🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹*2026-న్యూ ఇయర్ రెజల్యూషన్*
*1)లక్ష్య సాధన*
*ప్రతి ఒక్కరికీ ఓ లక్ష్యం ఉండాలి.లక్ష్యంలేని జీవితం వృధానే.మన జీవితంలో ఏదైనా సాధించాలి అనే లక్ష్యం ఉంటే మనం అందుకోసం కసిగా పనిచేస్తాం.అలా కాకుండా అయ్యేదేదో అవుతుందిలే అనుకుంటే విలువైన సమయాన్ని వృధా చేసుకున్నట్లవుతాం. ఉద్యోగం పొందడం,ఓ కోర్సు పూర్తి చేయడం,అధిక బరువును తగ్గడం ఇలా ఏదైనా ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకోండి.దాన్ని చేధించి విజేతగా నిలవండి.*
*2)మొక్కల పెంపకం*
*ఒకప్పుడు మన పెద్దలంతా ప్రకృతితో మమేకం అయి ప్రకృతి ఒడిలో పెరిగారు. కానీ ఇప్పటితరం కాంక్రీట్ జంగల్ మధ్య పెరుగుతోంది.కాలుష్యం కోరల మధ్య జీవిస్తోంది.అలా కాకుండా కాస్త సమయం తీసుకుని మొక్కలను పెంచడాన్ని రెజల్యూషన్‌గా తీసుకుంటే మనమూ ప్రకృతికి దగ్గర కావచ్చు.మొక్కలతో మన ఇంటిని అందంగా మార్చుకోవడంతో పాటు మనకెంతో ఇస్తున్న ప్రకృతికి మనం కొంత రుణం తీర్చుకున్నవారిగా మారవచ్చు.*
*3)ప్రయాణాలు*
*జీవితంలో కలిసే కొత్త వ్యక్తులు, చేసే కొత్త ప్రయాణాలు మనకు అనుభూతులతో పాటు ఎన్నో అనుభవాలను మిగులుస్తాయి. మీకు వీలు చిక్కినప్పుడల్లా ఏవైనా కొత్త ప్రదేశాలకు పర్యటనలు చేసేలా ప్లాన్ చేసుకోండి.ఈ టూర్లు పుణ్యక్షేత్రాలైనా కావచ్చు ప్రకృతి నెలవైన ప్రదేశాలైనా ఉండొచ్చు. ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేయండి జీవితంలో కొత్త రోజులను,ఎన్నో అనుభవాలను సొంతం చేసుకుంటారు.*
*4)ఆటలు*
*డిజిటల్ యుగంగా మారిపోయిన ప్రస్తుత ప్రపంచంలో ఆటలకు చాలామంది దూరం అవుతున్నారు.సమయం లేక, ఆడే తోడు లేక సహా ఇతర కారణాలతో ఆటలకు దూరం అవుతున్నాం.కానీ ఆటలు మన శారీరక సామర్థ్యాన్ని పెంచడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కల్గిస్తాయి.నూతన సంవత్సరంలో ఆటలను రెజల్యూషన్‌గా తీసుకోండి.బ్యాడ్మింటన్,టెన్నిస్, క్రికెట్, కబడ్డీ.. ఇలా ఏ ఆటనైనా ఎంచుకుని ఆడటం ప్రారంభించండి.ఆటను ఆస్వాదించండి.*
*5)జంక్‌ఫుడ్*
*ఈ కాలంలో జంక్ ఫుడ్ తినడం అందరికీ సాధారణం అయిపోయింది.కానీ మారిన జీవనశైలితో ఈ ఆహారం తీసుకుంటే శరీరంలో అనవసరంగా క్యాలరీలు పెరుగుతాయి.అంతేకాకుండా జంక్‌ఫుడ్‌లో వాడే మైదా,ఇతర రసాయనాలు ఆరోగ్యానికి హాని కల్గిస్తాయి.కాబట్టి ఈ న్యూఇయర్ సందర్భంగా జంక్‌ఫుడ్ మానేయాలని రెజల్యూషన్ తీసుకోండి.మీలో ఆరోగ్యకర మార్పును గమనించడంతో పాటు డబ్బును కూడా ఆదా చేసుకుంటారు.*
*6)కొత్త కోర్సులు*
