Thursday, January 1, 2026

భారతీయులలో పెరుగుతున్న పొట్ట సమస్య Why millions of Indians have bloated stomach #facts #telugufacts

భారతీయులలో పెరుగుతున్న పొట్ట సమస్య Why millions of Indians have bloated stomach #facts #telugufacts

https://youtu.be/aAHKw9819W4?si=v9H03vt3RtZJvtj4


https://www.youtube.com/watch?v=aAHKw9819W4

Transcript:
(00:00) మీకు కూడా పొట్ట ఉందా సిక్స్ ప్యాక్ నుంచి ఫ్యామిలీ ప్యాక్ అయిపోయిందా బాడీ స్లిమ్ గా ఉన్న పొట్ట మాత్రం బయటికి వచ్చేస్తుందా ఇప్పుడు లక్షలాది మంది భారతీయులను వేధిస్తున్న సమస్య ఇదే ఈ సమస్య గురించి ఇటీవల కాలంలో ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ అనే న్యూస్ పేపర్ లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఈ వీడియోలో ఆ ఆర్టికల్ లో ఉన్న ఫాక్ట్స్ గురించి వివరిస్తాను.
(00:25) ఈ వీడియో కేవలం ఆ ఆర్టికల్ లో ఉన్న ఫాక్ట్స్ ఇన్ఫర్మేషన్ గురించి మాత్రమే కానీ ఇది వైద్య సలహ మాత్రం కాదు దయచేసి గమనించగలరు. హలో ఫ్రెండ్స్ మీకు కూడా పొట్ట వచ్చేసిందా భారతీయుల్లో ఒకప్పుడు అరుదుగా కనిపించే పొట్ట ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా దాదాపు అందరిలో కనిపిస్తుంది. పొట్ట అంటే ఎలుక పొట్టల లావుగా కాకపోయినా మన భారతీయుల పొట్ట రౌండ్ గా ఉబ్బినట్టు కనిపిస్తుంది.
(00:52) అయితే ఇది కేవలం బరువు పెరగడం వల్ల అంటే పొరపాటే అమెరికాకు చెందిన ప్రఖ్యాత హెల్త్ ఎక్స్పర్ట్ డాక్టర్ ఎరిక్ బర్గ్ చెప్పిన అసలు కారణం వింటే మీరు షాక్ అవుతారు? ఈ వీడియోలో ఎందుకు భారతీయులకు పొట్ట ఉబ్బుతుంది? ఎందుకు స్లిమ్ గా ఉన్నవారికి కూడా పొట్ట బయటకు కనిపిస్తుంది? డాక్టర్ ఎరిక్బర్గ్ చెప్పిన అసలు సైంటిఫిక్ కారణాలు ఏంటి? మనం ఈ సమస్యను ఎలా అధిగమించొచ్చు? ఇవన్నీ పూర్తి వివరాలతో చూద్దాం.
(01:25) వీడియోను పూర్తిగా చూడండి. ఇది మనం ఆరోగ్యంగా ఉండటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అసలు భారతీయుల్లో పొట్ట పెరగడం ఊబకాయం ఒక్కసారిగా ఎందుకు పెరిగిపోయింది? ఇటీవల కాలంలో భారతదేశంలో ఆఫీస్ లో ఎక్కువసేపు కూర్చొని పని చేసే పనులు ఎక్కువైపోయాయి. ఇష్టం వచ్చినట్టు రాత్రులు లేట్ గా తినడం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వీటివల్ల పొట్ట ఉబ్బటం గ్యాస్ హెవీనెస్ ఇలాంటి సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయి.
(02:18) కాబట్టి పొట్ట బయటికి రావడం ఇప్పుడు అందరి సమస్య. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది కేవలం ఫ్యాట్ వల్ల కాదు. డాక్టర్ ఎరిక్ బర్గ్ చెప్పిన షాకింగ్ నిజం ఏంటంటే మన భారతీయులు మాంసాహారం తక్కువ తీసుకొని ధాన్యాలు పప్పులు అధిక ఫైబర్ డైట్ ఎక్కువగా తీసుకుంటారు. ఫలితంగా మన గట్లో ఫెర్మెంటేషన్ పెరుగుతుంది. అంటే మనం తినే ఫైబర్ జీర్ణం కాక కడుపులో కుళ్ళటం మొదలవుతుంది.
(03:01) అప్పుడే కడుపు ఉబ్బటం కడుపులో గ్యాస్ రౌండ్ పొట్ట ఇలాంటివి మొదలవుతాయి. ఆయన చెబుతున్న ఉదాహరణ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరు ఇది గమనించారా మేకలు గొరిల్లాలు ఎందుకు పెద్ద పొట్టతో ఉంటాయి. అవి తినే గడ్డి ఫెర్మెంట్ అవ్వడానికి వాటి పొట్టలు ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. కానీ మనుషులకు అలా కాదు భారతీయులు ఎక్కువ ఫైబర్ తక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఆ జంతువుల పొట్టలాగా మనకు కడుపు ఉబ్బడం మొదలైంది.
