Friday, February 4, 2022

వివేకానంద జీవిత చరిత్ర

ఈరోజు12.01.2022) స్వామి వివేకానంద జయంతి
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
వివేకానంద జీవిత చరిత్ర
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
బాల్యం

బాల్యంలో వివేకానంద స్వామిని నరేంద్రనాథ్ దత్త అని , ముద్దుగా నరేన్ అని పిలిచేవారు. ఆయన కలకత్తా నగరంలో విశ్వనాథ్ దత్త , భువనేశ్వరి దేవి దంపతులకు 1863 సంవత్సరం జనవరి 12 వ తేదీ సోమవారం జన్మించారు. దత్త కుటుంబీకులు ధనికులే గాక సంఘంలో మంచి పేరున్నవారు. దాతృత్వానికీ , విద్యాధికతకూ , స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను కాంక్షించే వారుగానూ పేరెన్నికగన్నారు. నరేంద్రుడి తాత అయిన దుర్గాచరణ్ దత్త పర్షియన్ , సంస్కృతభాషలలో గొప్ప పాండిత్యాన్ని కలిగిన న్యాయవాది. కానీ విశ్వనాథ్ జన్మించిన తర్వాత ఆయన సన్యసించారు. అప్పుడాయనకు 25 సంవత్సరాల వయస్సు మాత్రమే.
కలకత్తా హైకోర్టులో విశ్వనాథ్ దత్త ఒక న్యాయవాది. అతడు ఆంగ్ల , పర్షియన్ భాషలలో గొప్ప పండితుడు. పర్షియన్ కవి అయిన హఫీజ్ రచించిన కవితలను చదివి తన కుటుంబానికి వినిపించేవాడు. బైబిల్ గ్రంథాన్ని చదవడంలోనూ , సంస్కృతంలోని హిందూశాస్త్రాలను చదవడంలోనూ గొప్పగా ఆనందించేవాడు. మితిమీరిన దాతృత్వాన్ని , పేదలపట్ల జాలిని కలిగివున్నా మత సాంఘిక విషయాలలో హేతుబద్దమైన , అభ్యుదయ భావాలను కలిగివుండేవాడు. బహుశా పాశ్చాత్య సంస్కృతీ ప్రభావంవల్ల ఆయనకు ఆ గుణాలు కలిగివుండవచ్చు. భువనేశ్వరీదేవి ఏ పనినైనా సమర్థంగా నిర్వహించగలిగిన రాజకుటుంబీకురాలు. నరేంద్రుడు పుట్టకముందు కొందరు కుమార్తెలు పుట్టినా కొడుకు కావాలన్న కోరికతో ఆమె వారణాసిలోని వీరేశ్వర శివునికి పూజలు జరిపించమని తన బందువులలో ఒకరిని కోరారు. తరువాత శివుడు ఆమెకు కలలో కనిపించి , ’నీకు కొడుకుగా పుడతాన’ ని మాట ఇచ్చినట్టు చెప్పుకుంటారు. ఆ తర్వాత కొంతకాలానికి నరేంద్రనాథ్ జన్మించాడు.

చిన్నతనంలో నరేంద్రనాథ్ ఎంతో ఉల్లాసంగా , అల్లరివాడుగా ఉండేవాడు. కానీ అదే సమయంలో అతనికి ఆధ్యాత్మిక విషయాల మీద గొప్ప ఆసక్తి ఉండేది. రాముడు , సీత , శివుడు మొదలైన దేవుళ్ళ బొమ్మల్ని పూజిస్తూ , ధ్యానిస్తూ ఆడుకునేవాడు. తన తల్లి చెప్పిన రామాయణ , మహాభారత కథలు అతని మనస్సు మీద చెరగని ముద్ర వేసాయి. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు , ధైర్యం , పేదలపట్ల జాలి , దేశద్రిమ్మరులై వచ్చే సన్న్యాసులపట్ల ఆకర్షణ మొదలైన గుణాలు అతనిలో పసితనంలోనే కనిపించాయి. చిన్నతనంలోనే ఎవరేదిచెప్పినా దాన్ని నిరూపించి చూపమని నరేంథ్రనాథ్ సవాలు చేసేవాడు. మదికీ , హృదికీ తలమానికమైనటువంటి ఈ సద్గుణాలతో అతడు ఒక శక్తిమంతుడైన యువకునిగా ఎదిగాడు.

శ్రీ రామకృష్ణుల చరణకమలాల వద్ద

యువకునిగా , నరేంథ్రనాథ్ తన సింహంలాంటి రూపానికి సరితూగే ధైర్యాన్ని కలిగివుండేవాడు. మంచి వస్తాదు వంటి శరీరనిర్మాణాన్ని , సుస్వరమైన గొంతును , ప్రకాశమానమైన బుద్ధిని కలిగివుండేవాడు. సాముగరిడీలలోనూ , తత్త్వశాస్త్రంలోనూ , సంగీతం లోనూ తన తోటివారి మధ్య తిరుగులేని నాయకుడిగా పేరెన్నికగన్నాడు. కళాశాలలో పాశ్చాత్య తత్త్వాన్ని అధ్యయనం చేసి ఒంటపట్టించుకున్నాడు. తద్వారా అతని మనస్సులో విషయాలను సూక్ష్మంగా పరిశీలించే శక్తి నాటుకుపోయింది. పుట్టుకతో అలవడిన లక్షణాలయిన ఆధ్యాత్మికతపై మక్కువ , సనాతన మతసాంప్రదాయాల మీద , నమ్మకాల మీద గౌరవం ఒకప్రక్క , మరొకప్రక్క పదునైన బుద్దితో జతగూడిన అతని విమర్శనాత్మక స్వభావం ఇప్పుడు ఒకదానితో ఒకటి తలపడ్డాయి. ఇటువంటి సందిగ్ధసమయంలో , ఆ కాలంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న మత - సాంఘిక ఉద్యమమైన భ్రహ్మసమాజంలో చేరి కొంత ఊరట పొందటనికి ప్రయత్నించాడు. భ్రహ్మ సమాజం నిరాకారదైవాన్ని నమ్మి , విగ్రహారాధనను తూలనాడి , అనేక విధాలయిన సంస్కరణలను చెయ్యడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. నరేంద్రనాథ్ అనేకమంది పెరెన్నికగన్న మతనాయకులను కలుసు కున్నాడు. కానీ వారెవ్వరూ , ’దేవుడు ఉన్నాడా’ , లేడా?’ అన్న అతని ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వలెకపోయారు. ఇది అతని ఆధ్యాత్మిక అశాంతిని మరింతగా పెంచింది.

ఇటువంటి చిక్కుపరిస్థితిలో , కలకత్తాకు కొద్ది దూరంలో , దక్షిణేశ్వరంలో ఒక సాధువు ఉన్నాడని తన ఆచార్యుడైన విలియం హేస్టీ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. వర్డ్స్ వర్త్ తన ’విహారము’ అన్న కవితలో వర్ణించిన పారవశ్యస్థితిని ఆ ’సాధువు అనుభూతి చెందాడని హేస్టీ వివరించాడు. అతడి గ్నాతి అయిన రామచంద్ర దత్త కూడా ఆ సాధువును దర్శించమని నరేంద్రుణ్ణి ప్రోత్సహించాడు. ఆ విధంగా 1881 లో ఆధునిక భారతదేశపు దివ్యద్రష్ట అయిన శ్రీరామక్రుష్ణునికి , అతని సందేశప్రచారకుడైన నరేంద్రునికి పరిచయం కలిగింది. "అయ్యా ! మీరు దేవుణ్ణి చూశారా?" అని నరేంద్రనాథ్ ప్రశ్నించాడు. "ఔను ! నేను భగవంతుణ్ణి చూశాను ! నిన్నిప్పుడు చూస్తున్నదానికన్నా స్పష్టంగా చూశాను !" అని శ్రీరామకృష్ణులు సమాధానమిచ్చారు. ఎట్టకేలకు తన సొంత అనుభూతి ద్వారా దేవుణ్ణి దర్శించిన ఒక మనిషి నరేంద్రుడికి లభించాడు. అతని అనుమానం తొలగిపోయింది. శిష్యునిగా శిక్షణ ప్రారంభమయింది.

శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి అనేకరకాలుగా పరీక్షించారు. దానికి ప్రతిగా , శ్రీరామకృష్ణులు తాను అనుభూతి చెందినట్టు వర్ణించిన ఆధ్యాత్మికస్థితులలో నిజం ఎంతవరకూ ఉందో తెలుసుకోవడానికి ఆయనను అనేకవిధాలుగా నరేంద్రుడు పరీక్షించి చూశాడు. తన తండ్రి 1884 లో గతించిన తర్వాత నరేంద్రుడి కుటుంబం అనేకవిధాలుగా ఇక్కట్లపాలైంది. గురుదేవుల సలహామీద దక్షిణేశ్వరంలోని కాళికాదేవిని తన కుటుంబ బాధలు తీర్చమని ప్రార్థించడానికి వెళ్ళాడు. అయినప్పటికి , తనకు డబ్బు అవసరం ఉందని తెలిసికూడా భక్తిగ్నానాల కోసం మాత్రమే ప్రార్థించగలిగాడు.

క్రమక్రమంగా నరేంద్రుడు గురుదేవులకు శరణాగతుడయ్యాడు. తన అంతులేని ఓరిమితో శ్రీరామకృష్ణులు తన యువశిష్యుని యొక్క సంప్రదాయ వ్యతిరేకధోరణిని అణగార్చి , సంశయస్థితిలోనుంచి దృఢనిశ్చయానికి , ఆవేదన నుండి ఆధ్యాత్మిక ఆనందానికి అతనిని తీసుకొనిపోయారు. కానీ శ్రీరామకృష్ణులందించిన మార్గదర్శకత్వంకన్నా ఆయన ప్రేమయే ఆ యువశిష్యుని మనస్సును మరింతగా చూరగొన్నది. ఆ ప్రేమను అంతే నిండుదనంతో ఆ శిష్యుడు తిరిగి గురువుకు అందించాడు.

శ్రీరామకృష్ణులు జబ్బుపడినప్పుడు చికిత్సకోసం ఆయనను కలకత్తా పొలిమేర్లలోని కాశీపూర్ కు తరలించారు. అక్కడ తన గురువు ఆధ్వర్యంలో నరేంద్రుడి చివరి విడత శిక్షణాకార్యక్రమం మొదలైంది. ఆ సమయంలో నరేంద్రుడు తీవ్రమైన తపస్సాధనలను చేశాడు. శ్రీరామకృష్ణులు తమ యువ శిష్యులందరిని నరేంద్రుడి నాయకత్వంలోకి తేవడానికి కృషి చేశారు. నరేంద్రుడు తనకు సర్వోత్కృష్ట పారమార్థికస్థితి అయిన నిర్వికల్ప సమాధిని ఇవ్వమని శ్రీరామకృష్ణులను కోరినప్పుడు ఆయన , "సిగ్గులేదా ! నువ్వొక పెద్దమర్రిచెట్టులాగా పెరిగి , ఈ ప్రపంచపు బాధలలో మాడిపోతున్న వేలమందికి నీడనిస్తావని నేననుకుంటున్నాను. కానీ ఇప్పుడు చూస్తే నువ్వు నీ మోక్షాన్నే కోరు కుంటున్నావు" అని మందలించారు. అయినప్పటికీ నరేంద్రుడికి ఆ అనన్యసామన్యమైన అనుభూతి సిద్దించింది. కానీ , "నువ్వు జన్మించిన కార్యం సిద్దించేవరకూ ఈ అనుభూతికి తాళంచెవి నా దగ్గరే ఉంటుంద" ని గురుదేవులు అతనికి చెప్పారు. తన మహాసమాధికి మూడునాలుగురోజుల ముందు గురుదేవులు తన ఆధ్యాత్మికశక్తినంతా నరేంద్రుడికి ధారపోసి , "ఇప్పుడు నీకిచ్చిన శక్తితో మహాత్కార్యాలు సాధించబడతాయి. దాని తర్వాతే నువ్వు నీ ధామానికి చేరుకుంటావ" ని చెప్పారు.

గురుదేవులు 1886 వ సంవత్సరం ఆగస్టునెలలో మహాసమాధి చెందిన తర్వాత నరేంద్రుడి నాయకత్వంలో యువశిష్యులందరూ బారానగర్ లో ఒక పాడుబడిన అద్దె ఇంటిలో చేరారు. ఇక్కడే , తీవ్రమైన తప్పసాధనల మధ్య "శ్రీరామకృష్ణ సోదరబృందా" నికి పునాది పడింది. ఇక్కడ ఉంటున్న రోజులలోనే నరేంద్రనాథ్ పలువురు సోదరశిష్యులతో కలిసి అంత్ పూర్క్ కు వెళ్ళారు. అక్కడ ’క్రిస్టమస్ ఈవ్’ పర్వదినాన (1886) వాళ్ళందరూ ఒక పెద్దమంటవేసి దానిచుట్టూ కూర్చుని సన్న్యాసదీక్ష తీసుకున్నారు. భారానగర్ లో గడిపిన దినాలు అధ్యయనంలోనూ , ఆధ్యాత్మికసాధనలతోనూ , మహదానందంగా గడిచాయి. కానీ దేశద్రిమ్మరులుగా పరివ్రాజక జీవితం గడపాలన్న కోరిక వారిలో పలువురిని ఆకర్షించసాగింది. నరేంద్రుడు కూడా 1888 చివరిభాగం నుంచి అనేకసార్లు మఠం విడిచి యాత్రలకు పోసాగాడు.

పరివ్రాజక సన్న్యాసి

తాత్కాలికమైన యాత్రలు ప్రారంభించిన 1888 చివరిభాగం నుంచి 1890 లో తన సోదరబృందాన్ని పూర్తిగా విడిచిపెట్టి ఊరూపేరూలేని బైరాగిగా పర్యటించడం ప్రారంభించినంతవరకూ జరిగిన కాలంలో నరేంద్రనాథుడి దృక్పథంలో గొప్పమార్పు వచ్చింది. భారతదేశపు జనసామాన్యంలో కలిసి పోవడానికి , ఎవరూ తనను గుర్తుపట్టాకుండా ఉండడానికి , రకరకాల పేర్లు పెట్టుకుంటూ ఆయన పర్యటించసాగారు.

ఈ సమయంలో ఒక భారతీయ సన్న్యాసిలాగా ఏకాంతజీవనం గడపాలనే సహజమైన కోరిక చెదిరిపోయి తానొక గొప్ప బాధ్యతను నెరవేర్చడానికి పుట్టానన్న భవిష్యత్ గ్నానం ఆయనలో కలుగసాగింది. తనఒక్కడిసొంత ముక్తి కోసం వెంపర్లాడే మామూలు సాధువును కాదని ఆయనకు తేటతెల్లమైంది. భారతదేశాన్ని మరింత బాగా తెలుసుకోవాలన్న కోరిక రగులుతుండగా , అణగద్రొక్కబడిన భరతమాత మౌనరోదనల విన్నపాలు తనచుట్టూ పెల్లుబుకుతుండగా హిందువులకు పరమపవిత్రమైన వారణాసిని ముందుగా చేరుకున్నారు. అక్కడనుంచి లక్నో , ఆగ్రా , బృందావనం , హత్రాస్ , రిషి కేశ్ లకు పర్యటించి తిరిగి కొంతకాలంపాటు బారానగర్ కు వచ్చారు. హత్రాస్ లో తనకు ప్రథమ శిష్యుడై , స్వామి సదానందగా పెరొందిన శరత్ చంద్ర గుప్తాను కలుసుకున్నారు. ఈ దేశాన్ని , ప్రపంచాన్ని ఆధ్యాత్మికంగా పునరుజ్జీవింపజెయ్యాలనే బృహత్ పథకాన్ని తనకు తన గురుదేవులు అప్పగించారని అతనికి తెలిపారు. హత్రాస్ లోని రైల్వేస్టేషనులో ఉద్యోగస్థుడైన శరత్ తన ఉద్యోగానికి రాజీనామాచేసి తన ’గురువు’యొక్క మహాత్కార్యంలో సహాయ పడటానికి ఆయనను అనుసరించాడు.

స్వామీజీ జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన 1890 వ సంవత్సరంలో ఆయన ఘాజీపూర్ లోని పవహారిబాబాను కలిసినప్పుడు జరిగింది. ఆయనయొక్క సాధుత్వానికి స్వామీజీ తన జీవిత పర్యంతం గొప్ప ఆదరాన్ని చూపించారు. ఈ సమయంలో ఆయన అద్వైతపు అనంతనిశ్శబ్దంలో మునిగిపోవాలన్న కోరికకూ , మరొకప్రక్క తన గురుదేవుల మహాత్కార్యానికి పరిపూర్ణతకలిగించాలన్న సంకల్పానికి మధ్య మథనపడసాగాడు. సర్వోత్కృష్టమైన సమాధిలో ఆ భగవంతుడిలో లీనమైపోవాలని తన హృదయంలో తొలుస్తున్న తపనను పవహారిబాబా ఉపశమింప జేయగలుగుతారని ఆయన భావించారు. ఈ ప్రబలమైన కోరిక తన గురుదేవులు తనకప్పగించిన బాధ్యతనుండి ఆయనను దూరంగా లాగివేయసాగింది. ఇరవైయొక్క రోజులపాటు ఆ ఆకర్షణకు లొంగిపోయే స్థితికి చేరినా ప్రతిసారీ గురుదేవులు తన దర్శనం ద్వారా ఆయనను తిరిగి తన పనివైపు మరలించారు.

గురుదేవులు గతించిన తర్వాత యువసన్యాసులకు ఆధ్యాత్మిక మార్గదర్శిగా ఉన్న శ్రీ శారదాదేవి వద్ద స్వామీజి సెలవు తీసుకున్నారు. అన్నిరకాల బంధాలనూ త్రెంచివేసి హిమాలయపర్వతాల గంభీర ఏకాంతంలోకి పోవాలని తన సోదరసన్న్యాసులవద్ద కూడా సెలవు తీసుకున్నారు. ఇప్పుడు కొంతకాలం ఏకాంతంగా ఉండడం అత్యవసరంగా ఆయనకు తోచింది. రోమారోలా ఇలా వర్ణించాడు: "ఇది ఒక మహాప్రస్థానం. ఒక గజఈతగానిలాగా ఆయన భారతదేశ మహాసాగరంలోకి దుమికారు. ఆ మహాసాగరం ఆయన కాలిబాటల్ని కప్పివేసింది. దాని అలలలో తేలుతూ , అటూఇటూ కొట్టుకుపోతున్న జనసామాన్యంలోనూ , వేలమంది. సన్న్యాసుల్లో తానూ ఒక అనామక సన్న్యాసిగానూ కలిసిపోయారు. కానీ ప్రజ్వరిల్లుతున్న మేధస్సు ఆయన కళ్ళల్లో కొట్టొచ్చినట్టు కనపడేది. ఎంత మారువేషం వేసినా రాజు రాజే!"

ఆయన పరివ్రాజక జీవితం ఆయనను చారిత్రాత్మకంగానూ , తీర్థయాత్రాస్థలాలుగానూ పేరొందిన రకరకాలచోట్లకు తీసుకుపోయింది. ఆయన ఉత్తరప్రదేశ్ , రాజస్థాన్ , గుజరాత్ , మహారాష్ట్ర , మైసూర్ , కేరళ , మద్రాసు , హైదరబాదులకు పర్యటించారు. ప్రతిచోటా రాజకీయ , సాంస్కృతిక , ఆధ్యాత్మిక రంగాలలో ప్రాచీనభారతదేశ ఔన్నత్యం ఆయనకు స్పష్టంగా గోచరించింది. ఈ మహాసంస్కృతికి మధ్య భారతదేశ జనసామాన్యం యొక్క కష్టాలు , కడగండ్లు ఆయన మనస్సును ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఆయన ఒక రాజసంస్థానం నుండి మరొక రాజసంస్థానానికి తిరిగి , వారి కష్టాలను కడతేర్చే మార్గాలను అన్వేషించారు. ఆ విధంగా ఆయన పలు రాజసంస్థానాల పరిపాలకుల్ని , ప్రముఖవ్యక్తుల్ని కలుసుకున్నారు. వారిలో ఖేత్రీ మహారాజయిన అజిత్ సింగ్ ఆయనకు ప్రాణస్నేహితుడు , శిష్యుడు అయాడు. ఆల్వారులో స్వామీజీ ’పతంజలి మహాభాష్యాన్ని’ అధ్యయనం చేశారు. పూనాలో గొప్ప జాతీయనాయకుడైన బాలగంగాధర్ తిలక్ వద్ద అతిథిగా ఉన్నారు. మొదట తిలక్ స్వామిజీతో ఒకింత చులకనగా మాట్లాడినా , స్వామీజీ గ్నానగంభీరతను , ఆలోచనా పరిపుష్టిని మెచ్చుకుని తన ఆతిధ్యాన్ని స్వీకరించవలిసిందిగా ఆహ్వానించారు. అక్కడనుంచి బయలుదేరి , కొంతకాలం బెల్ గాంలోవున్న తరువాత స్వామీజీ బెంగుళూరు , మైసూరులను దర్శించారు. పాశ్చాత్యదేశాలలో మన సనాతనధర్మాన్ని బోధించి , భారతదేశానికి కావలసిన ఆర్థికసహాయాన్ని కోరడానికి అవసరమైన ధనసహాయాన్ని తాను అందిస్తానని మైసూరు మహారాజు స్వామీజీకి వాగ్దానం చేశారు. మైసూరునుంచి స్వామీజీ త్రివేండ్రం , కన్యాకుమారి దర్శించారు.

