీ ఆత్మజ్ఞానంతో మౌనంగా నిర్మలంగా జీవించండి. మీ జీవిత గమ్యం మీలోనే ఉంది. ఇది కేవలం ఏదో ఒక మతానికి సంబంధించిన పాఠం కాదు. ఇది మానవజాతి మొత్తానికి మన ఆత్మకు సంబంధించిన అంతిమ గమ్యం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు
No comments:
Post a Comment