(03:43) డాక్టర్ బెర్గ్ చెప్తున్న మరో పెద్ద విషయం ఇండియాలో ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం భయంకరంగా పెరిగిపోయింది. ఇంటిలో చేసుకునే వేపుళ్ళు మానేసి మనం ప్యాకేజ్డ్ స్వీట్స్ రెడీ టు ఈట్ స్నాక్స్ బేకరీ ఐటమ్స్ ఇన్స్టంట్ నూడిల్స్ ఇవే తింటున్నాం. ఇలా తినడం వల్ల గట్ లైనింగ్ బలహీన పడుతుంది. బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిపోతుంది.
(04:08) కడుపులో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. కడుపు ఉబ్బి మరింత పెరుగుతుంది. మనం చేస్తున్న ఇంకొక పెద్ద పొరపాటు భారతీయులు ఎసిడిటీ కోసం ఏం వాడతారు? యాంటీసిడ్ సిరప్లు సోడా పౌడర్లు అయితే డాక్టర్ బర్గ్ ప్రకారం ఇవి కడుపులో యసిడ్ ని తగ్గిస్తాయి. యసిడ్ తగ్గితే మన అరుగుదల తగ్గిపోతుంది. మనం తీసుకున్న ఆహారం లోపల కుళ్లిపోతుంది. బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిపోతుంది.
(04:41) చివరికి అది సిబోకి దారి తీస్తుంది. సిబో అంటే స్మాల్ ఇంటెస్టినల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ ఈ సిబో వల్ల పుల్లటి త్రేన్పులు రావటం కడుపు ఉబ్బటం కడుపులో నొప్పి అజీర్ణం పొట్ట బయటికి రావడం ఇవన్నీ రోజు రోజుకి కామన్ అయిపోతాయి. మన ఇండియాలో డాక్టర్లు చేస్తున్న అసలు తప్పు ఏంటి? డాక్టర్ బర్గ్ పరిశోధన ప్రకారం భారతదేశంలో ఎక్కువగా డాక్టర్లు సింటమ్స్ ని మాత్రమే ట్రీట్ చేస్తారు.
(05:17) పేషెంట్ డైట్ అతని జీర్ణ పరిస్థితి గురించి వివరంగా అడగరు. గ్యాస్ అని చెప్తే గ్యాస్ టాబ్లెట్ అసిడిటీ అంటే యాంటీసిడ్ సిరప్ కడుపు ఉబ్బితే దానికి ఇంకో సిరప్ అంటే ఒక ప్లాస్టర్ వేసినట్టు మందులు రాస్తారు తప్ప మూల కారణం రూట్ కాస్ ని తెలుసుకోరు. అయితే ఈ పొట్ట ఒబ్బడం తగ్గించడానికి డాక్టర్ బెర్గ్ సూచించిన సింపుల్ మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
(05:45) కడుపులో గ్యాస్ ని ట్రిగ్గర్ చేసే ఫుడ్స్ తగ్గించాలి. అంటే పెసరపప్పు శెనగపప్పు ఆలుగడ్డ అధిక ఫైబర్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ మనకి ఆహారంలో ఫైబర్ అవసరమే కానీ ఎక్కువగా తీసుకుంటే అది ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. ఈజీగా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్లు తీసుకోవాలి. మాంసాహారులు అయితే గుడ్లు, చేపలు, చికెన్ పెరుగు శాఖహారులు అయితే పాలు పెరుగు ఎక్కువగా తీసుకోవాలి.
(06:24) ప్యాకేజ్డ్ ఫుడే మన గట్టకి ప్రధాన శత్రువు అల్ట్రా ప్రాసెస్డ్ స్నాక్స్ ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మన గట్టికి విశ్రాంతిని ఇస్తుంది. దీనివల్ల మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. డాక్టర్ బెర్గ్ ఇచ్చిన ఫైనల్ వార్నింగ్ కడుపు ఉబ్బడం కేవలం అసౌకర్యం మాత్రమే కాదు అది మన జీర్ణ వ్యవస్థ బలహీన పడుతుందని చెప్పే డేంజర్ సిగ్నల్ గట్ బలహీన పడితే ఇమ్యూనిటీ తగ్గుతుంది.
(07:02) వెయిట్ పెరుగుతుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మెంటల్ హెల్త్ పై కూడా ప్రభావం పడుతుంది. అందుకే పొట్ట బయటకి రావడానికి చిన్న సమస్యగా చూడద్దని డాక్టర్ చెబుతున్నారు. కాబట్టి ఫ్రెండ్స్ మీరు స్లిమ్ గానే ఉన్నా మీరు తీసుకునే ఆహారం మంచిదే అయినా మీకు పొట్ట రావడానికి అసలు కారణం డైజెషన్ మరియు ఫెర్మెంటేషన్ ఇంబాలెన్స్ ఈ రోజు నుంచి చిన్న చిన్న మార్పులు చేస్తే కడుపు ఉబ్బడం తగ్గుతుంది.
(07:39) మీ జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. స్టమక్ నాచురల్ గా ఫ్లాట్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్ వీడియో కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ రావడానికి గంట సింబల్ ని ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకొక ఫాక్ట్స్ వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.

No comments:

Post a Comment