స్వామీజీ ఎక్కడికి వెళ్ళినా , అక్కడి ప్రముఖప్రదేశాలు , వ్యక్తులు ఆయనను ఎక్కువగా ప్రభావితం చెయ్యలేదు. సామాన్య ప్రజానీకపు దుర్భరదారిద్ర్యం , బాధలు ఆయన హృదయాన్ని కలచివేశాయి. ఇంచుమించు మూడేళ్ళపాటు , తరచుగా కాలినడకన ప్రయాణించి , స్వామీజీ భారతదేశాన్ని తనకుతానుగా చూసి తెలుసుకున్నారు. ఇప్పుడు ఆయన ఒక విధంగా తన ప్రయాణపు ముగింపుకు చేరుకున్నారు. గొప్ప ఉద్వేగంతో ఆయన కన్యాకుమారిలోని కుమారీదేవి విగ్రహం ముందు సాగిలపడ్డారు. ఆ తర్వాత సముద్రాన్ని ఈది , దక్షిణతీరంలో కొద్దిదూరంలో నీటిమధ్యవున్న ఒక కొండరాయిని చేరుకుని అక్కడ ఆ రాత్రంతా తీవ్రమైన ధ్యానంలో మునిగిపోయారు. తన ప్రయాణాలలో పొందిన అనుభూతులన్నీ ఒక సుదీర్ఘచిత్రంగా ఆయన మనోనేత్రం ముందు కదలాడాయి. భరతమాతయొక్క భూత , భవిష్యత్ , వర్తమానాల గురించి , ఆమె అథ:పతనానికిగల కారణాలను గురించి , ఆమెను తిరిగి ఉద్ధరించేందుకు తగిన పద్ధతుల గురించి ఆయన ధ్యానం చేశారు. భారతదేశ పేదప్రజానీకానికి కావలసిన సహాయాన్ని కోరడానికి , తద్వారా తన జీవితపు మహాత్కార్యానికి ఒక రూపునివ్వడానికి , పాశ్చాత్యదేశాలకు ప్రయాణించాలన్న అతిముఖ్యమైన నిర్ణయాన్ని ఆయన ఇక్కడే తీసుకున్నారు.

ఈ నిర్ణయంతో ఆయన రామేశ్వరం , మదురైలకు ప్రయాణమయ్యారు. అక్కడనుంచి ఆయన మద్రాసు వెళ్ళారు. అక్కడ అలసింగ పెరుమాళ్ నాయకత్వంలో ఒక యువబృందం ఆయన రాకకోసం ఆతృతగా ఎదురుచూస్తున్నది. వారికి ఆయన , అమెరికావెళ్ళి అక్కడ చికాగోలో జరుగుతున్న సర్వమతమహాసభలో పాల్గొనాలన్న కోరికను బయటపెట్టారు. ఆ యువశిష్యులు ఆయన ప్రయాణ ఖర్చులకు అవసరమైన సొమ్మును పోగు చేశారు. కానీ ఆ జగన్నాత తన ప్రయాణానికి ఇచ్చగించిందో లేదో తెలియదన్న నెపంతో స్వామీజీ ఆధనాన్ని పేదలకు పంచిపెట్టమని చెప్పారు. ఈ తరుణంలో స్వామీజీ తన మనసులొమాట సరైనదేనన్నదానికి సంకేతంగా ఒక కలలో శ్రీరామకృష్ణులు సముద్రం మీదకు నడుస్తూ తనను కూడా రమ్మని సౌంగ్న చేస్తున్నట్టు ఆయనకు కనిపించింది. దీనికితోడు శ్రీ శారదాదేవి కూడా తన దీవెనలను , అంగీకారాన్ని తెలిపారు. శ్రీ శారదాదేవి కూడా ఒక కలలో శ్రీరామకృష్ణుల అంగీకారాన్ని పొందారు. దీనితో స్వామీజీ సందేహాలన్నీ తీరిపోయాయి. ఆయన ప్రయాణానికి అవసరమైన నిధులను సేకరించడానికి స్వామీజీ యువమిత్రులు మరలా ఉద్యమించారు.

ఆ తర్వాత అయన కొద్దిరోజులు హైద్రాబాదుకు వెళ్ళారు. అమెరికా ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు ఆవిధంగా జరుగుతుండగా , అకస్మాత్తుగా ఖేత్రీమహారాజుకు కొడుకు పుట్టిన సందర్భంగా జరుగుతున్న వేడుకలకు రావలసిందిగా ఆయనకు ఆహ్వానం అందింది. స్వామీజీ తన శిష్యుడినుంచి అందిన ఈ ఆహ్వానాన్ని కాదనలేకపోయారు. మాహారాజుగారు స్వామీజీని సాదరంగా ఆహ్వానించి ఆయన ప్రయాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లనూ చేయిస్తానని మాటయిచ్చారు. ఇక్కడే , మహారాజుగారి సలహామేరకు "వివేకానంద" అన్న పేరును పెట్టుకున్నారు. తాను మాట ఇచ్చినట్టుగానే మహారాజుగారు తన వ్యక్తిగత కార్యదర్శిని స్వామీజీతోపాటు పంపి , బొంబాయినుండి ఆయన ప్రయాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లను చేయించారు. అమెరికాకు స్వామీజీ 1893 మే 31 వ తేదీన బయలుదేరారు.

ప్రపంచవేదిక మీద

స్వామి వివేకానందులు చైనా , జపాన్ , కెనడాల మీదుగా ప్రయాణించి చికాగో నగరానికి జులై మధ్యభాగంలో చేరుకున్నారు. కాంటన్ లో ఆయన కొన్ని బౌద్ధవిహారాలను దర్శించారు. జపాన్ ప్రజల పారిశ్రామిక ప్రగతిని , పరిశుభ్రతను ఎంతగానో మెచ్చుకునారు. చికాగోలో ప్రజల కళ్ళు చెదిరే భోగభాగ్యాలను , కొత్తవిషయాలను కనిపెట్టే మేధాశక్తిని చూసి ఒక చిన్నపిల్లవాడిలాగా దిగ్బ్రమ చెందారు. విశ్వమత మహాసభ సెప్టెంబరు వరకూ ప్రారంభం కాదని , తగిన పరిచయపత్రాలు లేనిదే ఎవ్వరినీ అందులో పాల్గొనడానికి అనుమతించరనీ తెలుసుకుని నిరాశ చెందారు.

దారితప్పిపోయినట్టు తోచినా దేవుడిమీద భారంవేసి చికాగోకన్నా చౌకగా ఉండే బోస్టన్ నగరానికి వెళ్ళారు. తాను ప్రయాణించే రైలులో ఆయనకు మిస్ కాథరిన్ సాన్ బర్న్ తో పరిచయమయింది. ఆమె తన అతిథిగా ఉండమని స్వామీజీని ఆహ్వానించింది. ఆమె ద్వారా స్వామీజీకి హార్ వార్డ్ విశ్వవిద్యాలయ ఆచార్యుడైన జాన్ హెన్రీ రైట్ మహాశయునితో పరిచయం కలిగింది. సర్వమత మహాసభ అధ్యక్షునికి స్వామీజీని గురించి ఒక పరిచయపత్రాన్ని డా.రైట్ ఇచ్చారు. అందులో ఒక వాక్యంగా , "విద్యాధికులైన మన ఆచార్యులందరినీ ఏకం చేసిన దానికన్నా ఎక్కువ జ్ఞానవంతుడైన మనిషి ఇక్కడ ఉన్నాడు" , అని వ్రాశాడు.

సర్వమత మహాసభ ప్రారంభానికి ఒకటి రెండురోజుల ముందు స్వామీజీ చికాగోకు తిరిగి వచ్చారు. కానీ ఆయన దిగులుకుతోడు ప్రాచ్యమతప్రతినిధులకు ఆతిధ్యాన్ని అందజేసే కమిటీ చిరునామాను పోగొట్టుకున్నారు. ఆ రాత్రి అక్కడి రైల్వేస్టేషనులో ఒక పెద్దపెట్టెలో తల దాచుకుని , మరునాటి ఉదయం తనకు సహాయం చెయ్యగల మనిషి దొరుకుతాడేమోనని బయలుదేరారు. కానీ శ్వేతజాతీయులుకాని వారికి సహాయం అంత త్వరగా లభించదు. నిష్పలంగా చాలాసేపు అన్వేషించిన మిదట అలసిపోయున , అంతా దైవసంకల్పంమీద వదిలి రొడ్డుప్రక్కన చతికిలబడ్డారు. అకస్మాత్తుగా ఆయన ఎదురుగా ఉన్న ఇంటిలోంచి ఒక స్త్రీ ఆయన వద్దకు నడిచి వచ్చి ఆయనకు ఏ సహాయం కావాలని అడీగారు. ఆమెయే శ్రీమతి జార్జ్ డబ్ల్యూ హేల్. వారింటి చిరునామాయే అమెరికాలో స్వామీజీ శాశ్వత విలాసంగా నిలిచిపోయింది. హేల్ కుటుంబీకులు స్వామీజీ భక్తులుగా మారిపోయారు.

సర్వమత మహాసభ 1893 సెప్టెంబరు 11 వ తేదీన ప్రారంభమయింది. కళాసంస్థ (Art Institute) సభాప్రాంగణం సుమారు 7000 మంది జనంతో కిటకిటలాడిపోయింది. వారు ఆదేశపు ఉత్కృష్ట సంస్కృతికి ప్రతినిధులు. వేదికమీద ప్రపంచం నలుమూలల నుంచి విచ్చేసిన అన్నిమతాల ప్రతినిధులూ ఆశీనులయ్యారు. స్వామీజీ అటువంటి బ్రహ్మాండమయిన , విశ్వవిఖ్యాతులయిన వారితో నిండిన సభను ఉద్దేశించి ఎన్నడూ ప్రసంగించలేదు. ఆయన చాలా భయపడ్డారు. ఆయన తరుణం వచ్చినప్పుడు , మనస్సులో సరస్వతీదేవికి నమస్కరించి , "అమెరికాదేశపు సోదర సోదరీమణూలారా !" అని సంబోధించారు. వెనువెంటనే ఆ బ్రహ్మాండమైన సభలో కరతాళధ్వనులు మిన్నుముట్టాయి. పూర్తిగా రెండునుముషాలపాటు ఆ కరతాళాలు ఆగలేదు. "ఏడువేలమంది జనం లేచి నిలబడి , తమకు అంతుబట్టనిదేదో ఒకదానికి నివాళులర్పించారు." ప్రజ్వరిల్లే చిత్తశుద్ధితో ఆయన పలికిన పలుకులు , తేజస్సుతో నిండిన ఆయన ముఖవర్చస్సు , కాషాయవస్త్రాలు వారిని ఎంతగా ఆకట్టుకున్నాయంటే మరుసటిరోజు వార్తాపత్రికలు స్వామీజీని సర్వమతమహాసభలో పాల్గొన్న ప్రతినిధులలో అత్యుత్తముడిగా కీర్తించాయి. భిక్షాపాత్రతో బయలుదేరిన ఒక సాధారణ సాధువు అందరి మనస్సులనూ దోచుకున్నవాడిగా ఎదిగిపోయాడు.

స్వామీజీ అటుపై ఆ మహాసభలో చేసిన ప్రసంగాలన్నింటినీ సభికులు గొప్ప గౌరవంతోనూ , ఆసక్తితోనూ విన్నారు. వాటన్నింటిలో విషయమూ సార్వజనీనతే ! సభలో మిగిలిన ప్రతినిధులు తమ మతాల గొప్పను గురించి మాట్లాడితే స్వామీజీ , ఆకాశమంత విశాలమైనదీ , సముద్రమంత లోతైనదీ అయిన మతాన్ని గురించి మాట్లాడారు. మహాసభ ముగియడంతో స్వామీజీ అనామకజీవితం ముగిసిపోయింది. అటుపైన క్షణం తీరిక లేకుండా సంయుక్తరాష్ట్రాలలోని అన్ని ప్రదేశాలలోనూ ఆయన ఉపన్యసించవలసి వచ్చింది. ఒక ఉపన్యాస సంస్థతో ఒక ఉపన్యాస పర్యటన నిమిత్తం ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు. దానివల్ల స్వామీజీ నిరంతరం ప్రయాణిస్తూ అన్నిరకాల శ్రోతలనూ ఉద్దేశించి ప్రసంగించవలసి వచ్చింది. ఈ పర్యటన ఆయనకు పాశ్చాత్య జీవనంలోని వేర్వేరు అంశాలను ప్రత్యక్షంగా చూసి తెలుసుకునే అవకాశాన్ని కలిగించినా , ఆ సంస్థ స్వలాభానికి ఆయనను వాడుకుని , అవమానాల పాలు జేసింది. ఆయనకు వారి ప్రవర్తనతో రోతపుట్టి ఆ సంస్థతో తెగతెంపులు చేసుకున్నారు. అటుపై నిజమైన ఆసక్తి ఉన్న కొద్దిమంది అమెరికన్ భక్తులకు తరగతులు నిర్వహించారు. వారి నుంచి ఎటువంటి రుసుము వసూలు చేయలేదు. ఆయన 1896 డిసెంబరు వరకూ పాశ్చాత్యదేశాలలో ఉన్నారు. ఆ కాలమంతా విపరీతమైన పని వత్తిడితో గడిచింది. లెక్కలేనన్ని ఉపన్యాసాలు , తరగతులూ నిర్వహించడంతోపాటు అయన న్యూయార్కు నగరంలో ఒక వేదాంత సమాజాన్ని స్థాపించారు. సహస్రద్వీప వనంలో ఆయన కొద్దిమంది శిష్యులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. రాజయోగాన్ని రచించారు. రెండుసార్లు ఇంగ్లాండుకు విజయవంతంగా పర్యటించి , ఇప్పుడు గ్నానయోగంగా ప్రసిద్ధిపొందిన ఉపన్యాసాలను అక్కడే అందించారు. అక్కడ కొందరిని శిష్యులుగా చేసుకున్నారు. వారిలో ముఖ్యులు కెప్టెన్ సేవియర్ దంపతులు , సోదరి నివేదిత , ఇ.టి.స్టర్డీ మొదలైనవారు. అంతకుముందు జె.జె.గుడ్విన్ అనే సంక్షిప్త లేఖకుడు (Stenographer) శిష్యుడయ్యాడు. ఈ పర్యటనలోనే ఆయన మాక్స్ ముల్లర్ మహాశయుణ్ణి కలుసుకున్నారు. ఆయన యూరపుఖండాన్ని పర్యటిస్తున్నప్పుడు ప్రఖ్యాతజర్మన్ ప్రాచ్యతత్త్వవేత్త అయిన పాల్ డుస్సెన్ ను కలుసుకునారు.

అన్నిమతాలకూ మూలమయిన సార్వజనీన సూత్రంగా వేదాంతాన్ని పాశ్చాత్యదేశాలలో బోధించడానికి ఆయన అమితమైన కృషిచేశారు. ఆయన ప్రయత్నాలవల్ల వేదాంత ఉద్యమం సంయుక్తరాష్ట్రాలలో ఒక శాశ్వతప్రాతిపదికన వేళ్ళూనుకుంది. లండనులో కూడా ఆయన పని కొంత పురోగతి సాధించింది. ఇక ఆయన జన్మభూమి అయనను ఎలుగెత్తి పిలువసాగింది. ఆయన సందేశాన్ని అందుకోవడానికి గొప్ప ఆతృతతో ఎదురుచూస్తోంది. అందువల్ల 1896 ఆఖరులో ఆయన లండన్ నుండి భారతదేశానికి బయలుదేరారు. తన పనిని కొనసాగించడానికి అమెరికా , ఇంగ్లండులలోని శిష్యులే కాకుండా తన సోదర సన్యాసులైన శారదానంద , అభేదానంద స్వాములను కూడా వినియోగించారు.

విజయుడై తిరిగి మాతృభూమికి

వివేకానంద స్వామి సేవియర్ దంపతులతో కలిసి 1896 డిసెంబర్ 16 తేదీన లండన్ నగరాన్ని వదలి బయలుదేరారు. ఇటలీలోని రోమ్ తదితర ప్రదేశాలను సందర్శించిన తరువాత డిసెంబరు 30 న నేపుల్స్ లో భారతదేశానికి వెళ్ళే ఓడను ఎక్కారు. నేపుల్స్ లో జె.జె.గుడ్విన్ వారితో కలిశాడు. వారు 1897 జనవరి 15 న కొలంబో చేరుకునారు. స్వామీజీ వస్తున్నారన్న వార్త అప్పుడే భారతదేశమంతా పాకిపోయింది. దేశమంతటా అన్నిచోట్లా జనం స్వామీజీని ఆహ్వానించాలని ఆతృతతో ఎదురుచూడసాగారు. ఆయన ఇప్పుడు ఒక "అనామక సన్యాసి" ఎంతమాత్రం కాదు. ప్రతి చిన్నాపెద్దా పట్టణంలోనూ ఆయన విజయానికి తగిన ఎదుర్కోలు పలకడానికి ఆహ్వానసంఘాలు ఏర్పాటయ్యాయి. రోమారోలా ఇలా వర్ణించాడు: "అత్యుత్సాహంతో ఎదురుతెన్నులు చూస్తున్న జనబాహుళ్యానికి తన ’భాతరదేశానికి సందేశంతో , రాముడు , కృష్ణుడు , శివుడు పుట్టినగడ్డను పునరుజ్జీవింపజేసే శంఖారావంతో , ఆ జనుల ధీరశక్తినీ , అమర ఆత్మశక్తినీ ఎలుగెత్తి పిలుస్తూ , యుద్ధరంగానికి కదనుత్రొక్కమన్నారు. ఆయన ఒక సేనాధిపతి. తన ’ఉద్యమ ప్రణాలికను’ వివరించి తన దేశప్రజలను ముకుమ్మడిగా లేచిరమ్మని పిలుస్తూ , ’ఓ , నా భారత దేశమా ! నీ ప్రాణశక్తి ఎక్కడుందో తెలుసా ? మరణ మెరుగని నీ ’ఆత్మ’లోనే !" అని ఉద్భోధించారు. మద్రాసులో ఆయన ఐదు ఉపన్యాసాలను ఇచ్చారు. బలహీనతలనూ , పిచ్చినమ్మకాలనూ పారద్రోలి ఒక కొత్త భారతాన్ని నిర్మించమని బోధించే తూర్యనాదాలు అవి. " ఏ దేశ జాతీయజీవన సంగీతానికంతటికీ మతమే జీవస్వరమని" ఆయన బోధించారు. ఆ మతం , ’ఈ విశ్వమంతా ఆ ఆత్మస్వరూపమే’ అని బోధిస్తున్నదనీ , ఆ మతాన్ని బలోపేతం చేస్తే , మిగిలినవన్నీ వాటికవే చక్కబడతాయనీ బోధించారు. అయితే తన దేశప్రజల బలహీనతలను ఆయన విమర్శించకుండా ఉండలేదు. దేశప్రజలు గుడ్డిగా పాశ్చాత్య పద్ధతులను అనుకరించడాన్ని , పాతకాలపు పిచ్చిపిచ్చి నమ్మకాలని , కుల విభేదాలను ఆయన తూర్పారబట్టారు.

మద్రాసు నుంచి కలకత్తాకు ప్రయాణమై ఫిబ్రవరి 20 కి అక్కడకు చేరుకున్నారు. సొంతవూరు ఆయనకు బ్రహ్మాండంగా స్వాగతంపలికింది. ఇక్కడే స్వామీజీ తన గురుదేవులకు ఘనంగా నివాళులర్పించారు: "ఆలోచనలలో , మాటలలో , చేతలలో నేను సాధించినదేమైనా ఉంటే , ఈ ప్రపంచంలో ఏ వొక్కరికైనా మేలుచేసే ఒక్కమాటైనా నా పెదవులమీంచి రాలివుంటే దానిలో నా గొప్పతనమేమీలేదు. అది ఆయనదే ! నా మాటగా గుర్తుంచుకోండి ! ఈ దేశం బాగుపడదలుచుకుంటే ఆయన పేరును ఆశ్రయించవలసిందే !"

తన మహాత్కార్యాన్ని ఒక గట్టి పునాదిపైన స్థిరపరచడానికి స్వామీజీ సన్యాస , గృహస్థ శిష్యులందరినీ శ్రీబలరాంబోసుగారి ఇంటిలో ఏర్పాటుచేయబడ్డ సమావేశానికి రమ్మని కబురు పెట్టారు. ఆ విధంగా రామకృష్ణ మిషన్ మే , 1897 లో ఏర్పాటయింది. స్వామీజీ మిషన్ కోసం ప్రతిపాదించిన లక్ష్యాలు , ఆదర్శాలు పూర్తిగా ఆధ్యాత్మికమైనవి , మానవసేవకు ఉద్దేశించినవి. ఆయన తన భావాలకు కార్యరూపాన్ని ఇవ్వడానికి ఆ విధంగా ఒక యంత్రాంగాన్ని ప్రారంభించారు.

కలకత్తా నగరంలో 1898 వ సంవత్సరంలో ప్లేగువ్యాధి ప్రబలినప్పుడు సన్న్యాసుల , గృహస్థ భక్తుల సహాయంతో స్వామీజీ సహాయకార్యక్రమాలను ప్రారంభించారు. ప్లేగువ్యాధి అదుపులోకి వచ్చిన తర్వాత స్వామీజీ తమ పాశ్చాత్యశిష్యులతో కలిసి నైనిటాల్ , ఆల్మోరలను దర్శించడానికి వెళ్ళారు. ఆ పాశ్చాత్య శిష్యులకు ముఖ్యంగా సోదరి నివేదితకు , ఈ కాలంలో మంచి శిక్షణ లభించింది. జూన్ 16 న స్వామీజీ వీరిలో కొందరు శిష్యులతో కాశ్మీరు వెళ్ళారు. ఈ కాశ్మీరు పర్యటన స్వామీజీకి , వారి శిష్యులకు ఒక మరుపురాని అనుభూతి. జులై చివరలో స్వామీజీ , సోదరి వివేదితతో కలిసి ’అమరనాథ్’ కు వెళ్ళారు. సాంప్రదాయబద్దంగా అనుసరించాల్సిన ప్రతిచిన్న విషయాన్నీ తుచ తప్పక అనుసరిస్తూ , వంటికి బూడిద పులుముకుని , గోచీ మాత్రమే ధరించి ఆగస్టు 2 న అమరనాథ్ గుహకు చేరుకున్నారు. ఆయన శరీరంమొత్తం దివ్యావేశంతో కంపించపోసాగింది. ఒక గొప్ప యోగానుభూతి ఆయనకు కలిగింది.

