🙏🏻 *రమణోదయం* 🙏🏻
*దృష్టి రూపంగా వెలికిపోయే మనోవృత్తులను అణచటానికి అత్యంత శ్రేష్టమైన మార్గమేమంటే, మనస్సుని లోపలికి త్రిప్పి నిలిపే "ఆత్మ విచారణ" ఒక్కటే. "మోక్షం అనేది శరీరంలో కాదు; మనం శరీరం కాదని గ్రహించినపుడే మోక్షం కలుగుతుంది."*
నీవు చూచే ప్రతి దృశ్యం కింద,
నీవు తలచే ప్రతి తలంపు కింద,
నీవు పొందే ప్రతి అనుభవం కింద
"భగవదిచ్చ" అనే పదం చేర్చు
ఇక ఏ ఘర్షణకూ తావుండదు!
ఆత్మనే నీ నిజతత్వం..
చావు పుట్టుకలకు అతీతమైనది...
ఆత్మకు పుట్టుకే లేదు...చావూ లేదు...
అస్సలు పుట్టనే లేదు..అది అనంతం..
దీన్ని తెలుసుకోవడానికి నీవు ఎక్కడికెళ్లాలి చెప్పు.
ధ్యానం చెయ్యాలంతే..ఎక్కడికి వెళ్లనక్కర లేదు..
నీ హృదయమే మాద్యమం..నీ అంతరాత్మే
ఆనందానికి మూలం...ఆనందం కోసం బయట
ఎక్కడా వెదకాల్సిన అవసరమే లేదు..
అది ఒక మనిషిలో ఉండదు...స్థలంలో ఉండదు..
విషయాల్లో ఉండదు...వస్తువుల్లో ఉండదు,
నీ విజయంలో కూడా ఉండదు...
నీ ఆత్మలోనే ఉంటుంది అసలైన ప్రశాంతత,ఆనందం!
ఉండు...అంతే.
నరుడుగానూ ఉండొద్దు.
హరుడుగానూ ఉండొద్దు.
జడంగానూ ఉండొద్దు.
చైతన్యంగానూ ఉండొద్దు.
నీవు నీవుగా ఉండు.
"ఉండూ" అంతే!
🌹🙏🏻సద్గురు రమణా...
శరణం శరణం శరణం🙏🏻🌹
అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ..
అరుణాచలా!🌹🙏🏻
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.758)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*స్మరణ మాత్రముననె
పరముక్తి ఫలద* |
*కరుణామృత జలధి యరుణాచలమిది*||
🪷🙏🏻🪷🙏🏻🪷
No comments:
Post a Comment