Friday, January 2, 2026

ప్రకృతి శక్తితో మీ ఆత్మను అనుసంధానం చేయండి | Connect with Nature Power | SwamiAatma

ప్రకృతి శక్తితో మీ ఆత్మను అనుసంధానం చేయండి | Connect with Nature Power | SwamiAatma

https://youtu.be/EWJXJpRm6qo?si=QaHk16-V6Lh3gAlE


https://www.youtube.com/watch?v=EWJXJpRm6qo

Transcript:
(00:07) నీ మనసు ప్రశాంతతను కోరుకుంటుందా అయితే నీకు ధ్యానం అవసరం. ధ్యానం నిన్ను నీకు పరిచయం చేస్తుంది. ధ్యానం నిన్ను ఈ ప్రపంచం నుండి వేరు చేస్తుంది. నీలో ఒక ప్రపంచం ఉంది. మర్చిపోవద్దు. ఆ ప్రపంచాన్ని నువ్వు తెలుసుకోవాలనుకుంటే ధ్యానం చేయాలి. నిన్ను నువ్వు తెలుసుకోవాలి [సంగీతం] అంటే ధ్యానం ఏకైక మార్గం ధ్యానం లేని జీవితం ఎంతో అలజడితో కూడుకొని ఉంటుంది.
(00:46) ధ్యానం వల్ల మాత్రమే ఆ అలజడి తొలగి నీలో ఉన్న ప్రశాంతత నీలో ఉన్న దైవత్వాన్ని నువ్వు అనుభూతి పొందగలుగుతావు. ఆ దైవం పైన ధ్యాస అంటే నీలో ఉన్న దైవం పైన ధ్యాసే ధ్యానం ఆ దైవం వేరేదో కాదు అదే నీ స్వరూపం అదే నీ నిర్మలమైన స్థితి ఆ స్థితిని పొందటానికే ధ్యానం ఆ ధ్యానం ప్రతిరోజు నువ్వు చేయగలిగితే ఆ ప్రశాంతత నీ నుంచి ఎప్పుడే గాని దూరమవుతుంది. ఆ ఆనందం ఎప్పుడూ నీతోనే ఉండాలి అని అనుకుంటే ధ్యానం చెయ్ నువ్వు చైతన్య స్వరూపుడవే అర్థం చేసుకో ధ్యానం వల్ల మాత్రమే నీ చైతన్య స్వరూపాన్ని నువ్వు దర్శించగలుగుతావు ధ్యానం లేని జీవితం ఎంతో అలజడితో కూడుకొని ఉంటుంది.
(01:47) ధ్యానం కలిగిన జీవితం నీకు ఎంతో ప్రశాంతతను కలుగజేస్తుంది. ఈ ప్రకృతిలోని శక్తిని తెలుసుకో ఈ ప్రకృతిలోని శక్తిని తెలుసుకొని మసలుకో అందుకోసమే ధ్యానం చెయ్ నువ్వు యోగివైతే ధ్యానం చెయ్ నువ్వు ధ్యానం చేస్తేనే నువ్వు ఎవరో నీకు తెలుస్తుంది. నీలో ఏముందో తెలుస్తుంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో తెలుస్తుంది.
(02:16) నువ్వు ఎక్కడికి పోతావో ఇక్కడి నుంచి తెలుస్తుంది. కాబట్టి ధ్యానం చేయ ధ్యానము లేని జీవితము వ్యర్థము వ్యర్థము వ్యర్థము ధ్యానముతో జీవితము హాయి హాయి హాయి ధ్యానమే ధ్యేయంగా నువ్వు చేయగలిగితే ఆ ధ్యానమే నువ్వు ఎవరో నీకు తెలియజెప్తుంది. ఆ ధ్యానంలో లభించే ప్రశాంతత మాటల్లో మనం చెప్పలేము. అటువంటి ప్రశాంతమైన స్థితి మనలో పెట్టుకొని మనం బయట ఎక్కడెక్కడికో పోతాం ఏవేవో కావాలంటాం అక్కడికి తిరుగుతాం ఇక్కడికి తిరుగుతాం ఇవన్నీ జుట మాయ జగత్తంతా మాయ ఈ పంచేంద్రియములతో నువ్వు ఏదైతే చూస్తున్నావో ఇదంతా మాయ మాయ మాయ గుర్తుపెట్టుకో ఈ పంచేంద్రియములను నియంత్రించుకొని
(03:11) ఈ పంచేంద్రియములకు సెలవు లవ చెప్పి ఈ పంచేంద్రియముల అన్నిటిని నువ్వు నీ స్వాధీనములోకి తెచ్చుకోవాలని అంటే ధ్యానం చేయాలి. నీ భార్య పిల్లలు కానియండి నీ స్నేహితులు కానియండి ఏదైనా సరే అంతా కర్మ విధితమే అంతా కర్మ వలనే కర్మ ఉంది కాబట్టే ఇవన్నీ నీ చుట్టూ జరుగుతా ఉన్నాయి ఇవన్నీ నువ్వు చూస్తా ఉన్నావు వీటన్నిటిని నీ పంచేంద్రియముల ద్వారా నువ్వు తెలుసుకోగలుగుతున్నావు దీనన్నిటికీ వెనక ఉన్నది కర్మ మాత్రమే తెలుసుకో ఇవన్నీ కర్మానుశాస్త్రంగా వస్తా పోతా ఉండే ఉంటాయి ఏదైతే వస్తుందో అది పోక తప్పదు అదే కర్మ కర్మ వస్తుంది పోతుంది.
(03:59) కర్మ నీ జీవితంలోకి కొన్ని విషయాలని తీసుకొని వస్తుంది అలాగే తీసుకొని వెళ్ళిపోతుంది. ఈ జగత్తులో నువ్వు అనుభవిస్తున్న ప్రతిది మాయ అనుకుంటే ఆ మాయకు కారణభూతమైనదే కర్మ. కర్మ నీ శరీరాన్ని నీకు ఇచ్చింది. ఈ కర్మ ఇక్కడి నుండి ఈ శరీరాన్ని వదిలేసి ఆ కర్మ నీ ఆత్మతో పాటు వెళ్ళిపోతుంది. భగవత్ స్వరూపాన్ని నీలోనే తెలుసుకో అది నీలోనే ఉంది.
(04:33) నువ్వు నాకు ఇది కావాలి అంటే అది నీ జీవితంలోకి వస్తుంది. అది నీ జీవితంలోకి రావాలంటే నువ్వు ధ్యానం చేయాలి. నువ్వు ధ్యానం చేయకుండా నాకు అది కావాలి నాకు ఇది కావాలి అంటే ఎలా వస్తుంది రాదు ఆ చైతన్య స్థితిలో నువ్వు ఈ ప్రకృతిలో ఉన్న పంచభూతాల యొక్క శక్తితో నువ్వు ఎప్పుడైతే ఒకటిగా మారిపోతావో అప్పుడు ఈ ప్రకృతి నీకు కావలసిన దాన్ని నీ జీవితంలోకి తీసుకొని వస్తుంది గుర్తుపెట్టుకో ఈ పంచభూతముల శక్తితో నువ్వు ఒకటి అయిపోవాలి ఈ అనుసంధానము చైతన్య స్థితిలో జరగాలి ఈ అనుసంధానము ప్రకృతిలో ఉన్న శక్తులతో ఎప్పుడైతే నీ ఆత్మశక్తి ఒకటిగా మారిపోతుందో అప్పుడు నీకు కావలసినది ఏదైనా
(05:19) నీ జీవితంలోకి వస్తుంది గుర్తుపెట్టుకో

No comments:

Post a Comment