శివుడే తనకు స్వయంగా దర్శనమిచ్చాడన్న దానికన్నా ఆ అనుభూతి గురించి స్వామీజీ ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు. దీని తర్వాత శ్రీనగర్ కు కొంతదూరంలో ఉన్న క్షీరభవాని మాత మందిరానికి స్వామీజీ ఒంటరిగా వెళ్ళారు. అదికూడా స్వామీజీకి ఒక మరువలేని అనుభూతి. ఆయన ఆ జగన్మాతలో పూర్తిగా లీనమైపోయారు. తాను వ్రాసిన కవితనే ఉదహరిస్తూ ఆయన ఇలా వర్ణించారు : "అదంతా నిజమే అందులో ప్రతి పదమూ సత్యమే. నేనే దాన్ని నిరూపించాను. ఎందుకంటే ఆ మృత్యురూపాన్ని ప్రత్యక్షంగా ఆలింగనం చేసుకున్నాను గనుక".

అక్టోబరు 18 కి ఆయన కలకత్తా చేరుకునే సరికి ఆయన పాలిపోయి , బాగా బలహీనపడి రకరకాల వ్యాధులతో బాధపడుతునారు. అయినప్పటికీ ఆయన అనేకపనులలో నిమగ్నమయ్యారు. గంగానది పడమరగట్టుమీద కలకత్తా నుండి ఐదు మైళ్ళ దూరంలో బేలూరు అనేచోట కొంతభూమిని కొని అక్కడ మఠనిర్మాణం ప్రారంభించారు. 1899 జనవరిలో సన్యాసులు ఆ కొత్త మఠంలోకి మారారు. ఇప్పుడది బేలూరుమఠంగా ప్రసిద్ధి పొందింది. అంతకు కొంతకాలం మునుపే ’నివేదిత బాలికల పాఠశాల’ ప్రారంభోత్సవం జరిగింది. ఇదేసమయంలో బెంగాలీ మాసపత్రిక ’ఉద్భోధన్’ ను ప్రారంభించారు. హిమాలయాలలో ఒక మఠాన్ని ప్రారంభించాలన్న స్వామీజీ చిరకాల స్వప్నాన్ని సేవియర్ దంపతులు మాయావతి (ఆల్మోరా)లో అద్వైత ఆశ్రమాన్ని నిర్మించడం ద్వారా సఫలీకృతం చేశారు. ఆంగ్లమాసపత్రిక అయిన ప్రబుద్ధభారత అంతకుముందే మద్రాసులో ప్రారంభమయింది. కానీ దాని సంపాదకులు 1898 లో అకాలమృత్యువు పాలవడంతో ఒకనెల దాని ప్రచురణ ఆగిపోయింది. ఆ మాసపత్రికను స్వామీజీ శిష్యులయిన స్వరూపానంద స్వామి సంపాదకత్వంలో అల్మోరాలో మళ్ళీ ప్రారంభించారు. 1899 లో దాన్ని మాయావతి లోని అద్వైత ఆశ్రమానికి మార్చారు.

ఈ కాలంలో అక్కడి సన్న్యాసులనూ , బ్రహ్మచారులనూ నిరంతరం ఉత్తేజపరుస్తూ , తీవ్రమైన ఆధ్యాత్మికతతోనూ , సేవతోనూ నిండిన జీవనంవైపు వారిని పురికొల్పారు. ఆయన మాటలలోనే చెప్పినట్టుగా , ’ఆత్మనోమోక్షార్థం జగద్ధితాయచ’ - ’తన స్వంత మోక్షానికి - జగతికి సేవచెయ్యడానికి’ - అన్న జీవితాదర్శాన్ని వారి ముందుంచారు.

కానీ స్వామీజీ ఆరోగ్యం రోజు రోజుకీ దిగజారుతున్నది. ఇంకొకసారి పాశ్చాత్య దేశాలకు పర్యటించాలని ఆయన అనుకున్నారు. దానివల్లనైనా ఆయన ఆరోగ్యం బాగుపడవచ్చునన్న ఆశతో సోదర సన్న్యాసులు ఆయన నిర్ణయాన్ని సమర్థించారు.

ప్రపంచాన్ని చుట్టి మరొకసారి

తురీయానందస్వామిని , సోదరి నివేదితను వెంట తీసుకుని 1899 జూన్ 20 న వివేకానందస్వామి భారతదేశాన్ని వదిలి ప్రయాణమయ్యారు. స్వామీజీతో ప్రయాణం వారిరువురికీ గొప్ప శిక్షణా కార్యక్రమంగా రూపొందించింది. సోదరి నివేదిత వారి ప్రయాణాన్ని ఇలా వర్ణించారు: "మొదటి నుంచీ చివరివరకూ రకరకాల కథల సజీవస్రవంతి ప్రవహించింది. ఏ క్షణంలో ఆయనలోని అంతర్ జ్ఞానజ్యోతి మెరిసి , ఏ కొత్త సత్యాన్ని ఖంగుమనే ఆయన కంఠస్వరంలో వినిపిస్తోందో అన్నది ఎవరికీ తెలియదు." మార్గమధ్యంలో మద్రాసు , కొలంబో , ఆడెన్ , మార్సెల్స్ మొదలైన ప్రదేశాలను తాకి , వారి ఓడ జులై 31 కి లండన్ చేరింది. ఈ ప్రయాణంవల్ల స్వామీజీ ఆరోగ్యం మెరుగుపడింది.

రెండువారాలు లండన్ లో గడిపి , స్వామిజీ న్యూయార్కుకు ఓడలో ప్రయాణమయ్యారు. అక్కడ శ్రీ లెగ్గెట్ దంపతులతో కలిసి హడ్సన్ నదీతీరంలో , రిడ్జిలీమానర్ అనే సుందరప్రదేశంలో ఉన్న వారి గ్రామీణకుటీరానికి వెళ్ళారు. నవంబర్ 5 వ తేదీ వరకు స్వామీజీ ఆ ఏకాంత ప్రదేశంలో గడిపారు. ఆ తర్వాత పశ్చిమతీరానికి పయనమయ్యారు. లాస్ ఏంజిల్స్ , ఓక్ లాండ్ , శాన్ ఫ్రాన్సిస్కోలకు వెళ్ళారు. మధ్యలో కొద్దిరోజులు చికాగో , డెట్రాయిట్ లకు కూడా పర్యటించారు. తూర్పుపశ్చిమాలు పరస్పరం సహకారం అందించుకోవడం ద్వారా మాత్రమే మరింత శక్తిమంతంగా ఎదగగలవన్న నమ్మకం ఇప్పుడు స్వామీజీకి దృఢపడింది. పాశ్చాత్యదేశాల భోగభాగ్యాల వెలుగుజిలుగులు ఆయన కళ్ళకు మిరుమిట్లుగొల్పలేదు. అదే విధంగా భారతదేశంలో ఆధ్యాత్మికతకు ఇచ్చే ప్రాధాన్యత , అక్కడి సామాజిక , ఆర్థిక వెనుకబాటుతనాన్ని ఆయనకు కనబడకుండా దాచలేక పోయింది.

స్వామీజీ నివేదితతో ఇలా చెప్పారు : "పడమటి దేశాలలో సామాజిక జీవనం పైపైన నవ్వుల పువ్వుల్ని పూయిస్తుంది కానీ వాటి క్రింద అది ఏడ్పులతో మొదలై వెక్కిళ్ళతో అంతమౌతుంది........ కానీ ఇక్కడ భారతదేశంలో పైపొర చీకట్లు కమ్ముకుని , చింతలతో నిండినట్టు కనిపించినా దాని క్రింద నిర్లక్ష్యం , ఉల్లాసం నిండివుంటాయి". పాశ్చాత్యసమాజం బయటి ప్రకృతిని జయించడానికి ప్రయత్నిస్తే , ప్రాచ్యసమాజం లోపలిప్రకృతిని జయించడానికి ప్రయత్నించింది. ఇప్పుడు , వారివారి ప్రత్యేకతలను నాశనం చేసుకోకుండా , చేయిచేయి కలిపి , ఒండొరుల మంచి కోసం ప్రాక్పశ్చిమాలు పనిచేసితీరవలసిన సమయం ఆసన్నమైంది. పడమరదేశాలు తూర్పునుంచి నేర్చుకోవలసినది ఎంతో ఉంది , అదే విధంగా , తూర్పు పడమర నుంచి నేర్చుకోవలసినది ఎంతో ఉంది , నిజానికి ఈ రెండింటి ఆదర్శాలనూ కలబోయడం ద్వారా మాత్రమే ఉజ్జ్వలభవిష్యత్తుకు రూపుదిద్దగలం. అప్పుడు తూర్పు పడమరలు మిగలవు - మానవజాతి ఒక్కటే మిగులుతుంది.

ఈ కాలంలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన ఉత్తర కాలిఫోర్నియాలో శాంతి ఆశ్రమ ప్రారంభం. తురీయానంద స్వామిని దానికి నాయకుణ్ణి చేశారు. శాన్ ఫ్రాన్సిస్కోలో కూడా ఒక వేదాంత కేంద్రం ప్రారంభించబడింది. ఈ మధ్య కాలంలోనే స్వామీజీ పశ్చిమ అమెరికా నగరాలలో అనేక ఉపన్యాసాలిచ్చారు. కానీ స్వామిజీకి దగ్గరపడుతున్న తమ అంత్యకాలం మరింత స్పష్టంగా కనపడసాగింది. ఆయన మిస్ మాక్లౌడ్ కు ఇలా వ్రాశారు: "ఆ ప్రశాంతతీరానికి నా నావ చేరుతున్నది. అక్కడ నుంచీ మళ్ళీ అది బయలుదేరదు !"

అంతర్జాతీయ సదస్సు సందర్భంగా పారిస్ లో జరుగుతున్న మతచరిత్ర సభలలో పాల్గొనడానికి స్వామీజీ 1900 ఆగస్టు 1 న విచ్చేశారు. కొందరు స్నేహితులు కలిసి ఆయన అక్టోబరులో పారిస్ వదిలి హంగేరీ , రుమేనియా , సెర్బియా , బల్గేరియాలను దర్శించి చివరిగా కాన్ స్టాంటినోపుల్ చేరుకున్నారు. అక్కడ నుండి ఏథెన్స్ మీదుగా కైరో చేరుకున్నారు. కైరోలో స్వామీజీకి అకస్మాత్తుగా భారతదేశానికి వెళ్ళిపోవాలనిపించింది. కెప్టెన్ సెవియర్ మరణించి ఉండవచ్చునని ఆయనకు మనస్సులో తోచింది. అక్కడనుంచి బయలుదేరే మొదటి ఓడలో ఎక్కి స్వామీజీ వేగంగా భారతదేశానికి చేరుకుని 1900 డిసెంబర్ 9 న బేలూరుమఠం చేరుకునారు. తన రాక గురించి వాళ్ళకి ముందుగా తెల్పలేదు. అకస్మాత్తుగా ఆయన అలా రావడం సోదర సన్యాసులకు , శిష్యులకు పట్టలేని ఆనందాన్ని కలిగించింది.
⚜️🫐✡️🌸🕉️🌀🦚🦅🍏🌺🌴⚜️

సేకరణ

భోజనానంతరం విస్తరిని ఉంచుకుంటామా? (ఆశ్రమ డాక్టర్ ఎం.అనంతనారాయణరావు స్మృతుల నుంచి).

భోజనానంతరం విస్తరిని ఉంచుకుంటామా?
(ఆశ్రమ డాక్టర్ ఎం.అనంతనారాయణరావు స్మృతుల నుంచి).

చరమాంకం వరకు మౌనంలో, ధ్యానంలో గడిపారు రమణ మహర్షి. అప్రమేయంగా సాగిన స్వల్ప సంభాషణలు తప్ప ఆయన ఎక్కడా ప్రసంగించలేదు. సంకేత మాత్రంగా స్వీయ శోధనను తప్ప దేనినీ ప్రవచించలేదు. ఆత్మసాక్షాత్కారం కోసం కౌమారంలోనే అరుణాచలం చేరుకున్న ఈ మహా రుషిలోని ఏ చిన్న కోణాన్నీ చిక్కువిప్పుకోడానికైనా ఎంత శక్తీ, ఎంత కాలమూ సరిపోదు. అందుకే - ఆయనతో దీర్ఘకాల ఆశ్రమ బాంధవ్యం ఉన్న ఓ వైద్యుని స్మృతులలో నుంచి ఈ నివాళి.

ఓ రోజు (1948 డిసెంబరులో) శ్రీ భగవాన్ చేతిని మర్దనా చేస్తూంటే మోచేతికి కాస్త పైభాగంలో ఉన్న కణితిని గమనించాను. 1949 జూలై నాటికి ఆ భాగమంతా పచ్చి పుండు అయింది. ‘‘నయం కావాలన్న సంకల్పం మీకు ఉండాలి. సంకల్పించుకోండి’’ అని ప్రాధేయపడ్డాను. వారు చిరునవ్వు నవ్వి మౌనంగా ఉండిపోయారు. నేను మళ్లీ అర్థించాను. అప్పుడు వారు, ‘‘ఇక్కడ మనస్సంటూ ఏమీ లేదు. కాబట్టి సంకల్పించే ప్రసక్తే లేదు’’ అన్నారు.
భగవాన్ శ్రీ రమణ మహర్షికి దేహం గానీ, దాని రోగాలు కానీ పట్టవు. పుండుకు కట్టు కడుతున్నప్పుడు నొప్పి అనివార్యం. కానీ వారు ఏ బాధనీ కనబరచలేదు. పెపైచ్చు ఆ కట్టు కట్టడానికి కుడిచేతితో సహాయం చేసేవారు... ఆ పుండు ఇంకెవరిదో అయినట్టు!

వారి పుండుకు కట్టు కట్టే ముందు ఆ ప్రాంతాన్ని స్పిరిట్‌తో శుభ్రం చెయ్యాల్సి వచ్చేది. ఓసారి ఆ స్పిరిట్ చేతి మీదకు వచ్చింది. వెంటనే వారు, ‘‘స్పిరిట్ స్నానం అయింది నాకు’’ అన్నారు. అందరికీ అటువంటి స్పిరిట్ స్నానం అవసరమని కూడా అన్నారు. ఆ మాటల అంతరార్థమేమిటో తెలియక, వివరించి చెప్పమని కోరాను. వారు చిరునవ్వుతో ఇట్లా చెప్పారు. ‘‘చేపలు ఎప్పుడూ నీటిలోనే ఉంటాయి.

బయటికి వస్తే బ్రతకలేవు. అట్లాగే మనం ఎప్పుడూ స్పిరిట్‌లోనే, అంటే శుద్ధ చైతన్యంలోనే ఉంటాం, ఉండాలి. ప్రయత్నపూర్వకంగా శుద్ధచైతన్యంలో, అంటే ఆత్మలోనే ఉండాలి.’’

ఈ మాటల వల్ల వారెప్పుడూ సహజ సమాధిలోనే ఉంటారని నమ్మకం కలిగింది నాకు. శ్రీ భగవాన్ తరచు చిన్న చిన్న విషయాలలో కూడా ప్రగాఢమైన బోధనలు చేసేవారు. ఆ బోధనలకు మనపై గట్టి పట్టు ఉండేది.
1949లో ఒకసారి శ్రీ భగవాన్, ‘మనం సంతోషంగా ఉన్నప్పుడు కన్నీరు ఆవలి కొన నుంచీ, విచారంగా ఉన్నప్పుడు లోపలి కొన నుంచీ వస్తుంది’ అని చెప్పారు. అది నిజమే.

మహా నిర్వాణ దినం నాడు 1950 ఏప్రిల్ 14న వారి గదిలో నేనూ ఉన్నాను. వారి కోరిక మీద వారు కాళ్లు చాచుకుని కూర్చోవడానికి ఏర్పాటుచేశాం. వారు కళ్లు మూసుకున్నారు. శ్వాస నెమ్మదిగా సాగుతోంది. బయట భక్తులు ‘అరుణాచల శివ స్తోత్రం’ పాడుతున్నారు.

ఒక్కసారి కళ్లు తెరిచి, ఆ పాట వస్తున్న వైపు చూసి, మళ్లీ కళ్లు మూసుకున్నారు. వారి కళ్ల ‘ఔటర్ కాన్తస్’ నుంచి కన్నీరు కారింది. అంటే పరమాత్మునిలో ఐక్యమయ్యేటప్పుడు కలిగే ఆనందానికి ఆ కన్నీరు బాహ్యరూపం అనుకున్నాను. దేహాన్ని ఎంతో ప్రశాంతంగా విడిచారు. శ్రీ భగవాన్ రమణ మహర్షి అదేరోజు సాయంత్రం 8 గం. 47 ని.లకు శివైక్యం పొందారు.
తన బాధ గురించి దుఃఖిస్తున్నవారి పట్ల కరుణ ఉండేది శ్రీ భగవాన్‌కి. ఆయనెప్పుడూ అసలు సత్యాన్నీ, తన బోధనలో ప్రధానాంశమైన ‘‘మనం దేహం కాదు’’ అనే మాటను జ్ఞాపకం చేస్తుండేవారు. తనదైన రీతిలో ఒక మాట అడిగేవారు కూడా. ‘‘భోజనానంతరం విస్తరిని ఉంచుకుంటామా?’’ అని.

సేకరణ

వివాహమైన రోజున ఆలయాన్ని రక్షించడానికి ఔరంగజేబుసైన్యంతో పోరాడుతూ 7 వేల మొఘల్ సైన్యాన్ని ఒక్కడే మట్టుపెట్టి అమరుడయిన సుజన్ సింగ్ షెకావత్ వీర యోధుడు...

వివాహమైన రోజున ఆలయాన్ని రక్షించడానికి ఔరంగజేబుసైన్యంతో పోరాడుతూ 7 వేల మొఘల్ సైన్యాన్ని ఒక్కడే మట్టుపెట్టి అమరుడయిన సుజన్ సింగ్ షెకావత్ వీర యోధుడు...

ఔరంగజేబు సైన్యానికి వ్యతిరేకంగా పోరాడి, ఆలయాన్ని రక్షించడానికి వివాహం చేసుకున్న రోజున వీరమరణం పొందిన అటువంటి గొప్ప యోధుని జీవితాన్ని ఈ రోజు తెలుసుకుందాం...

భయానక సంఘటన:
అది 7 మార్చి 1679 AD నాటి విషయం, ఠాకూర్ సుజన్ సింగ్ తన పెళ్లి ఊరేగింపును తీసుకువెళుతున్నాడు, సుజన్ సింగ్, దేవతలా కనిపించాడు,
దేవతలు తమ ఊరేగింపు తీసుకుంటున్నట్లుగా ఉంది

అతను తన పెండ్లికూతురు ముఖం కూడా చూడలేదు, సాయంత్రం అయ్యింది, కాబట్టి మిగిలిన రాత్రికి అతను "ఛపోలీ"లో ఆగిపోయాడు. కొద్ది క్షణాల్లోనే, ఆవుల కొమ్ముల శబ్దం అతనికి వినిపించింది, స్వరాలు స్పష్టంగా లేవు, అయినప్పటికీ వారు వినడానికి ప్రయత్నించారు, ఆ స్వరాలు తమకు ఏదో చెబుతున్నట్లుగా.

సుజన్ సింగ్ తన ప్రజలను ఉద్దేశించి, బహుశా ఇది గొర్రెల కాపరుల గొంతు కావచ్చు, వారు చెప్పేది వినండి.
"డియోడ్"లో కొంత సైన్యం వచ్చిందని యువరాజ్ చెబుతున్నారని డిటెక్టివ్‌లు తెలియజేశారు. వారు ఆశ్చర్యపోయారు. ఎలాంటి సైన్యం, ఎవరి సైన్యం ఏ ఆలయానికి వచ్చింది?

సమాధానం వచ్చింది, "యువరాజ్, ఇది ఔరంగజేబు యొక్క చాలా పెద్ద సైన్యం, అతని కమాండర్ దరబ్ ఖాన్, అతను ఖండేలా వెలుపల శిబిరాన్ని ఉంచాడు.
రేపు ఖండేలాలోని శ్రీకృష్ణ దేవాలయాన్ని కూల్చివేయనున్నారు. నిర్ణయం తీసుకోబడింది,ఒక్క క్షణంలో అంతా మారిపోయింది. వివాహం యొక్క సంతోషకరమైన ముఖాలు అకస్మాత్తుగా గట్టిపడ్డాయి, మృదువైన శరీరం పిడుగులా గట్టిగా మారింది.
సైన్యంగా మారిన బారాతీలు తమ సైన్యంతో చర్చించడం ప్రారంభించారు. అప్పుడు అతని దగ్గర కేవలం 70 మందితో కూడిన చిన్న సైన్యం ఉందని తెలిసింది.
ఆ తర్వాత రాత్రివేళ, ఒక్క క్షణం కూడా వదలకుండా, దగ్గర్లోని ఊరి నుండి కొంతమంది మనుషులను సమకూర్చాడు.
అతనికి ఇప్పుడు దాదాపు 500 మంది గుర్రపు సైనికులు ఉన్నారు.

ఒక్కసారిగా డోలీలో కూర్చున్న తన మొహం కూడా చూడలేని భార్య గుర్తొచ్చింది.

రకరకాల ఆలోచనల్లో కూరుకుపోయాడు..అప్పుడు తన తల్లికి రాజ్‌పుత్ మతాన్ని వదలను అని వాగ్దానం చేసిన మాటలు గుర్తొచ్చాయి, అతని భార్యకు కూడా అంతా అర్థమైంది, ఆమె డోలి వైపు చూసి.అతనికి భార్య చేతులుతో చూపిస్తోంది. మెహేంది యొక్క. ఆమె ముఖంలో సంతోషం వెల్లివిరిసింది, ఆమె నిజమైన క్షత్రియుని విధులను నిర్వహిస్తోంది, ఆమె స్వయంగా కత్తిని తీసుకొని శత్రువుపై దాడి చేయాలనుకుంది, కానీ ఇది జరగలేదు.