*నిత్య విద్యార్థిగా ఉన్నప్పుడే మన జ్ఞానం పెరుగుతుంది. ప్రస్తుతం చాలా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కోర్సులను నేర్చుకుని మీ స్కిల్స్ పెంచుకోండి.ఉద్యోగులు,విద్యార్థులు,నిరుద్యోగులు, గృహిణులు.. ఇలా మీరు ఎవరైనా సరే స్కిల్స్ పెంచుకోవడాన్ని రెజల్యూషన్‌గా తీసుకుని ఎప్పుడూ ఏదో కొత్త విషయం తెలుసుకోండి.కొత్త భాష నేర్చుకోవడం కూడా మన స్కిల్స్ అప్‌డేట్ చేసుకోవడం కిందకు వస్తుంది.*
*7)అదుపు-పొదుపు*
*ఖర్చులను అదుపు చేసుకుంటే చాలు మనం ఎక్కువగా సంపాదించినట్లే.మనం ఆర్జించే డబ్బులో కొన్ని అనవసర ఖర్చులుంటాయి.ఇవాళ అనవసరంగా కొన్న వస్తువును రేపు అవసరంలో అమ్ముకోవాల్సి వస్తుంది అనేది ఆర్థిక నిపుణుల మాట.అందుకే మనం ఖర్చులను అదుపు చేసుకుని డబ్బును పొదుపు చేసుకుంటే జాగ్రత్తగా జీవించవచ్చని తెలుసుకోవాలి.ఈ న్యూఇయర్ సందర్భంగా ఖర్చులను అదుపు చేయడం లేదా డబ్బు పొదుపును రెజల్యూషన్‌గా తీసుకోండి.*
*8)దురలవాట్లకు దూరం*
*మనలో చాలామందికి సిగరెట్,మద్యం తాగే అలవాటు ఉంటుంది.ఇవి మన ఆరోగ్యాన్ని పాడు చేయడంతో పాటు మనవారికి నష్టాన్ని మిగులుస్తాయి.మనం కాల్చే సిగరెట్ మనతో పాటు మనచుట్టూ ఉన్నవారినీ దహించివేస్తోంది.కాబట్టి ఈ న్యూయర్ సందర్భంగా సిగరెట్, ఆల్కహాల్ వంటి దురలవాట్లకు దూరంగా ఉండండి.కేవలం ఇవే కాదు మీకు మరే దురలవాట్లున్నా వాటికి దూరంగా ఉండి కొత్త మార్పుకు నాంది పలకండి.*
*9)బుక్ రీడింగ్*
*ఓ పుస్తకం మంచి మిత్రునితో సమానం అని చెబుతారు.కానీ డిజిటల్ యుగంలో మనం పుస్తకాలు చదవడం మానేశాం.కానీ వచ్చే ఏడాది పుస్తకాలు చదవడాన్ని ఓ రెజల్యూషన్‌గా తీసుకోండి.పుస్తకాలు మీకు ఎన్నో కొత్త విషయాలు చెబుతాయి. అంతేకాకుండా మీలో పరిపక్వతకు ఇవి దోహదం చేస్తాయి.పది మందిలో మీరు ఏదైనా మాట్లాడాలంటే అవసరమైన జ్ఞానాన్ని పుస్తక నేస్తాలు అందిస్తాయి.కథలు,నావెల్స్ లాంటి ఏ తరహా పుస్తకమైనా చదవడం మొదలుపెట్టండి.*
*10)ఆరోగ్యం*
*ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు.అలాంటి ఆరోగ్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం.ఆరోగ్యంగా ఉంటేనే ఏమైనా చేయగలం అనేది మరిచి ప్రవర్తిస్తున్నాం.కానీ ఈ నూతన సంవత్సర వేళ.. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలనేది రెజల్యూషన్‌గా తీసుకోండి.రోజూ అరగంట నడవడం లేదా వ్యాయామం చేయడం,యోగా,ధ్యానం,జిమ్.. ఇలా ఏ రూపంలో అయినా ఒళ్లు వంచండి,చెమటోడ్చండి.దీంతో శారీరకంగా ఆరోగ్యంగా ఉండటంతో పాటు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు.*
*ఆల్ ద బెస్ట్.హ్యాపీ న్యూ ఇయర్.*🍏🍎🍐🍊🍋🍋🟩🍌🍉🍇🍓🫐🍈🍒🍑🥭🍍🥝🍅🍆🥑🫛🥦🥬🥒🌶️🫑🌽🥕🫒🧄🧅🥔🍠🫚🥐🕉️☪️✝️
No comments:
Post a Comment