Sunday, August 17, 2025




 🙏🏻 *రమణోదయం* 🙏🏻

*పరమోత్కృష్ట ఫలదాయకమైనది ఆత్మవిచారణ ఒకటే. అది తప్ప మనస్సణగటానికి తగిన సాధనలు వేరే లేవు. ఇతర సాధనాలవల్ల మనస్సు అణగినట్లే అణగి మళ్ళీ విజృంభిస్తుంది.*

శాశ్వతమైన నిధి(దేవుడు) కోసం
ఎవ్వరూ ప్రయత్నం  చేయరు.
వెంటరాని వాటి కోసం జీవితమంతా
ఆరాటపడి, పోరాడి మరణిస్తారు.

తానే అన్నింటికీ ప్రకాశం.
తానే అన్నింటికీ ఉనికి.
తాను వెదికేది తననే అని తెలిస్తే
అది మోక్షం.

కనుచూపు పారినంతమేరకే
ప్రపంచం ఉన్నది.
ఆవల,ఈవల ప్రపంచం లేదు.
ఆవల,ఈవల  ఉన్నది దైవమే!

అరుణాచల శివ.. 
అరుణాచల శివ..
అరుణాచల శివ..
అరుణాచలా!🌹

🌹🙏🏻ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🏻🌹 

*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.756)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి 
🪷🪷🦚🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*
                 
🪷🙏🏻🪷🙏🏻🪷

No comments:

Post a Comment