సుజన్ సింగ్ డోలీకోసం వెళ్లి డోలీకి మరియు అతని భార్యకు నమస్కరించాడు మరియు భార్యని సురక్షితంగా తన రాజ్యానికి పంపమని కహార్లు మరియు మంగలిని ఆదేశించాడు మరియు ఖండేలాను చుట్టుముట్టాడు మరియు ఆలయాన్ని కాపలా కాయడం ప్రారంభించాడు.

ఆ ఆలయాన్ని కృష్ణుడే కాపలా కాస్తున్నట్లు, ఆయన ముఖం కూడా శ్రీకృష్ణుడిలా ప్రకాశించేదని ప్రజలు చెబుతారు.

మార్చి 8, 1679న, ​​దరాబ్‌ఖాన్ సైన్యం ముఖాముఖికి వచ్చింది, మహాకాల్ భక్తుడు సుజన్ సింగ్ తన అధిష్టాన దేవతను జ్ఞాపకం చేసుకున్నాడు మరియు హర్ హర్ మహాదేవ్ చప్పట్లతో, 10 వేల మంది మొఘల్ సైన్యంతో సుజన్ సింగ్ యొక్క 500 మంది వ్యక్తుల మధ్య భీకర యుద్ధం ప్రారంభమైంది.
సుజన్ సింగ్ దరాబ్ ఖాన్‌ను చంపడానికి దరాబ్ ఖాన్ చుట్టూ ఉన్న 40 మంది అంగరక్షకులను మొఘల్ సైన్యాన్ని చంపడానికి అతని వైపు పరుగెత్తాడు. అటువంటి పరాక్రమాన్ని చూసి, దారాబ్ ఖాన్ వెనక్కి తగ్గడమే మంచిదని భావించాడు, కానీ ఠాకూర్ సుజన్ సింగ్ ఆగడం లేదు.
ఎదురుగా వస్తున్న వారిని చంపేస్తున్నారు. సుజన్ సింగ్ నిజమైన మృత్యువు రూపంలో పోరాడుతున్నాడు. మహాకాళుడే పోరాటానికి వచ్చినట్టు అనిపించింది, కొంత సేపటికి మొఘల్ సేనలో దాదాపు సగానికి పైగా సేనలు మరణించారు
ఇంతలో కొందరి చూపు సుజన్‌సింగ్‌పై పడింది.
అయితే సుజన్ సింగ్ శరీరంలో తల లేదు కానీ తలలేని సుజన్ సింగ్ శరీరం యుద్ధం ఆపలేదు

ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు, కానీ సుజన్ సింగ్ మోక్షం పొందాడని వారి స్వంత వ్యక్తులకు అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు.
వారు చేస్తున్న యుద్ధం సుజన్ సింగ్ యొక్క సైనికులు. అందరూ మనసులో తల వంచుకుని పీఠాధిపతి కృష్ణభగవానునకు నమస్కరించారు.

ఇప్పుడు దరాబ్ ఖాన్ చంపబడ్డాడు, మొఘల్ సైన్యం పరారీలో ఉంది, కానీ సుజన్ సింగ్ గుర్రంపై తల లేకుండా మొఘల్‌లను చంపుతున్నాడు.

7 వేల మంది మొఘలుల సైన్యాన్ని సుజన్ సింగ్ ఒక్కడే హతమార్చాడన్న వాస్తవాన్ని బట్టి ఆ యుద్దభూమిలో ఎలాంటి మృత్యుభయం జరిగింది. మిగిలిన మొఘల్ సైన్యం పూర్తిగా ప్రళయభయంతో అరుస్తూ పారిపోయినప్పుడు, కేవలం శరీరం మాత్రమే అయిన సుజన్ సింగ్ ఆలయం వైపు తిరిగాడు.

సుజన్ సింగ్ శరీరం నుండి వెలువడే దివ్యకాంతి ప్రకాశాన్ని ప్రేక్షకులు చూడగలిగారని, ఆ విచిత్రమైన ఆశ్చర్యకరమైన కాంతి ముందు సూర్యుని కాంతి కూడా మసకబారుతుందని చరిత్రకారులు చెబుతున్నారు.

ఇది చూసి, అతని స్వంత ప్రజలు కూడా భయపడ్డారు మరియు అందరూ కలిసి శ్రీ కృష్ణుడిని స్తుతించడం ప్రారంభించారు, గుర్రం నుండి దిగిన తరువాత, సుజన్ సింగ్ శరీరం ఆలయ విగ్రహం ముందు బోల్తా పడింది మరియు ఒక వీర యోధుడు అంతం అయ్యాడు.

హిందూ ధర్మ పరిరక్షణ కోసం తల్లి భారతి యొక్క ఈ వీర యోధుడికి నివాళులు....🙏🙏🙏🙏🙏
Copy పోస్ట్

సేకరణ

Thursday, February 3, 2022

స్త్రీ మూర్తులకి ఇవి అవసరం

🌷స్త్రీ మూర్తులకి ఇవి అవసరం🌷

1.స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ళ ఉప్పు హాఫ్ స్పూన్ వేసుకుని స్నానం చేస్తే దిష్టి పోతుంది.

2. బయటకు వెళ్లే ముందు ఛాతీ పైన చిన్న కాటుక కనపడకుండా పెట్టుకుంటే ఎదురు దిష్టి తగలదు..

3.అరికాలు లో కాటుక కానీ కాస్త ఒక డ్రాప్ కొబ్బరి నూనె కానీ రాసుకుంటే మీ వెంట వెళ్లిన చోట నెగటివ్ పవర్ వెంట రాదు..

4.తల స్నానం చేశాక వారానికి ఒక సారి అయినా తల వెంట్రుకలుకు సాంబ్రాణి వేసుకోవాలి ఆడవాళ్లపైన పడే చెడు దృష్టి అంతా వెంట్రుకలను అంటి ఉంటుంది అది పోతుంది..

5.అష్టమి, అమావాస్య, ఆదివారం ఇలాంటి రోజుల్లో కచ్చితంగా దుర్గా స్త్రోత్రం చదవడం దుర్గమ్మ గుడికి వెళ్లడం , బైరావుడిని తలుచుకుని నమస్కారం చేయడం మంచిది..

6. ఉదయం లేవగానే 21 సార్లు గం గణపతయే నమః అని తలుచుకుని పడక దిగాలి , నిత్యం రాత్రి వేళ హనుమాన్ చాలీసా కానీ లేదా 11 సార్లు ఓం నమఃశివాయ అని కానీ తలుచుకుని నిద్రపోతే మంచిది.

7.మీ జన్మ నక్షత్రం రోజు మీ ఇంటి దేవుడు ఎవరో ఆ గుడికి వెళ్లి అర్చన చేసుకోవాలి ఉదా: వెంకటేశ్వర స్వామి అయితే మీ జన్మ నక్షత్రం రోజు కచ్చితంగా దగ్గరలో ఉన్న గుడికి వెళ్లి అర్చన చేసి రావాలి.

8.తలకు నూనె పెట్టుకోవడం లేదు చాలా మంది అలా డ్రై గా ఉంచకుండా తల లో ఎదో ఒక చోట చుక్క నూనె అయినా రాసుకోవాలి.

9.ఇంటి విషయాలు గట్టిగా మాట్లాడ కూడదు కొత్తవారికి కష్టాలు చెప్పుకో కూడదు పరిచయం లేని వారిని సహాయం కొరకూడదు..

10. పండగ రోజుల్లో సెలవు దినాల్లో, కనీసం శుక్రవారం రోజు అయినా పాదాలకు పసుపు పూసుకోవాలి..మంగళవారం రోజుమోహనికి పసుపు రాసుకుంటే చెడు దృష్టి పడదు..

11.కుటుంబ సభ్యులు దగ్గర ఏది దాపరికం ఉండకూడదు..

12. అతి చనువు ఎప్పటికీ ప్రమాదమే, మొండి ధైర్యం మొదటికే మోసం. ఇవన్నీ పెద్దవాళ్ళు కాలం నుండి వస్తున్న పద్దతులు .

13. నిత్య దీపారాధన అలవాటు చేసుకోవాలి , అమంగళం పలక కూడదు..పొలాలు బీడు ప్రాంతంలో ఏదైనా దొరికి న వస్తువులు తెచ్చి దాచ కూడదు కొన్ని మంత్రించి దాచినవి ఉంటుంది..

14. గొరోజనం వశీకరణకువాడుతారు మీకు తెలియని కొత్త వారి నుండి మాంత్రికులు తాంత్రికులు నుండి చేతికి ఏది నేరుగా తీసుకోకూడదు.

15 చీకటి పడ్డాక ఒంటరిగా బయటకు వెళ్ళాలి అంటే తోడు లేకుండా వెళ్ల కూడదు నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఒంటరిగా పగలు కూడా తిరగకూడదు ముఖ్యంగా వెంట్రుకలు విరబోసుకుని తిరగకూడదు...

(సేకరణ) మీ రవిచంద్ర విశ్వకర్మ !!
👏సర్వేజన సుఖినో భవంతు👏

సేకరణ

మనదేశం కోల్పోయిన అద్భుత ఆలయాలు మతోన్మాదుల దాడులు తట్టుకునినిలిచిన భారతీయ శిల్ప వాస్తుశాస్త్రంతో నిర్మాణం చేసిన అత్యంత అద్భుత కళా సంపద ఉన్న ఆలయాలు నగరాల్లో కొన్ని

 

❤️ మనదేశం కోల్పోయిన అద్భుత ఆలయాలు మతోన్మాదుల దాడులు తట్టుకునినిలిచిన భారతీయ శిల్ప వాస్తుశాస్త్రంతో నిర్మాణం చేసిన అత్యంత అద్భుత కళా సంపద ఉన్న ఆలయాలు నగరాల్లో కొన్ని:~
💕 కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) -కుశార్, పాకిస్తాన్
💕 లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) -లాహోర్, పాకిస్తాన్
💕 తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షకుడు నిర్మించిన నగరం)తక్షశిల,పాకిస్తాన్
💕 పుష్కలావతి /పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండోకొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం)పెషావర్, పాకిస్తాన్ (భాగవతం,మహాభారతం)
💕 మహావిష్ణువు గజేంద్రుణ్ణి మొసలి బారి నుంచి రక్షించిన స్థలం - దేవ్ ధాం,నేపాల్
💕 నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం, ఆంధ్రప్రదేశ్
💕 జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్
💕 మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప్రదేశ్
💕 శమంతక పంచక (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు),కురుక్షేత్రం,
💕 దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా
💕 పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి సముద్ర జలాలను వెనక్కి పంపి తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) - కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర, సముద్రతీర ప్రాంతం
💕 మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) - పశ్చిమ ఒరిస్సా
💕 నిషాద రాజ్యం(నలమహారాజు రాజ్యం) గ్వాలియర్,మధ్యప్రదేశ్
💕 వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్
💕 నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు
బోధించిన ప్రాంతం) - సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్
💕 వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు- మన గ్రామం, ఉత్తరాంచల్
💕 రతిష్టానపురం (పురూరవుని రాజధాని) ఝాన్సీ,అలహాబాద్
💕 సాళ్వ రాజ్యం(సావిత్రీ, సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)- కురుక్షేత్ర దగ్గర
💕 హస్తినాపురం (కౌరవుల రాజధాని)హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్
💕 మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్
💕 వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర
💕 కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) - గ్వాలియర్
💕 మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) – పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్
💕 ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్
💕 గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) - గురుగావ్, హర్యానా
💕 కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం – కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్)
💕 పాండవుల లక్కగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్
💕 కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం - గిర్నార్,గుజరాత్
💕 శ్రీకృష్ణ,బలరాముల ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్.
💕 హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) జలాన్,ఉత్తర్ ప్రదేశ్
💕 విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) - విదర్భ, మహరాష్ట్ర
💕 కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) - కుండినపుర, మహరాష్ట్ర
💕 చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) – బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్
💕 కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం)దాతియ,మధ్యప్రదేశ్
💕 ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర
💕 కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్
💕 పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) - ఎటాహ్,సహజహంపూర్
,ఫారుఖాబాద్,ఉత్తర్ ప్రదేశ్
💕 కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు, మత్స్యయంత్ర బేధన స్థలం) -
కంపిల్, ఉత్తర్
💕 జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి,బీహార్
💕 కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన
ప్రాంతాలు) - పశ్చిమ హర్యానా
💕 మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్, గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం,రాజస్థాన్
💕 విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్ నగర్,రాజస్థాన్
💕 శోణపురం (బాణాసురుడి రాజధాని) - సోనిత్ పూర్, అస్సాం
💕 ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) - తేజ్ పూర్, అస్సాం
💕 నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం –ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్
💕
జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్
💕
కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)నేపాల్ లోని తిలార్కోట్
💕
బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్
💕
బుద్ధుడు నిర్యాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్.
❤️
ॐశ్రీవేంకటేశాయ నమః*

సేకరణ

Wednesday, February 2, 2022

నక్కల జనవరి, 01 సంతాప దినం❓

 *నక్కల జనవరి, 01 సంతాప దినం❓*


◆మీ ఆస్తులు *దోచుకున్న*,


◆మీ పూర్వీకుల *ప్రాణాలు తీసిన,*


◆మీ స్త్రీలను *రేపులు చేసిన,*


◆మీ స్త్రీలను *తెల్ల సైనికుల కామానికి బలిచేసిన*


◆తమ దగ్గర పని చేసిన *స్త్రీలను వాడుకొనిన,* 


◆మిమ్మల్ని *కట్టు బానిసలుగా చూసిన,*


◆మీ మతాన్ని , సంప్రదాయాలను *మూఢనమ్మకాల పేరుతో దాడి చేసిన,*


◆మీ వేల సంవత్సరాల *చరిత్రను కత్తిరించిన,* 


◆తప్పుడు ఆర్య-ద్రవిడ *కుట్ర సిద్దాంతాలు ప్రచారం చేసిన,*


◆మీలోని కొందరిని వారి *ఏజెంట్లుగా నియమించుకొని,*

వారి ద్వారా 

*హైజాక్ రాజకీయాలు,* సాంఘీక, మత, ఆర్థిక *సంస్కరణలు పేరుతో ,*

విదేశీ ఇజాలను *చొప్పించి*, కలుషితం చేసిన,


◆మీ పచ్చటి స్వయం పాలన గ్రామ వ్యవస్థను *ధ్వంసం చేసిన,*

◆మీ చేనేత కళాకారుల *వ్రేళ్ళు విరగొట్టిన,*


◆మిమ్మల్ని *కుతంత్రాలతో విభజించి,* రాజ్యాన్ని *పాలించిన*


◆భారతదేశాన్ని *అనేక ముక్కలు చేసిన* 


● మీ ధనంతో రవి అస్తమించని *సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన*,


◆మనకు సంబంధంలేని రెండు ప్రపంచ యుద్దాల్లో *40 లక్షల పైగా భారతీయ సైనికుల వాడుకున్న,*


●కేవలం ఆహారం సప్లయి చేయకుండా, *7.5 లక్షల బెంగాలీలను ఆకలి చావులకు గురిచేసిన*(1942)


◆జాతి వివక్ష, జాతీఅహంకారం *ఆక్రమ పాలకులైన,*


 *బ్రిటిష్ నక్కల jan 01కి* 

జరపాలసింది - వేడుకలా ❓ లేక *సంతాప దినమా❓*


        ```Both are not same.``` 


*ఆలోచించండి భారతీయులారా*🤔🇮🇳

       *ముఖ్యంగా* _భారతీయ ధనవంతులు, సెలబ్రెటీలు ఇక  పై ఆ వేడుకలు వద్దు అని ప్రార్థన

అప్పట్లో అలా... ఇప్పటితో పోల్చితే

అప్పట్లో అలా... ఇప్పటితో పోల్చితే.---//-

1980 - 90లలో జీవనం ఎలా వుండేది? తెలియాలంటే మాత్రం తప్పని సరిగా చదవాలి మరి...

డబ్బుకు ప్రాధాన్యం ఇప్పటి తో పోల్చితే, అపుడు బాగా తక్కువ.

2000 కు ముందు వరుసగా 3, 4 ఏళ్లు కరువు వచ్చినా, బియ్యం, తదితర నిత్యావసరాల ధరలు పెరగలేదు.

విశాలమయిన ఇళ్ళు. అపార్ట్మెంట్స్ దాదాపుగా లేవు.

రోజూ ఇంటికి భిక్షానికి వచ్చి, పెట్టిన అన్నం, కూరా సంతోషంగా తీసుకుని వెళ్ళే వారు.

సంక్రాంతి వస్తుందంటే, పోటీలు పడి అమ్మాయిలు ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులేశే వారు.

కేటరింగ్లు లేవు. ఏ శుభకార్యం జరిగినా, బంధువులు పది రోజులు ఉండి, తలా చెయ్యి వేసి, వంటల నుంచీ బట్టలు ఉతికే వరకు అన్నీ చేసే వారు.

పిల్లలకు స్వీట్స్, కారప్పూస అన్నీ ఇంటిలోనే తయారు చేసి, అత్తయ్యలు తెచ్చేవారు.

ఎందరో పిల్లలు బంధువుల ఇళ్ళల్లో ఉంటూ చదువుకునే వారు.

బంధువులు వస్తే రెండు మూడు వారాలు ఉండి వెళ్ళే వారు. వాళ్ళు వెళ్లి పోతుంటే పిల్లలు, వెంటపడి అపుడే వెళ్ళవద్దు అని ఏడిచేవారు. ఇపుడు బంధువులు వస్తున్నారంటే ఏడుస్తున్నారు.

ఎంత దూరమైనా ఊళ్ళో నడిచి లేక సైకిల్ పైనే వెళ్లే వాళ్ళం. ఇపుడు ఇంటి పక్క షాప్ కైనా, బండి తీయాల్సిందే.

సైకిల్ కు హెడ్ లైట్ లేక పొతే ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేసే వారు. సైకిళ్లకు లైసెన్స్ లు కూడా ఉండేవట.

రిక్షా వాడు బాడుగకు పావలా తక్కువకు బేరమాడితే, ఇంకో పది పైసలు ఇప్పించండి బాబు అని బతిమాలే వాడు. ఇపుడు ఆటో వాడు, చెప్పిన రేట్ కు తక్కువ అడిగాం అనుకో, అతను తిట్టి పోకుండా ఉంటే మన అదృష్టం.

స్కూటర్, లునా, మోఫా ఉండేవి. స్కూటర్ అంటే బజాజ్ చేతక్. బుకింగ్ చేస్కుంటే, 1– 2 years తరువాత వచ్చేది.

ట్రైన్ రావడానికి కొంత ముందు స్టేషన్ కు వెళ్లి, రిజర్వేషన్ అప్పటికి అపుడే చేయించుకునే వారు, దొరుకుతుందో లేదో అని ఆందోళన లేకుండా!

సాయంత్రం ట్రైన్ లో వెళ్తుంటే, స్టేషన్ ల మధ్య గూళ్లకు చేరుకుంటున్న వేల కొద్దీ పక్షుల సందడి కనబడేది, వినబడేది. ఇపుడు ఏమీ లేదు. నిశ్శబ్ధం.

ట్రైన్, బస్ ల లో మనుషులు మాట కలిపి, తెలియని వారయినా కష్ట సుఖాలు చెప్పుకునే వారు. ఇపుడు తెలియని వారితో మాట్లాడితే, ప్రమాదమే!

కుటుంబంకి ఫ్యామిలీ డాక్టర్ ఉండే వారు. ఇన్ని కొత్త రోగాలు, స్పెషలిస్ట్ లు లేరు.

టెన్త్ లో 60% ఫస్ట్ క్లాస్ వచ్చినదంటే చాల గొప్ప.

ఇంటిలో నాయనమ్మ, తాతయ్యలు తప్పక ఉండే వారు.

కూల్ డ్రింక్ అంటే Gold Spot యే!

ప్రతి వేసవి సెలవులు తప్పక అమ్మమ్మ, తాతయ్య ల ఇంటికే. మధ్యాహ్నం చెట్లు ఎక్కడం, కాయలు కోయడం తప్పనిసరి.

నీళ్లు ఎక్కడ ఏ pump క్రిందనైనా త్రాగేసే వారు. వాటర్ ఫిల్టర్ లు లేవు.

వేసవిలో రోజూ సాయంత్రం 7 కు కరెంట్ పోయేది. కిరోసిన్ తో పని చేసే లాంతర్లు, ముగ్గు తో తోమి సిధ్ధం చేసే వారు.

గ్రామాల్లో ఎద్దుల బండ్లు పై సరదా సవారీ.

కోడి కూత తో నే నిద్ర లేవటం. అలారం లు లేవు.

అందరి ఇళ్ళలో నీటి బావులు, వేడి నీటికి బాయిలర్ లు లేక బొగ్గుల కుంపటి ఉండేవి.

ఏడు పెంకులాట, గిల్లీ దండా, దాగుడు మూతలు, గాలి పటాలు, గోళీకాయల ఆటలు, గల్లీ క్రికెట్, కోతి కొమ్మచ్చి, సైకిల్ పందేలు, ఇవే మన ఆటలు.

ఉత్తరాలు కార్డ్, ఇన్లాండ్ లెటర్స్ ప్రధాన సమాచార వారధి. అపుడపుడు ట్రంక్ కాల్ . Telegram వచ్చింది అంటే దడే…అర్ధరాత్రి అయినా వచ్చి తలుపు కొట్టి ఇచ్చే వారు.

Telephone, fridge, TV లు ఉన్నవారు గొప్ప ధనవంతుల కిందే లెక్క.

బంగారం 10 గ్రాములు సుమారు 4000, సాగర్ నగర్ లో MIG flat సుమారు 80,000. షేర్స్ 1992 జనవరి లో సెన్సెక్స్ 1001.

కాలేజీల్లో చదివే పిల్లలకు డబ్బులు పంపాలంటే, money ఆర్డర్ యే గతి. అది తెచ్చిన పోస్ట్ మాన్ కు 2 రూపాయలు బహుమానం!

ఇంటికి పిల్లలు ఉత్తరం రాసి పంపిస్తే, దానిని పోస్ట్ మాన్ యే చదివి, వారికి వినిపించే వారు.

సినిమాకు వెళ్ళడమే గొప్ప ఆటవిడుపు. సినిమా ప్రచారం గూడు రిక్షా, పాంఫ్లెట్లు, పోస్టర్లు.

ప్రసాద్ పెన్, అశోక్ పెన్, హీరో ఫౌంటైన్ పెన్ లు చాలా పేరు గాంచినవి. Reynolds ball పాయింట్ పెన్ అంటే క్రేజ్!

స్కూళ్లకు పిల్లల కోసం గూళ్ళ రిక్షాలు ఉండేవి. 5,6 తరగతులు కు వచ్చారంటే పిల్లలే నడిచి స్కూల్ కి వెళ్లి పోయేవారు. పికప్ డ్రాప్ లు లేవు.

దీపావళి కు పది నుంచి నెల రోజుల ముందే టపాసులు పేలుతుండేవి. తారాజువ్వలు, సిసిండ్రీలు పిల్లలే తయారు చేసుకునే వారు.

గుడులలో హరికథా కాలక్షేపం సర్వ సాధారణం.

Theater కు వెళ్తే, నేల, బెంచి, కుర్చీ, బాల్కనీ టికెట్లు. Theater లోపల సిగరెట్లు బీడీలు కాల్చుతు సినిమాలు చూసే వారు. అలానే ట్రైన్స్, హోటల్స్, బస్ ల లో కూడా యధేచ్చగా…

సినిమా పాటలకు లిరిక్స్ పుస్తకాలు పావలకు అమ్మేవారు.

పౌరాణిక, కుటుంబ, సామాజిక, భక్తిరస చిత్రాలదే రాజ్యం.

పెద్దలకు వార్తా పత్రిక లు ఈనాడు, ఆంధ్ర జ్యోతి, ఆంధ్ర ప్రభ, ఉదయం, వార్త, ప్రజా శక్తి. పిల్లలకు: చందమామ, బొమ్మరిల్లు, బాల జ్యోతి. గృహిణులకు: ఆంధ్ర భూమి, స్వాతి వారపత్రిక లు. యువకులకు: యువ, స్వాతి మాస పత్రికలు. పెద్దవారికి Readers Digest. ప్రభుత్వ ఉద్యోగార్థులకు Employment News Weekly.ఇలా!

వార్తలంటే రేడియో, సినిమా పాటలంటే శుక్రవారం సాయంత్రం 7 గంటలకు, అరగంట చిత్ర లహరి .సినిమా అంటే నెల కో, రెండు నెలలకో DD National లో వచ్చే తెలుగు సినిమా వచ్చేది.
దసరా, సంక్రాంతి పండక్కి ఫ్రెండ్స్ తో కలసి సరికొత్త సినిమాలు చూడటం అదోక గమ్మత్తైన సరదా.
ఎవరైన ఫ్రెండ్స్ తను చూడని సినిమా చూసివుంటే వారితొ ఆ సినీమా కథ అడిగి మరీ చెప్పించు కోవడం మహా సరదా.
👆ఇలా గమ్మత్తైన విషయాలు ఎన్నో, ఎన్నేనో..అప్పటి రోజులు గడిపిన వారికి మరుపురాని మధురానుభూతులు.ఆ పాత మధురాలు...తిరిగి రాని అమృత్సోవాలు...
కాదంటారా ఫ్రెండ్స్!!!అవునంటారని నా భావన...
సమయం పెట్టి చదివిన మీకు అభినందనలతో 💐🙏----//-

సేకరణ

Nine Personal Finance Rules we all must know

 

@TradeTricks24

An Interesting Read...Fwd.

Nine Personal Finance Rules we all must know

1) Rule of 72 (Double Your Money)
2) Rule of 70 (Inflation)
3) 4% Withdrawal Rule
4) 100 Minus Age Rule
5) 10, 5, 3 Rule
6) 50-30-20 Rule
7) 3X Emergency Rule
8) 40℅ EMI Rule
9) Life Insurance Rule

1) Rule of 72

No. of yrs required to double your money at a given rate, U just divide 72 by interest rate
Eg, if you want to know how long it will take to double your money at 8% interest, divide 72 by 8 and get 9 years.

At 6% rate, it will take 12 years
At 9% rate, it will take 8 years

2) Rule of 70

Divide 70 by current inflation rate to know how fast the value of your investment will get reduced to half its present value.

Inflation rate of 7% will reduce the value of your money to half in 10 years.

3) 4% Rule for Financial Freedom

Corpus Required = 25 times of your estimated Annual Expenses.

Eg- if your annual expense after 50 years of age is 500,000 and you wish to take VRS then corpus with you required is 1.25 crore.

Put 50% of this into fixed income & 50% into equity.

Withdraw 4% every year, i.e.5 lacs.

This rule works for 96% of time in 30 years period

4) 100 minus your age rule

This rule is used for asset allocation. Subtract your age from 100 to find out, how much of your portfolio should be allocated to equities

Suppose your Age is 30 so (100 - 30 = 70)

Equity : 70%
Debt : 30%

But if your Age is 60 so (100 - 60 = 40)

Equity : 40%
Debt : 60%

5) 10-5-3 Rule

One should have reasonable returns expectations

10℅ Rate of return - Equity / Mutual Funds
5℅ - Debts ( Fixed Deposits or Other Debt instruments)
3℅ - Savings Account

6) 50-30-20 Rule - about allocation of income to expense

Divide your income into
50℅ - Needs (Groceries, rent, emi, etc)
30℅ - Wants / Desires (Entertainment, vacations, etc)
20℅ - Savings (Equity, MFs, Debt, FD, etc)

At least try to save 20℅ of your income. You can definitely save more...

7) 3X Emergency Rule

Always put atleast 3 times your monthly income in Emergency funds for emergencies such as Loss of employment, medical emergency, etc.

3 X Monthly Income

In fact, one can have around 6 X Monthly Income in liquid or near liquid assets to be on a safer side.

8) 40℅ EMI Rule

Never go beyond 40℅ of your income into EMIs.

Say if you earn, ₹ 50,000 per month. Then you should not have EMIs more than ₹ 20,000 .

This Rule is generally used by Finance companies to provide loans. You can use it to manage your finances.

9) Life Insurance Rule

Always have Sum Assured as 20 times of your Annual Income.

20 X Annual Income

Say you earn ₹ 5 Lacs annually, yoy should atleast have 1 crore insurance by following this Rule.

These rules are equally useful for young, youth and old. Hope you will find them simple, useful and handy.

సేకరణ

ఆహా! జ్ఞాపకాల దొంతర అంటే ఇదీ!! అచ్చంగా మన బాల్యాన్నిమనమే రాసుకున్నట్టుగానే వుంది

 *బాల్యం*


జారే అరుగుల ధ్యాసే లేదు

పిర్ర పై చిరుగుల ఊసేలేదు

అమ్మ చేతి మురుకులు లేవు

అలసట లేని పరుగులు లేవు

ఎత్తరుగులు మొత్తం పోయే

రచ్చబండలూ మచ్చుకు లేవు

 వీధిలో పిల్లల అల్లరి లేదు

 తాతలు ఇచ్చే చిల్లర లేదు

 ఏడు పెంకులు ఏమైపోయే

 ఎద్దు రంకెలు యాడకి పోయె

ఎక్కడా వెదురు తడికెలు లేవు

ఏ తడికకీ భోగి పిడకలు లేవు

కూరలమ్మే సంతలు లేవు 

పెరుగులమ్మే ముంతలు లేవు

బువ్వా లాటల విందే లేదు

గవ్వలాటలు ముందే లేదు

కుప్పిగంతులు లేనే లేవు 

కళ్ళ గంతలు కానే రావు

డ్రింకు మూతల గోలే లేదు 

బచ్చాలాడే ఇచ్చా లేదు

కోతి కొమ్మచ్చి ఏమైపోయే

అవ్వా అప్పచ్చి ముందే పాయె

గూటీ బిళ్ళా గూటికి పోయే

తొక్కుడు బిళ్ళకు రెక్కలు వచ్చె

గచ్చకాయలు మచ్చుకు లేవు

చింత పిక్కలు లెక్కకూ లేవు

ధారగా కారే ముక్కులు లేవు 

జోరుగా జారే లాగులు లేవు

కొబ్బరి పుచ్చు కొరుకుడు లేదు

కొండముచ్చుని కెలుకుడు లేదు

బట్టన మురికి అంటక పోయె

మనసుకి మురికి జంటగ చేరె

కాకి ఎంగిలి కరువై పోయే

భుజాన చేతులు బరువై పోయె

అన్ని రంగులూ ఏడకో పోయె

ఉన్న రంగులూ మాసికలాయె

దానికితోడు కరోనా వచ్చె

బళ్ళూ, గుళ్ళూ మూసుక పోయె

బడిగంటల ఊసే లేదు

బడికి పోయే ధ్యాసే లేదు

మూతులన్నీ మాస్కుల పాలు

చేతులన్నీ సబ్బుల పాలు

ఆన్ లైన్ లో పాఠాలాయె

అర్థం కాని చదువులాయె

ప్రశ్నలకు జవాబులుండవు

కొన్నాళ్ళకు ప్రశ్నలే ఉండవు

ప్రస్తుత బాల్యం వెలవెల పోయె

దానికి మూల్యం ప్రస్తుత మాయే

రేపటి సంగతి దేవుడి కెరుక

నేటి బాలలకు తప్పని చురక

బాలానందం లేని జీవితం

మానవాళికే మాయని మరక.

మేమేఅదృష్టవంతులమ్*!           

1950-75 లో పుట్టిన మేము ఒక ప్రత్యేక తరానికి చెందిన వాళ్ళం. చాలా సాధారణ స్థాయి బళ్ళో చదువుకున్నా, దాదాపు మా తరం వాళ్ళు అన్ని విషయాలలో నిష్ణాతులుగా కనిపిస్తారు. 

ఆంగ్ల  మాధ్యమంలో  చదువుకోకున్నా, మాకు ఆ భాష మీద ఉండే పట్టు అమోఘం. ఒక్క ఆంగ్లమే కాదు మేము చదువుకొన్న ప్రతి విషయంలో ఎంతో ప్రతిభ చూపించేవాళ్ళము.  లెక్కలు, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం ఇంకా అనేక విషయాలు ఎంతో శ్రద్ధతో నేర్చుకునేవాళ్ళము. 

పోటీ చాలా ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో అదేమంత 

గొప్ప విషయంగా కనపడకపోవచ్చు, కానీ ఆనాడు ఉన్న *సామాజిక -ఆర్థిక* పరిస్థితులకు మేము సాధించింది చాలా ఎక్కువ అనే చెప్పుకోవాలి. 

దాదాపు ప్రతీ కుటుంబంలో కనీసం నల్గురు నుండి ఆరుగురు పిల్లలు ఉండేవాళ్ళు. *ఇంత పెద్ద కుటుంబం కేవలం తండ్రి సంపాదన పైనే ఆధార పడేది...* అంటే అందరికీ కడుపునిండా తిండి దొరకటమే కష్టం అయ్యేది.

*పొద్దున్నే చద్దన్నం, మధ్యాహ్నం మామూలు భోజనం ఉండేది. రాత్రికి కూడా అంతే.* 

పండగ రోజుల్లో మాత్రం కాస్త ప్రత్యేకంగా ఉండేది. బొగ్గుల కుంపటిలోనో, కట్టెల పొయ్యిలోనో వంటలు చేసి, ఇంత మంది పిల్లలను పెంచిన *ఆ నాటి తల్లుల ఋణం ఎంత ఇచ్చినా తీర్చుకోలేము.* 

దాదాపు అందరం దుంపల బడిలోనో ప్రభుత్వ ఉచిత పాఠశాలలోనో చదువుకొన్న వాళ్ళమే. మాలో చాలా మంది డిగ్రీ చదువులకు వెళ్లేవరకూ చెప్పులు లేకుండా నడిచిన వాళ్ళమే!  

ఆ రోజుల్లో  చాలా సాధారణంగా ఉండేది. బడి చదువులు అయిన వెంటనే తల్లి-దండ్రులు తమ బిడ్డలకు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకునేవాళ్ళు.  

ఆ రోజులల్లో ప్రభుత్వ డిగ్రీ చేసి PG చేసిన వాళ్ళు తక్కువే.

మా తరం వాళ్లకి సినిమా, రేడియో తప్ప వేరే వినోదం ఉండేది కాదు. *మూడు అణాలు ఇచ్చి తెరకు దగ్గరగా కూర్చొని చూసిన సినిమాలు ఎన్నో.* అదీ కాకుండా, రేడియోలో పాత కొత్త పాటలు వినటం ఎంతో ఇష్టంగా ఉండేది. ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు , మాధవపెద్ది సత్యం, సుశీల, లీల, జిక్కీ గార్లు పాడిన తెలుగు పాటలు అంటే పడి చచ్చేవాళ్ళం ఇక హిందీ పాటల విషయానికొస్తే, పాటల ట్యూన్ ని బట్టి సంగీత దర్శకులెవరో చెప్పే వాళ్ళం. SD బర్మన్, నౌషాద్, మదన్ మోహన్, శంకర్ జైకిషన్, లక్ష్మీ కాంత్  ప్యారేలాల్,కళ్యాణ్ జీ ఆనంద్ జీ ... ఒకరేమిటి, ఎన్ని పేర్లు చెప్పుకోవాలో తెలియదు. ఈ సంగీత సామ్రాట్టులు అందించిన పాటలు ఈనాటికీ శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి.

మాకు ఉన్న మరో వినోదం పగలు గూటిబైళ్ల గోళీలాట ఏడుపెంకులాట బుచ్చలాట

రాత్రికి హరికథలు బుర్ర కథలు నాటకాలు చూడటం ఇదే వినోద కాలక్షేపం

ఈ నాటికీ దాదాపు అందరం 48-65సంవత్సరాలు పూర్తి చేసుకున్నవాళ్ళమే. జీవితంలో ఉన్నత ఉద్యోగాలు చేసుకున్నవాళ్ళమే. పిల్లలను పై చదువులు చదివించి ప్రయోజకుల్ని చేసినవాళ్ళమే!

అయినా ఉత్సాహం ఏమాత్రం తగ్గక ఇంకా యువకుల్లా కనిపిస్తున్నవాళ్ళమే. ఈ వయసులో కూడా మన చిన్నప్పటి స్నేహితులను పేరు పేరునా గుర్తుంచుకొని పిలుస్తున్న వాళ్ళమే.   

*ఇక మాకన్నా అదృష్టవంతు లెవరుంటారు?*

*ఆహా! జ్ఞాపకాల దొంతర అంటే ఇదీ!! అచ్చంగా మన బాల్యాన్నిమనమే రాసుకున్నట్టుగానే వుంది

*సమయానికి* తగినట్టుగా ! ఉండటమే ! *మనిషి గొప్ప లక్షణం...*

తుమ్మ చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా ! తులసి చెట్టునే ! పూజిస్తాం !!

అలాగే ! చెడ్డవారు ఎంత గొప్పవారు అయినా ! గొప్ప మనసున్న మంచివారినే ! గౌరవిస్తాం !!

అరుపులు గెలుపు కాదు ? మౌనం ఓటమి కాదు ? సమయానికి తగినట్టుగా ! ఉండటమే ! మనిషి గొప్ప లక్షణం...

👏👍💐👋😷


నిజాయితీ లేని నూరు మంది వెనుక నడవడం కన్నా !

నిజాయితీ ఉన్న ఒక్కడి వెనుక నడవడం ఉత్తమం !!

ఆశకు అంతముండదు -

పైసాకు పద్థతుండదు -

ఈ రెండిటి వెనకాల పరిగెత్తేటోడికి మనఃశాంతి ఉండదు,

మన పరిచయానికి మాటలు అక్కర్లేదు,

చిన్న చిరునవ్వు చాలు,

మంచితనానికి డబ్బుతో పనిలేదు,

మంచి మనసుంటే ! చాలు,

స్నేహానికి చుట్టరికం అక్కరలేదు,

మనసులోని భావనలు కలిస్తే ! చాలు,

మనకు ఏది శాశ్వతం కాదు - ఈ లోకంలో,

గడుపుతున్న ఈ క్షణం మాత్రమే ! మనది,

నిన్న అనేది తీరిపోయిన రుణం -

రేపు అనేది - దేవుడు అనబడే ! ప్రకృతి (సృష్టి) ఇచ్చే వరం...

జీవితం ఎప్పుడు ఒకేలా ! ఉండదు,

నవ్వే వారికి -

ఏడ్చే రోజు -

ఏడ్చే వారికి -

నవ్వే రోజు వస్తుంది,

కాస్త ఓపిక పట్టాలి అంతే !

నీతో ! ఉన్న వారు నిన్ను ఎందుకు ?

కలిసామా ! అనేలా ! బతకకూడదు ?

నిన్ను విమర్శించిన వారు కూడా !

నిన్ను ఎందుకు వదులుకున్నామా ! అనేలా ! బతకేలా ! ఉండాలి,

ఏ బంధమైనా -

ఒక అడుగు మనం,

ఒక అడుగు వాళ్ళు,

వేస్తేనే ! దగ్గరవుతాం - కానీ !

అన్ని అడుగులు మనమే ! వేస్తే !

మనమే ! చులకన అవుతాము,

మనిషి నాశనానికి ప్రధాన కారణాలు - రెండు,

ఒక్కటి ఎవరో ! చెప్పింది వినడం,

రెండు విన్నదాన్ని -

ఇంకొకరికి చెప్పడం...

తుమ్మ చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా !

తులసి చెట్టునే !

పూజిస్తాం - అలాగే !

చెడ్డవారు ఎంత -

గొప్పవారు అయినా !

గొప్ప మనసున్న -

మంచివారినే ! గౌరవిస్తాం,

అరుపులు గెలపు కాదు ?

మౌనం ఓటమి కాదు ?

సమయానికి తగినట్టుగా !

ఉండటమే ! మనిషి గొప్ప లక్షణం...


* ✊

సేకరణ

కరోనా పొయ్యేనా ?

అదొక పాఠశాల . అక్కడి నియమాల గురించి తెలియని భారత మూలాలున్నఒక విద్యార్ధి ఒక రోజు తన లంచ్ బాక్స్ లో నట్స్ { వేరు శనిగ గింజలు } తీసుకొని వచ్చాడు . అతని పక్కన ఉన్న శ్వేత జాతి విద్యార్ధి కి రెండు పల్లీలు ఇచ్చాడు . దాన్ని ఆ విద్యార్ధి తిన్నాడు .
అంతే నిముషాల్లో ఆ శ్వేత జాతి విద్యార్ధి మొఖం ఎర్రగా వాచి పోయి గుమ్మడి కాయ లా వూది పోయింది . టీచర్ చూసింది . నిర్గాంత పోయి ప్రిన్సిపాల్ రూమ్ కు పరుగెత్తింది . అక్కడ ఉన్న ఎపి పెన్ తీసుకొని తన క్లాసు రూంకు పరుగెత్తుకొని వచ్చింది . ఏమి జరిగిందో అర్థం చేసుకొన్న ప్రిన్సిపాల్ కూడా ఆమె తో బాటే పరుగెత్తుకొని వచ్చింది . ఇద్దరు కలిసి ఆ ప్రత్యేక ఎపి పెన్ తో ఆ అబ్బాయి చేతిపై బలం గా గుచ్చారు . అందులోని రసాయనం అతని చేతిలోకి వెళ్ళింది .
ఇది ప్రధమ చికిత్స . ఆ అబ్బాయి గుండె ఆగిపోకుండా , ఊపిరి పీల్చుకోవడం లో ఇబ్బంది లేకుండా , వాపు కాస్త తగ్గేలా అది చేసింది . ఈ లోగా అంబులెన్సు వచ్చింది . ఆ అబ్బాయి ని ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు . కాసేపటికి పోలీస్ వాన్ వచ్చి టీచర్ ను అరెస్ట్ చేసింది . తన విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించింది అని ఆ టీచర్ పై కేసు రిజిస్టర్ అయ్యింది .
ఇదేదో సినిమా లో జరిగిన కథ కాదు . ఊహ.. కట్టు కథ కానే కాదు .
నిజ జీవిత ఘటన . ఆ దేశం పేరు అమెరికా . అక్కడి పిల్లలు పెద్దలు రకరకాల ఎలర్జీ ల తో బాధ పడుతుంటారు . పోనీ ఇది అరుదుగా జరిగే ఘటనా అంటే అదీ కాదు .
మా అమ్మ నాన్న టీచర్ లు . కానీ వ్యవసాయం పై మక్కువతో మెట్ట సేద్యం చేసేవారు . వేరుశనిగ తో నా బాల్యానికి విడదీయలేని అనుబంధం వుంది . సీజన్ వచ్చిదంటే ఇంట్లో కుప్పగా పచ్చి సెనెక్కాయలు పోసి ఉండేది . దాని పక్కనే పడుకోవడం . పచ్చివి , ఎండినవి అదే పనిగా తినడం .. ఇదీ నా బాల్యం .
నట్స్ తింటే ఎలర్జీ రావడాన్ని ఇక్కడ మన దేశం లో ఎప్పుడైనా కనీవినీ ఎరుగుదుమా ? లేదు కదా ? కానీ అమెరికా లో ఇది చాల సీరియస్ సమస్య . అసలు గ్రౌండ్ నట్స్ ని వారు అసహ్యించుకొంటారు . ఇది థాయిలాండ్ , ఇండియా లాంటి అనాగరిక దేశాల్లో పండించే ఒక చెత్త పంట అని అక్కడి వారి భావన . విమానాల్లో, హోటల్స్ లో గ్రౌండ్ నట్స్ దాదాపుగా నిషేధం .
అమెరికా ప్రజలకు నట్స్ తింటే ఎందుకు ఎలర్జీ వస్తుంది ? . తిన్నా కనీసం ముట్టుకున్నా ఎలర్జీ వస్తుంది . ఎపి పెన్ తో పొడుచుకోకుంటే ప్రాణం పొయ్యే అవకాశం ఎక్కువ . పోనీ గ్రౌండ్ నట్స్ అనాగరికుల పంట . వదిలేద్దాము . నత్త ను తిన్నా, ముట్టుకున్నా ఎలర్జీ వచ్చే వారి సంఖ్య ఆ దేశం లో ఎనభై రెండు లక్షలు . పాలు.. పిలల్లకు ఆహారం . పాలు తాగితే ఎలర్జీ వచ్చి ప్రాణం మీదకు వస్తుందా ? అవును . అమెరికా లో మిల్క్ ఎలర్జీ ఉన్న వారి సంఖ్య అరవై లక్షలు . nut ఎలర్జీ ఉన్న వారు అరవై లక్షలు . ఇంతే కాదు . జంతువులు, బొద్దింక , పుప్పొడి , దుమ్ము , కీటకాలు , పెర్ఫ్యూమ్ ఇలా సవా లక్ష ఎలర్జీ లు . జనాభా లో సగం మందికి ఏదో ఒక ఎలర్జీ . ఏటా కొన్ని వేలమంది ఎలర్జీ ల తో ఆసుపత్రులకు పరుగెత్తుతారు .
చిత్రంగా వుంది కదా ? మీ బంధువు ఎవరైనా అమెరికా లో వున్నారా ? అయితే ఇది నిజమో కాదో తెలుసుకోండి . ఇందుకు కారణం ఏమిటని వాకబు చెయ్యండి .
ఫ్లూ .. అంటే సాధారణ జలుబు . ఇప్పుడైతే మనం జలుబు చేస్తే కరోనా అని భయపడుతున్నాము . కానీ మొన్నటి దాక జలుబును పట్టించుకొనే వారమా ? అమెరికా లో ఇదొక సీరియస్ సమస్య . కరోనా పూర్వ యుగం లో ఏటా నాలుగు కోట్ల మంది ఫ్లూ బారిన పడేవారు . దీని వల్ల కనీసం నాలుగు లక్షల మంది ఆసుపత్రి లో చేరాల్సి వచ్చేది . దీనికోసం ఏటా రెండు టీకాలు తీసుకొంటారు . అయినా ఏటా ఇరవై వేల మంది చనిపోతారు . అవునండీ జలుబు వల్ల చనిపొయ్యేవారి సంఖ్య ఏటా ఇరవై అయిదు వేలు .
ఇప్పుడు కరోనా విషయానికి వద్దాము . ఓమిక్రాన్ వల్ల దక్షిణాఫ్రికా లో ఆసుపత్రి పాలయ్యే వారి సంఖ్య 91 % తగ్గిపోయింది . వారి కోవిద్ వార్డులు ఖాళీ అవుతున్నాయి . రెండు వందల మందికి ఓమిక్రాన్ సోకితే ముగ్గురు మాత్రం ఆసుపత్రుల పాలయ్యే పరిస్థితి . అదీ మైల్డ్ లక్షణాలు . ఇప్పటిదాకా ఓమిక్రాన్ దక్షిణాఫ్రికా లో కనీసం నాలుగు లక్షల మందికి సోకితే ఒక్క మరణం కూడా జరగలేదు . అదే ఇంగ్లాండ్ దేశం ఓమిక్రాన్ తో చిగురుటాకులా వణుకుతోంది . అక్కడి ఆసుపత్రులు మూసుకోవాల్సి పరిస్థితి . డాక్టర్ లు నర్స్ లు వార్డ్ బాయ్ లు అందరూ ఖాయిలా పడితే ఇంక ఆసుపత్రి నడిచేది ఎలా ? మూడు డోసుల వాక్సిన్ తీసుకొన్నారు . మాస్క్ లు పెట్టుకొన్నారు . అయినా హెల్త్ సిబ్బందికే ఇంత సీరియస్ సమస్య . ఇక మాల్స్ హోటల్స్ లాంటి చోట్ల పని చేసే వారి సంగతి చెప్పనక్కర లేదు . ఇప్పుడు ఇంగ్లాండ్ మొత్తం ఖాయిలా పడింది . ఎందుకిలా ? దక్షిణాఫ్రికా లో తోక ముడిచిన ఓమిక్రాన్ ఎందుకు ఇంగ్లాండ్ ను కాటేస్తోంది ? ఎవరైనా మీకు చెప్పారా ?
ఇప్పుడు అమెరికా విషయానికి వద్దాము . ఇప్పటిదాకా ఆ దేశం లో కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య అధికారికంగా ఎనిమిది లక్షలు . వాస్తవంగా ఇంక చాల ఎక్కువ అని వారి సీడీసీ సంస్థ చెప్పింది . అధికారికంగా ప్రకటించిన ఎనిమిది లక్షల మరణాల్లో నాలుగు లక్షల మరణాలు వాక్సిన్ వచ్చాక జరిగినవే . అంటే వాక్సిన్ పని చేయలేదని కాదు . అది లేకుంటే డెల్టా వేవ్ లో ఇంకా నాలుగైదు రెట్లు ఎక్కువగా మరణించే వారు . కానీ వాక్సిన్ వారిని రక్షించిందా? అంటే లేదు అని సమాధానం వస్తుంది . ఇప్పుడు వారి జనాభా లో డెబ్భై శాతానికి పైగా వాక్సిన్ ఇచ్చేసారు . అయినా రోజుకు లక్షన్నర కేసులు . ఇది జనవరి కల్లా మరింత పెరగనున్న స్థితి . ఇప్పడు రోజుకు రెండు వేలకు కాస్త తక్కువ గా మరణాలు . జనవరి నాటికి ఇది మరింత పెరిగే అవకాశం .ఇప్పుడు మరణిస్తున్న వారిలో వాక్సిన్ తీసుకోని వారు ఎక్కువగా వున్నారు అనేది వాస్తవం . కానీ అదే సమయం లో వాక్సిన్ తీసుకొన్న వారి మరణాలు కూడా వున్నాయి .
మూడు డోసుల వాక్సిన్ తీసుకొన్నా ఓమిక్రాన్ లాంటి బలహీనమైన వేరియంట్ అమెరికా , యూరోప్ దేశాలను వణికిస్తోంది . ఎందుకు ? పోనీ.. ఎప్పటికి ఈ సమస్య పరిష్కారం అయ్యేను ? వందేళ్ల క్రితం స్పానిష్ ఫ్లూ వచ్చింది . చచ్చిన వారు చచ్చారు . మన పూర్వీకులు కొంత మంది చనిపోయి వుంటారు . మన తాతలు బతికారు . దాన్ని జయించారు . ఆ వైరస్ పోలేదు . వందేళ్లుగా రకరకాలుగా మ్యుటేట్ అవుతోంది . మనం దాన్ని పట్టించుకోలేదు . అదీ మనకు సమస్య కాలేదు . మరో పక్క అమెరికా లో దానికి వాక్సిన్ ..ఏటా రెండు డోసులు . అయినా చావులు.
కరోనా పొయ్యేనా ?
కరోనా పోతుంది అనుకోవడం మూర్కత్వనికి పరాకాష్ట . వందేళ్ల క్రితం వచ్చిన ఫ్లూ వైరస్ పోలేదు . మరి కరోనా వైరస్ పోతుందా ? ఫ్లూ వైరస్ కు మందు ఉందా ? లేదే . మరి కరోనా వైరస్ కు వస్తుందా ? ఆలోచించండి .
ఫ్లూ వల్ల ఏటా ఇరవై వేల మంది చనిపొయ్యే అమెరికా దేశం లో కరోనా ఏమి చేయనుంది . ఇక మీదట ఏటా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి దాక ఏటా కనీసం యాభై వేల మంది చనిపొయ్యే అవకాశం . ఇది సమీప భవిష్యత్తులో ఆగదు . అసలు సరైన మార్గం లో ప్రయాణం మొదలుపెడితే కదా పరిష్కారం దొరికేది .
ఈ పోస్ట్ సైన్స్ కో వాక్సిన్ కో వ్యతిరేకం అనుకునేరు . కాదు . సైన్స్ పేరుతొ మన చుట్టూరా జరుగుతున్న మాయ ను, మోసాన్ని, కుట్ర ను మీ ముందు ఉంచాడనికి ఒక చిన్న ప్రయత్నం .
మనిషి .. హోమో సేపియన్స్ .. నలబై లక్షల సంవత్సరాల క్రితం పరిణామ క్రమం లో ఆవిర్బావించాడు . మనిషి ప్రకృతిలో ఒక భాగం . మనిషి శరీరం లోని జన్యువులు ఇతర శరీర కణాలు , కణజాలాలు , అంగాలు , వ్యవస్థలు అదే విధంగా రూపొందాయి .
నేల విడిచి సాము చేస్తే ?
ఈ రోజు మీరు బతికి వున్నారు .. డెల్టా వేవ్ లో పోకుండా ఇంకా బతికి ఈ పోస్ట్ చదువుతున్నారు అంటే దానికి మీరు మీ తండ్రికి , తాతకు , ముత్తాతకు ఇంక పూర్వీకులకు రుణపడి ఉండాలి . కృతఙ్ఞతలు చెప్పాలి . వారు మట్టిలో బతికారు . నేల విడిచి సాము చెయ్యలేదు . నాగరికత పేరుతొ కొంప తగలబెట్టుకోలేదు . కానీ మీరు మీ పిల్లలకు చేస్తున్నది ఏమిటి ? ? ఆలోచించండి .
తిరిగీ పాతరాతి యుగం లో వెళ్లిపోవాలని నేను చెప్పడం లేదు . అది సాధ్యం కాదు కూడా ? కానీ నేల విడిచి సాము చేస్తే ?
మనిషిని బతికించేది ఆరోగ్యాన్ని ఇచ్చేది తిండి .. ఇంకా సరైన జీవన విధానం . ఆధునిక వైద్యం- నాగరికత ఇచ్చిన వరం . అది అవసరం . కానీ మనిషి టాబ్లెట్స్ తింటూ సెలైన్ ఎక్కించుకొంటూ బతకగలడా ? పండెమిక్ వచ్చినపుడు వాక్సిన్ వసరమే . కానీ వాక్సిన్ కంపెనీ ల కోసం బతకాలా ? వాక్సిన్ కంపెనీ లు మనుషుల కోసమా? లేక మనుషులు ఆసుపత్రులను వాక్సిన్ కంపెనీ ల ను బతికించడం కోసమా ? ఆలోచించండి .
తిరిగి అమెరికా విషయానికి వద్దాము . వారు తినే తిండి విష తుల్యం . ప్రకృతిలో సహజ సిద్ధంగా వచ్చిన పంటల్ని వారి ఆహార కంపెనీ లు జన్యుపరంగా మార్చేశాయి . దీన్ని జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్ అంటారు . అసలు జెనెటికల్లీ మావోడిఫీడ్ ఫుడ్ సమస్య కాదు అని వారి మోన్ శాంటో కంపెనీ వాదన . కాసేపు నిజం అనుకొందాము. ప్యాకింగ్ చేసేటప్పుడు అది జెనిటికెల్లి మాడిఫైడ్ అవునో కాదో దానిపై ముద్రించేలా కాంగ్రెస్ లో అంటే అమెరికా పార్లిమెంట్ లో ఒక బిల్లు ను ప్రవేశపెట్టారు . దాన్ని వీగి పొయ్యేలా చేసింది మోన్ శాంటో కంపెనీ డబ్బుల సంచులు .
ఆ దేశం లో మనుషులు తినేది కంపెనీ ల కు లాభం చేకూర్చడం కోసం . తాగేది .. అవునండీ మంచి నీళ్లతో కలుపుకొని వారు తాగేది కంపెనీ ల కోసమే . ఇక బతికేది ఆసుపత్రుల కోసం . అక్కడ మందులు , వాక్సిన్ లు మనుషుల కోసం కాదు . మనుషులు వాటి కోసం .
ఇది చదువుతుంటే మీకు గందర గోళంగా వుంది కదా ? అవునండీ .. వాస్తవం అంత సులభంగా అర్థం కాదు . బతకాలంటే చుట్టూరా జరుగుతున్న దానిని అర్థం చేసుకోవాలి . తప్పదు .
అమెరికా చాల అభివృద్ధి చెందిన దేశం . వారికి చెప్పేటంత గొప్పవాడిని కాను . చెప్పినా లాభం లేదు . నిద్ర పొయ్యే వాడిని లేపవచ్చు కానీ నిద్ర నటించేవాడిని లేపగలమా ? పాపం అమెరికా ప్రజలు . జీవితం అనే వైకుంఠ పాళీ లో వారికి నిచ్చెనలు తక్కువ . పాములు ఎక్కువ . ఆ పాములు ఫుడ్ , ఫార్మా ఇంక అనేక ఇతరత్రా కంపెనీ ల రూపం లో వున్నాయి . బహుశా తిరిగి రాలేని దూర తీరాలకు వారు వెళ్లిపోయారు .
పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం .. దీని గురించి విన్నారా ? మనం భారతీయులం అమెరికా వారిని తెల్ల దొరలను చూసి ఎప్పుడు అదే చేస్తుంటాము . ఇది మానాలి.
ఇప్పుడు ఏమి చెయ్యాలో చెబుతాను . ప్రస్తుతానికి మాస్క్ పెట్టుకోండి . రెండు డోసుల వాక్సిన్ తీసుకోండి . ప్రభుత్వం చెప్పాక మాస్కు లు తీసి అవతల పడెయ్యండి . ముఖ్యంగా పిల్లల్ని మట్టిలో ఆడుకోనివ్వండి . అప్పుడే వారిలో ఇమ్మ్యూనిటి పెరుగుతుంది . లేక పొతే గాలి సోకితే ఎలర్జీ , మట్టి సోకితే ఎలర్జీ లు వచ్చి మన పాఠశాలల్లో కూడా ఎపి పెన్ లు వచ్చే పరిస్థితి వస్తుంది .
ప్రకృతికి దగ్గరగా పిల్లల్ని పెంచండి . ఆడనివ్వండి . ఎగరనివ్వండి. మట్టిలో ఆడాలి . దుమ్ము ధూళి తగలాలి . ఫిల్టెర్డ్ వాటర్ కాదు . మామూలు నీరు ఇవ్వండి . రిఫైన్డ్ ఆయిల్ కాదు . గానుగ నూనె ఇవ్వండి . హైబ్రిడ్ టమాటో , కృత్రిమంగా మాగ పెట్టిన అరటి లాంటి విషాలు మనకు కూడా వచ్చేసాయి . .ఇక్కడ కూడా ఆహారం విషతుల్యం అయిపోతోంది దీని నుంచి పిల్లల్ని రక్షించుకోండి.
గుర్తు పెట్టుకోండి . మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆహారం .. మందులు కాదు . రోగం వచ్చినప్పుడు మందులు . నిజమే . అవసరమే . కానీ మందుల కోసం రోగాలు .. మనుషులు కాదు కదా ? మానాలి ఆరోగ్యం గా ఉంచేది మన దిన చర్యలు . వేల లేవడం .. ఎండ .. వ్యాయాయం .. మంచి తిండి .. పిలల్లకు ఆటలు .. ఆహ్లదం .. అంటే కానీ రోజూ కేసులు కేసులు అంటూ డోకు వార్తలు కాదు . రోజూ భయపడుతూ బతకడం కన్నా చావడం మేలు . నీ భయం తో భావితరాలకు శాశ్వత నష్టం చేయకు . ఒక్క మాటలో చెప్పాలంటే ఆరోగ్యం విష్యం లో ఇండియా ను అమెరికా చెయ్యకు .
ఆ అమ్మాయి పేరు విశాల . ఆమె తండ్రి ఢిల్లీ లో జవహర్లాల్ నెహ్రు విశ్వవిద్యాలయం లో పీహెచ్డీ చేసేవాడు . మా కుటుంబ మిత్రుడు . అప్పటికి విశాల చిన్న పిల్ల . అటు పై విశాల అమెరికా లో మెడిసిన్ చదివింది . డాక్టర్ అయ్యింది . ఆమె తండ్రికి అంటే మా ఫ్రెండ్ కు కాన్సర్ వచ్చింది . అయన మూడు నెలలో చనిపోతారు అని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి . ఇక చచ్చేవాడికి ట్రీట్మెంట్ ఏమిటని ఆసుపత్రి వారు ఆయన్ని పక్కన పెట్టేసారు . విశాల అప్పటికి డాక్టర్ . తన తండ్రి బాధ ను చూసింది . మాస్ విరిగి పొయ్యింది . వైద్యం గొప్ప శాస్త్రం . దాన్ని కాదనే వాడు మూర్కుడు . కానీ వైద్యం ఎవరికి ? ఎందుకు ? వైద్యం మనిషి కోసమా ? లేక ఆసుపత్రుల కోసమా ? ఆలోచించింది . వృత్తిని వదిలేసింది .
కెనడా లో మెడికల్ ఆంత్రోపాలజి లో చేరింది . MA లో ఆమె సబ్జెక్టు PEOPLE అండ్ మెడిసిన్ . అంటే ప్రజలు - వైద్యం . ప్రజల కోసం వైద్యం . అక్కడే పీహెడీ చేసింది . అమెరికా లో విస్కాన్సిన్ యూనివర్సిటీ లో ఇప్పుడు ఆమె PEOPLE అండ్ మెడిసిన్ ను విద్యార్థులకు బోధిస్తోంది .
ఈ పోస్ట్ డాక్టర్ ల కు ఆధునిక వైద్యానికి వ్యతిరేకం అని ప్రచారం చేసేవారు వుంటారు . ఆధునిక వైద్యం గొప్ప శాస్త్రం . వైద్యులు దేవుళ్ళు . సమస్య అల్లోపతి తో కాదు . దాన్ని చెరపట్టిన నరరూప రాక్షసుఁల తో . సమస్య డాక్టర్ ల తో కాదు . వారి వైద్యం గొప్పది . సమస్య ఆసుపత్రుల్ని బతికించడం కోసమే మనుషులు అనే విధంగా రూపొందుతున్న నేటి వ్యవస్థతో .
మన పూర్వీకుల మంచి జీవన విధానం పుణ్యమా అంటూ మనం ఆరోగ్యం గా వున్నాము . జీవిస్తున్నాము . మన పిలల్లకు మనం ఏమి ఇవ్వబోతున్నాము ? వారిని రోగులుగా మార్చి ఫార్మసురులకు అప్పచెబ్బబోతున్నామా ? మాస్కు లు .. వాక్సిన్ లు దాటి మనం ముందుకు సాగలేమా ? సహజ జీవన విధానాన్ని అనుసరించలేమేనా ?
చివరిగా ఒక మాట . మన సంప్రదాయాలు అన్నీ గొప్పవి అని నేను చెప్పడం లేదు . మంచి ఎక్కడ వున్నా గ్రహించాలి . పర సంస్కృతుల పట్ల సహనం , ప్రజాస్వామిక భావన , వర్క్ ఎథిక్స్ ఇలాంటి విషయాల్లో మనం అమెరికా లాంటి దేశాల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో వుంది . అది వేరే సబ్జెక్టు .
సర్వే జన సుఖినోభవంతు .
మిత్రమా .. నువ్వొక సంధి యుగం లో వున్నావు . ఇప్పుడు నువ్వు ఏమి చేస్తావు అనే దాని పై నీ రాబొయ్యే తరాల భవిష్యత్తు ఆధారపడింది . మంచి మార్గం లో అడుగు ముందుకు వెయ్యి . ఆ క్రమం లో ఈ మెసేజ్ ను ఒకటికి రెండు సార్లు చదువు . వినదగు నెవ్వరు చెప్పిన .. విననంతనే వేగపడకే వివరింపతగున్ ..నేను చెప్పిన విషయాల పట్ల లోతుగా ఆలోచింది . మిత్రుల తో శ్రోయోభిలాషుల తో చర్చించు . మంచి దారిలో ముందుకు సాగు . అదే నీ భావితరాలకు నువ్వు ఇచ్చే కానుక.
ఒక స్కూల్ యజమానికి కరోనా గురించి ఏమి తెలుసు అని కొంత మంది ఎగతాళి చేస్తున్నారు . వారందరికీ ఒకటే సమాధానం . మా విశాల చిన్నపిల్లగా వున్నప్పుడే నేను కొన్ని వేల మందికి ఆంథ్రోపాలజీ చెప్పిన బోధకుడి ని . ప్యూపిల్ అండ్ మెడిసిన్ అంటే ప్రజల కోసం వైద్యం . ఇదే పోస్ట్ సారం .

సేకరణ

స్కూల్లో చరిత్రలో శివాజీ గురించి పెద్దగా నేర్చుకోలేదు. చాలామంది అతని గురించి ఏమనుకుంటున్నారో చూసి ఆశ్చర్యపోయారు:

స్కూల్లో చరిత్రలో శివాజీ గురించి పెద్దగా నేర్చుకోలేదు. చాలామంది అతని గురించి ఏమనుకుంటున్నారో చూసి ఆశ్చర్యపోయారు:

"కాబూల్ నుండి కాందహార్ వరకు నా తైమూర్ కుటుంబం మొగల్ సుల్తానేట్‌ను సృష్టించింది. ఇరాక్, ఇరాన్, టర్కిస్తాన్ మరియు అనేక దేశాలలో నా సైన్యం క్రూరమైన యోధులను ఓడించింది. కానీ భారతదేశంలో శివాజీ మాకు బ్రేకులు వేశారు. నేను శివాజీకి నా గరిష్ట శక్తిని వెచ్చించాను, కానీ తీసుకురాలేకపోయాను. అతని మోకాళ్లకు.

యా అల్లాహ్, నువ్వు నాకు శత్రువును, నిర్భయమైన మరియు నిటారుగా ఉన్నవాడిని ఇచ్చావు, దయచేసి అతని కోసం స్వర్గానికి మీ తలుపులు తెరిచి ఉంచండి ఎందుకంటే ప్రపంచంలోని అత్యుత్తమ మరియు విశాల హృదయం ఉన్న యోధుడు మీ వద్దకు వస్తున్నాడు."

-ఔరంగజేబ్ (శివాజీ మరణానంతరం నమాజ్ చదువుతూ)

"ఆ రోజు శివాజీ నా వేళ్లు నరికేయలేదు కానీ నా అహంకారాన్ని కూడా నరికేశాడు. నా కలలో కూడా ఆయనను కలవాలంటే భయం."

--షాహిస్తా ఖాన్.

"నా రాజ్యంలో శివాజీని ఓడించే వాడు లేడా??"

- విసుగు చెందిన బేగం అలీ ఆదిల్షా.

"నేతాజీ, బ్రిటిష్ వారిని తరిమికొట్టడానికి మీ దేశానికి హిట్లర్ అవసరం లేదు. మీరు బోధించాల్సింది శివాజీ చరిత్ర మాత్రమే."

-అడాల్ఫ్ హిట్లర్

"శివాజీ ఇంగ్లండ్‌లో జన్మించి ఉంటే, మనం భూమిని మాత్రమే కాకుండా మొత్తం విశ్వాన్ని పాలించి ఉండేవాళ్ళం."

-లార్డ్ మౌంట్ బాటన్

"శివాజీ ఇంకో పదేళ్లు బ్రతికి ఉంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశం ముఖం చూసి ఉండేవారు కాదు."

-- ఒక బ్రిటిష్ గవర్నర్

_భారతదేశానికి స్వాతంత్ర్యం కావాలంటే ఒక్కటే మార్గం, 'శివాజీలా పోరాడండి'."

--నేతాజీ

"శివాజీ అనేది కేవలం పేరు కాదు, భారతీయ యువతకు ఇది శక్తి వనరు, ఇది భారతదేశాన్ని స్వేచ్ఛగా మార్చడానికి ఉపయోగపడుతుంది."

- స్వామి వివేకానంద.

"శివాజీ అమెరికాలో జన్మించి ఉంటే, మేము అతనిని SUN అని నామకరణం చేస్తాము."

- బరాక్ ఒబామా

ఉంబర్‌ఖైండ్ యొక్క ప్రసిద్ధ యుద్ధం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో పేర్కొనబడింది:

"ఉజ్బెకిస్తాన్ నుండి వచ్చిన 30,000 మంది కరతలాబ్ ఖాన్ సైన్యాన్ని కేవలం 1000 మంది శివాజీ మావలలు ఓడించారు. స్వదేశానికి తిరిగి రావడానికి ఒక్క ఉజ్బెకీ కూడా ప్రాణాలతో మిగిలిపోలేదు."

శివాజీ అంతర్జాతీయ ఖ్యాతి పొందిన రాజు. తన కెరీర్‌లో 30 ఏళ్ల వ్యవధిలో కేవలం ఇద్దరు భారతీయ యోధులతోనే పోరాడాడు. మిగతా వారంతా బయటి వ్యక్తులు.

అబూ తాలిబాన్ మరియు టర్కిస్తాన్ రాజుగా తన కలలో కూడా శివాజీకి భయపడే షాహిస్తా ఖాన్.

బెహ్లోల్ ఖాన్ పఠాన్, సికందర్ పఠాన్, చిదర్ ఖాన్ పఠాన్ అందరూ ఆఫ్ఘనిస్తాన్ యొక్క యోధ సర్దార్లు.

దిలేర్ ఖాన్ పఠాన్ మంగోలియా యొక్క గొప్ప యోధుడు. వీరంతా శివాజీ ముందు దుమ్ము దులుపుకున్నారు.

సిద్ధి జౌహర్ మరియు సలాబా ఖాన్ ఇరానియన్ యోధులు, వీరు శివాజీ చేతిలో ఓడిపోయారు.

సిద్ధి జౌహర్ తర్వాత సముద్ర దాడికి ప్లాన్ చేశాడు. ప్రతిస్పందనగా శివాజీ ఒక నౌకాదళాన్ని, మొదటి భారతీయ నౌకాదళాన్ని పెంచారు. అయితే ఆ పని పూర్తి కాకముందే శివాజీ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు.

Google "శివాజీ, మేనేజ్‌మెంట్ గురువు."
ఇది బోస్టన్ విశ్వవిద్యాలయంలో పూర్తి సబ్జెక్ట్.

ఇంకా, భారతీయులమైన మనకు ఆయన గురించి చాలా తక్కువ తెలుసు.....
మన భావి తరానికి, మనకు తెలిసిన, ఈ గొప్ప భారతీయుని గురించి తెలిసేలా చేద్దాం.

దయచేసి కనీసం విస్తృతంగా ప్రసారం చేయండి.🙏🙏🙏 ఒక మిత్రుని వాల్ నుంచి సేకరణ

సేకరణ

#inspiration #srikanthbolla #BollantIndustries

#మచిలీపట్నం జిల్లా లోని సీతారామపురం పల్లెలో ఒక రైతుకుటుంబం లో 1992 జూలై 7 వ తేదీన #Srikanth_Bolla పుట్టినపుడు తల్లితండ్రులు సంతోషించలేదు. పైగా చాలా బాధ పడ్డారు. ఎందుకంటే అతను రెండు కనుగుడ్లు మూసుకుపోయి పుట్టాడు కాబట్టి. ఆ వూరిజనం అయితే మరో అడుగు ముందుకేసి , ఆ పిల్లవాడిని ఎలా వదిలించుకోవాలో కూడా సలహాలు ఇచ్చారు. కానీ అమ్మ నాన్న అలా చేయలేదు. ” మేము బతికున్నంతవరకు వీడిని బాగా చూసుకొంటాం. మేము పోయాక దేవుడే చూసుకోవాలి ” అని అనేవారు. కళ్ళుకనపడకపోవడం తప్ప , బడిలో శ్రీకాంత్ అందరికంటే చురుకుగా వుండేవాడు. కానీ ఇంటర్ లో ‘ నీవు గుడ్డివాడివి కాబట్టి సీటు ఇవ్వలేమని ” కాలేజీలు చెపితే శ్రీకాంత్ కోర్టుకెళ్ళి గెలిచి admission తెచ్చుకొన్నాడు. తోటి పిల్లల ఎగతాళి భరించలేక చదువు మానేసి 2 ఏళ్ళు ఇంట్లోనే వుండిపోయాడు. మళ్ళీ హైదరాబాద్ లో school for the specially abled లో చేరాడు. అక్కడకూడా పిల్లలు అవమానపెట్టారు. అందరూ తనను వదిలేసి వెళ్ళిపోతుంటే బాధ తట్టుకోలేక బడివదిలేసి

పారిపోతుంటే ఒక teacher పట్టుకొని చెంపచెళ్ళుమనిపించింది. అది అతని జీవితం లో game changing moment. ఆ టీచర్ ఆడియో టేపుల్లో పాఠాలు వినిపించింది. ఇంటర్ లో MPC చదివి 98% సంపాదించగా ఎగతాళి చేసినవారు అవాక్కయ్యారు. కానీ IIT వాళ్ళు సీటు ఇవ్వమన్నారు. నిరాశ పడని అతను అమెరికా universities లకు entrance exams వ్రాస్తే Stanford , మరో 2 universities admission ఇవ్వడానికి ముందుకొచ్చాయి. శ్రీకాంత్ Howard Massachusetts Institute of Technology [ అమెరికా ] లో చేరాడు. అక్కడ Brain Cognitive Sciences లో చేరిన తొలి అంధుడిగా రికార్డు పొందాడు. అతని ప్రతిభ చూసి , చదువు అయ్యాక 4 అమెరికన్ కంపెనీ లు తమదగ్గర వుద్యోగం చేయమని అడిగితే శ్రీకాంత్ సున్నితంగా ‘ లేదు ‘ అనిచెప్పాడు. ‘ భారతదేశం చేరుకొని తనతోటి నిరుపేద , దివ్యాంగ భారతీయులకు సహాయపడే భాగ్యాన్ని నాకు ఇవ్వు ‘ అని అతను భగవంతుడిని ప్రతి రాత్రీ ప్రార్థించేవాడు. ప్రార్థనలు పరమాత్మ విన్నాడు.

శ్రీకాంత్ India కు వచ్చి హైదరాబాద్ దగ్గర Bollant Industries స్థాపించాలని వుందంటే రతన్ టాటా ముందుకొచ్చి ఫండ్స్ ఇచ్చారు. అది మొదలైంది. ఈరోజు అది 150 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీ. దానికి శ్రీకాంత్ CEO. సాక్షాత్తూ అబ్దుల్ కలాం గారే అక్కడికొచ్చారు. ఇద్దరూ కలిసి Lead India Project ద్వారా 4 లక్షలమంది విద్యార్థులకు పాఠాలు చెప్పారు. శ్రీకాంత్ దగ్గర ఇపుడు సుమారు 300 మంది దివ్యాంగులు వుద్యోగాలు చేస్తున్నారు. అతను 3000 మంది విద్యార్థులను చదివిస్తున్నాడు.

#చీకటి ని అసహ్యించుకోనేవారు కొందరు , చీకటి ని చూసి భయపడేవారు ఇంకొందరు , చీకటిని చీల్చుకువెళ్ళేవారు మరికొందరు.ఆ మూడవరకం వాళ్ళను మూడక్షరాల పదం లో ” సూర్యుళ్ళు ” అంటారు. మనవాడు మరోసూర్యుడు,మరియు ఎందరికో మార్గదర్శి,ఇటువంటి వారి చరిత్రలు ఎందరికో దశ,దిశ నిర్దేశితాలు....👏👏👏

#inspiration
#srikanthbolla
#BollantIndustries

సేకరణ

🌹దేవతలనే శపించగలిగే మునులు, రాక్షసులు దాడి చేస్తే దేవుళ్ళ సహాయం ఎందుకు కోరేవారు?🌹

🌹దేవతలనే శపించగలిగే మునులు, రాక్షసులు దాడి చేస్తే దేవుళ్ళ సహాయం ఎందుకు కోరేవారు?🌹

https://chat.whatsapp.com/LQ2aAE9VFrEI4aT5koZV5F

https://t.me/joinchat/5gVEZGFAscQ3N2Fl

నిజమే! శపిస్తే పోతారు. కానీ, వారికి ఆ అధికారం లేదు కాబట్టి, శపించరు. ఎందుకు ఇలా? అంటే, దానికి చాలా కారణాలు ఉన్నాయి. కొంచెం ఈ విషయం తర్కించి చూద్దాం. కొన్ని ఉదాహరణలు తీసుకుని, ఈ తర్కం తెలుసుకుందాం..

ముందుగా విశ్వామిత్రుడిని ఉదాహరణగా తీసుకుంటే, ఆయన ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి, బ్రహ్మర్షి అయినాడు. ఆయన కోపం వలన, కామం వలన, ఎన్నో సార్లు తన తపః శక్తిని వృధా చేసుకుని, ప్రాయశ్చిత్తంగా, మరల కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసి, పూర్వపు స్థితికి చేరుకోగలిగాడు. ఆయన క్రోధం వహించి, తాను చేస్తున్న యాగం సంపూర్ణం చెయ్యడానికి, ఆ రాక్షసులను ఒక్క హుంకారంతో చంపి వెయ్యగలడు.. కానీ, దాని వలన ఆయన చేస్తున్న యాగం, ఆ యాగసంకల్పం  సంపూర్ణం కాదని, ఆయనే స్వయంగా చెప్పారు.

ఆయనే తన వద్దనున్న బల-అతిబల విద్యలను, ఎన్నో దివ్యాస్త్రాలను సమంత్రకంగా రామునికి ఉపదేశించి, ఆయన నుండి రక్షణ కోరాడు. ఇందులో ఎన్నో దైవరహస్యాలు దాగి ఉన్నాయి.

1. పరమాత్ముడు శ్రీరాముని అవతారం తీసుకుని వస్తున్నారని ఆయనకు తెలుసు. ఆయనకు తన వద్దనున్న విద్యలన్నీ ధారబోసి, సర్వస్వ శరణాగతి కోరాడు

2. రామునికి విద్య నేర్పి దివ్యాస్త్రాలు ఇవ్వవలసిన గొప్ప బాధ్యతను ఆయనకు అప్పజెప్పారు. ఆయన తన కర్తవ్యం నిర్వర్తించారు.

3. రావణుడు కేవలం మానవుల, వానరుల చేతిలో మరణించే అవకాశం మాత్రమే ఉంది. రావణుని అడ్డు పెట్టి, ధర్మవర్తన అందరికీ తెలుపవలసిన దివ్యనాటక రచనలో, ఆయన తన పాత్రను పోషించాలి.

4. సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ కూడా, అతడు చేస్తున్న దుందుడుకు కార్యాలకు చావమని శాపం ఇవ్వక, పడతి అనుమతి లేకుండా, వారిని మరోలా తాకితే, తల వెయ్యి ముక్కలు అయ్యే శాపం మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే, ఆయన పాత్ర కూడా, కేవలం అక్కడితో ఆగిపోతుంది. చెయ్యవలసిన కార్యం కోసం, రావణుడిని అడ్డుపెట్టుకుని, ఈ భూమి పై అడుగుపెట్టి, ధర్మాన్ని నిలుపవలసిన మహత్కార్యం ఉంది.

5. ఆ మాటకు వస్తే, రావణుడు వాలి చేతిలోనూ, కార్తవీర్యార్జునుని చేతిలోనూ దారుణంగా నిహతుడు అయ్యే అవకాశం ఉన్నా, వారి పరిమితికి లోబడి, వారు కేవలం ఆ రాక్షసుని చెర మాత్రమే పట్టి, ఇతరుల ఆదేశం మేరకు వదిలేసారు.

6. ఒకవేళ రావణుడంతటి రాక్షసుని చంపవలసి వస్తే, విశ్వామిత్రుడు కొన్ని వేల సంవత్సరాల తపస్సు ధారబోసి, క్రోధం పూని, అతడిని చంపవచ్చు. కానీ, మరల ఆయనకు అంత ఆయుర్దాయం ఉండడం, అనుకున్న గొప్ప కార్యం నేరవేతుందన్న నమ్మకం ఉందా? కాబట్టి, మహర్షులు తమ క్రోధాన్ని అణగద్రొక్కుకుని, తమకూ, లోకానికీ, రక్షణ ఇచ్చే బాధ్యత ఉన్న ఆ ధరణీపతిని శరణు వేడి, ఆయన చేత రక్షణ పొందారు.

7. అసలు విశ్వామిత్రునికి ఆ దివ్యాస్త్రాలు, పరబ్రహ్మ అనుమతి వలనా, ఆయన అనుగ్రహం వలనా వచ్చినవే. ఆయన ఇచ్చిన విద్యను ఆయనకే ఇచ్చి, నువ్వు తప్ప నాకు మరొక దిక్కులేదు, నన్ను బ్రోవుమా అనే గొప్ప శరణాగతి తత్త్వం, ఇందులో కనబడుతుంది.  ఎప్పుడూ 'నాదేమీ లేదు, నువ్వే దిక్కు' అని ఆయనను ఆశ్రయిస్తే, గజేంద్రమోక్ష వరదుడు, సంసార కూపం నుండి ఉద్ధరించి, ఉన్నత స్థితిని అనుగ్రహిస్తాడు.

8. ఎవరి పని వారు చెయ్యాలి. రక్షణ చెయ్యడం, క్షత్రియుని బాధ్యత. తపస్సు చేసి, అందరికీ మార్గదర్శనం చెయ్యడం, మహర్షుల కర్తవ్యం. వారికి అప్పజెప్పిన పనిని, అతిక్రమించరు వారు.

9. ఎవరెవరి కర్మఫలం ఎలా వుందో, వారి విషయంలో, మహర్షులు మామూలుగా జోక్యం చేసుకోరు. ఎవరైతే, ఆ రాక్షసుల చేతిలో బాధలు అనుభవిస్తున్నారో, వారి కర్మఫలం అలా వున్నది. ఎప్పుడైతే వారందరూ స్వామికి శరణాగతి చేస్తారో, అప్పుడు వారిని కాపాడే బాధ్యత ఆయన తీసుకుని, వారిని రక్షిస్తాడు.

ఇంకా ఎన్నో దేవరహస్యాలు ముడిపడి ఉంటాయి. మనకు తార్కికంగా అర్ధం చేసుకోవడానికి ఈ కారణాలు చాలు.

ఇలా మనం భారతంలోనూ, భాగవతంలోనూ చూస్తే, ఇటువంటి ఎన్నో తార్కాణాలు కనబడతాయి. అన్నింటికీ, పైన చెప్పుకున్న విషయాల కారణంగా, ఋషులు జోక్యం చేసుకోరు. ఒక్కోసారి మరీ అధర్మం పెచ్చరిల్లితే, వారికి అందిన ఆదేశం ప్రకారం, వారు అప్పుడప్పుడు దండిస్తూ ఉంటారు. ఒకసారి ఇక్ష్వాకు వంశంలో, వేనుడు అన్న వాడి ఆగడాలు మితిమీరిపోతే, వాడికి మంచి బుద్ధులు చెబుదామని వెళ్ళిన ఋషులూ, మునులను బంధించి, కేవలం తననే దైవంగా పూజించమని నిర్బంధించినప్పుడు, వారంతా చేసిన ఒక్క హుంకారానికి ఆ వేనుడు చావగా, అతడిని మధించి, వంశోద్ధారకుని పుట్టించారు. కానీ, ఇటువంటి ఉదాహరణలు చాలా తక్కువ. ఒకరి పాపం పండినప్పుడు, వారిని అంతం చెయ్యడానికి, దైవమే ఒక అవతారం తీసుకుని, భువికి వస్తారు. అప్పటివరకు, ఎవరి కర్మఫలాలనుబట్టి, అటువంటి నరకబాధలు ఎవరెవరు అనుభవించాలో, వారు వీరి బారిన పడి, బాధలు అనుభవిస్తూ ఉంటారు.

ఈ ప్రపంచం అంతా, ఆ పరాత్పరుని నియమానికి లోబడి నడుస్తుంది. ఆయన ఆజ్ఞ లేనిదే, ఏదీ జరగదు. ఒకొక్కప్పుడు, దేవతలకు తమలో ఉన్న సత్త్వ గుణాన్ని తొక్కి, రజో, తమో గుణాలు ప్రకోపించినప్పుడు, వాటిని అదుపు చెయ్యడానికి, ఆ పరమాత్మ ప్రతినిధులైన ఆ మహర్షులు, వారిని శపించి, తగిన శాపవిమోచనం బోధించి, వారిని సరైన దారిలో పెడతారు. ఈ రాక్షసులు అలా శాపకారణంగా, వారిలో ఉన్న తమోగుణం పోగోట్టుకోకపోగా, మరింత పెచ్చరిల్లే అవకాశం ఉన్నందున, వారిని దునుమాడవలసిన అవసరం ఉన్నప్పుడు, ఆ పరమాత్ముడిని ఆశ్రయించక తప్పదు. కాబట్టి, వారు ఏం చేసినా, లోకకళ్యాణం కొరకేగనుక, వారికి అనుమతి ఉన్న కార్యాలు మాత్రమే చేస్తారు, ఆ మహర్షులు. వారి తపః ఫలితంగా, ఆ పరమాత్మ వారికి సశరీరంగా అనుగ్రహించి, వారిని భౌతికంగా రక్షించి, ఆధ్యాత్మికంగా వారిని మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్తాడు.

ఆ మాటకొస్తే, నేటికి కూడా, అంతటి గొప్ప మహర్షులు మన భారతదేశంలో ఉన్నారు. మన కంచి కామకోటి పీఠాధిపతులు, ఇలలో నడయాడిన పరమాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి. వారు అందరికీ సద్బుద్ధిని ప్రసాదించి, సరైన దారిలో పెట్టారు తప్ప, శపించి వారి శక్తిని దుర్వినియోగం చెయ్యలేదు. ఒక్కసారి మన భౌతిక స్థాయిని దాటి ధ్యానం చేస్తే, మన వాంగ్మయం మీద సంపూర్ణ నమ్మకంతో, ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచన చేస్తే, ఆ పరమాత్మే మనను అనుగ్రహించి ప్రచోదనం చేస్తారు.

https://www.facebook.com/groups/638078683192004

సేకరణ

🍁ఏమి నేర్చుకున్నాం...??* *ఎందుకు నేర్చుకున్నాం...??* *నేర్చుకుని ఏమి చెయ్యాలి..??*🍁

 

🍁ఏమి నేర్చుకున్నాం...??
ఎందుకు నేర్చుకున్నాం...??
నేర్చుకుని ఏమి చెయ్యాలి..??🍁

📚✍️ మురళీ మోహన్

🌸 ఈ చిన్ని ప్రశ్నలు... మనం ఎవరికన్న సందిస్తే సమాధానాలు అనంతంగా చెప్పాలి... ఎంత జ్ఞాని అయిన సమాధానం చెప్పాలి అంటే ఒకరకంగా తటపాటాయిస్తారు కారణం ప్రశ్నల తాలూక లోతు అటువంటిది... పైగా అడిగే వ్యక్తిని బట్టి సమాధానం ఉంటుంది అనేది కూడా స్పష్టం.. మనం ఒకసారి ప్రశ్నలను తరచి చూస్తే.. కొంతవరకు సమాధానం వస్తుంది... కానీ తన పరిస్థితిని బట్టే అనేది వాస్తవం...

🌸 ఏమి నేర్చుకున్నాం..? అనే ప్రశ్న దగ్గర అందరూ చెప్పేది వారి గతమే... అంటే అనుభూతి పరంగా ఉన్న అనుభవమే.. ఎంత చెప్పినా అందులోనే ఉంటుంది సమాధానం... తను ఏమి చూస్తున్నా, చేస్తున్న, లేదా నేర్చుకు0టున్న గతం అనే పునాదిమీద నుంచే అనేది పక్క.. అక్కడ నుండే నేర్చుకోవాలి, చూస్తారు, చేస్తారు... సరే సగటు మనిషి విషయానికి వస్తే చెప్పే సమాధానం సవ్యంగా లేదా హాయిగా జీవించటం అనేది సమాధానం.. హాయిగా అంటే మళ్ళీ ప్రశ్న మొదలు... స్పష్టమైన సమాధానం ఏమిటంటే అందరితో కలసిమెలసి జీవించడం అనకుందాం...

🌸 ఎందుకు నేర్చుకున్నాం..? అని రెండో ప్రశ్నకొస్తే నూటికి 75 మంది దగ్గర సమాధానం ఉండదు.. జీవితం అలా సాగుతోంది అంతే అనే చెబుతారు... కొంత మంది తర్వాత తరాలకు తాము ఎదుర్కొన్న సవాళ్లు తర్వాత తరంలో ఉండకుండా ఉండటానికి అనే చెబుతారు..
అంటే వీరు తమకన్న తమ పిల్లలకు సుఖం అందించాలి అని చూస్తారు... లేదా మరికొంచెం మెరుగ్గా ఉండటం కోసం నేర్చుకున్నది ఉపయోగిస్తారు అని అనుకోవచ్చు... మరి కొంతమంది శోధిస్తారు... వెదుకుతారు ఈ లోపు వచ్చే ప్రశ్నలకు సమాధానం వెదుకుతూ వేళ్తూనే వుంటారు.. వీరికి వచ్చిన సమాధానం సంతృప్తి ఇవ్వలేదు అనుకోవచ్చు... చాలా తక్కువ మంది మాత్రమే ఈ దారిలో ఉంటారు... ఇక్కడ సమాధానం రాలేదు అనేది కూడా వాస్తవం..

🌸 నేర్చుకొని ఏమి చెయ్యాలి..? ఈ ప్రశ్న మాత్రం మనకు చక్కటి దారి చూపుతుంది.. ఎందుకంటే చేసిన పని ఏది నిరుపయోగం కాదు కాబట్టి... ఎవరు ఏ పని చేసినా, ఆవిష్కరించిన అది తర్వాత తరానికి ఉపయోగపడటనికే... ఇప్పుడు ఉన్న అన్ని పరికరాలు ఈకోవకు చెందినవె... అయిన సంతృప్తి అనేది మాత్రం దొరికేది ప్రయత్నంలోనే... కొత్త దారిలో నడుస్తున్నాం అంటే మనలో కొత్తదనం వైపుకు మన అడుగు అసంతృప్తి నుండి సంతృప్తి వైపు అనుకోవచ్చు... ఇది భౌతికంగా అనుకుంటే ఆధ్యాత్మిక దారిలో కూడా జరిగేది ఇదే... కానీ మనం ఒప్పుకోవడానికి ఇప్పటి వరకు నడిచిన దారిలో ఉన్న అలవాటును వధులుకోవాలి అనేది ధైర్యనికి చిహ్నం గా చూడవచ్చు... ధైర్యం ఉన్నంతవరకు మనలో వెదుకులాట ఉంటుంది అక్కడ వయసుతో పని ఉండదు.. ఇలా సామాన్యమైన సమాధానాలతో ఇక్కడి వరకు వచ్చాం...

🌸 కానీ ఇదేమిటి అని ఒకసారి సింహవాలోకనం చేసుకుంటే... మనం మన జీవితంలో ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలు చక్కటీ చిరునవ్వుని బహుమతిగా ఇచ్చాయి అనేది వాస్తవం...
ఏమి నేర్చుకున్నా, ఎందుకు నేర్చుకున్న, నేర్చుకొని ఏమి చెయ్యాలి అన్న ఆలోచన.. ప్రయత్నం చెయ్యాలి భౌతికంగా... సాధన చెయ్యాలి ఆధ్యాత్మిక0గా.. ఇప్పటికి ఇంతవరకు అర్ధమైంది..

నిరంతర ప్రయత్నానికి వయసు ఉండదు... నిరంతర సాధకుడికి చిరునవ్వు చేరగదు..

🌸🌸🌸

సేకరణ

భగవద్గీత ప్రకారం మరణించిన వారి ఆత్మకు గమ్యాన్ని తెలిపే లక్షణాలు!

 *🚩🕉భగవద్గీత ప్రకారం మరణించిన వారి ఆత్మకు గమ్యాన్ని తెలిపే లక్షణాలు!🕉🚩*


*https://chat.whatsapp.com/LQ2aAE9VFrEI4aT5koZV5F*


*https://t.me/joinchat/5gVEZGFAscQ3N2Fl*


*తల్లి గర్భం నుండి ఈ లోకంలోకి వచ్చేటప్పుడు, ప్రాణం ఎలా వస్తుందో తెలియదు. మన దేహాన్ని వదిలి, ఆత్మ ఎలా వెళుతుందో తెలియదు. ఈ లోకంలో మనిషి జీవితం తాత్కాలికం, అశాశ్వతం. పుట్టడం, పెరగడం, పెళ్లీ, పిల్లలూ ఇలా వీటితో పాటే, మరణం కూడా మన జీవితంలో ఒక భాగం. పుట్టుట గిట్టుట కొరకే అయినా, మరణం అనే విషయం, ప్రతీ ఒక్కరిలో భయాన్ని పుట్టిస్తుంటుంది. ఒక మనిషి మనతో పాటే ఉంటూ, ఆకస్మాత్తుగా మాయమైపోతారు. ఆనాటి నుండీ, వారితో ఉండే మన బంధం తెగిపోతుంది. వస్తువు పాడైపోయినా, మన కళ్లముందే ఉంటుంది. శరీరాన్ని వదిలిన ఆత్మ ఏమవుతుంది? ఎక్కడకు వెళుతుంది? ప్రాణం ఆత్మ నుండి విడిపోయి ఏం చేస్తుంది? మన చివరి క్షణాల్లో, ప్రాణం పోయే ముందు కనిపించే లక్షణాల వల్ల, మనం స్వర్గానికి వెళతామో? నరకానికి వెళతామో తెలుస్తుందా? అనే విషయాల గురించి, ఈ రోజు తెలుసుకుందాం..*


*ఒక వ్యక్తి మరణించే ముందు, తాను గడిపిన జీవితంలో చేసిన మంచీ చెడూ, కళ్లముందు కదలాడుతుంటాయి. మనిషి చనిపోయిన వెంటనే, ఆత్మ శరీరం నుండి వేరై, తన చుట్టూ జరిగే పరిస్థితులను గమనిస్తుంటుంది. లోకాన్ని విడిచి వెళ్లే చివరి క్షణాల్లో, ఆ వ్యక్తిలో కనిపించే కొన్ని లక్షణాల వలన, వారు స్వర్గాన్ని పొందబోతున్నారో, నరకాన్ని పొందబోతున్నారో తెలుస్తుంది. శ్రీ కృష్ణుడు భగవద్గీతలో, మరణించిన వారికి సంబంధించిన కొన్ని విషయాలను వివరించాడు. మనిషి శరీరంలో, 9 ప్రధాన ద్వారాలుంటాయి. ఎవరైతే వారి జీవితంలో పుణ్యాలు, అంటే, సకారాత్మక క్రియలు చేస్తారో, వారి శరీరంలోని ఎగువ ద్వారాల నుంచి, ఆత్మ బయటకు వెళ్తుంది. శరీరం ఎగువ భాగంలో ఉన్న కళ్లూ, ముక్కూ, నోరూ, చెవుల గుండా, ఆత్మ బయటకు వస్తుంది. జీవితాంతం సద్గుణమైన పనులు చేసిన గొప్ప వ్యక్తుల ఆత్మలు, ఈ ఎగువ ద్వారాల గుండానే, బయటకు వెళ్తాయి. మరణించే సమయంలో, వారి ఆత్మ ముక్కు నుంచి బయటకు వస్తే, ముక్కు కొంచెం వక్రంగా మారుతుంది.*


*కళ్ల నుంచి బయటకు వస్తే, చనిపోయే ముందు కళ్లు మూసుకోరు. చెవి నుంచి ఆత్మ బయటకు వస్తే, చెవి కొంచెం పైకి లాగినట్లు కనిపిస్తుంది. నోటి నుంచయితే, నోరు తెరుచుకుంటుంది. బ్రతికున్న రోజుల్లో ఎలాంటి పనులు చేసినా, మరణించే సమయంలో, వ్యక్తి సంతృప్తిగా, ముఖంలో సంతోషం ఉంటే, వారు తప్పక స్వర్గానికి వెళతారు. అదే విధంగా, వారి జీవితంలో పాపాలు చేసి, పాపాత్మకచర్యలకు పాల్పడిన వారి ముఖంలో, మరణ భయం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే, వ్యక్తి సంతృప్తిగా, సంతోషంగా చనిపోయినట్లయితే, అలాంటి వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. పాప కార్యాలు చేసి, మరణభయంతో చనిపోయిన వారు, నరకానికి వెళ్తారు. గరుడపురాణం, కఠోపనిషత్తుల ప్రకారం, మనిషి మరణించే సమయంలో, వారి ప్రాణాలను తీసుకుపోవడానికి, యమదూతలూ, దేవ దూతలూ వస్తారు.*


*పాప కార్యాలు చేసిన వ్యక్తి ఆత్మను తీసుకుపోవడానికి, యమదూతలు వస్తారు. వారిని చూసిన భయంతో, ఆత్మ, శరీరం దిగువ భాగానికి చేరుకుంటుంది. ఆ భయం కారణంగానే, కొంతమంది చనిపోయే ముందు, మల, మూత్రాలు విసర్జిస్తారు. ఈ విధంగా జరగడం మంచిది కాదు. మరణించే సమయంలో ఎవరైతే మల, మూత్రాలను కోల్పోతారో, వారు నరకానికి వెళ్తారు. వ్యక్తుల ఆఖరు క్షణాల్లో, వారి కళ్లు మూసుకుపోవడం, లేదా ఏమీ కనిపించకపోవడం వంటివి జరుగుతుంటాయి. అలాంటి సమయంలో, వారికి నలుపురంగు దుస్తుల్లో వచ్చిన యమదూతలు మినహా, మరేమి కనిపించవు. అయితే, సత్పురుషులకూ, జీవితంలో మంచి పనులు ఎక్కువగా చేసినవారికీ, ఈ విధంగా జరగదు. వీరికి చివరి క్షణాల్లో, పసుపు రంగు దుస్తుల్లో ఉన్న దేవ దూతలు కనిపిస్తారు. ఆ దేవదూతలే, వీరిని స్వర్గానికి తీసుకుని వెళ్తారు. మన హిందూ సంప్రదాయం ప్రకారం, మనిషి మరణించే సమయంలో, వారికి తులసి నీళ్లో, గంగాజలామో నోటిలో పోస్తారు.*


*అలాంటి వారు, ఎంతో అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే, తులసీ, గంగాజలం, ఎంతో పవిత్రమైనవి. చాలా మందికి, వారు మరణించే చివరిక్షణాల్లో, ఇవి అందుబాటులో ఉండవు. మరణించే ఆఖరు క్షణాల్లో, తులసి లేదా గంగాజలం నోట్లో పోస్తే, వారు స్వర్గానికి పయనిస్తారు. ఎవరైనా ఇంట్లో మరణిస్తే, వారి ఆత్మ ఆ ఇంట్లోనే ఉంటుందని భావిస్తుంటారు. అయితే, తీరని కోరికలతో, అర్థాంతరంగా వారి జీవితాన్ని మధ్యలోనే ముగించిన వారి విషయంలో, ఇలాంటివి జరిగే అవకాశాలుంటాయి. అంతేకానీ, ముదిమి వయస్సులో చనిపోయిన వారూ, జీవితాన్ని సంపూర్తిగా అనుభవించిన వారి విషయాలలో, ఇలాంటివి జరుగవు. వారు తమ జీవితాలను సంపూర్ణం చేసుకుని, ఈ జన్మలో చేసిన కర్మల ఫలితంగా, మరు జన్మకు సిద్ధమవుతుంటారు. శరీరం నుండి వేరుపడిన ఆత్మ, తిరిగి మరోక శరీరంతో, మరో జీవితంలోకి అడుగుపెట్టే వరకూ ఏం చేస్తుంటుంది? అనే విషయాలు తెలుసుకోవాలంటే మా ‘మరణం తర్వాత ఏం జరుగుతుంది?*


*https://www.facebook.com/groups/638078683192004*

Tuesday, February 1, 2022

అతిరథ మహారథులు..అంటే..ఎవరు..!

అతిరథ మహారథులు..అంటే..ఎవరు..!
అతిరథ మహారథులందరూ వచ్చారని మనం అంటూ ఉంటాం..
అంటే చాలా గొప్పవారొచ్చారనే విషయం మాత్రం
మనకు అర్థమవుతుంది.
అయితే ఆ పదాలకు సరైన అర్థం మాత్రం మనలో చాలామందికి తెలియకపోవచ్చు.
మహామహా గొప్పవాళ్ళు వచ్చారనే అర్థంలో వాడతామనేది అందరికీ తెలుసు.
ఆ పదాలకు అర్థాలేమిటో చూద్దాం.
యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లివి.
ఇందులో 5 స్థాయులున్నాయి. అవి..

రథి,
అతిరథి,
మహారథి,
అతి మహారథి,
మహామహారథి.

1) రథి..💐
ఏక కాలంలో 5,000 మందితో యుద్ధం చేయగలడు.
సోమదత్తుడు,
సుదక్షిణ,
శకుని,
శిశుపాల,
ఉత్తర,
కౌరవుల్లో 96మంది,
శిఖండి,
ఉత్తమౌజులు,
ద్రౌపది కొడుకులు -
వీరంతా..రథులు.

2) అతి రథి (రథికి 12రెట్లు)..💐
60,000మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.
లవకుశులు,
కృతవర్మ,
శల్య,
కృపాచార్య,
భూరిశ్రవ,
ద్రుపద,
యుయుత్సు,
విరాట,
అకంపన,
సాత్యకి,
దృష్టద్యుమ్న,
కుంతిభోజ,
ఘటోత్కచ,
ప్రహస్త,
అంగద,
దుర్యోధన,
జయద్రథ,
దుశ్శాసన,
వికర్ణ,
విరాట,
యుధిష్ఠిర,
నకుల,
సహదేవ,
ప్రద్యుమ్నులు
వీరంతా..అతిరథులు.

3) మహారథి (అతిరథికి 12రెట్లు).💐
7,20,000 మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.
రాముడు,
కృష్ణుడు,
అభిమన్యుడు,
వాలి,
అంగద,
అశ్వత్థామ,
అతికాయ,
భీమ,
కర్ణ,
అర్జున,
భీష్మ,
ద్రోణ,
కుంభకర్ణ,
సుగ్రీవ,
జాంబవంత,
రావణ,
భగదత్త,
నరకాసుర,
లక్ష్మణ,
బలరామ,
జరాసంధులు
వీరంతా..మహారథులు.
4) అతి మహారథి (మహారథికి 12రెట్లు).💐
86,40,000 (ఎనభై ఆరు లక్షల నలభైవేలు) మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు.
ఇంద్రజిత్తు,
పరశురాముడు,
ఆంజనేయుడు,
వీరభద్రుడు,
భైరవుడు -
వీరు..అతి మహారథులు.
రామరావణ యుద్ధంలో పాల్గొన్నది ఇద్దరే ఇద్దరు అతి మహారథులు,
అటు ఇంద్రజిత్తు -
ఇటు ఆంజనేయుడు.
రామలక్ష్మణ రావణ కుంభకర్ణులు మహారథులు మాత్రమే.

5) మహామహారథి (అతిమహారథికి 24రెట్లు) .💐
ఏకకాలంలో 207,360,000
(ఇరవై కోట్ల డెబ్భై మూడు లక్షల అరవై వేలు) మందితో ఏకకాలంలో యుద్ధం చేయగలడు.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు,
దుర్గా దేవి,
గణపతి మరియు
సుబ్రహ్మణ్య స్వామి,
వీరంతా..మహామహారథులు.
మహామహారథులలో అమ్మవారు కూడా ఉండడం
హిందూ ధర్మంలోనున్న మహిళా సాధికారతకు నిదర్శనం. మహిళ..యుద్ధంలో పాల్గొన్న సంగతే ఇతర మతాల్లో మనకు కనిపించదు.
అలాంటిది, ఒక మహిళయైన దుర్గా దేవి ఏకంగా ఇరవైకోట్ల మంది కంటే ఎక్కువ మందితో యుద్ధం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నట్టుగా గుర్తించడం మామూలు విషయం కాదు🙏🙏🙏🙏🌹👌

సేకరణ

కోపం మనోనిగ్రహం

🍁కోపం మనోనిగ్రహం🍁

📚✍️ మురళీ మోహన్

క్రోధాన్ని జయించటానికి సహనమొక్కటే మనకు తోడ్పడుతుంది. కోపాన్ని గనుక మనం నియంత్రిస్తే జీవితంలో ఉత్తమగతులను అధిరోహించవచ్చు. దీనికి ఉదాహరణగా ఒక సంఘటనను పరిశీలిద్దాం. పరమేష్ఠి గురువులైన శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ మహాస్వాముల వారి హయాంలో జరిగింది. స్వామివారు యాత్రలో ఒక చోట మకాం చేసియున్నప్పుడు ప్రభుత్వ అటవీ శాఖకు చెందిన అధికారి ఒకరు గురువుల దర్శనార్థం వచ్చాడు. క్షేమ సమాచారాలు అడిగి భక్తులను పంపించటం స్వామివారికి అలవాటు లేదు. ఆ అధికారికి సత్యాన్ని తెలుసుకోవాలనెే ఆలోచన ఉన్నదో లేదో అని గ్రహించటానికై గురువులు ఇలా ప్రశ్నించారు. "మికెప్పుడైనా కోపం వస్తుందా?"

అధికారి :- అప్పుడప్పుడు సహనాన్ని కోల్పోతానని చెప్పాడు.

గురువులు :- మీకు కోపం వస్తే ఏమి చేస్తారు.

అధికారి :- నా క్రింద పని చేసే వారిపై ఆ కోపాన్ని ప్రదర్శిస్తాను.

గురువులు :- అప్పుడు అతను ఏమి చేస్తాడు?

అధికారి :- అతను తన క్రింద పనిచేసే వారిపై తన కోపాన్ని ప్రదర్శిస్తాడు.

గురువులు :- ఒక మనిషి క్రోధం ఎందరిని ఇబ్బంది పెడ్తుందో చూసారా.

అధికారి తన తప్పును అంగీకరించి, తాను ఏమి చేస్తే బాగుంటుందో వివరించమని ప్రార్థించాడు. అప్పుడు గురువుగారు ఇలా బదులిచ్చారు. "మూడు రకాల మనుష్యలున్నారు. కొందరు తమకు కోపం రావచ్చని ముందే గ్రహిస్తారు. మరికొందరు వచ్చే కోపాన్ని ముందుగా పసిగట్టలేరు కాని కోపం వచ్చిన తరువాత తమకు కోపం వచ్చిందని గ్రహించగలరు. ఇంకొందరు తమ కోపాన్ని చాలా ఆలస్యంగా అంతా అయిపోయిన తర్వాత గుర్తిస్తారు. ఈ ముగ్గురిలో నీవు ఏ వర్గానికి చెందుతావు?

అధికారి :- తాను రెండవ వర్గానికి చెందుతానని చెప్పాడు.

గురువులు :- నీవు మొదటి వర్గంలో చేరటానికి ప్రయత్నించు, కోపం వస్తోందనుకున్నప్పుడు, కోపం తెచ్చుకోవడం ఎంత వరకు సమంజసం ? అని ఆలోచించి కోపాన్ని అదుపుచేసుకోవలని సూచించారు.

తరువాత ఆ అధికారి జగద్గురువులకు సాష్టాంగ ప్రణామాలు చేసి సెలవు తీసుకొని తన మకాం వైపు బయలుదేరాడు. ఆయన తన వసతిని చేరుకునేటప్పటికి మధ్యాహ్నమయింది. అందువలన విపరీతంగా ఆకలివేయసాగింది. అయితే ఆయన వంటవాడు రెండు రొట్టెలను మాత్రమే చేసాడు. అది తెలియగానే ఆయనకు కోపం వచ్చి సహనం కోల్పోయి వంటవానిపై కేకలు వేయబోయాడు. వెంటనే గురువుల సలహా జ్ఞాపకానికి వచ్చింది. వెంటనే వంటవానిని పిలిచి రెండు రొట్టెలు మాత్రమే తయారుచేయటానికి కారణమడిగాడు. ఇంట్లో పిండి లేదని, పిండి తీసుకురావటానికి వెళ్లిన నౌకరు ఇంకా రాలేదని, కాని అధికారి ఆకలిని కొంచెమైనా తగ్గించవచ్చని తాను ఇంట్లో ఉన్న పిండిని ఉపయోగించి రెండు రొట్టెలు తయారుచేసానన్నాడు. వంటవాడు తానేమీ తినలేదు, వస్తువులు వచ్చిన తరువాత రొట్టెలు తయారుచేసుకొని తినాలి అని చెప్పాడు. అధికారి తన వంటవానిని మెచ్చుకోకుండ ఉండలేకపోయాడు. అమాయకుడైన తన వంటవానిపై అనవసరంగా కోపం తెచ్చుకోకుండ జగద్గురువుల సలహా తనను కాపాడిందని సంతోషించాడు.

కోపం వికృతంగా తలెత్తకుండ మనం జాగ్రత్తపడాలి. పరిస్థితులను విశ్లేషించి కారణం తెలుసుకుంటే కోపానికి అవకాశముండదు. అటువంటి విశ్లేషణ తరువాత ఎవరైనా దోషిగా మనం భావిస్తే, పరిమితంగా అతనిని మనం శిక్షించవచ్చు.

--- జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహస్వామివారు.

సేకరణ